అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తంగా ఉండాలి

Aug 13 2026 12:09 AM | Updated on Aug 13 2026 12:09 AM

● కలెక్టర్‌ రాజర్షి షా ● ఎల్‌నినో ప్రభావంపై అధికారులతో సమీక్ష

● కలెక్టర్‌ రాజర్షి షా ● ఎల్‌నినో ప్రభావంపై అధికారులతో సమీక్ష

కై లాస్‌నగర్‌: మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యంత్రాంగం, రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ రాజర్షి షా సూచించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించే కార్యాచరణపై వివిధ శాఖ ల అధికారులతో బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ప్రస్తుత నీటి లభ్యత, ప్రాజెక్టుల్లో నిల్వలు, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలన్నారు. నీటి వనరులను శాసీ్త్రయంగా వినియోగిస్తూ తాగునీరు, సాగునీటి అవసరాలను సమతుల్యంగా నిర్వహించాలన్నారు. తాగునీటికే తొలి ప్రా ధాన్యం ఇవ్వాలన్నారు. చివరిఆయకట్టు వరకు నీటి సరఫరా జరిగేలా పటిష్టచర్యలు తీసుకోవాలని సూ చించారు. తక్కువనీటితో అధిక దిగుబడినిచ్చే ఆరు తడి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతుల కు అవగాహన కల్పించి ప్రోత్సహించాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయా లన్నారు. సమావేశంలో ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజినీర్‌ జగదీష్‌, ఎస్‌ఈ ప్రభు కల్యాణ్‌, ఈఈ సునీల్‌, హరీ ష్‌కుమార్‌ సంబంధిత శాఖల అధికారులు, రైతు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

పిల్లల అభ్యసన సామర్థ్యాల పెంపే లక్ష్యం

కై లాస్‌నగర్‌: విద్యార్థుల్లో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాశాస్త్ర సామర్థ్యాలు మెరుగుపరిచేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్‌ రాజర్షి షా ఉ పాధ్యాయులను ఆదేశించారు. జిల్లాలోని 176 కాంపిటెంట్‌ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు, మండల విద్యాశాఖాధికా రులతో ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమాలు, పిల్లల అభ్యసన సామర్థ్యాల పెంపుపై జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రతి పాఠశాలలో తెలుగు, ఇంగ్లిష్‌, గణితం సబ్జెక్టులకు సంబంధించి ఉపాధ్యాయులు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషిచేయాలన్నా రు. పాఠశాలల్లో చేపట్టిన బేస్‌లైన్‌ టెస్టు నివేదికలను రెండు రోజుల్లోగా ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా సబ్‌మిట్‌ చేయాలన్నారు. అభ్యసన పురోగతిని పర్యవేక్షించేందుకు స్పష్టమైన క్యాలెండర్‌ను ప్రకటించారు. ప్రతినెల 26నపాఠశాలస్థాయిలో హెచ్‌ఎం, ఉపాధ్యాయులతో సమీక్ష జరిపి విద్యార్థుల ప్రగతిని నిర్ధారించుకోవాలన్నారు. అలాగే ప్రతి నెల 27న ఎంఈవోల సమక్షంలో మండలస్థాయి సమీక్ష నిర్వహించాలని తెలిపారు. ప్రతి నెల 28న కలెక్టర్‌ అధ్యక్షతన హెచ్‌ఎంలు, ఎంఈవోలతో జిల్లా స్థాయి సమీక్ష ఉంటుందన్నారు.ఇందులో డీఈవో మాధవి, ఏఎంవో లక్ష్మణ్‌, అజయ్‌, సీఎంవో తిరుపతి, రాష్ట్ర ఎఫ్‌ఎల్‌ఎన్‌ బృందం సభ్యులు నిఖిల్‌, వెంకటేశ్‌, నికిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement