ప్రాణం తీసిన పబ్జీ గేమ్‌.. ఏకంగా సెల్‌ టవర్‌ ఎక్కి.. పైనుంచి.. | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన పబ్జీ గేమ్‌.. ఏకంగా సెల్‌ టవర్‌ ఎక్కి.. పైనుంచి..

Nov 6 2023 1:10 AM | Updated on Nov 6 2023 7:39 AM

- - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: పబ్జీ గేమ్‌కు బానిసై ఏడాది క్రితం మానసిక స్థితి కోల్పోయిన ఓ యువకుడు సెల్‌ టవర్‌ పైనుంచి పడి మృతిచెందాడు. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం ముత్నూర్‌ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. కుటుంబీకులు, ఎస్సై సునిల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దేవాపూర్‌ గ్రామానికి చెందిన దుర్వ జగదీశ్‌–మోహన్‌బాయి దంపతుల కుమారుడు వికాస్‌(19) ఇంటర్‌ మధ్యలోనే మానేశాడు. పబ్జీ గేమ్‌కు అలవాటు పడి ఇంట్లోనే ఉంటూ ఏడాది క్రితం మానసిక స్థితి కోల్పోయాడు.

శనివారం రాత్రి ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. కుటుంబసభ్యులు గ్రామంలో వెతికినా ఆచూకీ లభించలేదు. రాత్రి దేవాపూర్‌ నుంచి ముత్నూర్‌ గ్రామానికి చేరుకొని గ్రామ సమీపంలో ఉన్న సెల్‌ టవర్‌ ఎక్కి పైనుంచి కింద పడి మృతిచెందాడు. గ్రామస్తులు ఆదివారం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మానసిక స్థితి సరిగా లేక సెల్‌టవర్‌ ఎక్కి పైనుంచి పడిపోవడంతోనే మృతిచెందినట్లు నిర్ధారించారు. తల్లి మోహన్‌బాయి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement