Chandrababu Naidu
-
‘వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే భయంతోనే.. అందుకే చంద్రబాబు ఇలా’
సాక్షి, గుంటూరు: కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో రాష్ట్రం తిరోగమనంలో సాగుతోందిన మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకురాకపోగా, ఉన్న పరిశ్రమలపై కుట్రలు చేస్తూ, వారిని రాష్ట్రం వదిలి పారిపోయేట్లుగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న సజ్జన్ జిందాల్, నేడు వికాట్ ఫైనాన్స్ సెక్రటరీ గోవిందప్ప బాలాజీ వరకు ఈ వేధింపులు కొనసాగుతున్నాయని ధ్వజమెత్తారు. ఏడాది కూటమి పాలన రాష్ట్ర ప్రజలకు చీకటి రోజులనే మిగిల్చిందని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే...గత వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధి, పారదర్శక విధానాలు, ప్రజల కొనుగోలుశక్తి, రెవెన్యూ ఆదాయం, మూలధన పెట్టుబడి అంశాల్లో గణనీయమైన ప్రగతిని సాధించింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావోస్తోంది. ఈ ఏడాది పాటు చంద్రబాబు పాలనను చూస్తే బాధ కలుగుతోంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు. సంపదను సృష్టించి, ప్రజల ఆదాయాలను పెంచడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చెందేలా చేస్తానంటూ నమ్మించారు.కానీ ఆయన పాలనను చూస్తే దయనీయమంగా కనిపిస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ జగన్‌పై ఏ విధంగా బురదచల్లాలి, ఏ విధంగా ఆయన వ్యక్తిత్వహననం చేయాలి, వైఎస్సార్సీపీ నాయకులపై కేసులు ఎలా బనాయించాలి, పోలీసులను ప్రయోగించి ఎలా వేధించాలనే లక్ష్యంగా పనిచేస్తున్నారు. చంద్రబాబు తన మొత్తం సమయాన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కోసమే వినియోగిస్తున్నారే తప్ప రాష్ట్రం గురించి, ప్రజల బాగోగుల గురించి కాదు.వికాట్ ఫైనాన్స్ సెక్రటరీ గోవిందప్ప బాలాజీపై తప్పుడు కేసులులేని మద్యం కేసును రంగంలోకి తీసుకువచ్చి, దానిలో వైఎస్ జగన్‌కి సన్నిహితులైన వారందరినీ బాధ్యులుగా చూపి, ఒక పథకం ప్రకారం కక్ష సాధింపులకు చంద్రబాబు తెగబడ్డారు. దీనిలో భాగంగానే అంతర్జాతీయ సంస్థ వికాట్‌లో ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేస్తున్న గోవిందప్ప బాలాజీని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వికాట్ అనే సంస్థ 165 సంవత్సరాల కిందట ప్రారంభించిన సిమెంట్ కంపెనీ. యూరప్‌లోనే పేరు ప్రఖ్యాతలు సాధించిన ఈ సంస్థ 1967లో ప్రారంభమైంది. ఈ సంస్థ 2024లో మొత్తం 44,316 కోట్ల రూపాయలు సిమెంట్ అమ్మకాల ద్వారా ఆర్జించిందంటే ఎంత బలమైన సంస్థో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ జగన్ భారతీ సిమెంట్స్‌ను వరల్డ్ ఫస్ట్‌క్లాస్ టెక్నాలజీతో ప్రారంభించారు. దానిని 2010లో ఈ వికాట్ కంపెనీ టేకోవర్ చేసింది. 51 శాతం వాటాలు దీనికి ఉన్నాయి.ఈ వికాట్ కంపెనీనికి బాలాజీ గోవిందప్ప ఫుల్‌టైం ఫైనాన్స్ సెక్రటరీ. కేవలం వైఎస్ జగన్ ప్రారంభించిన కంపెనీలో ఈయన పనిచేస్తున్నారనే కారణంతోనే లేని లిక్కర్ స్కామ్‌ను సృష్టించి, దానిలో ఆయనను ఇరికించి, ఆయనను జైలుకు పంపారు. చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలకు ఈ అరెస్ట్ ఒక ఉదాహరణ. అలాగే సజ్జన్ జిందాల్ భారతదేశంలోనే పెద్ద వ్యాపార దిగ్గజ్జం. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభించి, పనులు ప్రారంభించారు.చంద్రబాబు అధికారంలోకి రాగానే ఒక సెకెండ్ గ్రేడ్ సినిమా ఆర్టీస్ట్ను అడ్డం పెట్టుకుని జిందాల్‌ను వేధింపులకు గురి చేశారు. ఇవి తట్టుకోలేక జిందాల్ కడప నుంచి వెళ్ళి మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. అలాగే ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై కేసులు పెట్టారు. ఒక డీజీపీ ర్యాంక్‌లో ఉన్న పోలీస్ అధికారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇలా వైఎస్ జగన్‌పై కోపంతో, మరోసారి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందనే భయంతో పారిశ్రామికవేత్తలను చంద్రబాబు భయపెట్టాలని చూస్తున్నారు.కూటమి నేతల అరాచకాలతో పారిశ్రామికవేత్తలు బెంబేలుమరోవైపు కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తలపై మామూళ్ల కోసం దాడులు చేస్తున్నారు. తాడిపత్రిలో ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ పై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఫిర్యాదులు చేశారు. తనకు రౌడీ మామూళ్ళు ఇవ్వడం లేదని కంపెనీకి ముడిసరుకుని ట్రాన్స్పోర్ట్ చేసే సంస్థలను ఇబ్బంది పెట్టారు. దీనితో సిమెంట్ ప్లాంట్‌నే మూసేసే పరిస్థితి వచ్చింది. ఒకవైపు ప్రధానమంత్రి మన దేశంలోనే మేకిన్ ఇండియాలో భాగంగా అన్నీ ఉత్పత్తి చేసుకోవాలని చెబుతుంటే, అదే బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తనకు రౌడీ మామూళ్ళు ఇవ్వడం లేదని ఏకంగా ఆల్ట్రాటెక్ సిమెంట్ ప్లాంట్‌నే మూయించే ప్రయత్నం చేశారు. ఇలా చేస్తుంటే పరిశ్రమలు వస్తాయా?గండికోట ప్రాంతంలో ఆదానీ హైడ్రోపవర్ పైనా బీజేపీ ఎమ్మెల్యే, ఆయన సోదరుడు తమకే మొత్తం కాంట్రాక్ట్‌లు ఇవ్వాలని ఆ కంపెనీ కార్యాలయంపైనే దాడి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఏపీలో ఏ పరిశ్రమ అయినా సరే కూటమి ఎమ్మెల్యేలకు కప్పం కట్టాల్సిందే, లేనిపక్షంలో ఆ సంస్థలు పనిచేయవు అనే విధంగా వ్యవహరిస్తున్నారు. పల్నాడులోని గురజాడలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తాను ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేశానని, ఆ డబ్బును భవ్య, చెట్టినాడు సిమెంట్ ప్లాంట్లు చెల్లించాలంటూ వారిని వేధించడంతో ఈ రెండు సిమెంట్ కంపెనీలు మూతపడ్డాయి.శ్రీకాకుళంలోని యూబీ బీర్ తయారీ ఫ్యాక్టరీపై నడికుదిటి ఈశ్వర్రావు అనే బీజేపీ ఎమ్మెల్యే బీర్ రవాణా చేసే ఒక్కో లారీకి వెయ్యి రూపాయలు ఇవ్వాలని బెదిరించాడు. ఈ లెక్కన నెలకు రూ.1.50 కోట్లు వారి నుంచి డిమాండ్ చేశాడు. పదివేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న యూబీ సంస్థపై ఇలాంటి వేధింపులకు పాల్పడటంతో ఆ సంస్థ ఎలా ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది? జాతీయ రహదారుల కాంట్రాక్ట్‌ల కోసం బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌లు పోటీపడి కొట్టుకునే పరిస్థితికి వచ్చారు. దాల్మియా సిమెంట్‌పై చంద్రబాబు కక్షసాధింపు ప్రారంభించారు. ఇప్పటి వరకు రూ.793 కోట్ల రూపాయలు జప్తు చేసే కార్యక్రమం చేశారు. టీవీ9 ను లొంగతీసుకోవాలని మైహోం రామేశ్వరరావుకు చెందిన సిమెంట్ కంపెనీకి గనుల నుంచి ముడిసరుకుని రానివ్వకుండా వేధిస్తున్నారు.అసమర్థ పాలనతో ప్రగతి శూన్యంచంద్రబాబు అద్భుతమైన సంపద సృష్టిస్తాను, పరిశ్రమలను తీసుకువస్తాను అని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఐదేళ్ల పాటు మంచి పాలనను అందించిన వైఎస్ జగన్ కాదని ఒక దుర్మార్గమైన పాలనను అనుభవిస్తున్నామని నేడు అన్ని వర్గాలు ఆవేదన చెందుతున్నారు. కాగ్ లెక్కల ప్రకారం చూసినా రాష్ట్రం తిరోగమనంలో ఉందని తెలుస్తుంది. 2023-24లో వచ్చిన ఆదాయం కంటే 2024-25లో వచ్చిన ఆదాయంలో తగ్గుదల రూ.5520 కోట్లు. ఇదేనా చంద్రబాబు సంపద సృష్టించడం? ఆయన సంపద పోగొడుతున్నాడు.అమ్మకంపన్ను, స్టాంప్ డ్యూటీ చూస్తే 2024-25లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే రూ.1,053 కోట్లు పడిపోయింది. రిజిస్ట్రేషన్లు లేవు, అమ్మకాలు లేవు, ప్రజల కొనుగోలు శక్తి సన్నగిల్లింది. ఇదీ అనుభవజ్ఞుడైన చంద్రబాబు పాలన. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం అంతకు ముందు ఏడాదితో పోలిస్తే రూ.705 కోట్లకు పడిపోయింది. ఇక పన్నేతర ఆదాయానికి వస్తే 2024-25లో రూ.842 కోట్లు తగ్గింది. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రావాల్సిన డబ్బు 2024-25లో రూ.14,563 కోట్లు తగ్గింది. మూలధన వ్యయం రూ.4,413 కోట్లకు తగ్గిపోయింది. విద్యా, వైద్యం, సంక్షేమం తదితరాలకు చేసిన వ్యయం రూ.4696 కోట్లు తగ్గింది. కాగ్ రిపోర్ట్ ప్రకారం వచ్చిన లెక్కలు ఇవి.హామీల అమలులో పూర్తి వైఫల్యంచంద్రబాబు ఎల్లోమీడియాను అడ్డం పెట్టుకుని గొప్పగా తమను తాము ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు ఏదీ? ఈ హామీలను అమలు చేయడానికి ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏడాదికి రూ.79,867 కోట్లు అవసరం. కానీ చంద్రబాబు బడ్జెట్లో కేటాయించింది చూస్తే రూ.7,282 మాత్రమే. దీనిలో ఖర్చు పెట్టింది రూ.865 కోట్లు మాత్రమే. చివరికి పెన్షన్లలోనూ మూడు లక్షల వరకు కోత పెట్టారు. ఉచిత బస్పు ఊసే లేదు.చివరికి తల్లికి వందనం కింద ఇచ్చేదానిని కూడా వాయిదాల ప్రకారం ఇస్తానంటున్నారు. గతంలో ఇలాగే రైతురుణమాఫీని కూడా ఎగ్గొట్టారు. ఇప్పుడు తల్లికి వందనంను కూడా ఇలాగే చేస్తున్నారు. ఇక నిరుద్యోగభృతి అమలు ఏమయ్యిందో తెలియదు. పాలన ద్వారా ప్రజలను మెప్పించి, మళ్ళీ అధికారంలోకి రావాలనే కోరికే చంద్రబాబుకు లేదు. చంద్రబాబ అసమర్థ పాలనతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి, జీఎస్టీ వసూళ్ళు తగ్గిపోయాయి.రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను తీవ్రంగా భ్రష్టు పట్టించారు. పోలీసులను రాజకీయ కక్ష సాధింపులకు వాడుకుంటున్నారు. పోలీస్ వ్యవస్థ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. నిబంధనల ప్రకారం పనిచేయాలి. ఇటీవలే చిలుకలూరిపేటలో సీఐ వ్యవహరించిన తీరును ప్రజలు గమనించారు. న్యాయస్థానాలు పోలీసుల తీరుపై చాలా ఘాటుగానే విమర్శిస్తున్నా స్పందించడం లేదు. ఐపీఎస్ ఆఫీసర్లు చట్టాల ప్రకారం వ్యవహరించకపోతే భవిష్యత్తులో న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడాలి. కూటమి ప్రభుత్వం ఏం చెబితే గుడ్డిగా దానిని అనుసరించుకుంటూ పోతే దానికి వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కొందరు అధికారులు చట్టాలను అతిక్రమిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
Ambati: చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు బాధ పడుతున్నారు
-
చంద్రబాబు ప్రభుత్వంపై సీపీఎం రాష్ట్రకార్యదర్శి శ్రీనివాసరావు ఆగ్రహం
-
కిలో చికెన్‌కు రూ.20 కమిషన్ ఇవ్వాల్సిందే.. ఆళ్లగడ్డలో రెచ్చిపోతున్న టీడీపీ నేతలు
సాక్షి, నంద్యాల: చంద్రబాబు రాష్ట్రంలో ఆర్ధిక విధ్వంసం సృష్టిస్తుంటే, టీడీపీ ప్రజాప్రతినిధులు సైతం రెండడుగులు ముందుకేసి సొంతానికి సంపద సృష్టించుకోవడానికి వినూత్న మార్గాలు వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో ఆక్రమ ఆదాయ మార్గాలను అన్వేషించడంలో ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారు.ఇటీవల,నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కిలో చికెన్‌కు రూ.10 మామూళ్లు ఇవ్వాల్సిందేనని టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ హుకుం జారీ చేయడం విమర్శలకు దారి తీసింది. ఇప్పుడు తామేం తక్కువేం తినలేదంటూ టీడీపీ నేతలు, ఎమ్మెల్యే అఖిల ప్రియ మహిళా అనుచరులు రెచ్చిపోతున్నారు.చికెన్ కోళ్లను తమవద్దే కొనాలంటూ వ్యాపారస్తులకు హూకుం జారీ చేస్తున్నారు. చికెన్ కోళ్లను తమ వద్ద కొనుగోలు చేయకపోతే చికెన్ సెంటర్లను మూసేస్తామని బెదిరిస్తున్నారు. కేజీ చికెన్ మీద రూ.20 రూపాయిలు కమీషన్ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు.ఈ క్రమంలో తాము చిరు వ్యాపారులమని, కమిషన్లు ఇచ్చుకుంటూ పోతే..తమ కుటుంబ పోషణ భారమవుతుందటూ చికెన్ షాపు వ్యాపారస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతల ఆగడాలపై వ్యాపారస్తులు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. కేజీకి రూ.20 రూపాయలు కమిషన్ ఇవ్వాలని, కోళ్లను తమ దగ్గరే కొనుగోలు చేయాలంటూ టీడీపీ నేతల ఆగడాలపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతల బెదిరింపులు దౌర్జన్యాలు భరించలేక జిల్లా ఎస్పీని కలిసిని ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమరి చికెన్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
గుంటూరులోని విద్యా భవన్ ను ముట్టడించిన ఉపాధ్యాయ సంఘాలు
-
‘ఏపీలో జీహెచ్ఎంసీ యాక్ట్?.. కూటమిలో కుర్చీ కోసం కుమ్ములాట’
సాక్షి, వైఎస్సార్: కూటమి పాలనలో అభివృద్ధి లేదు.. కానీ కక్ష సాధింపులో మాత్రం ముందుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ నాయకులు రవీంద్రనాథ్ రెడ్డి. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది.. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని చెప్పుకొచ్చారు. కుర్చీల కోసం కుమ్ములాట నడుస్తోందన్నారు.వైఎస్సార్సీపీ నాయకులు రవీంద్రనాథ్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో అభివృద్ధి లేదు. ఇచ్చిన హామీల అమలు లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. కక్ష సాధింపులో భాగంగా రాక్షసానందం పొందుతున్నారు. వాళ్ళు పెడుతున్న కేసులు ఏవీ కోర్టుల్లో నిలబడటం లేదు. కడప మేయర్ సురేష్ బాబు విషయంలోనూ అదే తీరులో వెళ్తున్నారు. అసలు యాక్ట్ లేదు.. మనం జీహెచ్ఎంసీ యాక్టు అమలు చేసుకుంటున్నాం. మన రాష్ట్రానికి అసలు యాక్ట్ లేనే లేదు. జీహెచ్ఎంసీ యాక్టు చూపించి మా మేయర్‌పై చర్యలు తీసుకోవడం విడ్డూరం. మేయర్ కుమారుడి సంస్థకు కమిషనర్ రిజిస్టర్ చేస్తారు.. అప్పుడు ఎందుకు రిజెక్ట్ చేయలేదు?ఆరోపణల్లో ఏదైనా అవినీతి చూపించలేదు. కుర్చీల కోసం కుమ్ములాట కోసం ఇదంతా జరుగుతోంది. వాళ్ళ పత్రికలే కుర్చీల కోసమే ఇదంతా జరుగుతుందని రాసింది. ఎమ్మెల్యేలకు చాలా కంపెనీలు ఉన్నాయి.. మరి వాళ్ళు కాంట్రాక్టులు చేయవచ్చా?. మేయర్ తన వివరణలో తన దృష్టికి రాలేదని వివరణ కూడా ఇచ్చారు. న్యాయ వ్యవస్థపై మాకు గౌరవం ఉంది.. న్యాయ పోరాటం చేస్తాం. ఎమ్మెల్యే మాధవిరెడ్డి నేరుగా ఫిర్యాదు చేసారట.. దీనిలో ఇక రాజకీయం లేక ఏముంది?. నగరానికి ఆమె ఒక్క పైసా నిధులు తీసుకురాక పోగా కక్ష సాధింపులకు దిగడం సరికాదు.వేదికపై మేయర్ ఒక్కరే కూర్చోవాలి.. అది చట్టం. నీకు కుర్చీ వేయలేదని కక్ష సాధింపు అంటే ఎలా?. దీనికి మేయర్ ఇంటిపై చెత్త వేయిస్తారా?. తప్పుడు ఫిర్యాదులు చేస్తారా?. ఈ ప్రభుత్వం రాగానే అవిశ్వాసం పెట్టీ దించాలని ప్రయత్నం చేశారు. అది వీలు కాకపోవడంతో ఈ రకంగా కక్ష సాధింపునకు దిగుతున్నారు. చిన్న విషయాన్ని చూపి అనర్హత అనడం దారుణం’ అంటూ మండిపడ్డారు. -
KSR Live Show: పథకాలకు నో మనీ.. జల్సాలకు ఫుల్ మనీ..!
-
అప్పుల్లో చంద్రబాబు రికార్డ్
-
మద్యం కేసులో బాబు బేతాళ కుట్ర మరోసారి నిరూపితం
-
లిక్కర్ మాఫియా డాన్ చంద్రబాబే.. ఆధారాలతో సహా గతంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ... ఆ కేసులో ముందస్తు బెయిల్‌పై బయట ఉన్న చంద్రబాబు
-
‘అప్పే’.. ఏమీ లేదు!
మహమ్మారులు ప్రబలలేదు.. ప్రకృతి విపత్తులు ముంచెత్తలేదు.. ఆర్థిక సంక్షోభం లాంటివి తలెత్తలేదు..సంక్షేమ పథకాలు ఇచ్చింది కూడా లేదు.. కానీ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉంది. రాబడులు పడిపోతుండగా.. గ్రాంట్లు కొడిగడుతున్నాయి. సంపద పెంచేస్తా.. అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ పనిచేయలేకపోగా ఉన్న సంపదను ఆవిరి చేస్తున్నారు. కాగ్ వెలువరించిన నివేదిక ఆధారంగా వెల్లడైన వాస్తవాలు.. సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వ ఏలుబడిలో రాష్ట్ర ఆదాయం తిరోగమనంలో ఉందని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. ఓపక్క రెవెన్యూ రాబడి తగ్గుతూ ఇంకోపక్క రాష్ట్ర అప్పులు భారీగా పెరుగుతున్నట్లు తేలింది. మార్చి నెలతో ముగిసిన 2024–25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రాబడులు, వ్యయాల లెక్కలను కాగ్ బుధవారం వెల్లడించింది. వీటిని గమనిస్తే.. సంపద సృష్టించడం దేవుడెరుగు.. అస్తవ్యస్త పాలనతో ఉన్న సంపదను కూడా ఆవిరి చేసేస్తున్నారని స్పష్టమవుతోంది. అంతకుముందు వచ్చిన దానిని కూడా నిలబెట్టలేకపోయారని అర్థమవుతోంది. ఇందుకు ప్రధాన కారణం కక్షసాధింపులు, రెడ్‌బుక్ వేధింపులపైనే దృష్టిపెట్టి పాలనను గాలికి వదిలేయడమేనని తెలుస్తోంది. సహజంగా ఎలాంటి సంక్షోభాలూ లేకుంటే అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రాబడులకు మించిన ఆదాయం వస్తుంది. కానీ, రాష్ట్రంలో 2023–24లో వచ్చిన ఆదాయం 2024–25లో రాకపోగా రూ.5,520 కోట్లు తగ్గినట్టు కాగ్ గణాంకాలు పేర్కొంటున్నాయి. మరోపక్క రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు భారీగా పెరిగినట్లు తేల్చాయి. అంటే, సంపదలోనూ, వృద్ధిలోనూ రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తున్నట్లు తేలుతోంది.అమ్మకం పన్ను తగ్గిందంటే..» అమ్మకం పన్నుతో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం 2024–25లో తగ్గిపోయింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే అమ్మకం పన్ను రాబడి రూ.1,053 కోట్లు పడిపోయింది. దీని అర్థం ప్రజల కొనుగోలు శక్తి తగ్గడమేనని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రజల దగ్గర డబ్బులేక కొనుగోలు శక్తి తగ్గిపోవడం.. అమ్మకం పన్ను ద్వారా రాబడి పడిపోవడానికి ప్రధాన కారణమని అధికార వర్గాలు కూడా తెలిపాయి.» స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా కుదేలైంది అంటే రియల్ ఎస్టేట్ రంగంలో పురోగతి లేదని స్పష్టమవుతోంది. అంతకుముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే 2024–25లో స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్ ఆదాయం రూ.705 కోట్లు తగ్గిపోయింది.» పన్నేతర ఆదాయం కూడా తిరోగమనంలో ఉందని కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. అంతకుముందు ఆర్థిక ఏడాదిలో పోల్చితే 2024–25లో ఇది రూ.842 కోట్లు తగ్గినట్లు కాగ్ గణాంకాలు పేర్కొన్నాయి.» కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధుల్లోనూ భారీగా తగ్గుదల నమోదైంది. 2023–24తో పోల్చితే 2024–25లో గ్రాంట్లు రూ.14,563 కోట్లు తగ్గిపోయాయి.» బడ్జెట్ అంచనాలను మించి అప్పులు చేసినా మూలధన వ్యయం అంతంత మాత్రంగానే ఉందని కాగ్ గణాంకాలు పేర్కొన్నాయి. తెచ్చిన అప్పును ఆస్తుల కల్పన కోసం మూలధన వ్యయంపై పెట్టాలని ఇటీవల చంద్రబాబు విలేకరుల సమావేశంలో నీతి వాక్యాలు పలికారు. అయితే, 2023–24తో పోల్చితే 2024–25లో మూలధన వ్యయం రూ.4,413 కోట్లు తగ్గిపోయింది. చేసిన అప్పులను ఆస్తుల కల్పనపైనా పెట్టలేదు.. సూపర్ సిక్స్ హామీలనూ అమలు చేయలేదు.అంతా బడాయి» విద్య, వైద్యం, పౌష్టికాహారం, సంక్షేమానికి సంబంధించి సామాజిక రంగ వ్యయం కూడా అంతకుముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే 2024–25లో రూ.4,696 కోట్లు తగ్గినట్లు కాగ్ స్పష్టం చేసింది. రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు భారీగా పెరిగినట్లు తేల్చింది.» కాగ్ గణాంకాలనే చూస్తే 2023–24 కన్నా 2024–25లో రాష్ట్ర రెవెన్యూ రాబడులు తగ్గిపోయినట్లు తేలుతోంది. అయినా రాష్ట్ర వృద్ధి రేటు పెరిగి పోతోందని.. అదే సంపద అంటూ సీఎం చంద్రబాబు చెబుతున్నారు.» ఇదంతా కేవలం అప్పులు ఎక్కువగా చేయడానికే తప్ప.. రాష్ట్ర సంపద సృష్టికి కాదని స్పష్టమవుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
హ్యాపీ నెస్ట్.. రూ.315 కోట్లు లాస్ట్!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన తొలి రియల్ ఎస్టేట్ వెంచర్ ‘హ్యాపీ నెస్ట్’ ప్రాజెక్టులో ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా, ఖజానాకు ఇప్పటికే రూ.315.60 కోట్ల నష్టం వాటిల్లింది. నిర్మాణ సమయంలో ధరల సర్దుబాటు, డిజైన్ల మార్పు తదితరాల వల్ల నిర్మాణ వ్యయం మరింతగా పెరగడం.. తద్వారా మరింత నష్టం తథ్యమని అధికార వర్గాలు, బిల్డర్లు స్పష్టం చేస్తున్నారు. ఆ భారాన్ని ఆ ప్రాజెక్టులో ఫ్లాట్లు కొన్న 1,200 మందిపై మోపబోమని, రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ ఇప్పటికే సెలవిచ్చారు. అంటే.. 1,200 మంది ఎన్నారైలు, బడా బాబుల ఫ్లాట్ల కోసం రాష్ట్ర ప్రజలపై ఇప్పటికే రూ.315.60 కోట్ల భారం మోపారన్నది స్పష్టమవుతోంది. రాజధాని ప్రాంతంలో నేలపాడు వద్ద హ్యాపీ నెస్ట్ పేరుతో 14.46 ఎకరాల్లో జీ+18 అంతస్తులతో నిర్మించే 12 టవర్లలో 1,200 ఫాట్లను చదరపు అడుగు రూ.3,492 చొప్పున 2018లోనే రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) విక్రయించింది. ఈ మేరకు ఎన్నారైలు, బడా బాబులు అడ్వాన్సులు ఇచ్చి ఫ్లాట్లను బుక్ చేసుకున్నారు. హ్యాపీ నెస్ట్‌లో మొత్తం 21,52,349 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతాన్ని విక్రయించడం ద్వారా సీఆర్డీఏ రూ.751.60 కోట్లు సమీకరించింది. ఆ రియల్ వెంచర్ నిర్మాణ పనులను అప్పట్లో రూ.658.45 కోట్లకు (చదరపు అడుగు నిర్మాణ వ్యయం సగటున రూ.3,059.26 చొప్పున) కాంట్రాక్టు సంస్థ షాపూర్జీ పల్లోంజీకి 2018 డిసెంబర్ 31న సీఆర్డీఏ అప్పగించింది. తద్వారా ఆ ఒక్క ప్రాజెక్టు ద్వారానే రూ.93.15 కోట్ల లాభం వచి్చందని అప్పట్లో గొప్పగా చెప్పుకుంది. » చంద్రబాబు కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చాక హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసింది. ఆ ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం వల్ల వ్యయం పెరిగిందని.. ఆ భారాన్ని ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారిపై మోపబోమని, దాన్ని ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి నారాయణ ఇప్పటికే తేల్చి చెప్పారు. తద్వారా ఆ నష్టాన్ని ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే డబ్బుల ద్వారా పూడ్చుకోనున్నారన్నది స్పష్టమవుతోంది. » నిజానికి 2018–19 నాటికి.. ఇప్పటికి నిర్మాణ సామగ్రి, సిమెంటు, స్టీలు వంటి వాటి ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం ఇసుక కూడా ఉచితమే. ఈ నేపథ్యంలో ఆ రియల్ ఎస్టేట్ వెంచర్ ప్రాజెక్టు అంచనా వ్యయం పెరగడానికి అవకాశమే లేదు. కానీ.. గతేడాది సెపె్టంబరు 18న రూ.770.94 కోట్ల అంచనా వ్యయంతో హ్యాపీ నెస్ట్‌కు సీఆర్డీఏ మళ్లీ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే.. అంచనా వ్యయాన్ని రూ.112.49 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. ఆ తర్వాత ఆ టెండర్‌నూ రద్దు చేసింది. » మళ్లీ గతేడాది డిసెంబర్ 22న రూ.818.03 కోట్ల అంచనా వ్యయంతో సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే.. మూడు నెలల్లోనే అంచనా వ్యయాన్ని రూ.47.09 కోట్ల మేర పెంచేసినట్లు స్పష్టమవుతోంది. ఈ పనులను 4.68 శాతం అధిక ధరకు అంటే రూ.856.31 కోట్లకు ఎన్సీసీ సంస్థకు అప్పగించింది. పైగా జీఎస్టీ, నాక్, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.153.05 కోట్లను అదనంగా చెల్లిస్తామని పేర్కొంది. ఈ లెక్కన రూ.1,009.36 కోట్లకు అప్పగించినట్లు స్పష్టమవుతోంది. » ఇక రాజధాని ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఎకరం రూ.4 కోట్ల చొప్పున 2016–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. ఆ లెక్కన హ్యాపీ నెస్ట్ రియల్ వెంచర్‌కు కేటాయించిన 14.46 ఎకరాల భూమి విలువ రూ.57.84 కోట్లు. దీన్ని కూడా కలుపుకుంటే హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు వ్యయం రూ.1,067.20 కోట్లకు చేరుతుంది. ఆ ప్రాజెక్టులో ఫ్లాట్లను విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.751.60 కోట్లు. అంటే.. హ్యాపీ నెస్ట్ ద్వారా ఇప్పటికే రూ.315.60 కోట్లు నష్టం వచి్చనట్లు స్పష్టమవుతోంది. నిర్మాణ సమయంలో పడే అదనపు భారం వల్ల ఆ నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని, ఆ భారం ప్రజలపైనే పడుతుందని బిల్డర్లు స్పష్టం చేస్తున్నారు. »సర్కారు నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ లెక్కన అమరావతి తన నిర్మాణానికి అవసరమైన నిధులను తానే సమీకరించుకుంటుందని (సెల్ఫ్ ఫైనాన్స్ సస్టెయినబుల్ కేపిటల్) సీఎం చంద్రబాబు నుంచి మంత్రుల వరకూ చెబుతున్నదంతా సెల్ఫ్ డబ్బా, పచ్చి అబద్ధాలేనన్నది ‘హ్యాపీ నెస్ట్’తో తేలిపోయిందని రియల్టర్లు, బిల్డర్లు విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. -
‘ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులు ఎలా బతకాలి? ’
తాడేపల్లి : రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాలికొదిలేశారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. కౌలుదారు రైతులనైతే చంద్రబాబు అస్సలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈరోజు(బుధవారం) తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన కారుమూరి.. జగన్ హయాంలో కౌలు రైతులకు పెద్ద పీట వేస్తే, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం వారిని పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.‘జగన్ హయాంలో కౌలు రైతులకు పెద్ద పీట వేశారు. పంట నష్టం వచ్చినా అందుకున్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించారు. చంద్రబాబు వచ్చాక కౌలుదారీ కార్డులు తొలగించారు. ఖరీఫ్ సీజన్ కి మరో 15 రోజులే సమయం ఉంది. ఈలోపు కౌలుదారులకు కూడా న్యాయం చేయాలి. 80% మంది ఉన్న కౌలు రైతుల మేలు గురించి పట్టించుకోకపోవడం దారుణం. జగన హయాంలో తడిసిన ధాన్యం కూడా చివరి గింజ వరకు కొనుగోలు చేశారు. కౌలు రైతుకు కూడా కార్డులు ఇస్తే ఎక్కడ ప్రభుత్వ మేలు చేయాల్సి వస్తుందోనని చంద్రబాబు ఇవ్వటం లేదు. 32 లక్షల మంది కౌలు రైతులు చంద్రబాబు వలన ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులు ఎలా బతకాలి?, వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నారో అర్ధం కావటం లేదు. వ్యవసాయం దండగ అనే ఆలోచనలోనే ఇంకా చంద్రబాబు ఉన్నారు. అమరావతి మీద చూపే ప్రేమ రైతుల మీద కూడా చూపించండి. పొగాకుకు ధరల్లేక రైతులు కన్నీళ్ళు పెడుతుంటే చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదు?, పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. జగన్ హయాంలో రూ.18 వేలు ఉన్న ధర ఇప్పుడు రూ.10వేలు కూడా లేదురైతులను వదిలేసి అమరావతి, భ్రమరావతి అంటూ చంద్రబాబు తిరుగుతున్నారు. పొగాకు రైతులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుంది. వారి తరపున పోరాటం చేస్తాం. పవన్ కళ్యాణ్ పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్రంతో మాట్లాడాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్.. అందరూ స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నారు. ప్రభుత్వ సొమ్మును ఇష్టానుసారం వాడుకుంటున్నారు’ అని మండిపడ్డారు. -
Chandrasekhar Reddy: విద్యా వ్యవస్థకు చంద్రగ్రహణం.. చంద్రబాబుపై ఫైర్
-
‘రాష్ట్రంలో విద్యకు చంద్ర గ్రహణం పట్టించారు’
తాడేపల్లి : చంద్రబాబు నాయుడు పాలనతో రాష్ట్రానికి రాహు కాలం పట్టిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో విద్యను విధ్వంసం చేసి చంద్రగ్రహణం పట్టించారని మండిపడ్డారు. ఈరోజు(బుధవారం) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన చంద్రశేఖర్ రెడ్డి.. ‘ జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పులను చంద్రబాబు సర్వ నాశనం చేశారు. ప్రీ హైస్కూల్స్, శాటిలైట్ స్కూల్స్ వంటి రీఫామ్స్ తెచ్చారు. వాటి వలన 25 వేల మంది టీచర్లకు ప్రమోషన్స్ వచ్చాయి. జీవో 117 తో జగన్ తెచ్చిన మార్పులు ఎప్పటికీ గుర్తుండి పోతాయి.చంద్రబాబు తెచ్చిన 9 రకాల వ్యవస్థల వలన విద్యారంగం నాశనం అయింది. దీని వలన టీచర్ల మధ్య కూడా వైషమ్యాలు తెచ్చారు. చివరికి 26 వేల స్కూళ్లు దెబ్బతినబోతున్నాయి. ప్రాథమిక పాఠశాలలు పూర్తిగా కనుమరుగు అయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వ స్కూళ్ల మీద విరక్తి కలిగేలా చేస్తున్నారు. జగన్ మీద ఉన్న కోపాన్ని స్కూళ్ల మీద చూపిస్తూ వాటిని నాశనం చేస్తున్నారు. 4 లక్షల మంది అభ్యర్థులు డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు’ అని స్పష్టం చేశారు. -
ఏపీ పోలీసుల ఆగడాలకు హద్దు ఎక్కడ?
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు ఏమైంది?. ప్రభుత్వమేదైనా.. రాజకీయ ప్రభావం ఎంతో కొంత ఉండవచ్చు కానీ.. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వంలో మాత్రం పోలీసింగే తక్కువైపోతోంది!. వేసే ప్రతి అడుగు రాజకీయ ప్రేరేపితంగానే కనిపిస్తోంది. ఈ క్రమంలో పోలీసులు మహిళలన్న విచక్షణ కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇవి చాలవన్నట్లు లాకప్ మరణాలూ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడో 1980లలో తరచూ కనిపించిన లాకప్‌డెత్ వార్తలు మళ్లీ పత్రికలకు ఎక్కువ అవుతుండటం ఆందోళన కలిగించే విషయమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రమీజాబి, షకీలా అనే ఇద్దరు మహిళల లాకప్ డెత్ రాష్ట్రం మొత్తాన్ని కుదిపేశాయి. విపక్షాల ఆందోళనను అదుపు చేయడమే ప్రభుత్వానికి కష్టమైపోయింది. ఒక మహిళను గన్నవరం వద్ద పోలీసులు హింసిస్తే ప్రజలే తిరుగుబాటు చేసినంత పనిచేశారు. లాకప్‌డెత్‌లకు సంబంధిత పోలీసు అధికారులను బాధ్యులను చేసి చర్యలు తీసుకునేవారు. ఒకసారి విజయవాడలో మురళీధరన్ అనే కేరళ వ్యక్తి లాకప్‌లో మరణించినట్లు ఆరోపణలు వచ్చాయి. న్యాయ వ్యవస్థ జోక్యంతో లాకప్ డెత్‌ల విషయంలో పోలీసులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి.తాజా పరిణామాల విషయానికి వస్తే.. సాక్షి దినపత్రికలో ‘ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్’ శీర్షికతో ఒక కథనం ప్రచురితమైంది. రాజకీయ బాస్‌లను మెప్పించేందుకు పోలీసులు ఎంతకైనా తెగిస్తారా? అనిపిస్తుంది. దీన్ని చదివితే టీడీపీ జిల్లా నేత, అధిష్టానానికి సన్నిహితుడైన వీరయ్య చౌదరి అనే వ్యక్తిని దుండగులు హత్య చేశారు. రియల్ ఎస్టేట్, మద్యం సిండికేట్ తగాదాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. టీడీపీలోని మరో వర్గం వారే హత్య చేయించారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, వీరయ్య చౌదరి అంత్యక్రియలకు స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కావడంతో ఈ కేసు ప్రాముఖ్యత పెరిగిపోయింది. ఆ తరువాత పోలీసులు ఈ హత్య కేసులో అనుమానితులన్న పేరుతో కొందరిని నిర్బంధించి హింసిస్తున్నట్లు.. నేరం తామే చేసినట్టుగా ఒప్పుకోవాలని బలవంతం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. నిందితులైతే అరెస్టు చేయడం తప్పు కాకపోవచ్చు కానీ.. అనధికారికంగా నిర్బంధించడంతోనే వస్తోంది సమస్య.పోలీసుల హింస తట్టుకోలేక ఒక అనుమానితుడు ప్రాణాలు కోల్పోవడంతో సమస్య జటిలమైంది. మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు బెదిరించినట్లు తెలుస్తోంది. విషయం బయటకు పొక్కితే మిమ్మల్ని కూడా కేసులో ఇరికిస్తామని కుటుంబ సభ్యులను హెచ్చరించారట. పోలీసు ఉన్నతాధికారి ఒకరి పాత్ర కూడా ఇందులో ఉందట. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి కొంత డబ్బు ముట్టచెప్పి అంత్యక్రియలు కూడా జరిపించేశారట. ప్రజలను కాపాడవలసిన పోలీసులే ఇలా లాకప్ డెత్‌లకు కారణం అవుతుంటే ఏపీలో పాలన తీరు ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం అవుతుంది.ఎల్లో మీడియా గతంలో జగన్ ప్రభుత్వ టైమ్‌లో ఏ ఘటన జరిగినా భూతద్దంలో చూపుతూ నానా యాగీ చేసేవి. రాజమండ్రి వద్ద ఒక పోలీస్ స్టేషన్లో ఒక నిందితుడికి శిరోముండనం చేశారు. అది బయటకు వచ్చింది. వెంటనే జగన్ ప్రభుత్వం సంబంధిత పోలీసు అధికారులపై కేసు కూడా పెట్టి చర్య తీసుకుంది. అయినా అప్పటి విపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా కలిసి దారుణమైన రీతిలో ప్రచారం చేశాయి. సుధాకర్ అనే ఒక డాక్టర్ మద్యం తీసుకుని విశాఖ రోడ్డుపై రచ్చ చేస్తుంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ అతని చేతులు వెనక్కి కట్టి స్టేషన్‌కు తీసుకువెళ్లాడు. దానిపై ఎంత గందరగోళం సృష్టించారో అందరికి తెలుసు. ఇలా ఏ చిన్న అవకాశం వచ్చినా విరుచుకుపడేవారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా పోలీసుల కారణంగానే మరణించినా ప్రభుత్వం పెద్దగా స్పందిస్తున్నట్లు కనిపించదు.మరోవైపు మాజీ మంత్రి విడదల రజని పట్ల పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ వ్యవహరించిన తీరు శోచనీయం. ఆమెను కారు నుంచి బలవంతంగా దించి, కారణం, కేసు వివరాలు చెప్పకుండా ఆమె వద్ద పనిచేసే వ్యక్తిని అరెస్టు చేసిన వైనం తీవ్ర విమర్శలకు గురైంది. గుంటూరు జిల్లాలో ఒక మహిళా ఎంపీటీసీని రాత్రివేళ కనీసం డ్రెస్ మార్చుకోనివ్వకుండా అరెస్టు చేసి తీసుకువెళ్లారు. కృష్ణవేణి అనే సోషల్ మీడియా కార్యకర్తను గతంలో అరెస్టు చేసి పలు స్టేషన్లకు తిప్పారు. ఏపీలో మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు, హత్యలు వంటి వాటిని అరికట్టడానికి పోలీసులు ఏం చర్యలు చేపడుతున్నది తెలియదు కాని, ఇలా వైఎస్సార్సీపీకి చెందిన మహిళలను మాత్రం పలు రకాలుగా పోలీసులతో వేధిస్తున్న తీరు అభ్యంతరకరం అని చెప్పాలి.ఇవే కాదు.. అటవీ శాఖాధికారి, సీనియర్ అధికారి సిసోడియా వద్ద ఓఎస్డీగా పనిచేసిన మూర్తి అనే అధికారిని సిసోసియా మనుషులే కిడ్నాప్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. మూర్తి ఇంటెలిజెన్స్ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కు తీసుకోవాలని ఒత్తిడి చేశారట. ఈ కేసు సంగతి వదలి, అతనిని పోలీసులు ఇబ్బంది పెడుతుంటే హైకోర్టు జోక్యం చేసుకుని రక్షణ కల్పించిందట. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మార్పిఎస్ రాయలసీమ అధ్యక్షుడు లక్ష్మీనారాయణను ప్రత్యర్దులు కారు టిప్పర్‌తో ఢీకొట్టి వేట కొడవళ్లతో హత్య చేశారు. ఇది టీడీపీ నేతతో ఉన్న ఫ్యాక్షన్ గొడవతోనే. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఈ హత్య జరిగిందని ఆయన కుటుంబ సభ్యులు వాపోతున్నారు.మరో ఘటనలో టీడీపీ ఎమ్మెల్యే సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రరెడ్డిని గత నవంబర్ 8న అరెస్టు చేసి పదో తేదీన జరిగినట్లు రికార్డుల్లో చూపించారన్న విషయమై హైకోర్టు కూడా సీరియస్ అయింది. రెడ్ బుక్ పాలనలో సీనియర్ ఐపీఎస్ అధికారులు కొందరికి కూడా అక్రమ కేసుల బెడద తప్పడం లేదు. గత ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉండటమే వీరు చేసిన తప్పుగా ఉంది. ఈ పరిణామాలేవీ ప్రజాస్వామ్య వ్యవస్థలకు మంచిది కాదు. ఈ ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వస్తే అప్పుడు ఇదే మ్యూజిక్‌ను ఎదుర్కోవలసి వస్తుందని వైఎస్సార్సీపీ హెచ్చరికలు చేస్తున్నా, పోలీసు అధికారులు కొందరు రాజకీయ బాస్‌లకు అత్యంత విధేయులుగా ఉండడానికి, వారి మెప్పు పొందడానికి ఆగడాలకు దిగుతున్నారు. ఇది దురదృష్టకరం!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కూలి పనికెళ్తే.. పురుగులమందు తాగి చనిపోయేలా చేసారు
-
Chelluboyina Venu Gopala: ఉచిత ఇసుక అనేది చంద్రబాబు పెద్ద స్కామ్
-
చంద్రబాబు పాలనాపై ఆర్కే రోజా కామెంట్స్
-
జగన్ ప్రభంజనం చూసి సోనియా గాంధే భయపడింది.. ఇక బాబెంత!
-
అబద్ధపు వాంగ్మూలాలతో లేని మద్యం కేసు.. బాబు కుట్ర రాజకీయాలు
-
మద్యం కేసులో ఏపీ ప్రభుత్వ యంత్రాంగం తీరుపై సుప్రీంకోర్టు విస్మయం
-
రిమాండ్ రిపోర్ట్ లో చంద్రబాబు భేతాళ కథలు
-
ఆదాయం భారీగా పెంచాలి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆదాయం మరింతగా పెంచేందుకు ఉన్న అనుకూలతలు, వేగంగా వృద్ధి చెందడానికి గల అవకాశాలపై ఆదాయార్జన శాఖలన్నీ లోతైన అధ్యయనం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నుంచే 75 శాతం ఆదాయం వస్తుందని, మనకు అటువంటి అవకాశం లేనందున ఆదాయం పెంచుకునే మార్గాలను మరింతగా అన్వేషించాలన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయన ఆదాయార్జన శాఖల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బంగారం అత్యధికంగా కొనుగోలు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందున్నా, పన్ను ఆదాయం ఆ స్థాయిలో ఎందుకు లేదో అధికారులు దృష్టి పెట్టాలన్నారు. పన్ను ఎగవేతలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖల సమాచారంతో డేటా లేక్ ఏర్పాటు చేయాలని, ప్రతి శాఖకు ఏఐ బృందం ఉండాలని చెప్పారు. పన్ను చెల్లింపుదారులకు ఏఐ టూల్ ద్వారా సేవలు అందించేలా వచ్చే రెండు, మూడు నెలల్లో ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పారు. మద్యం సరఫరా, అమ్మకాల ట్రాకింగ్ పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా తీసుకొచ్చి, రాష్ట్రంలో విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రవాణా శాఖ ఆదాయం పెరుగుతుంటే.. ఏపీలో ఎందుకు తక్కువగా ఉందని ప్రశి్నంచారు. రాష్ట్రంలోని ఎర్ర చందనం నిల్వలను అంతర్జాతీయ మార్కెట్లో అమ్మేలా కమిటీ ఏర్పాటు చేసి, నివేదిక ఇవ్వాలని చెప్పారు. ‘2025–26 సంవత్సరానికి రాష్ట్ర సొంత ఆదాయం రూ.1,34,208 కోట్లు ఆర్జించాలన్నది లక్ష్యం. ఇది గత ఏడాది కన్నా 29 శాతం అధికం’ అని సీఎం చెప్పారు. -
మద్యం అమ్మకాల ఆదాయం భారీగా పెంచండి!
విజయవాడ: ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన ఆదాయం భారీగా తగ్గిపోవడంతో దాన్ని సరిచేసుకునే పనిలో పడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు. దీనికి చంద్రబాబు దగ్గర ఉన్న ప్రధానం ఆయుధం మద్యం. ఇప్పుడు దానిపైనే మరోసారి పడ్డారు చంద్రబాబు. మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం భారీగా పెంచాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ విషయం స్పష్టం చేశారు చంద్రబాబు.మద్యం ద్వారా అమ్మకాల ద్వారా రూ. 33, 882 కోట్లు ఆదాయం తేవాలని టార్గెట్ నిర్దేశించారు. అదే సమయంలో ఎర్రచందనం అమ్మకంతో కూడా ఆదాయం పెంచాలన్నారు సీఎం చంద్రబాబు. దీనిపై కూడా భారీగా ప్రభుత్వ ఆదాయం పెంచాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఎర్రచందనాన్ని అంతర్జాతీయంగా అమ్మాలని ఆదేశించారు. దీనికి సంబంధించి అధికారలతో కమిటీ వేయాలన్నారు.29 శాతం పెంచాలంటూ..!చంద్రబాబు పాలనలో భారీగా తగ్గిపోవడంతో కేంద్ర నుండి రావాల్సిన ఆదాయం భారీగా తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం తగ్గినట్లు అధికారులు అంగీకరించారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుండి మే 11 వరకూ రూ. 5,500 కోట్ల మైనస్ ఆదాయం ఉందని అధికారులు తెలిపారు. దాంతో ఆదాయాన్ని 29 శాతం ఆదాయం పెంచాలంటూ అధికారులకు టార్గెట్ పెట్టారు చంద్రబాబు. అయితే 29 శాతం ఆదాయం ఎలా పెంచాలని అధికారులకు తలలు పట్టుకుంటున్నారు. -
‘చంద్రబాబు ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ పూర్తి’
ఢిల్లీ: సూపర్ సిక్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. వాటిని అమలు చేయలేక డకౌట్ అయ్యారని విమర్శించారు సీడబ్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారన్నారు. చంద్రబాబు తీరు చూస్తే వాగ్దానాలు అమలు చేసే పరిస్థితి లేదన్నారు గిడుగు రుద్రరాజు. చంద్రబాబు ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ పూర్తయ్యిందని చమత్కరించారు. అమరావతి పేరుతో మళ్లీ భూసేకరణ చేయడానికి మేము వ్యతిరేకిస్తున్నామన్నారు. గతంలో భూమి ఇచ్చిన రైతులకే ప్రభుత్వం ఆర్థికంగా న్యాయం చేయలేదన్నారు. అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ద్వజమెత్తారు. అమరావతికి 7 వేల ఎకరాలు సరిపోతుందని గిడుగు రుద్రరాజు స్సష్టం చేశారు. -
గరం గరం వార్తలు ఫుల్ ఎపిసోడ్
-
లిక్కర్ స్కామ్ లో బాబే సూత్రధారి!
-
అప్పుడు జన్మభూమి కమిటీలు... ఇప్పుడు పీ-4 సమన్వయకర్తలు!
పేదరిక నిర్మూలన కోసమే పీ-4 విధానం అన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాన్ని పార్టీ నేతల పదవీదాహాన్ని తీర్చేందుకు వాడేసుకుంటున్నారా? అవుననే అంటున్నారు ప్రజలు. కార్పొరేట్ సంస్థలు, ధనికులు రాష్ట్రంలోని పేదలను దత్తత తీసుకుని పేదరికం నుంచి బయటపడేయడమే పీ-4 అని చంద్రబాబు నాయుడు ఇటీవలి కాలంలో రాష్ట్రమంతా ఊదరగొట్టిన సంగతి తెలిసిందే. అదేదో గేమ్‌ఛేంజర్ అని... కొద్దిమంది ధనికులు కొంతమంది పేదలను దత్తత తీసుకుంటే పేదరికం ఎలా తగ్గుతుందన్న అనుమానం వ్యక్తం చేస్తే.. ‘‘మీకు తెలియదులే’’ అన్నట్టుగా వ్యవహరించారు చంద్రబాబు. ఈ పీ-4 విషయంలో తాజా సమాచారం మాత్రం ఆశ్చర్యంగానే ఉంది.ధనికుల అనాసక్తో ఇంకో కారణమో తెలియదు కానీ.. పీ-4 అమలుకు ఇప్పుడు కొత్త స్కీమ్‌ను ముందుకు తెచ్చారు. పేదలకూ.. ధనికులకు మధ్య వారధిగా ఓ సమన్వయ కర్తను నియమించనున్నామని అంటున్నారు. మంచిదేగా అనుకుంటున్నారేమో.. నియోజకవర్గానికి ఒకరు చొప్పున రాష్ట్రం మొత్తం 175 మందిని ఏర్పాటు చేయడమే కాదు.. వీరు ఒకొక్కరికి నెలకు రూ.60 వేల జీతమిస్తారట! అలాగని వీరి నియామకాలకు ఏదైనా నిర్దిష్ట విధానముందా అంటే అదీ లేదు! అంటే.. తెలుగుదేశం కూటమి నేతలు సిఫారసు చేసిన వారికే ఈ పదవి వస్తుందన్నమాట. పైగా ఇది ఉద్యోగమా? లేక ఓ హోదానా? ఉద్యోగి అయితే అతడికి ఇతర సదుపాయాలు కల్పించాలి మరి!నియోజకవర్గంతోపాటు అవసమైనప్పుడు జిల్లా కేంద్రం, రాష్ట్ర రాజధానికి వెళ్లి వచ్చేందుకు అవసరమైన ఖర్చులన్నమాట. ఇవన్నీ ఏ పద్దు కింద.. ఏ కార్యాలయానికి అనుంబంధంగా ఇస్తారు? అంతేకాకుండా... ఈ సమన్వయకర్త పని చేసేందుకు ఓ కార్యాలయం.. అతడికో సీటు ఏర్పాటూ తప్పనిసరి అవుతుంది! పోనీ సమన్వయకర్త అనేది ఒక హోదా అనుకున్నా.. ఆఫీసు, రవాణా ఖర్చుల్లాంటివి భరించక తప్పదు. వీటన్నింటికీ కేటాయింపులు కూడా లేకపోవడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఏడాదికి రూ.12 కోట్ల వ్యయానికి లెక్కలేమిటి అని ఎవరైనా అడిగితే ఏం చెబుతారు?పీ-4 సమన్వయ కర్తలు నియోజకవర్గ ప్రణాళిక తయారు చేసి, దాతృత్వ వ్యక్తులు, ప్రైవేటు రంగ సంస్థలను ఒప్పించి సమన్వయం చేస్తూ సమాజానికి మేలు చేయాలట. నిజానికి చంద్రబాబు ఈ కార్యక్రమం ఆరంభించినప్పుడు ఏపీలో ఉన్న ప్రముఖులు, ఆయా సంస్థలు పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో పేదలను దత్తత తీసుకుంటారన్నట్లుగా హోరెత్తించారు. ఇందుకోసం ఒక సర్వేని కూడా నిర్వహించి సుమారు 20 లక్షల కుటుంబాలను పేదల కింద నిర్ణయించారని వార్తలు వచ్చాయి. అయితే ఆయా కుటుంబంలో పిల్లల చదువులు, ఇతర అవసరాలు తీర్చేందుకు ఎంతమంది దాతలు ముందుకు వస్తారన్న సందేహాలు వ్యక్తం అయ్యాయి.దీనికి తగ్గట్టుగానే ప్రభుత్వం ఏదో హడావుడి చేసినా, స్పందించింది చాలా కొద్దిమందేనని అనిపిస్తోంది. ప్రభుత్వం స్వయంగా పేదరికాన్ని వేలెత్తి చూపే విధంగా వ్యవహరించడం మంచిదేనా అన్న మీమాంస ఏర్పడింది. ఈ సమన్వయ కర్తలను కాంట్రాక్టు పద్దతిలో నియమించడం ద్వారా తమకు తోచిన వారిని నియమించుకోవచ్చని చెబుతున్నారు. ప్రభుత్వం పేదలను ఆదుకునే బాధ్యత ప్రైవేటు రంగానికి అప్పగించి చేతులు దులుపుకున్నట్లుగా ఉందీ వ్యవహారం. తాజాగా తెలుస్తున్నదేమిటంటే... పేదలను దత్తత తీసుకునే వారిని ఎంపిక చేయడం.. ఒప్పించడం అన్నీ గ్రామ పంచాయతీ కార్యదర్శుల బాధ్యతగా ప్రభుత్వం తీర్మానించింది. ఈ పని చేయకపోతే వారి జీతాల్లో కోతలూ ఉంటాయని ప్రభుత్వం హెచ్చరిస్తున్నట్లు సమాచారం. దీంతో మాకీ కొత్త తలనొప్పి ఏమిటని గ్రామ పంచాయతీ కార్యదర్శలు తలలు పట్టుకుంటున్నారు.సమన్వయకర్తలతోపాటు కన్సల్టెంట్ల పేరుతో మరింత మందిని నియమించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ‘వికసిత ఆంధ్ర విజన్’ పేరుతో ఏపీ రాష్ట్ర అభివృద్ది ప్రణాళిక కమిటీలో 71 మందిని కన్సల్టెంట్లుగా పెడుతున్నారు. ఇదే కాదు.రాష్ట్ర ఆదాయం పెంచడానికి ఎనిమిది నెలల కాలానికి రూ.3.28 కోట్లు చెల్లిస్తూ.. 11 మంది కన్సల్టెంట్లను నియమిస్తున్నారు. రాజధాని అభివృద్ది సంస్థ కోసం ఒకొక్కరికి రూ.లక్ష నుంచి రెండు లక్షల జీతాలతో మరో 68 మంది కన్సల్టెంట్లకూ ఓకే అంది ప్రభుత్వం. వీరు అమరావతి ఆర్థికాభివృద్దిలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలట. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణ పనుల పర్యవేక్షణ కోసం మరో కన్సల్టెన్నీ ఏజెన్సీకి రెండేళ్లలో ఇంకో రూ.22 కోట్లు వ్యయం చేయనున్నారు. చూడబోతే ప్రభుత్వాన్ని అంతా ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి పెట్టేలా ఉన్నారు.లక్షల మంది ఉద్యోగులు, యంత్రాంగం ఉన్న ఏపీ ప్రభుత్వం ఎందుకు ఈ నియమాకాలను చేపడుతోంది అంటే ఇదంతా పార్టీకి పని చేసిన వారి కోసమో, లేక కూటమి నేతలు తమ ఇష్టం వచ్చిన వారిని నియమించుకోవడానికో అన్న సమాధానం వస్తుంది. అసలు చంద్రబాబు పేరు వినగానే, ఆయనను చూడగానే ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు పెట్టుబడులు పెట్టడానికి, దానాలు చేయడానికి ముందుకు వస్తారని, అది ఆయన బ్రాండ్ గొప్పదనమని ప్రచారం చూసిన తెలుగుదేశం నేతలు, ఇప్పుడు ఆ బ్రాండ్ ఆశించిన స్థాయిలో ఉపయోగపడడం లేదని భావిస్తున్నారా? గత జగన్ ప్రభుత్వం ఏ నియామకం చేపట్టినా నానా రచ్చ, రచ్చగా రాసిన ఎల్లో మీడియా కాని, విమర్శలు చేసిన టీడీపీ, జనసేనలు కాని ఇప్పుడు వీటి గురించి ప్రజలకు వివరించడం లేదు. రహస్యంగా తమ పని తాము చేసుకుపోతూ ప్రజాధనాన్ని మంచినీటిలా ఖర్చు చేస్తున్నారు. ఇది ఏపీకి మేలు చేస్తుందా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబూ.. ఉచిత బస్సు ప్రయాణం ఇంకెప్పుడు?
బస్టాండ్ (విజయవాడ పశ్చిమ): మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయకపోవడం శోచనీయమని ఏపీ మహిళా సమాఖ్య సభ్యులు విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావొస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో హామీలు గుప్పించి.. గెలిచాక విస్మరించారని మండిపడ్డారు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరుతూ సోమవారం విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లోని సిటీ బస్సుల ప్రాంగణం వద్ద నిరసన తెలిపారు. సిటీ బస్సు ఎక్కి నినాదాలు చేశారు.సమాఖ్య విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి పంచదారుల దుర్గమ్మ మాట్లాడుతూ ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలపై టీడీపీ అధినేతగా చంద్రబాబు ప్రగల్భాలు పలికారని గుర్తుచేశారు. మహిళల ఓట్లతో అధికారం చేపట్టి.. ఏడాదైనా ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇప్పటికే అమలు చేస్తున్నా, కూటమి ప్రభుత్వం మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. నిత్యావసర వస్తువులు, కరెంట్ చార్జీలు, గ్యాస్ ధరలు మండుతున్న నేపథ్యంలో ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తే పేద, మధ్య తరగతి ప్రజలకు కాస్త ఊరటగా ఉంటుందన్నారు. హామీ అమలు చేయకుంటే పెద్దఎత్తున పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. -
మార్గదర్శులను గుర్తించకుంటే జీతాలు కట్!
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీలపై చేతులెత్తేసి పీ–4 పేరుతో వంచిస్తున్న కూటమి సర్కారు ఆ బాధ్యత నుంచి సైతం తప్పుకుంటోంది! ‘జీరో పావర్టీ పీ–4’ కార్యక్రమం మార్గదర్శులను గుర్తించే బాధ్యతను గ్రామస్థాయిలో చిరుద్యోగులైన పంచాయతీ కార్యదర్శుల నెత్తిన పెట్టి చేతులు దులుపుకొంటోంది. లేదంటే జీతాలు కట్ అంటూ బెదిరిస్తోంది. రాష్ట్రంలో 20 శాతం పేద కుటుంబాలను ఆర్థికంగా పైకి తెచ్చి 2029 నాటికి జీరో పేదరికం లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉగాది రోజు ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెలిసిందే.పేదలకు సాయం చేసేవారిని మార్గదర్శులుగా, లబ్ధి పొందే వారిని బంగారు కుటుంబాలుగా ప్రకటించారు. ప్రభుత్వం నిర్వర్తించాల్సిన బాధ్యతను చిరుద్యోగులైన పంచాయతీ కార్యదర్శులపై పెట్టారు. ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలో ఇద్దరు మార్గదర్శులను గుర్తించని పక్షంలో పంచాయతీ కార్యదర్శి జీతాలను నిలిపివేస్తామంటూ పలు జిల్లాల్లో అధికారులు హెచ్చరిక నోటీసులు జారీ చేస్తున్నారు. ఎంపీడీవోలు జారీ చేస్తున్న ఈ నోటీసులతో ఉద్యోగులు విస్తుపోతున్నారు. ప్రభుత్వం తాను నిర్వర్తించాల్సిన బాధ్యతను చిరుద్యోగులపై మోపడం ఏమిటనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్థిక సాయంతో కూడుకున్న వ్యవహారాలపై పంచాయతీ కార్యదర్శి చెబితే దాతలు ముందుకొస్తారా అని మండిపడుతున్నారు.రెండు నెలలు సర్వే హడావుడి..పీ–4 కార్యక్రమం పేరుతో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో జనవరి–ఫిబ్రవరిలో రెండు నెలలు పాటు ఇంటింటి సర్వేలంటూ ప్రభుత్వం హడావుడి చేసింది. ఇక మార్చి ఉగాది రోజున అమరావతిలో బహిరంగ సభ నిర్వహించి అన్ని నియోజకవర్గాల నుంచి పొదుపు మహిళలు, విద్యార్థులు, రైతులు, ఉపాధి కూలీలను ప్రత్యేక బస్సుల్లో తరలించింది. మరోవైపు ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సొసైటీని ఏర్పాటు చేసింది. అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున పీ–4 సమన్వయకర్తలను నియమించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఖజానా నుంచి ఏడాదికి రూ.12.60 కోట్లు వారికి వేతనాల రూపంలో చెల్లించేందుకు సిద్ధమైంది.హామీలపై మభ్యపుచ్చేందుకే..పీ–4 కార్యక్రమం ద్వారా 30 లక్షల పేద కుటుంబాలను గ్రామ సభల ద్వారా ఎంపిక చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టు 15 కల్లా ఐదు లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. నిజంగానే పేదరికాన్ని రూపుమాపాలంటే పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ వారి జీవన ప్రమాణాలు పెరిగేలా ప్రభుత్వం కృషి చేయాలి. ఒకవైపు ఇప్పటికే అమలవుతున్న పథకాలను నిలిపివేసి పేదల పొట్టగొడుతూ మరోవైపు పీ–4 పేరుతో మభ్యపుచ్చే యత్నాలు చేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు గ్రామాల దత్తత పేరిట హడావుడి చేయడం మినహా ఒరగబెట్టిందేమీ లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. -
ఆ డాక్టర్ల ఆవేదన.. అరణ్య రోదన
సాక్షి, అమరావతి: చంద్రబాబు ఏలుబడిలో రాష్ట్రంలో చిరుద్యోగుల ఆవేదన అరణ్య రోదనగా మారింది. గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లలో పనిచేస్తున్న డాక్టర్లు తాజాగా ఈ జాబితాలో చేరారు. ఉద్యోగ భద్రత, వేతనాలు పెంపు వంటి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించమని 15 రోజులుగా సమ్మె చేస్తున్న డాక్టర్ల ఆవేదనను ప్రభుత్వం లెక్కచేయడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అధికారుల చుట్టూ తిరిగి వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కక్ష సాధింపు చర్యలు షురూ..! పైగా డాక్టర్లపై తీవ్ర కక్ష సాధింపు చర్యలకూ ప్రభుత్వం దిగుతోంది. ఇందులో ఏప్రిల్‌నెల వేతనాల నిలుపుదల ఒకటి. మరోవైపు దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా రాష్ట్రంలో డాక్టర్లు రోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఆర్ఎస్ (ఫేషియల్ రికగి్నషన్ సిస్టమ్) వేయాలని తాజాగా ఆదేశించింది. ఎవరికీ లేనట్టుగా డాక్టర్లు వారు పనిచేస్తున్న గ్రామాల్లోనే నివాసం ఉంటున్నారన్న నిర్ధారణ కోసం రోజు రాత్రి ఎనిమిది గంటలకు ‘మొబైల్’ ఎఫ్ఆర్ఎస్ వేయాలని నిర్దేశించడం జరిగింది. దీనితోపాటు ప్రస్తుతం ఇస్తున్న రూ.15 వేల ఇన్సెంటివ్లో రూ.5 వేలు పనిచేస్తున్న గ్రామాల్లో ఉన్న వారికి మాత్రమే ఇస్తామని ప్రభుత్వం మెలిక పెట్టింది. నిర్దేశించిన హెల్త్ ఇండికేటర్స్‌లో వీరి పనితీరు ప్రాతిపదికన మిగిలిన రూ.10 వేల ఇన్సెంటివ్ను చెల్లించడం జరుగుతోంది.సానుకూలంగా స్పందించాలి ప్రజలు పడుతున్న అవస్థలు, మా సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలి. మాతో చర్చించి సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించాలి. – బి. సందీప్ కుమార్, జనరల్ సెక్రటరీ, ఏపీ సీహెచ్‌వో అసోసియేషన్ ఇళ్లు గడవడం కష్టంగా ఉంది.. సమ్మె చేస్తున్నామని మా వేతనం ఆపేశారు. ఇల్లుగడవడం కష్టమై, అనేక అగచాట్లు పడుతున్నాం. రాష్ట్రం మొత్తం పనిచేస్తున్న 10,032 మంది డాక్టర్లలో 8,700 మంది వరకూ మహిళలే ఉన్నారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా సమ్మెలో పాల్గొంటున్నారు. – ఎం. అనుపమ, అధ్యక్షురాలు, ఏపీ సీహెచ్‌వో అసోసియేషన్, పల్నాడు జిల్లా -
డీజీపీ అపాయింట్మెంట్ కోరిన వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని.. దాంతో పాటు, యథేచ్ఛగా సాగుతున్న పోలీసుల అక్రమ అరెస్టులు, వేధింపులపై వినతి పత్రం ఇచ్చేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని రాష్ట్ర డీజీపీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, వరుదు కళ్యాణి రాసిన లేఖను పార్టీ ప్రతినిధులు డీజీపీ కార్యాలయంలో అందజేశారు.మాజీ మంత్రి విడదల రజినిపై సీఐ దౌర్జన్యంగా వ్యవహరించిన నేపథ్యంలో, రాష్ట్రంలో నానాటికీ దిగజారుతున్న శాంతి భద్రతలు, విపక్షంపై సాగుతున్న పోలీసులు వేధింపులు, అక్రమ అరెస్టులు.. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకే ప్రమాదంగా మారుతున్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆ లేఖలో ప్రస్తావించారు. ఇంకా అవన్నీ కచ్చితంగా పౌరుల హక్కులకు భంగం కలిగించడమేనన్నారు. వీటన్నింటిపై వినతి పత్రం సమర్పించేందుకు డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వాలని తమ లేఖలో కోరారు. -
కక్ష సాధింపు కోసమేనా పోలీసులు?.. ఇది దేనికి సంకేతం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను నీరు గారుస్తూ.. రాజకీయ కక్ష సాధింపులకు వినియోగిస్తున్న కూటమి ప్రభుత్వ విధానాలపై వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం అందుబాటులో ఉన్న పార్టీ నాయకులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రాజకీయ కక్షసాధింపు చర్యలు, పోలీసులను వినియోగించుకుంటున్న తీరు, దిగజారిన శాంతిభద్రతలు, తాజాగా మాజీ మంత్రి విడదల రజిని పట్ల స్థానిక సీఐ అమానుషంగా వ్యవహరించిన వైనంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.ఈ సందర్భంగా పలువురు నాయకులు రాష్ట్రంలో పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటూ, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ విధానాలపై ఉదాహరణలతో సహా సమావేశంలో ప్రస్తావించారు. తాజాగా మాజీ మంత్రి విడదల రజిని పట్ల పోలీస్ అధికారి వ్యవహరించిన తీరు రాష్ట్రంలో పోలీసుల ద్వారా ప్రభుత్వం చేయిస్తున్న దౌర్జన్యకాండకు నిదర్శనమని పలువురు నాయకులు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలు, పోలీస్ యంత్రాంగాన్ని తప్పుదోవలో నడిపిస్తున్న వైనంను ప్రజలు ముందు పెట్టేందుకు వైఎస్సార్సీపీ ఒక కార్యాచరణను సిద్ధం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కూటమి సర్కార్ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను నొక్కేస్తోందని, ఎవరైనా ప్రభుత్వ వైఫ్యలాలను నిలదీస్తే పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు సైతం కేసుల నమోదులో చట్టపరమైన నిబంధనలను పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం దారుణ అన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోయాయని, డీజీపీకి ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఇవ్వక పోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.ఎన్ని సార్లు డీజీపీ అపాయింట్మెంట్ కోరినా స్పందించపోవడం దేనికి సంకేతమని నిలదీశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని వైఎస్సార్సీపీ సీరియస్‌గా తీసుకుంటోందని, వ్యవస్థలను కాపాడేందుకు బాధ్యత గల ప్రతిపక్షంగా దీనిపై స్పందిస్తుందన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, జోగి రమేష్, విడదల రజిని, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహన్రావు, అన్నాబత్తుని శివకుమార్, పార్టీ నాయకులు దేవినేని అవినాష్, వేమారెడ్డి, పోతిన మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘కూటమికి వత్తాసు.. పోలీసుల లెక్కలు తేల్చే టైమ్ వస్తుంది’
సాక్షి, తూర్పుగోదావరి: దేశ ప్రజలంతా యుద్ధం గురించి చర్చించుకుంటుంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం వైఎస్సార్సీపీ నేతలను ఎలా అణగదొక్కాలని ఆలోచిస్తున్నారని అంటూ ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. బాధ్యతాయుతమైన పోలీసు వ్యవస్థలో ఉండి అధికారంలో ఉన్న పార్టీకి కొమ్ము కాయడం మంచి పరిణామం కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మాజీ మంత్రి విడుదల రజినిపై పోలీసులు ప్రవర్తించిన తీరుని ఖండిస్తున్నాను. మాజీ మంత్రి, మహిళ అని కూడా చూడకుండా సీఐ ప్రవర్తించిన తీరు దారుణం. ఖాకీ చొక్కా వేసుకోగానే రాష్ట్రానికి సుప్రీం అనుకుంటున్నారేమో అర్థం కావడం లేదు. బాధ్యతాయుతమైన పోలీసు వ్యవస్థలో ఉండి అధికారంలో ఉన్న పార్టీకి కొమ్ము కాయడం మంచి పరిణామం కాదు. దేశ ప్రజలంతా యుద్ధం గురించి చర్చించుకుంటుంటే వైఎస్సార్సీపీ వారిని ఎలా అణగదొక్కలా అని చంద్రబాబు ఆలోచిస్తున్నారు.ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయం. ఇప్పుడు ఏ పోలీసు అధికారి ఏ రకంగా ప్రవర్తించారన్నది తప్పనిసరిగా గుర్తుపెట్టుకుంటాం. అధికార పార్టీకి కొమ్ము కాసిన ప్రతీ పోలీస్ అధికారి రేపు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా లెక్కలు అప్పజెప్పాల్సిన రోజు వస్తుంది. ఇది గుర్తు పెట్టుకుని పోలీసులు వ్యవహరిస్తే మంచిది’ అంటూ హెచ్చరించారు. -
సిగ్గుందా.. నువ్వు సీఎంవా లేక.. చంద్రబాబుపై మహిళలు ఫైర్
-
జాగ్రత్త చంద్రబాబు.. ఇది మంచిది కాదు.. శైలజానాథ్ వార్నింగ్
-
బిల్డప్ బాబాయ్ బడాయి!
