భర్త, అత్త వేధింపులతో వివాహిత తీవ్ర నిర్ణయం..! చివరికి.. | - | Sakshi
Sakshi News home page

భర్త, అత్త వేధింపులతో వివాహిత తీవ్ర నిర్ణయం..! చివరికి..

Mar 14 2024 12:05 AM | Updated on Mar 14 2024 11:16 AM

- - Sakshi

భర్త మరొకరితో వివాహేతర సంబంధమే కారణం..

ఆదిలాబాద్‌: వివాహిత ఆత్మహత్యకు కారణమైన భర్త, అత్తకు నిర్మల్‌ న్యాయస్థానం బుధవారం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు సమన్వయల అధికారి సక్రియనాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్‌ పట్టణం శాంతినగర్‌కు చెందిన బైరి లక్ష్మి(25), కడెం మండలం పాతమద్దిపడగ గ్రామానికి చెందిన బైరీ రమేష్‌కు 23 మే 2013న వివాహమైంది. పెళ్లిలో కట్నంగా లక్ష రూపాయలు, తులం బంగారం, మోటార్‌ సైకిల్‌ ఇచ్చారు. పైళ్లెన తర్వాత వీరికి ఓ పాప జన్మిచ్చింది.

ఆ తర్వాత బైరి రమేష్‌ అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమెతో గ్రామం వదిలి వెళ్లిపోయాడు. నెల రోజుల తరువాత ఆమెను తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న బైరి లక్ష్మి, తల్లి కౌసల్య కుల పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. గ్రామ పెద్దలు బైరి రమేష్‌కు రూ.20వేల జరిమానా విధించారు. కొద్ది రోజుల తర్వాత బైరి రమేష్‌ భార్యను డబ్బులు నువ్వే కట్టాలని వేధించడం మొదలుపెట్టాడు.

దీంతో లక్ష్మి తల్లి రూ.20వేలు కట్టి నచ్చజెప్పి సంతోషంగా ఉండాలని చెప్పింది. మళ్లీ కొన్ని రోజులకు బైరి రమేష్‌, ఆయన కుటుంబ సభ్యులు రూ.50వేలు కట్నం తీసుకురావాలని వేధించడం మొదలు పెట్టారు. దీంతో 23 జూలై 2017వ తేదీ రాత్రి 8గంటల ప్రాంతంలో పాతమద్దిపడగ గ్రామ శివారులోని పొద్దుటూరి నరసింహారెడ్డి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె తల్లి కౌసల్య కడెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

అప్పటి ఎస్సై రాము కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం అప్పటి డీఎస్పీ మనోహర్‌రెడ్డికి అప్పగించాడు. డీఎస్పీ కేసు విచారణ అనంతరం చార్జిషీట్‌ దాఖలు చేసి కోర్టులో హాజరు పరిచాడు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వినోద్‌రావు 17మంది సాక్షులను ప్రవేశపెట్టి నేరం రుజువు చేశాడు. దీంతో వారికి పైవిధంగా శిక్ష విధిస్తూ.. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణకుమార్‌ తీర్పునిచ్చారు.

ఇవి చదవండి: ప్రేమోన్మాదికి బెయిల్‌ రాకుండా చూడాలి..

Advertisement
 
Advertisement
Advertisement