కై లాస్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం ఆహారభద్రత కా ర్డుల స్థానంలో లబ్ధిదారులకు కొత్తగా అందించనున్న స్మార్ట్ రేషన్‌కార్డులు జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయాలకు చేరాయి. జిల్లాకు 2,26,733 కార్డులను కేటాయించిన ప్రభుత్వం వాటిని ఇటీవల జిల్లా పౌరసరఫరాల శాఖ కా ర్యాలయానికి పంపించింది. ప్రభుత్వ ఆదేశాలతో ఆ శాఖ అధికారులు మండలాల వారీ గా కార్డులను వేరుచేసి బుధవారం రెవెన్యూ సి బ్బందికి అప్పగించారు. మరో నాలుగు మండలాల కార్డులు మిగిలి ఉండగా వాటిని గురువా రం తరలించనున్నారు. అయితే అత్యధికంగా ఆదిలాబాద్ అర్బన్‌లో 35,139 కార్డులు రాగా అత్యల్పంగా సొనాల మండలానికి 4,256 వ చ్చాయి. వీటిని ఈనెల 15న మధ్యాహ్నం 2.30 గంటలకు అధికారికంగా ఎంపిక చేసిన లబ్ధిదా రులకు అందజేయనున్నారు. జిల్లా కేంద్రంలో ఎస్టీయూ భవన్‌లో కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే శంకర్ చేతుల మీదుగా పంపిణీ చేసేలా అధికా రులు ఏర్పాట్లు చేస్తున్నారు. చౌక ధరల దుకా ణాల వారీగా కార్డులను అందించేలా చర్యలు చేపడుతున్నారు. దుకాణానికి ఒకరు చొప్పున రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్ శాఖలకు చెందిన అధికారులు,ఉద్యోగులను ఇన్‌చార్జీలు గా నియమించనున్నారు. వీరి ఆధ్వర్యంలో పంపిణీ చేపట్టనున్నారు. డీలర్ల వద్ద ఉన్న కీ రిజిస్టర్ల ఆధారంగా అందజేయనున్నారు.