అమరావతిలో నాలుగు వేల ఎకరాలు అమ్మితే రూ.80 వేల కోట్లు వస్తాయట! ఎల్లో మీడియాలో బిల్డప్ బాబాయి రాసిన ఒక కథనం చెబుతోంది. రాజధాని పేరుతో లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలా ప్లాన్ చేశారన్నమాట! ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. విశాఖపట్నంలో టీసీఎస్‌కు కేవలం 99 పైసలకే భూములు కేటాయించిన ప్రభుత్వం అమరావతిలో మాత్రం ఆయా సంస్థలకు ఎకరా రూ.20 కోట్లకు విక్రయించాలని నిర్ణయించిందట.ఇలా సంపాదించిన మొత్తాన్ని అమరావతిలో వివిధ ప్రాజెక్టులకు, రుణాల చెల్లింపులకూ ఉపయోగిస్తారని ఈ మీడియా చెబుతోంది.ఎవరైనా నమ్మగలరా? గోబెల్స్ మాదిరి ఒకటికి, పదిసార్లు ప్రచారం చేస్తే జనం నమ్మక చస్తారా అన్నదే వీరి ధీమా కావచ్చు. గతంలో జగన్ ప్రభుత్వంపై ఇష్టారీతిలో అబద్దాలు రాసిన ఎల్లో మీడియా, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కొమ్ముకాస్తూ అసత్యాలు ప్రచారం చేస్తోంది. ఇక్కడ ఒక కిలకమైన విషయం ఉంది. మూడేళ్లలో రాజధానికి సంబంధించిన కొన్ని భవనాలను పూర్తి చేస్తామని చంద్రబాబు చెబుతున్నా, ప్రపంచ బ్యాంక్, ఇతర ఆర్థిక సంస్థలు మంజూరు చేసిన రూ.31 వేల కోట్లు మూడేళ్లలో ఇవ్వడం లేదు. దశల వారీగా ఐదారేళ్లలో ఇస్తాయని ఎల్లో మీడియానే తెలిపింది. అందుకనే బ్యాంకర్లతో కూడా చర్చలు జరిపి మరో రూ.40 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ సంగతి బయటకు వస్తే మరింత అల్లరి అవుతుందని భయపడి, డైవర్ట్ చేయడానికి భూములు అమ్మడం ద్వారా రూ.80 వేల కోట్ల రూపాయలు వస్తాయని ప్రచారం ఆరంభించారు. హైదరాబాద్ లోనే ఏవో కొన్ని ప్రదేశాలలో తప్ప ఎకరా ఇరవై కోట్ల ధర పలకడం లేదు. గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో ఎకరా వంద కోట్లకు వేలంలో పోయిందని చెప్పినా, ఆ రకంగా కొనుగోలు చేసిన సంస్థలు ఆ డబ్బు చెల్లించలేదు. ఇటీవలీ కాలంలో ఆర్థిక మాంద్యం ఏర్పడిన పరిస్థితిలో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బాగా దెబ్బతింది. అమరావతిలో పలు రకాలుగా గిమ్మిక్కులు చేస్తున్నా భూముల విలువలు ఆశించిన రీతిలో పెరగడం లేదు. చంద్రబాబు సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నట్లు చెప్పినా, చివరికి ప్రధాని మోడీని తీసుకువచ్చి అమరావతి పనుల పునః ప్రారంభం అంటూ హడావుడి చేసినా పరిస్థితిలో పెద్దగా మార్పు రావడం లేదు. దాంతో ఇప్పుడు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని అప్పులన్నీ భూముల అమ్మకం ద్వారా తీరిపోతాయని చెబుతూ కొత్త డ్రామాకు తెరదీశారు. ఏ సంస్థ ఎకరా రూ.ఇరవై కోట్లకు కొనుగోలు చేయడానికి సిద్దం అవుతుంది? రియల్ ఎస్టేట్ సంస్థలు సైతం ఈ ధరకు ఎందుకు కొనుగోలు చేస్తాయి? అమరావతిలో సమీకరించిన 33 వేల ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి మరో ఇరవై వేల ఎకరాలు కలిపి అభివృద్ది చేసిన తర్వాత పదివేల ఎకరాల భూమి ప్రభుత్వానికి మిగులుతుందని తొలుత చెప్పారు. ఆ తర్వాత దానిని ఎనిమిదివేల ఎకరాలు అన్నారు. తదుపరి రెండువేల ఎకరాలే మిగులుతుందని చెప్పారు. ఇప్పుడు నాలుగువేల ఎకరాలు మిగులుతుందని అంటున్నారు. వీటిలో దేనిని నమ్మాలి? ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉన్న 53 వేల ఎకరాల భూమి చాలదు కనుక మరో 44 వేల ఎకరాలు సమీకరిస్తామని చెప్పారు. ఐదు వేల ఎకరాలలో కొత్త విమానాశ్రయం నిర్మిస్తామని, అది కట్టకపోతే ఈ భూములు అన్ని వృథా అయిపోతాయని, కేవలం మున్సిపాల్టీగా మిగిలిపోతుందని చంద్రబాబే బెదిరించారు. గతంలో 53 వేల ఎకరాలు సరిపోతుందని అన్నారు కదా అంటే దానికి జవాబు ఇవ్వరు. కేవలం ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఏవో కట్టు కధలు చెప్పడం ద్వారా జనాన్ని మభ్య పెట్టే దిశలోనే సర్కార్ అడుగులు వేస్తోంది. మరో విశేషం ఉంది. రెండో దశలో ఎంత భూమి మిగులుతుందో తెలియదు కాని, అప్పుడు అమ్మే భూమిని రియల్ ఎస్టేట్ సంస్థలకు 60ః40 రిష్పత్తిలో భూములు ఇస్తారట. వారు అభివృద్ది చేసిన గృహాలు ,విల్లాలు, వాణిజ్య ప్లాట్ల రూపంలో ప్రభుత్వానికి ఆస్తులు సమకూరతాయట.ఇదంతా గాలిలో మేడలు కట్టినట్లే అనిపిస్తుంది. కీలకమైన అంశం ఏమిటంటే చంద్రబాబు మూడేళ్లలో ఐకానిక్ టవర్లతో సహా ఆయా భవనాల నిర్మాణం చేస్తామని చెప్పినా, దశల వారీగా వచ్చే నిధులతో పనులు పూర్తి కావని ఎల్లో మీడియానే స్పష్టం చేసింది. అందుకే బ్యాంకుల ద్వారా రూ.40 వేల కోట్లు సమీకరించాలని రాజధాని అభివృద్ది సంస్థ తలపెడుతోందట.దీంతో అమరావతి అప్పు రూ.70 వేల కోట్లు అవుతుంది. మంత్రి నారాయణ లక్ష కోట్ల రూపాయల విలువైన పనులు చేపడుతున్నట్లు ప్రకటించారు. వాటన్నిటిని పూర్తి చేయడానికి ఇంకో 30 వేల కోట్లు అవసరం అవుతాయి. కాలం గడిచే కొద్ది నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ఐదేళ్ల క్రితం నిర్ణయించిన రేట్లకన్నా డబుల్ రేట్లను కాంట్రాక్టర్ లకు చెల్లించి భవనాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. అలాంటప్పుడు మూడేళ్లకు ఈ పనులు పూర్తి కాకపోతే సహజంగానే ఇంకా రేట్లు పెరుగుతాయి. ఆ మొత్తం ఎంత అవుతుందో ఇప్పుడే చెప్పలేం. లక్షల కోట్ల రుణాలు తెచ్చి పనులు చేపడితే ఏపీ ప్రజలపై పడే అప్పు భారం తడిసి మోపెడవుతుంది. ముందుగా లక్షల కోట్లు వ్యయం చేసి ఈ మొత్తం భూమికి ప్రాధమిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిజంగానే భూమి ప్రభుత్వానికి ఏదైనా మిగిలితే దానిని ఎకరా రూ.20 కోట్లకు అమ్మాలి. దానిని ఆ ధరకు కొనడానికి ఎన్ని సంస్థలు ముందుకు వస్తాయన్నది చెప్పలేం. ఒకవేళ ఆ ధరకు కొనడానికి ఎక్కువమంది సిద్దపడకపోతే పరిస్థితి ఏమిటన్నది కూడా ప్రభుత్వం ఆలోచించాలి కదా? అదేమీ లేకుండా చేతిలో మీడియా ఉంది కదా అని ఇలాంటి కల్పిత కధలు సృష్టించి ప్రజల జీవితాలతో ఆడుకోవడం సరైనదేనా? అసలు ప్రభుత్వం తనకు అవసరమైన కొద్దిపాటి భవనాలను నిర్మించుకొని, మిగిలిన భూమిని రైతులకే వదలివేసి ఉంటే,వారే రియల్ ఎస్టేట్ వారికో, లేక ఇతరులతో అమ్ముకుంటారు కదా? ఈ పని అంతా ప్రభుత్వం ఎందుకు భుజాన వేసుకుంటోంది? కేవలం తమ వర్గంవారి ఆస్తుల విలువలు పెంచడానికే ఈ తంటాలు అన్న విమర్శకు ఎందుకు ఆస్కారం ఇస్తున్నారు? గతంలో కూడా అభూత కల్పనలు, అర్ధ సత్యాలు రాసి ప్రజలను ఏమార్చే యత్నం చేశారు. ప్రపంచ స్థాయి రాజధాని అంటూ దేశ,దేశాలు తిరిగి వచ్చారు.అసలు ప్రపంచ రాజధాని అవసరం ఏమిటి?ఒక రాష్ట్ర ప్రభుత్వంతో అయ్యేపనేనా?భవిష్యత్తులో ఈ ప్లాన్ లన్నీ తలకిందులైతే ఎపి ప్రజలు ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోరా? అలాంటి వాటిని పరిగణనలోకి తీసుకుని, అన్ని రక్షణ చర్యలు చేపట్టిన తర్వాత పెద్ద రాజధాని కట్టుకుంటారా? మహా నగరాన్ని నిర్మించుకుంటారా? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారా? అన్నది మీ ఇష్టం.అలా కాకుంటే ఏదో రకంగా తన సొంత కీర్తి కోసం నగర నిర్మాణం చేపట్టి ఏపీ ప్రజలను నట్టేట ముంచారన్న అపకీర్తిని చంద్రబాబు మూట కట్టుకోవల్సి ఉంటుంది. ఎల్లో మీడియా ఇచ్చే దిక్కుమాలిన సలహాలు విని చంద్రబాబు మునుగుతారా? లేక వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తారా? అన్నది ఆయన ఇష్టం.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఆసరాకు బాబు మంగళం
-
అమానుషం.. అమానవీయం
తిరుపతి మంగళం/నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట)/ సాలూరు/ బద్వేలుఅర్బన్/సాక్షి, నరస రావుపేట/ పెదకూరపా డు : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన విడదల రజని పట్ల చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు ప్రవర్తించిన తీరు అమానుషం, అమానవీయమని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీసులు సైతం చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేశ్ మెప్పు పొందేందుకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై రౌడీల్లాగా ప్రవర్తిస్తున్నారన్నారు.చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు.. మాజీ మంత్రి, బీసీ నేత అని కూడా చూడకుండా విడదల రజని పట్ల ప్రవర్తించిన తీరే అందుకు నిదర్శనమన్నారు. సీఐ గారూ.. సీఐ గారూ.. అని ఆమె పదే పదే గౌరవంగా మాట్లాడుతున్నప్పటికీ లెక్క చేయకుండా ఆమెను కారు నుంచి కిందకు లాగేయడం ఎంత దుర్మార్గం.. అని ప్రశ్నించారు. ఇటీవల గుంటూరు జిల్లాలో కల్పన అనే దళిత ఎంపీటీసీ సభ్యురాలి పట్ల కూడా అర్ధరాత్రి పోలీసులు దారుణంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. కూటమి నాయకుల బెదిరింపులకు, కక్ష సాధింపులకు, కేసులకు భయపడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. అక్రమ కేసులకు భయపడేది లేదు కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తున్నా భయపడేది లేదని రాజ్యసభ సభ్యుడు వై.వి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. మళ్లీ రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని, ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తామన్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ నంబూరు శంకరరావుతో కలసి ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ అక్రమ కేసులకు భయపడొద్దని, కార్యకర్తలకు తామంతా అండగా ఉన్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వ పాలన కీచకపర్వాన్ని తలపిస్తోందని వైఎస్సారీసీపీ నెల్లూరు సిటీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు.సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పార్టీ మహిళా నేతలతో కలసి నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు గాలికొదిలేసి, ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కేలా అక్రమ కేసులు బనాయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి విడుదల రజని పట్ల పోలీసుల ప్రవర్తన సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. అధికారం శాశ్వతం కాదని కూటమి పాలకులు గుర్తుంచుకోవాలని మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. సాలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మహిళ మంత్రి విడదల రజని పట్ల పోలీసుల తీరు సరికాదని ఖండించారు.కొందరు పోలీసు అధికారులు సభ్యత, సంస్కారాలు మరచి వ్యవహరిస్తున్నారని బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కడప జిల్లాలోని బద్వేలులో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళ అన్న కనీస గౌరవ మర్యాద లేకుండా సీఐ అనుచితంగా ప్రవర్తించడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో మాజీ మంత్రులకే రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. -
సోదాలు అప్రజాస్వామికం
శ్రీకాకుళం: బ్రిటిష్ పాలనను కూటమి ప్రభుత్వం గుర్తుకు తెస్తోందని ‘సామ్నా’ రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్టు నల్లి ధర్మారావు అన్నారు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి నివాసంలో పోలీసులు సెర్చ్ వారెంట్ లేకుండా తనిఖీలు చేయడాన్ని ఆయన ఖండించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా పోలీసు బలగంతో సోదాలు చేయించడం కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానానికి పరాకాష్టగా అభివరి్ణంచారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఏమన్నారంటే... ఇలాంటి ఘటనలు లేవు పత్రికా సంపాదకులపై దాడులకు శ్రీకారం చుట్టింది బ్రిటిష్ ప్రభుత్వంలోనే. మన దేశంలో ఒక సంపాదకీయం రాసినందుకు గాడిచర్ల హరిసర్వోత్తమరావుపై రాజద్రోహం నేరాన్ని ఆపాదించి జైలు శిక్ష విధించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు మళ్లీ జరగలేదు. 1975లో ఎమర్జెన్సీ సమయంలో ఆ నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ నిర్బంధాన్ని అమలు చేశారు. అయితే పత్రికల కార్యాలయాలు, సంపాదకుల ఇళ్లపై మాత్రం దాడులు జరిగిన దాఖలాలు లేవు. నచ్చకపోతే అణగదొక్కుతారా? నచ్చిన పత్రికలను ప్రోత్సహించడం, నచ్చని పత్రికలను అణగదొక్కడం చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకే మొదలైంది. పత్రికా రంగాన్ని గుప్పెట్లో ఉంచుకోవడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోగలమనే భావన సరైనది కాదని వైఎస్ రాజశేఖరరెడ్డి ఘన విజయంతో రుజువైంది. చంద్రబాబు పాలనలో భావప్రకటన స్వేచ్ఛపై మునుపెన్నడూ లేని విధంగా అణచివేతకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికార బలంతో వేధింపులు దేశానికి ఒకటే పవిత్ర గ్రంథం. అది రాజ్యాంగం. వ్యవస్థలన్నీ దీనికి లోబడే పనిచేయాలి. కూటమి ప్రభుత్వం అలా పనిచేయడం లేదని ఏపీ హైకోర్టు అనేక కేసుల విచారణ సమయంలో మందలిస్తూ కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అయినా కూటమి ప్రభుత్వం వాటిని గౌరవిస్తున్నట్టు కనిపించడం లేదు. మీడియాలో వచ్చిన వార్త, కథనంపై లీగల్‌గా చర్యలు తీసుకోవడానికి చట్టం కొన్ని అవకాశాలు కల్పించింది. వాటిని విస్మరించి నేరుగా అధికార బలంతో క్రిమినల్ కేసులు బనాయించి, వేధించడం ఈ ప్రభుత్వమే ప్రారంభించింది. ఒక ఎడిటర్ ఇంట్లో ముందస్తు సమాచారం ఇవ్వకుండా సోదాలు చేయించడం కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానానికి పరాకాష్ట. ఏముంటాయి అక్షరాలు తప్ప ఎడిటర్ ఇంట్లో ఏముంటాయి. అక్షరాలే తప్ప ఆయుధాలు కాదు కదా. అక్షరాలను కూడా ఆయుధాలుగా భావించిన ఒకనాటి బ్రిటిష్ వైఖరి బయట పెట్టుకోవడం తప్ప సాధించిందేమీ లేదు. అణచివేతలతో చరిత్రహీనులుగా మిగిలిపోవడం తప్ప ఏమీ చేయలేరు. మన ప్రజాస్వామ్యం గొప్పది. ప్రజలు సరైన సమయంలో తమ చైతన్యాన్ని ప్రకటిస్తారు. ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే, సామ్నా, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు, ఫొటో జర్నలిస్టు సంఘాలు కలిసి ‘సాక్షి’ పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ ధోరణిలకు వ్యతిరేకంగా గళం వినిపిస్తూనే ఉంటాయి. -
‘విడదల రజిని పట్ల సీఐ అనుచితంగా ప్రవర్తించారు’
కాకినాడ: మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నాయకురాలు విడదల రజిని పట్ల సీఐ సుబ్బారాయుడు వ్యవహరించిన తీరుపై వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. విడదల రజిని పట్ల సీఐ వ్యవహరించిన తీరు అమానుషమన్నారు. ఈరోజు(ఆదివారం) మీడియాతో మాట్లాడిన దాడిశెట్టి రాజా.. సీఐ తీరును ఖండించారు. ‘మాజీ మంత్రి అని చూడకుండా విడదల రజిని పట్ల అమానుషంగా ప్రవర్తించారు.దీనిపై మేము పోరాడతాము.వ్యవస్ధలకు వన్నె తెచ్చే విధంగా ఉద్యోగులు బాధ్యతతో పని చేయాలి. సంక్షోభంలో అవినీతిని వెతుకునే మగోడు చంద్రబాబు తప్పా మరో నాయకుడు లేడు.గత ఏడాదిగా ఉద్యోగులు, రైతులకు, విద్యార్ధులు,మహిళలకు ప్రభుత్వం చేసింది ఏమీ లేదు.రాష్ట్రంలో మహిళలను వేధించడం టీడీపీకి అలవాటుగా మారిపోయింది. టీడీపీ, పోలీసుల వేధింపులు తాళ్ళలేక ఇటీవల తుని మున్సిపల్ ఛైర్మన్ సుధారాణీ తన పదవికి రాజీనామా చేశారు.అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఉల్లంఘించి రెడ్ బుక్ రాజ్యాన్ని అమలు చేస్తున్నారు. కూటమి పాలనకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఏపీలో మహిళలు వేధింపులు జీవిస్తున్నారు’ అని దాడిశెట్టి రాజా మండిపడ్డారు. -
రెడ్ బుక్ పాలన.. ప్రజలే బుద్ధి చెబుతారు: ఎస్వీ మోహన్‌రెడ్డి
సాక్షి, కర్నూలు: మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని.. మహిళల ఆత్మగౌరవం కాపాడతామంటూ చెప్పే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమైపోయారంటూ వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిస్తున్నారని ధ్వజమెత్తారు.చంద్రబాబు ఏం చేస్తున్నారు. రజినీ పీఏ పై అక్రమ కేసులు నమోదు చేయడం ఏంటి?. మహిళా మాజీ మంత్రి అనేది చూడాకుండా పోలీసులు చేయి చేసుకోవడం దారుణం. అత్యుత్సాహంతో పోలీసులు.. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఇలాగే రెడ్ పాలన కొనసాగితే, వైఎస్ జగన్ మరో బుక్ సిద్ధం చేస్తారు. ఎంపీటీసీ కల్పనపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మహిళలను పోలీస్ స్టేషన్లో ఎలా పెడతారు?’’ అంటూ ఎస్వీ మోహన్‌రెడ్డి ప్రశ్నించారు.84 ఏళ్ల మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. అసభ్యకరమైన వాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పోలీసులు తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విడతల రజినిపై జరిగిన దుశ్చర్యపై న్యాయ పోరాటం చేస్తాం. నారా లోకేష్ మెప్పు కోసం పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. అనుచితంగా ప్రవర్తించిన సీఐ సుబ్బారాయుడిపై చర్యలు తీసుకోవాలి లేదంటే న్యాయ పోరాటానికి సిద్ధం అవుతాం’’ అని ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు.రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రశ్నించిన వ్యక్తులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేశారు. పోసాని కృష్ణమురళిపై 16 అక్రమ కేసులు నమోదు చేసి.. పలు జిల్లాల్లో తిప్పి కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారు. ఇలాంటి చర్యలపై ప్రజలు తగిన బుద్ధి చెబుతారు’’ అని ఎస్వీ మోహన్‌రెడ్డి చెప్పారు. -
ప్రజలకు ఇవ్వాల్సింది పోయి వారి దగ్గర నుంచే దోచుకుంటున్నారు: Karumuri Nageswara
-
‘రైతులకు గోనె సంచులు కూడా ఇవ్వలేని దుస్థితి’
తణుకు(ప గో జిల్లా): కూటమి ప్రభుత్వం రైతుల నడ్డివిరిచేస్తోందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. తణుకు పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి కారుమూరి మాట్లాడుతూ... ‘ధాన్యం రైతులకు గొనె సంచులు కూడా ఇవ్వలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. పది లక్షల మెట్రిక్ తన్నులు ధాన్యం జిల్లాలో పండిస్తే ఆరు లక్షలు మాత్రమే కొంటామని చేతులెత్తేశారు.రైతులనుండి ఆఖరు గింజవరకు ప్రభుత్వం కొనాల్సిందే. లేదంటే వైస్సార్సీపీ రైతులు పక్షాన పోరాటానికి దిగుతుంది. మంత్రి నాదెండ్ల ఎన్ని ప్రగల్బాలో పలికారు అంత చేస్తాం.. ఇంత చేస్తాం అన్నారు. ఇప్పుడు చుస్తే పండించిన ధాన్యాన్ని కూడా కొనలేని పరిస్థితి. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు కొనుగోలు శక్తి తగ్గిపోయింది. కూటమి ప్రభుత్వంలో వ్యాపారాలన్నీ కళాహీనంగా ఉన్నాయ్. జగన్ గారి హయాంలో నెంబర్ వన్ స్థానంలో జీడీపీ అట్టడుగు స్థాయికి పడిపోయింది. విద్యుత్ కొనుగోళ్లలో చంద్రబాబు వేల కోట్లు దోచుకొంటున్నారు. కుట్టు మిషన్ల లో 157 కోట్లు స్కామ్ కి తెరలేపారు బాబు. చంద్రబాబుది అంతా దాచుకో దోచుకో సిద్ధాంతం’ అని కారుమూరి విమర్శించారు. -
వారిపై చర్యలు తప్పవు: అంబటి రాంబాబు
సాక్షి, గుంటూరు: తన వ్యక్తిగత జీవితం, వైఎస్సార్సీపీ శ్రేణులపై కిరాక్ ఆర్పీ, సీమరాజు సోషల్ మీడియాలో పెడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. వాటిపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు తనపై కూడా చేసిన సోషల్ మీడియాలో పోస్టులపై ఫిర్యాదులు చేశాను. మొదట ఒక్క కేసు కూడా రిజిస్టర్ చేయలేదు.. న్యాయస్థానాల ద్వారా పోరాటంతో నాలుగు కేసులను రిజిస్టర్ చేశారు. మరొక కేసు రిజిస్టర్ చేయాల్సి ఉంది’’ అని అంబటి పేర్కొన్నారు.‘‘ఈ నెల 18వ తేదీన ఆ కేసుపై స్వయంగా నేనే హైకోర్టులో వాదనలు వినిపించనున్నాను. పోలీసులు రాజకీయ ఒత్తిడితో అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టులు చేస్తున్నారు. మహిళలను ఉదయం ఆరు లోపు అదుపులోకి తీసుకోకూడదని చట్టం చెబుతోంది. కానీ రాజకీయ ఒత్తిడికి గురై పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తున్నారు. చట్టాన్ని అతిక్రమించిన అధికారులపై రానున్న రోజుల్లో చర్యలు తప్పవు. కాంతేరులో దళిత ఆడబిడ్డను బలవంతంగా లాక్కెళ్లారు. బట్టలు మార్చుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడం దుర్మార్గం.‘‘గుంటూరు సీఐడి కార్యాలయానికి రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి వస్తే.. ఖాళీగా ఉన్న కుర్చీల్లో కూర్చుంటే వైఎస్సార్సీపీ శ్రేణులకు పోలీసులు రాచ మర్యాదలు అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ప్రచురించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైన్యం తగ్గడం లేదు.. మరింతగా పెరుగుతుంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వస్తుంది’’ అని అంబటి రాంబాబు చెప్పారు. -
చంద్రబాబు నాయుడు అబద్ధాల కోరు హంద్రీనీవా ప్రాజెక్టు వైఎస్సార్ పుణ్యమే
-
Chandra Sekhar Reddy: మద్యం కేసులో IAS లకు సంబంధం ఏమిటి?
-
ఆంధ్రప్రదేశ్‌లో తిరోగమన ప్రభుత్వం!
