అనుకుంట శివారు సర్వే నం.31లో మాకు 15 ఎకరాల 30 గుంటల భూమి ఉంది. మా పెద్దనాన్న కుమారులు, మా అన్నదమ్ముళ్లు కలిపి 8 పట్టాల వరకు దీంట్లో ఉన్నాయి. భూమి మధ్యలో నుంచి ఇదివరకు నుంచే దారి ఉంది. భూవిస్తీర్ణం రోడ్డుకు రెండు వైపులా ఉంది. ఈ గందరగోళం నేపథ్యంలో మా పెద్ద నాన్న కుమారులు, మేము గతంలో ఒక నిర్ణయం తీసుకున్నాం. రోడ్డుకు ఒకవైపు పెద్ద నాన్న కుమారులు, మరోవైపు మా అన్నదమ్ముళ్లం సాగు చేసుకుంటున్నాం. సర్వేలో దీంట్లో నుంచి కొంత భూమి మాత్రమే పోతుందని చెబుతున్నారు. ఈ విషయంలో మా అన్నదమ్ముళ్ల మధ్య గొడవలు చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం మొత్తం భూమిని తీసుకోవాలి.
– బండి నర్సింగ్, రైతు