‘‘ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రజల కంచాల్లోని కూడు లాగేశారు.. ప్రతి ఇంటికీ బాబు మోసం" ఇది వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శ. ఈ వార్త ప్రజలకు అందిన రోజే మరో సమాచారం వచ్చింది. జీఎస్టీ ఆదాయం వసూళ్లు దేశమంతటా పైపైకి వెళుతుంటే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం నేల చూపులు చూస్తున్నట్లు ఆ కథనం చెప్పింది. జగన్ వ్యాఖ్యలకు, జీఎస్టీకి ఏమి సంబంధం? అంటే.. జగన్ ప్రభుత్వం ప్రజలకు వివిధ స్కీముల కింద ఆర్థిక సాయం చేసేది. లబ్దిదారుడికి నేరుగా నగదు అందేలా ఆ పథకాలుండేవి.ఆ డబ్బుతో ప్రజలు ముఖ్యంగా పేదలు, దిగువ మధ్య తరగతి వారు వస్తు, సేవల కొనుగోళ్లు చేసేవారు. ఫలితంగా వ్యాపార కార్యకలాపాలు సాగి ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో ఆదాయం సమకూరేది. అందువల్లే ఆ రోజుల్లో ఒకవైపు పేదరికం తగ్గినట్లు గణాంకాలు తెలిపాయి. ఇప్పుడు పరిస్థితి మారింది. వ్యాపారాలు సరిగా సాగడం లేదని వ్యాపారస్తులు వాపోతున్నారు. ఇల్లు గడవడమే కష్టమవుతోందని పేదలు గగ్గోలు పెడుతున్నారు. ఫలితంగా దేశం అంతటా 12 శాతం వరకు జీఎస్టీ వృద్దిరేటు ఉంటే, ఏపీలో మాత్రం ఏప్రిల్ లో మైనస్ 3.4 శాతంగా మాత్రమే ఉంది. అందువల్లే జగన్ ఈ వ్యాఖ్య చేశారు.పేదల తింటున్న కడును కూటమి పెద్దలు లాగేశారని ఆయన అన్నారు. నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు ఎన్నికల ప్రచారంలో ఆకాశమే హద్దుగా వాగ్దానాలు చేశారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నిటిని కొనసాగించడమే కాకుండా, సూపర్ సిక్స్ హామీలను కూడా ప్రజలకు అందిస్తామని పదే, పదే ప్రకటించారు. ఈ సూపర్ సిక్స్‌ను తొలుత మహానాడులో ప్రకటించినప్పుడు తమ్ముళ్లూ అదిరిందా? అంటూ చంద్రబాబు ప్రశ్నించే వారు. అందుకు వారంతా ఔను, ఔనని చప్పట్లు కొట్టారు. జనం కూడా ఆశపడ్డారు. తీరా అధికారం వచ్చాక టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు నాలుక మడత వేయడం ఆరంభించారు. అదిరిపోవడం జనం వంతైంది.ఇదేమి ఖర్మ.. పాలిచ్చే గేదెను వదలుకుని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామా అని ప్రజలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ తాను పలావు పెడుతుంటే, చంద్రబాబు బిర్యానీ పెడతానని ప్రచారం చేశారని, అది నమ్మి జనం ఓట్లు వేశాక, పలావు, బిర్యానీ రెండూ లేకుండా పోయాయని పలుమార్లు వ్యాఖ్యానించారు. చంద్రబాబు సీఎం కాకముందు ప్రతి ఇంటిలో నాలుగువేళ్లు ఆనందంగా నోట్లోకి వెళ్లేవని, కూటమి వచ్చి కంచం లాగేసిందని కొద్ది రోజుల క్రితం పార్టీ సమావవేశంలో ధ్వజమెత్తారు. ఇందులో చాలా వరకు వాస్తవం ఉంది.జగన్ అమ్మ ఒడి స్కీమ్ కింద రూ.15 వేలు ఇస్తే వారికి ఆర్ధిక వెసులుబాటు వచ్చేది. చేయూత, ఆసరా, విద్యా దీవెన, రైతు భరోసా, వాహన మిత్ర తదితర స్కీముల కింద వచ్చే డబ్బు వేడినీళ్లకు చన్నీళ్ల మాదిరి ఉపయోగపడేవి. ఇప్పుడు అవేవీ రాలేదు. చంద్రబాబు తాను ప్రతి బిడ్డకు రూ.15 వేలు చొప్పున ఎందరు పిల్లలు ఉంటే అందరికి తల్లికి వందనం పేరుతో ఇస్తానని నమ్మబలికారు. రైతులకు రూ.20 వేలు, నిరుద్యోగులకు నెలకు రూ.మూడు వేలు లారీ డ్రైవర్లకు రూ.15 వేలు.. ఇలా ఎడాపెడా వాగ్దానాలు చేశారు. కాని అధికారంలోకి వచ్చాక ఒక ఏడాది పూర్తిగా ఎగవేశారు. దాంతో జనం కూడా జగన్ చెప్పినట్లు చంద్రబాబు తమ నోటికాడ కూటిని తమ నోటికాడ కూటిని లాగేశారని అనుకుంటున్నారు.జగన్ కాని, వైసీపీ నేతలు కాని చేస్తున్న ఈ విమర్శలను కూటమి పెద్దలు ఎవరూ ఖండించలేకపోతున్నారు. కాకపోతే జగన్ పాలనలో రాష్ట్రం ఆర్థిక విధ్వంసం జరిగిందని ఏవో పడికట్టు పదాలతో పిచ్చి ఆరోపణలు చేసి ప్రజలను డైవర్ట్ చేయడానికి యత్నిస్తుంటారు. ఈ విషయంలో కూడా వారిలో ఒక స్పష్టత, కనిపించదు. జగన్ ప్రభుత్వం రూ. ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిందని ఒకసారి, రూ.పది లక్షల కోట్లు అని మరోసారి, రూ.13 లక్షల కోట్లు అని వేరొకసారి, అది రూ.14 లక్షల కోట్లు అని ఇంకోసారి చంద్రబాబు, పవన్ లు చెప్పిన వీడియోలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి.కూటమి ప్రభుత్వం వచ్చాక పెట్టిన బడ్జెట్లో మాత్రం అప్పు అంతా కలిపి రూ.ఆరు లక్షల కోట్టేనని తేలింది. అందులో సగం 2014 టర్మ్‌లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు కూడా ఉంది. 2024లో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు అప్పులు చేయరు కాబోలు.. కొత్తగా సంపద సృష్టిస్తారేమోలే అనుకున్న వారందరికి మతిపోయేలా చేశారు. ఏకంగా రికార్డు స్థాయిలో అన్నీ కలిపి రూ.లక్షన్నర కోట్ల అప్పు చేశారు. స్కీములు అమలు చేయకుండా, పెద్దగా అభివృద్ది పనులు చేపట్టకుండా ఈ అప్పు ఏమి చేశారన్నది మిస్టరీ. దానిపై ప్రభుత్వం ఇంతవరకు వివరణ పత్రం ఇవ్వలేదు. దాంతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసం చేసిన సర్కార్‌గా గుర్తింపు పొందుతోంది.ఇంత అప్పు చేసి కూడా చంద్రబాబు తరచు తమకు అప్పులు పుట్టడం లేదని, సంపద సృష్టించడం ఎలాగో చెవిలో చెప్పండని కామెంట్లు చేస్తుంటే ప్రజలు నిశ్చేష్టులవుతున్నారు. తన పార్టీ సమావేశంలో జగన్ మాట్లాడుతూ ఎపిలో ప్రతి ఇంటిని బాబు మోసం చేశారని అన్నారు.అది కూడా నిజమే అనుకోవాలి. జగన్ టైమ్ లో ఏదో రకంగా 87 శాతం కుటుంబాలకు ఆర్థిక సాయం అందేది. ప్రస్తుతం పెరిగిన పెన్షన్ వెయ్యి రూపాయలు తప్ప మరేమీ అందడం లేదు. ప్రజలకు సూపర్ సిక్స్ అందకపోగా, రాక్షస రాజ్యం నడుపుతున్నారని, ప్రశ్నించేవారిపై కేసులు పెడుతున్నారని, తమకు బలం లేకపోయినా మున్సిపాల్టీ, మండల పరిషత్‌లను దౌర్జన్యంగా కైవసం చేసుకుంటున్నారని జగన్ అన్నారు. ఇందులో కూడా వాస్తవం ఉంది.సీఎం తన సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాల్టీలో టీడీపీకి బలం లేకపోయినా, భయపెట్టో, ప్రలోభపెట్టో తమ ఖాతాలో వేసుకున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి వెనుపోటే. కొన్నిచోట్ల మాత్రం వైసీపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు ధైర్యంగా అధికార కూటమి అరాచకాలను అడ్డుకున్నారు. అలాంటి వారితో జగన్ ప్రత్యేకంగా సమావేశమై వారిని అభినందించారు. జీఎస్టీ వసూళ్ల గురించి వచ్చిన డేటా విశ్లేషిస్తే, కూటమి సర్కార్ వచ్చిన ఈ పదినెలల్లో రెండు నెలలు తప్ప, మిగిలిన అన్ని నెలలు మైనస్ గ్రోత్ రేట్ నమోదైనట్లు స్పష్టమవుతోంది. ఇది ఏపీకి మంచి పరిణామం కాదు.గత ఏప్రిల్‌లో తమిళనాడులో 13 శాతం, తెలంగాణలో 12 శాతం, కర్ణాటకలో 11 శాతం, కేరళలో ఐదు శాతం, చివరికి ఒడిశాలో కూడా ఐదు శాతం వృద్ది రేటు చూపితే ఆంధ్ర ప్రదేశ్ మాత్రం మైనస్ 3.4 శాతంగానే ఉంది. అయినా దీన్ని కనిపించకుండా చేసేందుకు ఎల్లో మీడియా పాట్లు పడింది. కొద్ది రోజుల క్రితం జీఎస్డీపీలో నెంబర్ 2 వచ్చేశామంట ఒక అంకెను ప్రచారం చేశారు. ఆ తర్వాత కేంద్రం విడుదల చేసిన ఈ జీఎస్టీ లెక్కలతో ఏపీ ప్రభుత్వం చెప్పేవి బూటకపు లెక్కలని తేటతెల్లమవుతోంది! - కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అమరుడా.. నీకు వందనం
సాక్షి, న్యూఢిల్లీ/గోరంట్ల/కర్నూలు(సెంట్రల్)/సాక్షి, అమరావతి: భారత్ – పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో తెలుగు జవాన్ మురళీ నాయక్ (22) వీర మరణం పొందాడు. దేశ రక్షణలో శుక్రవారం తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో దాయాది బుల్లెట్‌కు బలయ్యాడు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళీ ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా నియంత్రణ రేఖ వద్ద పని చేస్తున్నాడు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన చికిత్స నిమిత్తం విమానంలో ఢిల్లీకి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే తనువు చాలించాడు. దేశ భద్రతలో తన ప్రాణాలను పణంగా పెట్టిన మురళీ నాయక్ త్యాగం మన దేశం ఎప్పటికీ మరువలేనిదని కేంద్ర, రాష్ట్ర ప్రముఖులు నివాళులర్పించారు. యావత్ భారత ప్రజానీకం ఈ వీర జవాన్‌కు సెల్యూట్ కొడుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఏకైక సంతానం.. దేశ సేవకు అంకితం జ్యోతిబాయి, శ్రీరాంనాయక్ దంపతులకు మురళీ నాయక్ ఏకైక సంతానం. వీరిది నిరుపేద కుటుంబం. ఈ దంపతులు 30 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం ముంబయికి వెళ్లారు. ఇద్దరూ అక్కడ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. మురళీ నాయక్ సోమందేపల్లి మండలం నాగినాయిన చెరువు తండాలో అమ్మమ్మ శాంతి బాయి వద్ద ఉంటూ సోమందేపల్లిలోని విజ్ఞాన్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో పదో తరగతి, ఇంటర్మీడియట్ అనంతపురంలోని సాయి జూనియర్ కళాశాలలో పూర్తి చేశాడు. అక్కడే డిగ్రీ చదువుతూ 2022 నవంబర్‌లో భారత సైన్యంలో చేరాడు. మహారాష్ట్రలో శిక్షణ పొందాక అసోం బార్డర్లో కొంతకాలం పనిచేశాడు. తర్వాత జమ్మూ కశ్మీర్‌కు బదిలీ అయ్యాడు. ఒక్కగానొక్క కుమారుడు కావడంతో మిలటరీలో చేరొద్దని తాము ప్రాధేయపడినా, దేశ సేవ చేయాలన్న తలంపుతో ముందుకు సాగాడని తల్లిదండ్రులు తెలిపారు. మురళీ నాయక్ ఇక లేడన్న సమాచారాన్ని భారత సైనికాధికారులు శుక్రవారం ఉదయం 9 గంటలకు తండ్రి శ్రీరాం నాయక్‌కు తెలియజేశారు. భౌతికకాయాన్ని శనివారం సాయంత్రం స్వగ్రామానికి తీసుకురానున్నట్లు సమాచారమిచ్చారు. అధైర్యపడొద్దు: సీఎం చంద్రబాబు మురళీ నాయక్ తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, అధైర్య పడొద్దని చెప్పారు. శుక్రవారం అనంతపురం జిల్లా పర్యటన ముగించుకుని కర్నూలు ఎయిర్‌పోర్టుకు వర్పింన ఆయన.. అక్కడే మురళీ నాయక్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వెళ్లారు. కాగా, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత శుక్రవారం కల్లి తండాకు చేరుకుని మురళీ నాయక్ తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును అందజేశారు. వీర సైనికుడి త్యాగాన్ని దేశం మరచిపోదు ‘సైనికుడు మురళీనాయక్ అమరుడవ్వడం చాలా బాధగా ఉంది. వీరోచిత పోరాటంలో తనువు చాలించిన మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. నాయక్ త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరచిపోదు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మలు పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని భారత జాతి ఎన్నడూ మరచిపోదని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వేర్వేరు ప్రకటనల్లో కొనియాడారు. మురళీ నాయక్ భారతమాత నుదుటిన అద్దిన సింధూరమని ఏపీ ట్రైకార్ మాజీ చైర్మన్ గుండా సురేంద్ర ఘన నివాళి అర్పించారు. ఆయన కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. మిలటరీ దుస్తుల్లో చనిపోవాలనేవాడుమురళీ నాయక్ చిట్టచివరిగా తల్లిదండ్రులకు గురువారం ఉదయం తొమ్మిది గంటలకు ఫోన్ చేసి మాట్లాడాడు. పాకిస్తాన్‌తో యుద్ధం నేపథ్యంలో బుధవారం రాత్రి నైట్ డ్యూటీ చేశానని, నిద్ర వస్తోందని చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని మురళీకి సూచించారు. అంతలోనే ఇలా ఘోరం జరిగిందంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు. దేశానికి సేవ చేయాలన్న సంకల్పం మురళీ నాయక్‌కు చిన్నప్పటి నుంచే బలంగా ఉండేది. ఒక్క రోజైనా భారత సైన్యంలో పనిచేసి.. మిలటరీ దుస్తులతో చనిపోవాలన్నదే తన లక్ష్యమని చెబుతుండేవాడని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపారు. అదే పట్టుదలతో కష్టపడి ఆర్మీలో ఉద్యోగం సంపాదించాడని, అనుకున్నట్టే యూనిఫాంతోనే వీర మరణం పొందాడని ఆవేదన వ్యక్తం చేశారు.నీ త్యాగాన్ని మరువలేంవైఎస్ జగన్ దిగ్భ్రాంతియుద్ధ భూమిలో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని ఎప్పటికీ మరువలేమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లో తెలుగు జవాన్ వీర మరణం చెందడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శోకతప్తులైన మురళి కుటుంబీకులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గిరిజన బిడ్డ దేశ భద్రతలో తన ప్రాణాలను సైతం ప్రాణంగా పెట్టి.. పిన్న వయసులోనే అశువులు బాయడం బా«ధాకరం అన్నారు. ఈ అమర వీరుడి త్యాగాన్ని భారతజాతి మరువదని, మురళీనాయక్ కుటుంబీకులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. మురళీ నాయక్ కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారు. మనోధైర్యంతో ఉండాలని సూచించారు. వైఎస్సార్సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌తో పాటు పలువురు నేతలు కల్లి తండాకు చేరుకొని మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. 13న కల్లితండాకు వైఎస్ జగన్జమ్మూకశ్మీర్లో వీరమరణం చెందిన జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. అందుకోసం ఈనెల 13న ఆయన శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ పరిధిలోని కల్లితండా వెళ్లనున్నారు. -
‘పట్టాదార్’పై పంతం!
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలతో రైతులు విలవిల్లాడుతున్నారు. గత ప్రభుత్వంపై అక్కసుతో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాల జారీని నిలిపి వేయడంతో గ్రామాల్లో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. వాటిపై అప్పటి సీఎం జగన్ ఫొటో ఉందనే కారణంతోపాటు లేనిపోని నిందలు మోపి 11 నెలలుగా పాస్ పుస్తకాలను జారీ చేయడం లేదు. గత ప్రభుత్వం ఇచి్చన లక్షలాది పట్టాదార్ పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి ఇస్తామని వాటిని వెనక్కి తీసుకుంది. దీంతో రైతులు బ్యాంకులు, ఇతర అవసరమైన చోట వాటి గురించి చెప్పలేక ఇబ్బందులు పడుతున్నారు. పాస్ పుస్తకాలు లేవనే కారణంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. తనకు భూమి ఉందని నిరూపించుకునే ఏకైక ఆధారమైన పాస్ పుస్తకం తమ దగ్గర లేక రైతులు కష్టాలు పడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో భూముల రీ సర్వేను ప్రారంభించి 2024 ఏప్రిల్ నాటికి 8 వేలకుపైగా గ్రామాల్లో విజయవంతంగా పూర్తి చేసింది. అత్యాధునికంగా డ్రోన్లతో భూమిని కొలిచి జియో కో–ఆర్డినేట్స్‌తో హద్దులు నిర్ధారించింది. ఆ హద్దుల్లో ప్రభుత్వ ఖర్చుతోనే రాళ్లు పాతించింది. అనంతరం క్యూఆర్ కోడ్‌తో రైతులకు పాస్ పుస్తకాలు జారీ చేసింది. ప్రతి రైతుకు ఆధార్ నంబర్ తరహాలో ఒక యూనిక్ ఐడీని కేటాయించింది. రికార్డుల్లోగానీ, భూమిపైగానీ ఎటువంటి ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా భూ వివాదాలకు శాశ్వతంగా స్వస్తి చెప్పేలా చర్యలు తీసుకుంది. తద్వారా స్వతంత్య్ర భారతదేశ చరిత్రలో రీ సర్వే చేసిన తొలి రాష్ట్రంగా నిలిచింది. ఈ సర్వే విజయవంతం కావడంతో కేంద్ర ప్రభుత్వం రూ.400 కోట్ల రాయితీ ప్రకటించింది. వైఎస్ జగన్ హయాంలో జరిగిన భూ సంస్కరణలను వ్యతిరేకించి, కూటమి నేతలు అభాండాలు మోపారు. ఇటీవల అదే కూటమి ప్రభుత్వం ఆ సొమ్మును స్వీకరించడం విశేషం. కొత్తవి ఎప్పుడిస్తారో తెలీదట! » కూటమి ప్రభుత్వం రీ సర్వేను కొనసాగించినా పట్టాదార్ పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో ఉందనే కారణంతో 8 వేల గ్రామాల్లో సర్వే పూర్తయిన భూములకు సంబంధించిన పుస్తకాలను రైతులకు పంచలేదు. పంచిన వాటిని కూడా వీఆర్ఓల ద్వారా వెనక్కి తీసుకుంది. వాటి స్థానంలో ప్రభుత్వ రాజముద్రతో కొత్తవి ఇస్తామని ప్రకటించింది. ఇందుకోసం రూ.15 కోట్లతో టెండర్ పిలిచింది. » చెన్నైకి చెందిన కంపెనీకి టెండర్ ఖరారు చేసినా ఇప్పటి వరకు ముద్రణ ఏ స్థాయిలో ఉందో కూడా బయటకు తెలియనీయడం లేదు. అవి ఎప్పుడు వస్తాయో తమకు తెలియదని తహశీల్దార్లు చెబుతున్నారు. ఉన్నతాధికారులు కూడా సరైన సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారు. » పాస్ పుస్తకాలు లేకపోవడంతో బ్యాంకులు రుణాలు మంజూరు చేయడం లేదు. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో సర్వే నంబర్ల స్థానంలో ఎల్పీఎం నంబర్లు కేటాయించారు. కానీ.. పాస్‌పుస్తకాలు లేకపోవడంతో భూముల అమ్మకాలు కూడా జరగడం లేదు. » కొనుగోలు చేసేవాళ్లు రెవెన్యూ రికార్డుల్లో పేరు ఉన్నా, పాస్ పుస్తకాలు లేవనే భయంతో వెనకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేస్తే అడంగల్‌లో పేరు మారుతుంది తప్ప పుస్తకం రావడం లేదు. మరోవైపు రీ సర్వే జరగని గ్రామాల్లోనూ పాస్ పుస్తకాలు జారీ కావడం లేదు. దీంతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. -
సీఎం చంద్రబాబుకు నిరసన సెగ
అనంతపురం: సీఎం చంద్రబాబు నాయుడుకు జిల్లా పర్యటనలో నిరసన సెగ గట్టిగానే తగిలింది. ఈరోజు(శుక్రవారం) ఉరవకొండ నియోజకవర్గం చాయపురంలో చంద్రబాబు పర్యటించిన క్రమంలో ఏబీవీపీ ఆందోళనకు దిగింది.. జీవో 77ను రద్దు చేయాలంటూ ఏబీవీపీ కార్యకర్తంలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. గో బ్యాక్ సీఎం అంటూ ఫ్లకార్డు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు.సీఎం చంద్రబాబు ఎదుట నిరసన తెలిపేందుకు వెళ్తున ఏబీవీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని సీఎం చంద్రబాబు ఎదుట నిరసన తెలపకుండా అడ్డుకున్న పోలీసులు.. అరెస్ట్ చేశారు. వీరిని అరెస్ట్ చేసిన తర్వాత చిన్నహోతూరు ప్రభుత్వ పాఠశాలలో పోలీసులు నిర్భందించారు. బీజేపీ అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘం ఏబీవీపీ నిరసనపై సర్వత్రా చర్చ నడుస్తోంది. చంద్రబాబు ఒకవైపు ఎన్డీఏ కూటమిలో ఉండగా, బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ నిరసన వ్యక్తం చేయడం చర్చకు దారి తీసింది. -
రోజులు దగ్గర పడ్డాయి.. బాబు సర్కారుకు సజ్జల వార్నింగ్
-
ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి.. బాబు సర్కార్‌కు సజ్జల వార్నింగ్
సాక్షి, గుంటూరు: గుంటూరు సీఐడి కార్యాలయంలో వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించి అక్రమ కేసులో విచారణకు పిలిచారని.. బాధ్యత కలిగిన పౌరుడిగా విచారణకు వచ్చానని తెలిపారు. గతంలో కూడా ఒకసారి విచారణకు వచ్చానని చెప్పారు ప్రజాస్వామ్యంలో పట్టాభిలాగా బూతులు మాట్లాడరు. టీడీపీ నాయకుడు పట్టాభి ఎలా మాట్లాడాడో అందరికీ తెలుసునని సజ్జల అన్నారు.‘‘దాడులకు మా నాయకుడు జగన్ వ్యతిరేకం. మాట్లాడే సమయంలో సంయమనంతో ఉండాలి. ఆ ఘటన జరిగిన సమయంలో నేను ఊళ్లో లేను. అధికారులు అడిగిన ప్రశ్నకి నాకేమీ తెలియదని సమాధానం చెప్పాను. ఏడాది కాలంగా రెడ్ బుక్ వేధింపులు ఎక్కువయ్యాయి. ఎన్నికలకు ముందునుంచే రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించారు. ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టడం, వేధించడం జైలుకు పంపడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు నుంచి కిందిస్థాయి వరకూ ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. కంతేరు ఎంపీటీసీ అయిన మహిళ పట్ల కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘మా వాళ్లు కేసు ఇస్తే తీసుకోలేదు.. వాళ్లు ఇస్తే మాత్రం దుర్మార్గంగా అరెస్టు చేశారు. కూటమి ప్రభుత్వం పథకం ప్రకారం వ్యవస్థీకృత టెర్రరిజాన్ని క్రియేట్ చేస్తున్నారు. మహిళల పట్ల పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. కాలం ఎప్పుడూ ఇలాగే ఉండదు. రేపు మేం అధికారంలోకి వచ్చి ఇలాగే మొదలుపెడితే ఎలా ఉంటుంది?. మీరు వేసిన విత్తనం చాలా ప్రమాదకరమైనది. పోసాని ఎప్పుడో మాట్లాడితే కేసు పెట్టారు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటికి ఎలాంటి అనుమతి లేకుండా పోలీసులు వెళ్లారు. పవిత్రమైన జర్నలిజం వృత్తిలో ఉన్న వారిని కూడా వదలటం లేదు. ఇలాంటి ఉన్మాద చర్యలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో ఆలోచించండి’’ అంటూ సజ్జల హితవు పలికారు.‘‘మీరు ఎంతమందిని జైలులో పెడతారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి కృత్రిమ కుంభకోణాలు సృష్టిస్తున్నారు. లిక్కర్ స్కాం కూడా తప్పుడు కేసే. ఏడాది దాటింది.. ఇప్పటికైనా వాస్తవంలోకి రండి. లేకపోతే జనం తరిమికొట్టే రోజులు వస్తాయి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. -
నీ నటన సూపర్ బాబు,పవన్ ను ఏకిపారేసిన కేఏ పాల్
-
‘కూటమి’ అక్రమాలు.. ప్రశ్నిస్తే వేధింపులా?: రవీంద్రనాథ్‌రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ పనిచేస్తోందని వైఎస్సార్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో స్కీములు లేవు.. కానీ అన్ని స్కాములే’’ అంటూ దుయ్యబట్టారు. 1.70 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక్క అభివృద్ధి పనులు చేయలేదని మండిపడ్డారు.‘‘సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటిపై పోలీసుల దాడులు అప్రజాస్వామికం. కనీసం ఎటువంటి నోటీసు కూడా ఇవ్వకుండా కుటుంబ సభ్యులను వేధించడం దారుణం. సాక్షి మీడియా ప్రతినిధులను బెదిరిస్తూ అక్రమాలు ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. లేని లిక్కర్ స్కాం బయటకు తీసి అబద్ధాలే ఆరోపణలుగా కేసులు పెడుతున్నారు. అధికారులను, నాయకులను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో అమాతంగా విద్యుత్ ఛార్జీలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు’’ అని రవీంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు.ఆపరేషన్ సిందూర్‌పై ఆయన మాట్లాడుతూ.. దేశం కోసం నిత్యం శ్రమిస్తున్న సైనికులకు సెల్యూట్ చెప్పారు. పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టడం హర్షణీయం అని రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. -
KSR Live Show: సాక్షి మీడియాపై బాబు సర్కార్ దాడి
-
ఉర్సాకు పెట్టుపోతలు పూర్తయినట్టేనా?
కంపెనీలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రాయితీల్లాంటివి ఇవ్వడం సహజమే కానీ.. ఓ స్టార్టప్ కంపెనీకి ఏకంగా మూడు వేల కోట్ల రూపాయల విలువైన భూమిని కారుచౌకగా కట్టబెట్టే ప్రయత్నం మాత్రం కని విని ఎరగనిదే! ఆంధ్రప్రదేశ్‌లో కేవలం రెండు నెలల వయసున్న ఉర్సా కంపెనీకి విశాఖపట్నంలో సుమారు 60 ఎకరాల భూమిని ధారాదత్తం చేసింది. ప్రతిపక్షాల అభ్యంతరాలు, ఆందోళనలన్నింటినీ తోసిరాజంటోంది అక్కడి ప్రభుత్వం. ఉర్సా వ్యవస్థాపకుల గత చరిత్ర.. వారి వెనుక ఉన్న పెద్దల సంగతి అన్నింటిలోనూ పలు అనుమానాలున్నా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని ప్రభుత్వం భూమిని కట్టబెట్టేందుకే సై అనింది.పెందుర్తి విజయకుమార్, అబ్బూరి సతీష్ అనే ఇద్దరు ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు మొదట వార్తలొచ్చినా.. ఆ తరువాత కంపెనీ డైరెక్టర్లుగా కొత్త కొత్త పాత్రలు ప్రవేశిస్తున్నాయి. అమెరికా వాసి తాళ్లూరి జయశేఖర్ అనే వ్యక్తి ఉర్సా తరఫున ఆన్లైన్లో మీడియా సమావేశం నిర్వహించి తన వాదన వినిపించే ప్రయత్నం చేశారు. అయితే అనుకూల మీడియాతోనే నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన పలు అంశాలకు స్పష్టమైన సమాధానం ఇచ్చినట్లు అనిపించలేదు. ఈ కంపెనీ సుమారు రూ.5600 కోట్ల పెట్టుబడి పెడుతుందని చెబుతున్నారు.తొలుత రూ.200 కోట్లు వచ్చిస్తారట. ఆర్థిక సహకారం అందించే వారెవ్వరన్నది వారి కోరిక మేరకు రహస్యంగా ఉంచారట. ఈయనకు బీజేపీ పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్‌కూ బంధుత్వం కూడా ఉందట. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పేరు ఈ వివాదంలోకి రావడం, ఆయన సోదరుడు, మాజీ ఎంపీ కేశినేని నానినే ఆరోపణలు సంధించడం సంచలనంగా ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి పాత్ర ఏమిటటన్నది ఇంకా స్పష్టత రానప్పటికీ, డీల్ వెనుక చాలా ప్రముఖుల హస్తమే ఉండవచ్చన్న అభిప్రాయం కలుగుతుంది. పరిశ్రమల ముసుగులో ఎవరికి పడితే వారికి, ఇష్టారీతిన భూములు కట్టబెడితే అది ఏపీకి తీరని నష్టం చేస్తుంది. ప్రస్తుతం అధికారం ఉంది కనుక ఎలాగైనే చేయవచ్చులే అనుకుంటే అనుకోవచ్చు. కాని పరిస్థితి ఎల్లకాలం ఒకేలా ఉండకపోవచ్చు.విశాఖలో ప్రముఖ కంపెనీ టీసీఎస్‌కు ఎకరా కేవలం 99 పైసలకే కట్టబెట్టడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. టీసీఎస్‌కు 21 ఎకరాలు ఇస్తే, ఊరు పేరు లేని ఈ ఉర్సా కంపెనీకి అరవై ఎకరాలా అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. విశాఖలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది కనుక తమకు నచ్చిన వారికి పందారం చేస్తున్న నేతలు అమరావతిలో ఇచ్చి ఉండవచ్చు కదా అని ఆ ప్రాంతవాసులు ప్రశ్నిస్తున్నారు. ఉర్సా కంపెనీకి భూమి ఇస్తున్నట్లు మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఎవరికి అర్థం కాలేదు. డిజిటల్ మీడియా దీనిపై పరిశీలన చేసినప్పుడు అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కంపెనీకి కూడా ఎకరా 99 పైసలకే ఇస్తున్నారన్న అభిప్రాయం కలిగింది.అప్పుడు కేవలం టీసీఎస్‌కు ఇచ్చిన భూమి విలువ చెప్పి ఈ ఉర్సా కంపెనీకి ఎంతకు ఇచ్చింది ప్రభుత్వం వెల్లడించలేదు. వివాదం చెలరేగిన తర్వాత ఉర్సా కంపెనీ డైరెక్టర్‌గా చెప్పుకున్న జయశేఖర్ తమకు ఎకరం రూ.ఏభై లక్షల చొప్పున ఇచ్చారని వెల్లడించారు. ఆ రకంగా చూసినా ఈ కంపెనీకి కేవలం రూ.మూడు వేల కోట్ల విలువైన భూమిని రూ.30 కోట్లకే ఇచ్చినట్లవుతుంది. అసలు ప్రభుత్వం భూమి అమ్మకం కాకుండా, లీజు పద్దతిలో ఇచ్చి ఉంటే, ఏదో కొంత ఎక్కువ, తక్కువకు భూమి కేటాయించారులే అని సరి పెట్టుకోవచ్చు.ఏ మాత్రం అనుభవం లేని సంస్థలకు భూములు అమ్మేస్తే, తదుపరి ఈ సంస్థలు ఆశించిన రీతిలో పని చేయకపోయినా, మూతపడినా, ఆ భూమి మాత్రం వారి సొంతం అవుతుంది. అప్పుడు వారికి భారీ లాభం చేకూరుతుంది కదా అన్నది మేధావుల భావన. దీనికి ప్రభుత్వం నుంచి ఎవరూ సమాధానం ఇస్తున్నట్లుగా లేదు. విశేషం ఏమిటంటే ఈ ఉర్సా కంపెనీ హైదరాబాద్‌లో ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్ అడ్రస్ లో రిజిస్టర్ చేయడం. దీనికి ఒక వెబ్సైట్ కాని, ఇతరత్రా సిబ్బంది తదితర హంగు ఆర్భాటాలేవీ లేవు. ఆ తర్వాత ఏదో వెబ్‌సైట్‌ను చూపించినా, దాని అనుమతి ఒక ఏడాదికే ఉన్నట్లు తెలిసింది. అందులో ఉన్న వివరాలపై కూడా అనేక సందేహాలు వచ్చాయి.మాజీ ఎంపీ కేశినేని నాని అయితే ఈ కంపెనీ టీపీపీ ఎంపీ కేశినేని చిన్ని బినామీ సంస్థ అని ఆరోపించారు. అబ్బూరి సతీష్, ఈయన వ్యాపార భాగస్వాములని, ఒక ప్రాపర్టీ సంస్థను స్థాపించి ప్రజలను మోసం చేశారని ఆయన అన్నారు. విశాఖలో భూమి కొట్టేయడానికే ఈ ప్లాన్ అని ఆయన అన్నారు. దీన్ని చిన్ని ఆయన మద్దతుదారులు కొందరు ఖండించినప్పటికీ, అసలు ఉర్సా కంపెనీ సామర్ధ్యం, అమెరికాలో ఈ సంస్థ కట్టిన పన్ను, అనుభవం తదితర వివరాలు బయటకు వచ్చాక, ఇది ఎవరికో బినామీనే అన్న అనుమానాలు బలపడ్డాయి. సతీష్ అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగి. పెందుర్తి విజయకుమార్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉద్యోగం చేస్తున్నారని వైసీపీ సంయుక్త కార్యదర్శి వెంకటరెడ్డి పేర్కొన్నారు. మంత్రి లోకేశ్‌కు వీరికి ఉన్న స్నేహ సంబంధాలపై కూడా ప్రచారం జరుగుతోంది. ఆయన దీనిపై వివరణ ఇచ్చినట్లు కనిపించలేదు.ఏ కంపెనీ అయినా పెట్టుబడి పెడతామని అంటే పరిశ్రమల శాఖ అన్ని విషయాలను పరిశీలించాలి. అవేవి చూడకుండా స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదించి, ఆ పైన మంత్రివర్గం ఓకే చేయడం కచ్చితంగా సందేహాలకు తావిస్తుంది. ఒక వైపు గత ప్రభుత్వ హయాంలో కొన్ని డిస్టిలరీలకు అధికంగా ఆర్డర్లు, మరికొన్నిటికి తక్కువ ఆర్డర్లు ఇవ్వడంతో రూ.మూడు వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ప్రభుత్వం పిచ్చి కేసు పెడుతోంది. మరో వైపు ఒక్క డీల్లోనే రూ.మూడు వేల కోట్ల భూమి స్కామ్ కు ప్రభుత్వ పెద్దలు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖను కారుచౌకగా అమ్మేస్తున్నారంటూ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా, దేశంలో కూడా గగ్గోలుగా చెప్పుకుంటున్నారు.గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి బోగస్ కంపెనీలకు భూములు ఇచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ లో బిల్లీరావు అనే వ్యక్తి సంస్థకు 400 ఎకరాల భూమిని విక్రయించడం పెద్ద వివాదంగా మారిన సంగతి తెలిసిందే. అలాగే సదస్సులు పెట్టి పలు బోగస్ ఒప్పందాలు చేసుకున్నారన్న అప్రతిష్ట కూడా అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వంపై వచ్చింది. ఏది ఏమైనా ఉర్సా కంపెనీకి అరవై ఎకరాల భూమి కేటాయింపును చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేస్తుందా?లేక ఇదే రీతిలో ముందుకు సాగుతుందా అన్నది చర్చ.కాని ప్రభుత్వం తీరు చూస్తే ఈ అడ్డగోలు తతంగాన్ని కొనసాగించేలానే కనిపిస్తోంది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
హైకోర్టు నోటీసులిచ్చినా చంద్రబాబు సర్కారు బేఖాతర్ రూ.9 వేల కోట్ల ఎన్సీడీ బాండ్ల జారీ
సాక్షి, అమరావతి: అప్పుల సమీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ ఏపీఎండీసీ (ఖనిజాభివృద్ధి సంస్థ) ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో ఇష్టారాజ్యంగా ముందుకెళ్తోంది. బాండ్ల అంశం హైకోర్టు పరిధిలో ఉన్నప్పటికీ న్యాయస్థానం నోటీసులను బేఖాతరు చేస్తూ ఎన్సీడీ (నాన్ కన్వర్టబుల్ డిబెంచర్) బాండ్ల ప్రక్రియకు బరితెగించింది. నిబంధనలకు విరుద్ధంగా అధికశాతం వడ్డీరేట్లకు వాటిని జారీచేసింది. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ ఆర్బీఐ కన్సాలిడేటెడ్ ఫండ్‌పై ప్రైవేట్ వారికి హక్కులు కల్పిస్తూ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ గురువారం రూ.9 వేల కోట్ల ఎన్సీడీ బాండ్లను జారీచేయగా, సుమారు రూ.3,400 కోట్ల బాండ్లను మాత్రమే పెట్టుబడిదారులు కొనుగోలు చేసినట్లు తెలిసింది.సెబీలోని ఐబీపీ ప్లాట్‌ఫాంలో నిర్వహించిన ఎల్రక్టానిక్ బిడ్డింగ్‌లో తెలుగుదేశం పార్టీకి చెందిన బినామీ వ్యక్తులే ఎక్కువగా ఈ బాండ్లు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కన్సాలిడేటెడ్ ఫండ్‌పై హక్కులు ఇచ్చే విషయాన్ని చివరి నిమిషంలో బయటపెట్టడం ద్వారా ఎక్కువమంది పెట్టుబడిదారులు ఆన్లైన్ బిడ్డింగ్‌లో పాల్గొనకుండా చేయడంలో ప్రభుత్వ పెద్దలు సఫలమైనట్లు సమాచారం. అయితే, అమ్ముడైన రూ.3,400 కోట్ల బాండ్లలో ఎక్కువ భాగం టీడీపీకి చెందిన వ్యక్తులే కొన్నట్లు తెలుస్తోంది. ఈ బాండ్ల జారీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత గోప్యంగా ఉంచింది.ఏపీఎండీసీలోని ముఖ్య అధికారులకు కూడా ఈ బాండ్లకు సంబంధించిన వివరాలేమీ తెలియకుండా ఆరి్థక శాఖ ముఖ్య ఉన్నతాధికారే అన్ని చూసుకున్నట్లు తెలిసింది. ఇక అప్పుల కోసం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడడంతోపాటు అందుకు సంబంధించిన కీలకమైన విషయాలను బయటపెట్టకుండా కేవలం తమకు అనుకూలమైన వారికి మాత్రమే మేలు చేసేందుకు ప్రభుత్వం పన్నాగం పన్నింది. అయినా, అనుకున్న మేర బాండ్లను విక్రయించడంలో సఫలం కాలేకపోయింది. మిగిలిన బాండ్లకు సంబంధించి ఏం చేయాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. హైకోర్టు నోటీసులు బేఖాతరు.. ఆర్బీఐ కన్సాలిడేటెడ్ ఫండ్‌ని ప్రైవేట్ వ్యక్తులకు బాండ్లు జారీచేయడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైనా లెక్కచేయకుండా ప్రభుత్వం ముందుకెళ్లడం గమనార్హం. రాజ్యాంగంలోని ఆర్టీకల్స్ 203, 204, 293 (1), 293 (3)లను ప్రభుత్వం ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో హైకోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సహా ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. అయినా, టీడీపీ కూటమి ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా గురువారం బాండ్లు జారీచేసేసింది. ఇలా జారీచేసిన బాండ్లలో సుమారు రూ.3,400 కోట్ల మొత్తాన్ని 9.30 శాతం అధిక వడ్డీ రేటుతో పెట్టుబడిదారులు కొనుగోలు చేశారు. ప్రైవేట్ వారికి పెత్తనం రాజ్యాంగ విరుద్ధం.. ఇక ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్సీడీ బాండ్లను 6.71 శాతం వడ్డీ రేటుతో జారీచేసింది. కానీ, ఇప్పుడు ఏపీఎండీసీ ఈ బాండ్లను 9.30 శాతం అధిక వడ్డీకి జారీచేయడంతోపాటు కన్సాలిడేటెడ్ ఫండ్‌పై ప్రైవేట్ వారికి పెత్తనం ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని నిపుణులు చెబుతున్నారు. -
‘సాక్షి ఎడిటర్ నివాసంలో సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలా?’
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న సాక్షి పత్రికపైన చంద్రబాబు దుర్మార్గంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సాక్షి ఎడిటర్ నివాసంలో ఎటువంటి సెర్చ్ వారెంట్ లేకుండానే సోదాలు నిర్వహించడం చంద్రబాబు అధికార దుర్వినియోగంకు పరాకాష్టగా నిలుస్తోందని అన్నారు. వైఎస్ జగన్ వెంట ఉన్న వారిపై వేధింపుల్లో భాగంగా లేని లిక్కర్ స్కామ్‌ను సృష్టించి, దానిలో వారిని భాగస్వాములుగా చూసే దారుణానికి చంద్రబాబు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే.. దేశంలో యుద్ధవాతావరణం నెలకొని ఉంటే ఏపీలో మాత్రం చంద్రబాబు రాజకీయంగా కక్షలు తీర్చుకునే పనిలో నిమగ్నమై ఉన్నాడు. లేని లిక్కర్ స్కామ్‌ను తెరమీదికి తీసుకువచ్చి వైయస్ జగన్ వెంట ఉన్న వారిని దోషులుగా చిత్రీకరిస్తున్నారు. చివరికి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న ప్రజల గొంతుక సాక్షి పత్రికపైన కూడా దుర్మార్గమైన దాడికి చంద్రబాబు ప్రయత్నించడం సిగ్గుచేటు. దేశంలో ఒకవైపు యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు దేశ రక్షణ బలగాలకు సంఘీభావంగా ఎలాంటి పరిస్థితినైనా ఎదర్కోవడానికి సమాయత్తమవుతున్నాయి. కానీ ఏపీలో మాత్రం చంద్రబాబు తన కుటిల రాజకీయ కుతంత్రాలను అమలు చేయడానికే మొత్తం సమయాన్ని వినియోగిస్తున్నారు.లేని లిక్కర్ స్కాంను సృష్టించి, అబద్ధాలను ఆరోపణలుగా మార్చి దానిచుట్టూ కక్ష తీర్చుకునే దుర్మార్గమైన కార్యక్రమాన్ని చేస్తున్నారు. దీనిలో భాగంగా రోజుకు ఒకరిని టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు ఇవాళ అధికారంలో ఉన్నాడు కాబట్టి, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి… కొన్నాళ్లపాటు వారి ఆటలు చెల్లుతాయి. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గుర్తు పెట్టుకోవాలి. అమావాస్య చీకట్లు ఎలా ఉంటాయో, వెలుగు కూడా దాని వెనుకకే ఉంటుంది. అప్పుడు తప్పనిసరిగా చట్టం ముందు నిలబడి తగిన మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రికి కార్యదర్శిగా పనిచేసిన ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిమీద, ఓఎస్డీగా పనిచేసిన ఒక నిజాయితీపరుడైన మాజీ ప్రభుత్వ ఉద్యోగి మీద చంద్రబాబు మొత్తం, బలాన్ని, బలగాన్ని ప్రయోగించడం సిగ్గు చేటు.అసలు లిక్కర్ స్కామ్ అనేదే లేదు. ఇది ఒక కుట్ర. దీనిలో అందరినీ భాగస్వాములను చేసి, వైయస్ జగన్ గారి చుట్టూ ఉన్న వారిని దీనిలో ఇరికించాలనే ఈ కక్ష సాధింపు చర్యలు. కక్షలు తీర్చుకోవడంలో చంద్రబాబు అన్ని లైన్లు క్రాస్ చేశాడు. తెలుగు పత్రికా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న సాక్షి ఎడిటర్ మీద కూడా పోలీసులను చంద్రబాబు ప్రయోగించడం దుర్మార్గం. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా ఒక పెద్ద పత్రిక సంపాదకుడ్ని టార్గెట్ చేయడం దారుణం.సాక్షి కథనాలు చంద్రబాబుకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. కూటమి పార్టీలకు, ముఖ్యంగా తెలుగుదేశంకు ఎల్లో పత్రికల్లాగ సాక్షి పత్రిక డబ్బా కొట్టాలని అనుకోవడం వారి అవివేకం. సమాజం పట్ల, ప్రజలపట్ల తన బాధ్యతను సాక్షి నిర్వహిస్తోంది. అలా సాక్షి పత్రికను, సంపాదకుడ్ని, జర్నలిస్టులను భయపెట్టాలనుకోవడం వారి దురాశే అవుతుంది. ప్రజల పక్షాన ఎన్నికల హామీలను ప్రశ్నిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. ప్రజల అండ ఉన్నంత వరకూ సాక్షి పత్రికను ఎవ్వరూ ఏమీ చేయలేరు. గతంలో కూడా సాక్షిపైన ఇలాంటి కుట్రలే చేసి విఫలమయ్యారు. నీతీ, నిజాయితీగా పనిచేసే సాక్షి పత్రికా బృందాన్ని కూటమి ప్రభుత్వం తన బలంతో అణిచివేయాలని చూసినా ప్రయోజనం లేదని తెలుసుకోవాలి. -
YS Jagan: మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే..!
-
ఎలాంటి నోటీసులు లేకుండా నేరుగా R.ధనుంజయ రెడ్డి ఇంటికి ఏపీ పోలీసులు
-
మీ బాధలు చూస్తున్నాను.. హామీ ఇస్తున్నా..
-
ఎక్కడ దాక్కున్నా.. తీసుకొచ్చిమరీ... వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
-
రైతుల సమస్యలపై చంద్రబాబు సానుకూలంగా స్పందించాలి- ప్రకాశ్ రెడ్డి
-
LIVE: జగన్ అంటే ఏంటో చూపిస్తా... వైఎస్ జగన్ వైల్డ్ ఫైర్
-
‘మీ బాధలు చూశా.. ఇబ్బందిపెట్టిన వారి పేర్లు రాసుకోండి’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. రాజంపేట, మడకశిర, మున్సిపాలిటీలతో పాటు రామకుప్పం, రొద్దం మండలాల నేతలతో భేటీ అయిన ఆయన... ఇటీవల జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికల్లో టీడీపీ అక్రమాలను ప్రస్తావించారు. పచ్చగూండాల దాడులను ఎదుర్కొన్నవారిని అభినందించారు.‘‘రాష్ట్రంలో కూటమి సర్కార్.. విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తోంది. ఈ పరిస్థితుల మధ్య తులసి మొక్కల్లా.. తెగువ చూపించి, విలువలతో కూడిన రాజకీయాలకు అర్ధం చెప్పి.. వాటిని చంద్రబాబుకు చూపారు.. నిలబడిన మీ అందరికీ హ్యాట్సాఫ్. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి. కానీ వాటన్నింటినీ దిగజార్చారు చంద్రబాబు. ఈ పరిస్థితి చూడాల్సి వస్తుందని అనుకోలేదు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.స్థానిక సంస్థల్లో చంద్రబాబు అనైతిక చర్యలు:రామకుప్పంతో ఒక ఎంపీటీసీ చనిపోతే, ఉప ఎన్నిక జరిగింది. అక్కడ మొత్తం 16 మంది వైఎస్సార్సీపీకి చెందినవారే. అయినా అక్కడ చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టి, ఆరుగురిని లాక్కునే ప్రయత్నం చేయడంతో పాటు, మన పార్టీ ఎంపీటీలు ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసుల ద్వారా అడ్డుకున్నారు. కోరం లేకపోయినా, కేవలం ఆరుగురు మాత్రమే అటువైపు వెళ్లినా, ఏకపక్షంగా డిక్లేర్ చేసుకున్నారు. రొద్దం మండలంలో మొత్తం 15 ఎంపీటీసీలు వైఎస్సార్సీపీకి చెందిన వారే. అక్కడ ఒకరు చనిపోతే ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడా చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేశాడు. చెడిపోయిన రాజకీయాలకు దిక్సూచిలా పని చేస్తూ.. మార్గం చూపాడు. పెనుకొండలో ఎంత ప్రలోభపెట్టినా ఒక్కరూ వెళ్లలేదు. మడకశిర ఎస్సీ నియోజకవర్గం. అక్కడా 15 మంది మన పార్టీ వారే. అక్కడా కౌన్సిలర్లను లాగాలని విశ్వప్రయత్నం చేశాడు. అంత కన్నా దిగజారిన నాయకుడు ఎవరూ ఉండరు. అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీలో 29 వార్డుల్లో 24 మంది కౌన్సిలర్లు. కేవలం ముగ్గురు టీడీపీ. ఇంకొకరు ఇండిపెండెంట్. అయినా అక్కడా చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేశారు.చంద్రబాబు సిగ్గు పడాలిఏ నాయకుడు అయినా ఆదర్శంగా ఉండాలి. మన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు విలువలు, విశ్వసనీయతతో పని చేస్తున్నారు. చంద్రబాబు సిగ్గుపడి తల దించుకునేలా మన వాళ్లు రాజకీయాల్లో ఉన్నారు. మనం మాట తప్పలేదు. విలువలు వదల్లేదు. మనం అధికారంలో ఉన్నప్పుడు కోవిడ్ వచ్చింది. రెండేళ్ల తర్వాత స్థానిక ఎన్నికలు జరిగాయి. కోవిడ్ వల్ల రాష్ట్రంలో ఎప్పుడూ చూడని పరిస్థితులు. ఆదాయాలు తగ్గాయి. ఖర్చులు పెరిగాయి. కానీ, ఏనాడూ సాకు చూపలేదు. ఎగొట్టే పని చేయలేదు. మాట తప్పలేదు. చిక్కటి చిరునవ్వుతో ఉన్నాం. మ్యానిఫెస్టోలో చెప్సిన ప్రతి మాటకు కట్టుబడ్డాం. పథకాలు అమలు చేశాం. బటన్ నొక్కాం. మాట తప్పకుండా పని చేశాం కాబట్టే, కోవిడ్‌లో అలా పని చేశాం కాబట్టే.. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గెలిచాంఅవకాశం ఉన్నా తాడిపత్రి వదులుకున్నాంనాడు కేవలం రెండు మున్సిపాలిటీల్లోనే టీడీపీకి మెజారిటీ వచ్చింది. తాడిపత్రి మున్సిపాలిటీలో మన పార్టీ వారు 16 మంది గెలిస్తే, టీడీపీ నుంచి 18 మంది గెలిస్తే.. ఎవరినీ లాక్కోవాలని చూడలేదు. అప్పుడు నేను మన ఎమ్మెల్యేను నేను హౌజ్ అరెస్టు చేశాను. దాంతో తాడిపత్రి మున్సిపాలిటీ ఛైర్మన్ పదవిని టీడీపీ గెల్చింది. మనం ఆనాడు అలా రాజకీయం చేస్తే, అదే మాజీ ఎమ్మెల్యేను ఇప్పుడు తాడిపత్రిలోకి అడుగు పెట్టనీయడం లేదు. ఆస్తులు విధ్వంసం చేస్తున్నారు.మీ బాధలు చూస్తున్నాను.. హామీ ఇస్తున్నా..ఇవన్నీ చూశాక, నేను ఒకటే చెబుతున్నాను. కేవలం వైఎస్సార్సీపీని ప్రేమించినందుకు, పార్టీని అభిమానించినందుకు కార్యకర్తలు పడుతున్న బాధను చూశాను. అందుకే జగన్ 2.0 లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాను. వారికి పూర్తి న్యాయం చేస్తాను. మిమ్మల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకొండి. అధికారంలోకి వచ్చాక వారిని చట్టం ముందు నిలబెడదాం. ఈరోజు నువ్వు (చంద్రబాబు, పోలీసులు) చేస్తున్న దుర్మార్గం. వారు ఈరోజు ఏదైతే విత్తనం వేస్తున్నారో రేపు అదే పెరుగుతుంది. అందుకే ఈరోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు, పోలీసులు.. ఆరోజు ఎక్కడున్నా, రిటైర్ అయినా, సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం. అది మామూలుగా ఉండదు.చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే..ఈ రోజు తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలు. సంబంధం లేకున్నా కేసుల్లో ఇరికిస్తున్నారు. ఇలాంటి రాజకీయాలు గతంలో ఏనాడూ చూడలేదు. చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే, ఆయన ప్రజల్లో చులకన అయ్యారు. హామీలు అమలు చేయడం లేదు. దీంతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. కాబట్టి, ఎవరూ ప్రశ్నించకూడదని, రాష్ట్రంలో భయానక పరిస్థితి సృష్టిస్తున్నాడు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ప్రజల్లో వ్యతిరేకత కనిపించినా, వెంటనే డైవర్షన్. ఒకరోజు తిరుపతి లడ్డూ అంటాడు. ఇంకోరోజు సినీ నటి కేసు.ఈ రోజు ప్రజలు అడిగే ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేడు. టీడీపీ వారు ఎక్కడికి వెళ్ళినా.. ఏం జరుగుతుంది?. నా రూ.15 వేలు ఏమయ్యాయని పిల్లలు, మా రూ.26 వేలు ఏమయ్యాయని రైతులు, అవ్వలు వారి రూ.48 వేలు, యువత తమ రూ.36 వేలు ఏమయ్యాయని అడుగుతారు. ఎన్నికల ముందు మాట ఇచ్చి, మోసం చేయడంతో సమాధానం చెప్పలేని దుస్థితి.అన్ని వ్యవస్థలు నాశనం చేసేశారు..ఈరోజు అన్ని వ్యవస్థలు నాశనం చేశారు. నాడు–నేడు లేదు. ఇంగ్లిష్ మీడియ లేదు. పిల్లలకు ట్యాబ్‌లు లేవు. గోరుముద్ద సక్రమంగా లేదు. గవర్నమెంటు బడులు రివర్స్లోకి వెళ్లాయి. పిల్లలు ఎదగాలంటే, ఆ కుటుంబం బాగు పడాలంటే, ఆ పిల్లవాడు బాగా చదవాలి. అందుకే ఫీజు చెల్లించాలి. మన ప్రభుత్వంలో ప్రతి మూడు నెలలకు ఫీజు రీయింబర్స్మెంట్ విద్యాదీవెన ఇచ్చాం. అందుకే ప్రతి మూడు నెలలకు రూ.700 కోట్లు, అలా ఏటా రూ.2800 కోట్లు, వసతి దీవెన కింద మరో రూ.1100 కోట్లు ఇవ్వాలి. ఇచ్చాం. కానీ, ఈ పెద్దమనిషి చంద్రబాబు గత ఏడాది రూ.3900 కోట్లకు బదులు రూ.700 కోట్లు మాత్రమే ఇచ్చాడు. ఈ ఏడాది ఏమీ ఇవ్వలేదు.దీంతో పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు.ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. మనం పక్కాగా అమలు చేశాం. ఇంకా ఆరోగ్య ఆసరా అమలు చేశాం. ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు కావాలి. రూపాయి ఇవ్వలేదు. ఆరోగ్య ఆసరా ఇవ్వడం లేదు. దీంతో పేదలు వైద్యం కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. రైతు ఈరోజు దళారుల పాలయ్యాడు. టమోటా కిలో రూ.2 కూడా రావడం లేదు. ఆర్బీకేలు నీరు గారిపోయాయి. ఉచిత పంటల బీమా లేదు. మన ప్రభుత్వ హయాంలో ఎక్కడ ప్రకృతి వైపరీత్యం జరిగినా, ప్రభుత్వ యంత్రాంగం కనిపించేది. సీజన్ ముగిసేలోగా వారిని ఆదుకునే వాళ్లం. ఇంకా మనం పెట్టుబడి సాయంగా రూ.13,500 ఇస్తే, రూ.26 వేలు ఇస్తానన్న చంద్రబాబు, వారినీ మోసం చేశాడు.అవినీతి రాజ్యమేలుతోంది..విచ్చలవిడిగా ఎక్కడ చూసినా అవినీతి యథేచ్ఛగా రాజ్యమేలుతోంది. రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వడం కోసం యూనిట్ విద్యుత్ కొనుగోలు కోసం సెకీతో రూ.2.49కి ఒప్పందం చేసుకుంటే, ఈ రోజు రూ.4.60కి ఒప్పందం చేసుకున్నారు. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ, ఊరూ పేరూ లేని ఉర్సా కంపెనీకి రూపాయికి రూ.3 వేల కోట్ల విలువైన భూమి. లులూ కంపెనీకి కూడా రూ.1500 కోట్ల విలువైన భూమి ఇచ్చారు. ఇక మద్యం. ఎక్కడ చూసినా అందుబాటు. ఊరూరా బెల్టుషాప్‌లు. ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. డోర్ డెలివరీ చేస్తున్నారు. ఉచిత ఇసుక పేరుకే. కానీ, ఎక్కువ ధరకు ఇస్తున్నారు. మనం వర్షాకాల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని 80 లక్షల టన్నులు స్టాక్ పెడితే, ఈ ప్రభుత్వం వచ్చీ రాగానే ఎక్కడికక్కడ అమ్మేసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ కంపెనీ నడపాలన్నా, ఎక్కడ ఏ మైనింగ్ చేయాలన్నా ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిందే.బాండ్ల పేరుతో కొత్త అవినీతి:ఇంత పచ్చిగా అవినీతి చేస్తూ, దాన్ని గత మన ప్రభుత్వం మీదకు నెడుతూ, అదే పనిగా తప్పుడు ఆరోపణలు. విమర్శలు చేస్తున్నారు. ఇంకా వాటికి ఎల్లో మీడియా వంత పాడుతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నాయి. కొత్తగా బాండ్ల పేరుతో అవినీతి. ఏపీ ఎండీసీలో కొత్తగా బాండ్లు జారీ చేస్తూ, అవినీతికి పాల్పడుతున్నారు. అలా కోరుకున్న వారికి గనులన్నీ ఇచ్చుకునే తంతు చేస్తున్నారు. ఇలాంటి అవినీతి వ్యవహారం ఇప్పటి వరకు చూడలేదు.మళ్లీ వచ్చేది మనమే:చూస్తుండగానే ఏడాది గడిచింది. కళ్లు మూసుకుని తెరిస్తే మూడేళ్లు గడుస్తాయి. మనం గట్టిగా నిలబడి మూడేళ్లు ఇలాగే పోరాడితే, ఆ తర్వాత వచ్చేది కచ్చితంగా మన ప్రభుత్వమే. ఇప్పుడు మిమ్మల్ని వేధిస్తున్న వారెవ్వరినీ వదిలిపెట్టబోము. మనం అధికారంలోకి వచ్చాక, వారిని చట్టం ముందు నిలబెడతాం. -
ఎమ్మెల్యేకే రూమ్ ఇవ్వరా.. నీకెంత ధైర్యంరా..?
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘ఎమ్మెల్యే మనుషులొస్తే రూములు లేవంటారా.. ఎంత ధైర్యం మీకు.. ఇకపై మీరు హోటల్ ఎలా నడుపుతారో చూస్తాం’ అంటూ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు వీరంగం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. మంగళవారం రాత్రి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తన అనుచరులతో మాట్లాడుకోవడానికి సూట్‌రూమ్ కావాలని తన ముఖ్య అనుచరుడిని నగరంలోని అలెగ్జాండర్ హోటల్‌కు పంపించారు. అయితే హోటల్ మేనేజర్ రూములు ఖాళీగా లేవని చెప్పారు. దీంతో కోపోద్రిక్తులైన ఎమ్మెల్యే అనుచరులు పరుష పదజాలంతో మేనేజర్‌పై విరుచుకుపడ్డారు. మెడపట్టి గెంటినట్టు బాధిత సిబ్బంది చెప్పారు. ఇవన్నీ సీసీ ఫుటేజీల్లో రికార్డయ్యాయి. గొడవ సమయంలో హోటల్లో ఎమ్మెల్యే అనుచరులు గంగారాం, పి.హరిక్రిష్ణ ఉన్నట్టు సీసీ ఫుటేజీల్లో తేలింది. ఆ సమయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి హోటల్ బయట కారులోనే ఉన్నారు. మేనేజర్‌ను కారులో ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్లగా.. ఎమ్మెల్యే సైతం తీవ్ర పదజాలంతో దూషించినట్టు బాధితులు చెబుతున్నారు. ‘ఎమ్మెల్యే అడిగితే సూట్‌రూం ఇవ్వవా.. నీకెంత ధైర్యంరా.. ఏమనుకుంటున్నావ్ నా గురించి’ అంటూ తిట్టడమే కాకుండా ఇకపై హోటల్ ఎలా నడుపుకుంటారో చూస్తా అంటూ బెదిరించినట్లు తెలిసింది. నాలుగేళ్ల పాటు సూట్‌రూమ్ ఫ్రీగా ఇవ్వాలని హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి.. పోలీసుల సోదాలు ముగిసిన తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఎమ్మెల్యే నుంచి ఫోన్ వెళ్లింది. దీంతో ముగ్గురు ఆ శాఖ అధికారులు హోటల్లో సోదాలకు వెళ్లారు. కిచెన్‌లో ఆహార పదార్థాలను పరిశీలించారు. చికెన్ నమూనాలను సేకరించారు. ఈ నమూనాలను ల్యాబుకు పంపిస్తున్నట్టు ఓ అధికారి పేర్కొన్నారు. ఇక.. మరుసటి రోజు అంటే బుధవారం ఉదయాన్నే మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే ఉసిగొలి్పనట్లు తెలిసింది. హోటల్ భవన నిర్మాణం అక్రమంగా ఉందని, తనిఖీలకు వెళ్లాలని ఆదేశించినట్టు సమాచారం. ఈ విషయం నగరంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గతంలో లిక్కర్ వ్యాపారి (సింధూర వైన్స్) పిట్టు రామలింగారెడ్డిపై కూడా దగ్గుపాటి ప్రసాద్ దాడికి యత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. పది నిమిషాల్లోనే పోలీసుల రైడింగ్ఈ ఘటన జరిగిన పది నిమిషాల్లోనే ఎమ్మెల్యే.. టూటౌన్ సీఐ శ్రీకాంత్ యాదవ్‌కు ఫోన్ చేసి హోటల్‌పై రైడ్ చేయాలని ఆదేశించడంతో ఒక్కసారిగా పోలీసులు హోటల్‌కు చేరుకున్నారు. ప్రతి రూము గాలించారు. చిన్న తప్పు కనిపించినా కేసు బుక్ చేయాలని శతవిధాలా యతి్నంచారు. అయితే, చివరకు ఏ లోపం కనిపించకపోవడంతో పోలీసులు ఇదే విషయాన్ని ఎమ్మెల్యేకు చెప్పారు. తొలుత హోటల్లో రైడ్ చేయలేదని చెప్పిన సీఐ శ్రీకాంత్ యాదవ్.. మళ్లీ కొద్ది సేపటికే అన్ని హోటళ్లలాగే ఇక్కడ చేశామని ‘సాక్షి’తో చెప్పడం గమనార్హం. -
భ్రమరావతి మీద పెట్టిన శ్రద్ధ కొంచం రైతులపై కూడా పెట్టండి..
-
చంద్రబాబు బాటలోనే రేవంత్.. ఇదేం రాజకీయం!
ఆర్థిక పరిస్థితులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రేవంత్ వ్యాఖ్యల్లో వాస్తవమున్నప్పటికీ ఆయన కూడా తన రాజకీయ గురువు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి బాటే పట్టారేమో అనిపిస్తుంది. ఎన్నికల ముందు ఆకాశం మీ చేతుల్లోకి తెచ్చేస్తానన్న రీతిలో హామీలివ్వడం.. తీరా అధికారం చేపట్టిన తరువాత ఖజానా చూస్తే హామీల అమలుపై భయమేస్తోందని సన్నాయి నొక్కులు నొక్కడంలో చంద్రబాబు ఆరితేరిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు రేవంత్ కూడా అదే మాదిరిగా.. అప్పులు కూడా పుట్టడం లేదని చెబుతున్నట్లు అనిపిస్తోంది.నిజానికి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇంత బహిరంగంగా మాట్లాడడం సరికాకపోవచ్చు. వాస్తవాలు చెబుతున్న కారణంగా అంతా సర్దుకు పోతారని ఆయన భావన కావచ్చు. కాని దీనివల్ల రాష్ట్రం పరపతి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకూ ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా మాట్లాడి ఉండకపోవచ్చు. తెలుగు రాష్ట్రాలకు అప్పులు నిజంగానే పుట్టడం లేదా అంటే ఆంధ్రప్రదేశ్‌లో పదకుండు నెలల్లోనే రూ.1.5లక్షల కోట్ల అప్పు చేస్తే, తెలంగాణలో రూ.1.58 లక్షల కోట్ల అప్పు చేశారు. అదనంగా అప్పులకు వెళితే ఇస్తున్నట్లు లేరు. దేనికైనా పరిమితులు ఉంటాయి. తోచినట్లు వాగ్దానాలు చేసి,అధికారంలోకి వచ్చాక ఇప్పుడు అప్పులు పుట్టడం లేదని, బ్యాంకులు తమను దొంగల్లా చూస్తున్నాయని అంటే ప్రజలు ఏమని అనుకుంటారు? తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులకు అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని, తీరు చూస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతారేమో అన్నట్లుగా పరిస్థితి దేశం ముందట ఉందని రేవంత్ అన్నారు.ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. దీనికంతటికి గత ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యుడని రేవంత్ చెప్పవచ్చు. కాని అది పరిష్కారం కాదు. సరైన జవాబు కాదు. ఎందుకంటే ఎన్నికలకు ముందే రాష్ట్ర అప్పులపై రేవంత్ కాని, ఇతర కాంగ్రెస్ నేతలు కాని అనేక విమర్శలు చేశారు. అయినా అధికారం రాబట్టుకోవడం కోసం ఎన్ని అసాధ్యమైన హామీలు ఇచ్చారో గుర్తులేదా? ఆరు గ్యారంటీలకు ఎంత ఖర్చు అవుతుందో తెలియకుండానే వాగ్దానం చేశారా? అలా చేస్తే అది బాధ్యతారాహిత్యం కాదా? అదేమంటే రేవంత్ ఇచ్చిన సమాధానం చూడండి. ప్రతి సంవత్సరం మూడు లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. మూడు లక్షల కోట్ల ఆదాయం వస్తుంది కాబట్టి ఇదెంత సంసారం. చక్కదిద్దవచ్చని అనుకున్నానని ఆయన చెప్పారు. తీరా చూస్తే మూడు లక్షల కోట్ల ఆదాయం లేదు.. రెండు లక్షల కోట్లే ఆదాయం, అప్పు ఎనిమిది లక్షల కోట్లు ఉంది అని ఆయన వివరిస్తున్నారు.సరిగ్గా చంద్రబాబు కూడా ఏపీలో ఇలాగే మాట్లాడారు. తనకు ఎన్నికల ముందు అన్నీ ఇవ్వవచ్చని అనుకున్నానని, కాని లోపలికి వెళ్లి చూస్తే ఏమీ లేదని, ఖజానా ఖాళీగా కనబడస్తా ఉందని చంద్రబాబు చెప్పారు. ఎన్నికలకు ముందు రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందని ప్రచారం చేసిన చంద్రబాబు తీరా బడ్జెట్లో రూ. ఆరున్నర లక్షల కోట్లే ఉందని అంగీకరించారు. అయినా హామీలు అమలు చేయకుండా ఎగ్గొట్టడానికి ఈ కబుర్లు చెబుతున్నారన్న సంగతి ఏపీ ప్రజలకు అర్థమైంది. అదే ధోరణిలో రేవంత్ కూడా ఎన్నికలకు ముందు వంద రోజులలో అన్ని హామీలు చేసి చూపిస్తామని, రైతులకు రూ.రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, ఎవరైనా అప్పు చేయకపోతే బ్యాంకులకు వెళ్లి అప్పు తీసుకోండని చెప్పారా? లేదా? అది బాధ్యతారాహిత్యం కాదా? ఇప్పుడేమో తాను 18 గంటలు కష్టపడుతున్నానని, ఒక్క రోజైనా, ఒక్క గంట సెలవైనా తీసుకోలేదని సానుభూతి కోసం మాట్లాడుతున్నారు. నిజానికి ఏ సీఎం అయినా 18 గంటలు పనిచేస్తున్నానని చెబితే ఆ ప్రభుత్వం పద్దతిగా లేదని అర్థం.ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి బాధ్యతలు వారికి ఉంటాయి. మిగిలినవారిని పని చేయనివ్వకుండా తానే పని చేస్తున్నానని చెప్పుకోవడానికి ఇలాంటి మాటలు పనికి వస్తాయి తప్ప జనానికి ఏమి ఉపయోగం? ఇది కూడా చంద్రబాబు తరహా మాటే.ఆయన కూడా తాను ఎంతలా కష్టపడుతున్నది పదే, పదే జనానికి చెబుతుంటారు. రేవంత్ కొత్తగా సీఎం అయి ఉండవచ్చు.ఆయన కొన్ని వాగ్దానాలు అమలు చేయడానికి ప్రయత్నం చేయకపోలేదు. అయినా అన్నిటిని అమలు చేయడం కష్టం కనుక ఈ కొత్తరాగం ఎత్తుకున్నారు. అప్పులు, వాయిదాలకే రూ.7500 కోట్లు అవుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటివారు రేవంత్‌కు మద్దతుగా మాట్లాడుతున్నా, అవి అంత కన్విన్సింగా కనిపించవు. ఏ ప్రభుత్వం ఉన్నా, రుణాలు చెల్లించవలసిందే కదా! ఒక్కసారి గతానికి వెళితే చంద్రబాబు నాయడు 1996 లోక్ సభ ఎన్నికలకు ముందు టీడీపీ అత్యధిక లోక్ సభ స్థానాలు గెలిస్తేనే కిలో రెండు రూపాయల బియ్యం, మద్య నిషేధం, మొదలైనవి కొనసాగుతాయని ప్రచారం చేశారు.ఎన్నికలు అయ్యాక మాత్రం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, మార్పులు చేయాలని, బియ్యం రేట్లు పెంచాలని, మద్య నిషేధం ఎత్తివేయాలంటూ ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ఒక తంతు సాగించారు. ప్రతి ఎన్నికకు ముందు ఇదే తతంగం ఆయన సాగిస్తుంటారు. 2014లో రైతుల రుణమాఫీ పూర్తిగా చేస్తానని, బ్యాంకులలో తనఖాలో ఉన్న రైతుల భార్యల బంగారం కూడా విడిపిస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఆయన ఏదో అరకొర చేసి చేతులెత్తేశారు. 2024లో కూడా సూపర్ సిక్స్ అంటూ మరోసారి జనాన్ని మభ్య పెట్టడానికి వెనుకాడలేదు. ఈ రకంగా గురు, శిష్యులైన తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ ఒకే బాటలో పయనించడం విశేషం.ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలు కూడా అంత సహేతుకంగా అనిపించవు. తమ డిమాండ్లు నెరవేర్చాలన్న ఉద్యోగ సంఘాలను ఉద్దేశించి ఎవరిపై మీ సమరం అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం వల్ల ఏమి ప్రయోజనం? తెలంగాణ రాష్ట్రం దివాళా తీయడానికి ఉద్యోగులు బాధ్యులు అవుతారా? లేక పాలన చేస్తున్న నేతలా?‘‘నన్ను కోసినా రూపాయి రాదు..ప్రభుత్వం అంటే నేను ఒక్కడినే కాదు..ప్రజా ప్రతినిధులు,, ప్రభుత్వ ఉద్యోగులు అంతా కలిస్తేనే ప్రభుత్వం’’ అంటూ సూత్రాలు చెబితే ఏమి లాభం. రేవంత్ ఒక్కసారి కాంగ్రెస్ మానిఫెస్టోని తిరిగి చదువుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్ని రకాల హామీలు ఇచ్చింది మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ చదివి వినిపించారు. వాటన్నిటిని ఏ బాధ్యతతో చేశారు? ఇప్పుడు వాటిని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు అడిగితే ‘‘ఎవరిపై మీ సమరం?’’ అంటే వారేమి జవాబు ఇస్తారు! ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, తదితర వాగ్దానాలు చేశారా? లేదా? రేవంత్ తాను అన్ని నిజాలే చెప్పినట్లు అనుకోవచ్చు.కాని అది చెప్పిన తీరు బాగోలేదు. ఉద్యోగ సంఘాలను పిలిపించుకుని అంతరంగికంగా చర్చలు జరిపి వారికి నచ్చ చెప్పి ఉండవచ్చు. ఫలానా సమయానికి తాను హామీలు అమలు చేయగలుగుతామని చెప్పి ఉండవచ్చు. అలా కాకుండా ఇంత బహిరంగంగా వేరే కార్యక్రమంలో ఉద్యోగులను బెదిరించే రీతిలో మాట్లాడడం వల్ల ఆయనకే నష్టం. రేవంత్ తీరువల్ల రాష్ట్ర పరువు పోయిందని బీఆర్ఎస్, బీజేపీలు తీవ్ర అభ్యంతరం చెబుతున్నాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఇతర బీజేపీ నేతలు ముఖ్యమంత్రి పై మండిపడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ తాను నిజాలే మాట్లాడుతున్నానులే అనుకుని సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఈ సీఎంకు చేతకావడం లేదని ప్రజలు అనుకునే పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్‌లో కూడా దీనిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతాయి.కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదులు వెళతాయి. కుల గణన ద్వారా తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అయిందని ప్రచారం చేసుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ దివాళా తీసిందని చెప్పడం ద్వారా దేశానికి ఏమి సంకేతం ఇచ్చినట్లయింది? అసలే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలలో రేటింగ్ తగ్గుతోందని అనుకుంటున్న తరుణంలో రేవంత్ రెడ్డే దానిని మరింత తగ్గించుకున్నట్లుగా ఉంది. ఎన్నికలకు ముందు పొలిటికల్ సైన్స్, ఎన్నికల తర్వాత ఎకనామిక్స్ చెబితే జనం నమ్ముతారా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
YSRCP పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో YS జగన్ భేటీ
-
గరం గరం వార్తలు ఫుల్ ఎపిసోడ్
-
రాజ్యాంగ ఉల్లంఘన అంతా రహస్యమే
సాక్షి, అమరావతి: అప్పులు మీద అప్పులు చేసుకుంటూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ 436 గనుల్లోని అత్యంత విలువైన ఖనిజ సంపదను ప్రైవేట్ వారికి సర్వ హక్కులతో తాకట్టు పెడుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం అందులోనూ సొంత లాభం చూసుకుంటోంది! ఎందులోనైనా సరే తన వ్యక్తిగత ప్రయోజనం ఉండాలని ఆశిస్తూ అందుకు తగ్గట్టుగా పథకాలు రచిస్తోంది. తాజాగా ఏపీఎండీసీ ద్వారా జారీ చేస్తున్న ఎన్సీడీ బాండ్ల వ్యవహారంలో ఒకపక్క దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా.. రూ.లక్షల కోట్ల విలువైన ఖనిజాలను తాకట్టు పెట్టి ఏపీఎండీసీ ద్వారా ప్రభుత్వం రూ.9 వేల కోట్ల విలువైన బాండ్లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం చట్ట విరుద్ధంగా ఏకంగా రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు హక్కులివ్వడంపై ఆర్థిక నిపుణులు నివ్వెరపోతున్నారు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వమూ ఇలా బరి తెగించి రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు హక్కులు కల్పించలేదని పేర్కొంటున్నారు. ఎడాపెడా అప్పులు చేస్తున్న కూటమి సర్కారు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో బడ్జెట్ బయట ఏపీఎండీసీ ద్వారా ఎన్సీడీ బాండ్లు జారీ చేసి నిధులను సమీకరిస్తోంది. లాభాల్లో ఉన్న ఏపీఎండీసీ భవిష్యత్తు ఆదాయాన్ని సైతం తాకట్టు పెట్టి అప్పులు చేయడం వల్ల రుణ ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అంతా రహస్యమే..ఎన్సీడీ బాండ్ల జారీకి సంబంధించి అత్యంత కీలకమైన సమాచారాన్ని ఇన్వెస్టర్లకు తెలియకుండా గుట్టుగా ఉంచి కేవలం తమవారే లాభపడేలా ప్రభుత్వం ఎత్తుగడ వేసింది. బాండ్లు కొనుగోలు చేసిన వారు నేరుగా ప్రభుత్వ సంచిత నిధి నుంచి డబ్బులు తీసుకోవడానికి అవకాశం కల్పిస్తున్న విషయాన్ని రహస్యంగా ఉంచడం ద్వారా రుణ మార్కెట్లో పోటీ లేకుండా పోతుంది. వాస్తవానికి పోటీ ఉంటే వడ్డీ తగ్గి ప్రభుత్వానికి ప్రయోజనం ఉంటుంది.అదే పోటీ లేకుండా చేస్తే ఎక్కువ వడ్డీకి బాండ్లు విక్రయించాల్సి వస్తుంది. దీనివల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతున్నప్పటికీ తాము ఎంపిక చేసిన వారికి ఎక్కువ వడ్డీకి బాండ్లు విక్రయించి, వారికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా సర్కారు వ్యవహరిస్తోంది. సెకండరీ మార్కెట్లో ఆ బాండ్లను ప్రీమియం ధరలకు విక్రయించడానికి అవకాశం ఉంటుంది. ప్రైవేట్ వ్యక్తులకు పెద్ద ఎత్తున లాభం చేకూర్చి క్విడ్‌ప్రోకో ద్వారా లబ్ధి పొందాలన్నది ప్రభుత్వ పెద్దల ప్రణాళిక.కీలక సమాచారాన్ని తొక్కిపెట్టి..దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కన్సాలిడేటెడ్ ఫండ్‌పై ప్రైవేట్ వారికి హక్కులు కల్పించడం రాజ్యాంగ ఉల్లంఘనే అని ఆర్థిక నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా సర్కారు పెడచెవిన పెడుతోంది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నా లెక్క చేయకుండా బాండ్ల జారీకి సిద్ధమైంది. ఈమేరకు బాండ్ల జారీ ప్రక్రియను ఏపీఎండీసీ గురువారం ప్రారంభించనుంది. ఇందుకోసం ఇటీవలే సెబీలోని ఇబీపీ (ఎలక్ట్రానిక్ బుక్ ప్రొవైడర్) ప్లాట్ఫామ్లో ఆన్లైన్ బిడ్డింగ్‌లో పాల్గొనాలని ఇన్వెస్టర్లను ఆహ్వానించింది. ఈ బాండ్ల జారీలో నిబంధనలు, షరతుల గురించి తెలిపే జీఐడీ (జనరల్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్), కేఐడీ (కీ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్) పత్రాలను ఆ పోర్టల్‌లో పెట్టింది. అయితే బాండ్లు కొన్న వారికి ఆర్బీఐ కన్సాలిడేటెడ్ ఫండ్‌పై హక్కులు ఉంటాయనే కీలకమైన సమాచారాన్ని ఆ డాక్యుమెంట్లలో పొందుపరచలేదు.చివరి నిమిషంలో..బుధవారం సాయంత్రం 4.30 గంటలకు మాత్రమే కన్సాలిడేటెడ్ ఫండ్‌పై హక్కుల విషయాన్ని ఈబీపీ ప్లాట్ఫామ్లో పొందుపరిచారు. అదే ఈ విషయం ముందే తెలిసి ఉంటే పెద్ద ఇన్వెస్టర్లు చాలామంది ఈ బాండ్ల కోసం పోటీ పడేవారు. ఎందుకంటే.. కన్సాలిడేటెడ్ ఫండ్ ద్వారా తాము పెట్టిన సొమ్ముకు కచ్చితమైన భరోసా ఉంటుంది కాబట్టి. ఇది ఏ ప్రభుత్వమూ ఇవ్వని బంపర్ ఆఫర్ లాంటిది. ఏ ప్రభుత్వమైనా సరే, ఎంత అప్పు చేసినా దానికోసం ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు అధికారం కల్పించదు. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అప్పులు చేయడమే ధ్యేయంగా రాజ్యాంగ విరుద్ధమైన పనులకు సిద్ధమైంది. అయితే ఆ సమాచారం ఇన్వెస్టర్లకు తెలియకుండా రహస్యంగా ఉంచి కేవలం తమకు అనుకూలమైన వారు మాత్రమే బాండ్లు కొనుగోలు చేసేలా వ్యూహం రూపొందించింది. అంటే వారు మాత్రమే బాండ్లు కొనుగోలు చేసి సెకండరీ మార్కెట్లో వాటిని ఎక్కువ వడ్డీకి అమ్ముకునే అవకాశం కల్పించింది. తద్వారా ఏపీఎండీసీ నుంచి నేరుగా బాండ్లు కొనుగోలు చేసిన ప్రభుత్వానికి సన్నిహితులైన వ్యక్తులు లాభపడతారు.సమయం ఇవ్వకుండా..నిజానికి ఈ ప్రయోజనం ప్రభుత్వానికి దక్కాలి. కానీ కుట్రపూరితంగా కన్సాలిడేటెడ్ ఫండ్ విషయాన్ని కేవలం తమ అనుయాయులకు మాత్రమే లీక్ చేసి ఇతర ఇన్వెస్టర్లకు తెలియనివ్వలేదు. దీంతో పెద్ద ఇన్వెస్టర్లు వీటిని సాధారణ బాండ్లుగానే పరిగణించి పెద్దగా ఆసక్తి చూపలేదు. అదే కన్సాలిడేటెడ్ ఫండ్ విషయం తెలిసి ఉంటే చాలామంది బిడ్డింగ్‌లో పాల్గొనేవారని నిపుణులు చెబుతున్నారు.కానీ ఇతరులు బిడ్డింగ్‌లో పాల్గొనకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న సర్కారు ఆ విషయాన్ని జీఐడీ, కేఐడీ డాక్యుమెంట్లలో కావాలనే పొందుపరచలేదు. ఏపీఎండీసీ ఎండీ జారీ చేసిన డాక్యుమెంట్లలో అత్యంత కీలకమైన ఈ విషయం గురించి వెల్లడించకపోవడం తెలిసి చేసిన తప్పిదంగానే కనిపిస్తోంది. ఆఖరి నిమిషాల్లో ఈ విషయాన్ని బయటపెట్టడంతో అర్హత ఉన్న ఇన్వెసర్లు బాండ్లు కొనేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇన్వెస్టర్లు బాండ్లు కొనాలంటే తమ ఇన్వెస్ట్మెంట్ కమిటీల నుంచి అనుమతి తీసుకోవడానికి కొద్ది రోజుల సమయం పడుతుంది. అలాంటి అవకాశం వారికి ఇవ్వకుండా చివరి నిమిషంలో అసలు విషయాన్ని బహిర్గతం చేశారు. తద్వారా ప్రభుత్వ పెద్దలు తమ అనుయాయులు మాత్రమే బాండ్లు కొనుగోలు చేసేలా కుట్ర పన్నారు. -
సామర్థ్యం పెంపుపై ప్రభుత్వోద్యోగులకు శిక్షణ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ సామర్థ్యం పెంపుదలపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గ్రామస్థాయి ఉద్యోగి నుంచి కార్యదర్శి వరకు ప్రతిఒక్కరికీ దీనిపై శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో శిక్షణతో సామర్థ్యం పెంచడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. సచివాలయంలో ప్లానింగ్, స్వర్ణాంధ్ర విజన్, జీఎస్డీపీపై సీఎం బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వచ్చే నెలకల్లా నియోజకవర్గాల విజన్ ప్లాన్.. స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యం చేరుకోవడం కోసం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి ప్రణాళికలు ఇప్పటికే సిద్ధంకాగా.. నియోజకవర్గాల వారీగా విజన్ ప్లాన్ వచ్చేనెలకల్లా రూపొందించనున్నారు. పీ–4 కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సీఎం చైర్మన్‌గా స్వర్ణాంధ్ర పీ–4 ఫౌండేషన్ ఏర్పాటుచేస్తున్నారు. మరోవైపు.. జనాభా నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకురానుంది.స్పేస్–డిఫెన్స్ ప్రాజెక్టులకు నూతన పాలసీ.!రాష్ట్రంలో అంతరిక్ష, రక్షణ రంగాలకు సంబంధించి ప్రాజెక్టులు నెలకొల్పేలా పెట్టుబడులు ఆకర్షించడంపై సీఎం చంద్రబాబు ఇస్రో మాజీ చైర్మన్, ప్రస్తుతం రాష్ట్రానికి స్పేస్ టెక్నాలజీ అడ్వయిజర్‌గా ఉన్న ఎస్.సోమనాథ్, డీఆర్డీవో మాజీ చైర్మన్, ప్రస్తుత రాష్ట్ర ఏరోస్పేస్–డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్ సలహాదారు డాక్టర్ జి.సతీష్‌రెడ్డితో చర్చించారు. స్పేస్–డిఫెన్స్ పాలసీల రూపకల్పనతో పాటు, ఈ రెండు రంగాలకు సంబంధించి రాష్ట్రానికి వచ్చే ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు పొందేలా చురుకైన పాత్ర పోషించాలని వారికి సూచించారు. -
ముంతాజ్ హోటల్‌కు రూ.వేల కోట్ల విలువైన టీటీడీ భూములు: భూమన
తిరుపతి: పవిత్రమైన అలిపిరికి సమీపంలో ముంతాజ్ హోటల్‌కు వేల కోట్ల రూపాయల విలువైన టీటీడీ భూములను కట్టబెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని మాజీ టీటీడీ చైర్మన్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు అలిపిరి సమీపంలోని టీటీడీ భూమిని ఏపీ టూరిజంకు బదలాయించేందుకు టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం నిర్వహించిందన్నారు. టీటీడీ బోర్డ్ చరిత్రలోనే ఇలా ఒకే ఎజెండా కోసం అత్యవసర సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి అన్నారు. శ్రీవారి పాదాల మంటపం అలిపిరికి సమీపంలో ముంతాజ్ హోటల్ నిర్మాణంపై సాధుపుంగవులు, హిందూ సమాజం స్పందించాలని కోరారు. ఇంకా ఆయనేమన్నారంటే...ఈ రోజు తిరుమలలో టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశంను నిర్వహించింది. భక్తుల గురించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకే ఈ అత్యవసర సమావేశం నిర్వహించారని అందరూ భావించారు. కానీ ఈ పాలకమండలి సమావేశంలో అలిపిరికి అంటే శ్రీవారి పాదాల మంటపంకు రెండున్నర కిలోమీటర్ల దూరంలో టీటీడీకి చెందిన వేల కోట్ల రూపాయల విలువైన భూమిని ఏపీ టూరిజంకు బదలాయించాలనే ఎజెండా అంశాన్ని అంగీకరిస్తూ తీర్మానం చేశారు.తిరుపతి అర్బన్ సర్వే నెంబర్ 588ఏ లో టీటీడీకి ఉన్న 24.68 ఎకరాలు, అలాగే ఇదే సర్వే నెంబర్ లో ఉన్న మరో 10.32 ఎకరాల భూమిని ఏపీ టూరిజం అథారిటీకి ఇవ్వాలని, దానికి బదులుగా ఏపీ టూరిజంకు తిరుపతి రూరల్ మండలం పేరూరులో సర్వే నెంబర్ 604 లో ఉన్న 24.68 ఎకరాలు, మరో 10.32 ఎకరాలను టీటీడీ తీసుకోవాలనే అంశంపై తీర్మానం చేశారు.గతంలో ఓబెరాయ్ సంస్థకు హోటల్ నిర్మాణం కోసం వైయస్ఆర్సీపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని, శ్రీవారి పవిత్రతకు దెబ్బతీస్తోందంటూ ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పెద్ద ఎత్తున హంగామా సృష్టించి, మాపైన బుదరచల్లారు. సాధుపుంగవులు కూడా దీనిని వ్యతిరేకించారు. ఇదే క్రమంలో చంద్రబాబు తన మనవడి పుట్టినరోజు సందర్భంగా తిరుపతికి వచ్చినప్పుడు ముంతాజ్ హోటల్‌కు ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తున్నాని, ప్రత్యామ్నాయంగా సమీపంలోనే మరో స్థలాన్ని కేటాయిస్తామని ప్రకటించారు.ఇప్పుడు శ్రీవారి అలిపిరికి సమీపంలోనే టూరిజం అథారిటీకి టీటీడీ భూములను కట్టబెట్టడం ద్వారా ముంతాజ్ హోటల్‌ను అక్కడ నిర్మించేందుకు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం అత్యవసర బోర్డ్ అత్యవసర సమావేశం నిర్వహించి తీర్మానం చేసి, వెంటనే ఈ భూబదలాయింపుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరింది. ఇదేనా శ్రీవారి పవిత్రను కాపాడే విధానం? ఆనాడు ముంతాజ్ హోటల్ ను వ్యతిరేకిస్తూ హిందూసమాజం ఆందోళనలు చేస్తే, దానిని సమర్థించిన చంద్రబాబు ఇప్పుడు అదే సంస్థకు ఏకంగా టీటీడీ స్థలానే ఎలా కేటాయిస్తున్నారు? దీనిపై హిందూ సమాజం, సాధుపుంగవులు స్పందించాలి. ఓబెరాయ్ హోటల్ కు ప్రత్యమ్నాయ స్థలాన్ని చూపించాల్సి ఉంటే, ఎయిర్ పోర్ట్ ఏరియాలో ప్రభుత్వ స్థలాలా ఖాళీగానే ఉన్నాయి. వాటిని ఇవ్వాలే తప్ప టీటీడీ స్థలంను ఎలా కట్టబెడతారు?ప్రభుత్వ తప్పిదాల మీద, అవకతవకలపై నేను పెద్ద ఎత్తున స్పందిస్తున్నాను కాబట్టే నాపైన కూటమి ప్రభుత్వం వేధింపులు ప్రారంభించింది. ఎల్లో మీడియా ద్వారా అవినీతి ఆరోపణలు చేయిస్తున్నారు. 2004లో నక్సల్స్‌తో ప్రభుత్వ చర్చల సందర్భంగా నక్సల్స్ ప్రధాన ఎజెండాలో భాగంగా రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రభుత్వానికి చెందిన చెరువులు, పోరంబోకు స్థలాలు, కుంటలను రామోజీరావు ఆక్రమించారని, వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ఆనాడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది.ఈరోజు రామోజీ కుమారుడు కిరణ్ నేతృత్వంలో నడుస్తున్న ఈనాడు పత్రిక నాపైన భూకబ్జా ఆరోపణల చేస్తుండటం విడ్డూరంగా ఉంది. నిజంగా నేను ఎక్కడైనా భూ ఆక్రమణలకు పాల్పడితే నిరూపించమని సవాల్ చేస్తున్నాను. నాలుగేళ్ల పాటు కూటమి ప్రభుత్వం నాపైన వేధింపులకు, అక్రమ కేసుల బనాయింపులకు పాల్పడుతుందని చాలా స్పష్టంగా తెలుసు. అయినా కూడా ఈ ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపడం కొనసాగిస్తూనే ఉంటాను. హైదరాబాద్ కోహినూరు హోటల్లో రాసలీలలు చేసి, ప్రభుత్వ భూములు కబ్జాలు చేయాలనుకున్న ఒక పెద్ద నేత నాపైన విచారణకు ఆదేశించారంటేనే చాలా ఆశ్చర్యం కలుగుతోంది. వీటికి భయపడేది లేదు. -
YSRCP పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో YS జగన్ భేటీ
-
చంద్రబాబులా అబద్ధాలు చెప్పలేను: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మీరంతా సమర్థులని భావించి ఈ బాధ్యతలు అప్పగించడం జరిగిందని.. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని వైఎస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులకు ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. బుధవారం ఆయన వైఎస్సార్సీపీ పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయిలో ఉన్న బూత్ కమిటీల వరకూ ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు.రీజినల్ కో-ఆర్డినేటర్లకు పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు సహాయకారులుగా ఉంటారు. రీజినల్ కో-ఆర్డినేటర్లతో అనుసంధానమై, వారికి కాళ్లు, చేతులుగా పార్లమెంటు పరిశీలకులు పనిచేస్తారు. నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌ఛార్జిలు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడగలగాలి. మీరు పరిశీలకుడిగా ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఎంతమందిని ఎమ్మెల్యేలుగా గెలిపిస్తారనేది మీకు పరీక్ష. మీ పనితీరు ఆధారంగా మీకు మంచి మంచి పదవులు వస్తాయి.. తప్పకుండా మనం అధికారంలోకి వస్తాం, అందులో ఎలాంటి సందేహం లేదు.. ఈ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు’’ అని వైఎస్ జగన్ చెప్పారు.‘‘ప్రజలకిచ్చిన హామీలను పూర్తిగా పారదర్శకంగా అమలు చేసిన మనకే ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇక అబద్ధాలు చెప్పి, మోసాలు చేసిన చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటుంది?. 2014లో కూడా చంద్రబాబు తానిచ్చిన హామీలను అమలు చేయలేదు. మనం పాదయాత్ర చేసి, ప్రజలకు భరోసా ఇచ్చాం. 2019 ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత కొట్టిచ్చినట్టు ఎన్నికల ఫలితాల్లో కనిపించింది. ప్రజావ్యతిరేకతను చీల్చడానికి చంద్రబాబు తన రాజకీయ భాగస్వామిని వేరేగా పోటీచేయించారు. అయినా చంద్రబాబు తన ఓటమిని అడ్డుకోలేకపోయారు. చంద్రబాబు రాకముందు.. మన పథకాల ద్వారా పేదల నోట్లోకి నాలుగు వేళ్లూ వెళ్లేవి. ఇప్పుడు చంద్రబాబు ప్రజలు తింటున్న కంచాన్ని లాగేశాడు’’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు.‘‘అంతేకాదు తానిచ్చిన హామీలను కూడా చంద్రబాబు అమలు చేయలేదు. రెండు రకాలుగా చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు. విద్య, వ్యవసాయం, వైద్య రంగాలు పూర్తిగా నీరు గారిపోయాయి. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. రైతులకు పెట్టుబడి సహాయంగా ఉన్న రైతు భరోసా ఎగిరిపోయింది. అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ, అదే రూపాయికి వేల కోట్ల విలువైన భూములు కట్టబెడుతున్నారు. లూలుకు రూ.1500 కోట్ల భూములు కట్టబెట్టారు. మరొకరికి రూ.3వేల కోట్ల భూములు కట్టబెట్టారు...రైతులకు ఉచితంగా విద్యుత్ అందించడానికి సెకీతో మనం రూ.2.49లకే విద్యుత్ కొనుగోలు చేశాం. కాని ఇవాళ వీళ్లు రూ.4.60లకు కొనుగోలు చేశారు. సెక్షన్ 108 ప్రకారం ఏపీఆర్సీపీమీద ఒత్తిడి తెచ్చి మరీ అమలు చేయించుకున్నారు. అవినీతి మన కంటికి కనిపిస్తోంది. మట్టి మాఫియా, ఇసుక మాఫియా, పేకాట క్లబ్బులు, బెల్టుషాపులు, ఎమ్మార్పీ ధర కన్నా లిక్కర్ ఎక్కువకు అమ్ముకుంటున్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేకు మట్టజెప్పనిదే ఏమీ కావడంలేదు. ఇవన్నీ కంటికి కనిపిస్తున్నాయి. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. ఒక్కసారి ఓటు వేశాక, ఐదేళ్లపాటు ప్రజలు వేచి చూడాలి. అందుకే ఇప్పుడేమీ చేయలేక ప్రజలు అన్నింటినీ చూస్తున్నారు..సమయం వచ్చినప్పుడు కచ్చితంగా ప్రజలు కచ్చితంగా తగిన తీర్పు ఇస్తారు. ఇప్పుడు కలియుగం పాలిటిక్స్ నడుస్తున్నాయి. కేసులకు భయపడితే రాజకీయాలు చేయలేం. చంద్రబాబు రాజకీయాలను ఒక దారుణమైన స్థాయికి తీసుకెళ్లారు. రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు ఉండకూడదని మన ప్రభుత్వంలో చాలా కష్టపడ్డాం. మన పరిపాలనలో చాలామంది నాయకులను కట్టడి చేశాం.తాడిపత్రిలో మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు టీడీపీ స్వల్ప ఆధిక్యత వచ్చింది. వైఎస్సార్సీపీకి 16, టీడీపికి 18 వచ్చాయి. కాని అప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మన పార్టీ వైపునకు ఫలితాన్ని తిప్పుదామని యత్నించారు. ఆ రోజు మన పార్టీ ఎమ్మెల్యే అయిన పెద్దారెడ్డిని గృహనిర్బంధం చేశాం. ఇప్పుడు ఏడాది కాలంగా పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అడుగుపెట్టనీయడంలేదు. కార్యకర్తల ఆస్తులను విధ్వంసం చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. చంద్రబాబు రెడ్‌బుక్ రాజ్యాంగం, కక్ష రాజకీయాలతో రాజకీయ వ్యవస్థ దారుణంగా తయారైంది’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు చూసిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. కార్యకర్తలకు కచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. పార్టీలో కష్టపడే ప్రతి ఒక్కరినీ గొప్ప స్థానంలో కూర్చోబెడతాను. ఈ సారి కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యత. చంద్రబాబులా అబద్ధాలు చెప్పలేను. ప్రజలకు హామీలు ఇస్తే కచ్చితంగా నెరవేరుస్తాను. కార్యకర్తల్లో ఇప్పటికే మంచి చైతన్యం వచ్చింది. కేడర్ ధైర్యంగా నిలబడింది. రాష్ట్రవ్యాప్తంగా నేను ఎక్కడకు వెళ్లినా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివస్తున్నారు. రాష్ట్రంలో అరాచక పాలన పట్ల వివిధ రూపాల్లో వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు పరిపాలన పట్ల తీవ్రమైన ఆగ్రహం ఉంది. రాజకీయాలతో సంబంధం లేనివారినికూడా కక్షలకు గురిచేస్తున్నారు. వచ్చే ఏడాది ప్లీనరీని నిర్వహిద్దాం. బ్రహ్మాండంగా ప్లీనరీని నిర్వహిద్దాం...బూత్ కమిటీలు పూర్తయ్చే సరికి పార్టీ నిర్మాణంలో దాదాపుగా 18 లక్షలమంది ఉంటారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదు, కనీస మద్దతు ధర అందడంలేదు. వైఎస్సార్ ప్రభుత్వం హయాంలో ప్రతి గ్రామ సచివాలయంలో కనీస మద్దతు ధరలతో జాబితాను పెట్టేవాళ్లం. ఎంఎస్పీ కన్నా తక్కువ ధర వస్తే అప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకునేది. పొగాకు విషయంలో కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం జోక్యంచేసుకునేది. ప్రైవేటు కంపెనీలతో పోటీపడి వేలంలో పాల్గొన్నాం. రైతులను ఆదుకున్నాం. అలాగే ఆయిల్‌పాం రైతులను ఆదుకున్నాం. తెలంగాణతో సమాన స్థాయిలో ధర వచ్చేలా చూశాం. ఎలాంటి విపత్తులు వచ్చినా రైతులను ముందుగా ఆదుకునే వాళ్లం...ధాన్యానానికి ఎంఎస్పీ ఇవ్వడమే కాదు, ఎంఎస్పీకి అదనంగా జీఎల్టీ కూడా ఇచ్చాం. వ్యవసాయరంగంపై ఇంత ఫోకస్ పెట్టిన ప్రభుత్వం మనదైతే, ఏ ఫోకస్ పెట్టని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. పంటలకు నష్టం వస్తే సీజన్ మగిసేలోగా వారికి ఇన్పుట్ సబ్పిడీ ఇచ్చేవాళ్లం. మళ్లీ సీజన్‌లోగా పరిహారిం ఇచ్చేవాళ్లం. క్రమంగా ప్పతకుండా ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్లం. ఇప్పుడు ఏమీ లేవు. క్రమం తప్పకుండా ఐదేళ్లపాటు మనం రైతులకు పెట్టుబడి సహాయం అందించేవాళ్లం’’ అని వైఎస్ జగన్ గుర్తు చేశారు. -
ఇది స్కీమ్ కాదు స్కాం కుట్టు మిషన్ల పేరుతో 240 కోట్ల కొట్టేసారు
-
‘కూటమి’ కోసం నియామకాలు!
సాక్షి, అమరావతి: పేదరికాన్ని నిర్మూలిస్తానంటూ పీ–4 కార్యక్రమంతో ముందుకొచ్చిన కూటమి ప్రభుత్వం.. ఆ పేరుతో తమ వారికి మంచి జీతాలతో ఉపాధి కల్పించేందుకు మాత్రం మార్గం వెతుక్కుంది. ప్రజలు, పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలనకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉగాది రోజున శ్రీకారం చుట్టారు. ధనికులు, ప్రైవేట్ సంస్థలు ముందుకు వచ్చి పేద కుటుంబాలను ఆరి్థకంగా పైకి తీసుకురావడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కేవలం సహాయకారిగా వ్యవహరిస్తుంది తప్ప రూపాయి నిధులు ఇవ్వదు.అయితే ఈ ముసుగులో కూటమి పార్టీకు చెందిన వారికి భారీ ఎత్తున ఉపాధి కల్పించేందుకు వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి నెలకు రూ.60 వేల వేతనంతో ఒక పీ–4 సమన్వయకర్త నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ లెక్కన 175 నియోజకవర్గాలకు ఏటా రూ.12.60 కోట్లు వారికి వేతనాల రూపంలో చెల్లించడం అంటే పార్టీ వారికి ఉపాధి కల్పించడమేనని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.ప్రభుత్వ ఉద్యోగులు ఆ పని చేయలేరా?ఇంతకూ పీ–4 సమన్వయ కర్తలు చేయాల్సిన పని ఏమిటంటే నియోజకవర్గ కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి.. దాతృత్వ వ్యక్తులు, ప్రైవేటు రంగ సంస్థలను ఒప్పించి సమన్వయం చేస్తూ పౌర సమాజానికి మేలు చేయడం. వాస్తవానికి ఈ పని చేసేందుకు గ్రామ, వార్డు స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఉండనే ఉన్నారు. అయినప్పటికీ పీ–4 సమన్వయకర్తల నియామకం అంటే ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి.. సొంత వారికి ఉపాధి కల్పించడమే అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్టు విధానంలో కాకుండా రెగ్యులర్ నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన పని లేదంటున్నారు. తద్వారా ఇది ముమ్మాటికీ ప్రజాధనం దుర్వినియోగమేననే అభిప్రాయాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.పేదరిక నిర్మూలన అంటే పేద పిల్లలను చదివించేలా ప్రోత్సహించాలని, ఇందుకు తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర సూపర్ సిక్స్ పథకాలను ప్రభుత్వం అమలు చేయాలని చెబుతున్నారు. అలా కాకుండా ఊరికొకరిని ఎన్నుకుని వారికి సాయపడితే పేదరికం ఎలా పోతుందని ప్రశి్నస్తున్నారు. పేదరిక నిర్మూలన బాధ్యతలను ప్రైవేట్‌కు అప్పగించిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేవని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జన్మభూమి పేరుతో, ఇప్పుడు పీ–4 పేరుతో ప్రభుత్వ సొమ్మును కార్యకర్తలకు దోచిపెట్టడమే బాబు విధానమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కన్సల్టెంట్ల పేరుతో దుర్వినియోగం ⇒ ఎన్నికల్లో సామాన్య నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, లేదంటే నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన హామీని విస్మరించి ఇప్పుడు భారీగా కూటమి పార్టీలకు చెందిన వారికి లేదా కన్సల్టెన్సీ పేరుతో కార్పొరేట్ సంస్థలకు భారీగా ఉపాధి కల్పిస్తున్నారనే అభిప్రాయాన్ని ఉద్యోగ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, కన్సల్టెన్సీల రాజ్యం మళ్లీ అమల్లోకి వచ్చిందంటున్నారు. ⇒ వికసిత్ ఆంధ్రా విజన్ పేరుతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీలో 71 పోస్టులను కన్సల్టెంట్ల రూపంలో నియమించేందుకు పరిపాలన అనుమతి మంజూరు చేసింది. మరో పక్క రాష్ట్ర ఆదాయం పెంచేందుకు 11 మంది కన్సల్టెంట్లను 8 నెలల కోసం రూ.3.28 కోట్ల చెల్లింపుతో నియమించింది. ⇒ సీఆర్డీఏలో ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్లు, అమరావతి ఆరి్థకాభివృద్ధిలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి కన్సల్టెంట్లను నియమిస్తోంది. ఇందుకోసం ఏకంగా ఒక్కో కన్సల్టెంట్‌కు నెలకు రూ.రెండు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు చెల్లిస్తోంది. 68 మంది కన్సల్టెంట్లకు రెండేళ్లలో రూ.70.64 కోట్లు చెల్లించనుంది. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణ పనుల పర్యవేక్షణ కోసం మరో కన్సల్టెన్సీ ఏజెన్సీని నియమిస్తోంది. ఇందుకోసం రెండేళ్లలో రూ.22.58 కోట్లు చెల్లించనుంది. -
Varudu Kalyani: కూటమి సర్కార్ ప్రతి పథకంలో స్కామ్ చేస్తోంది
-
‘అవినీతే సిగ్గుపడేలా..కూటమి ప్రభుత్వం అవినీతి’
తాడేపల్లి : అవినీతే సిగ్గుపడేలా కూటమి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని వైఎస్సార్ సీపీ మహిళా అధ్యక్షరాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా, వారిని కూటమి ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. ఇప్పుడు కొత్తగా కుట్టు మిషన్ల స్కాం చేస్తున్నారన్నారు.‘అన్ని వర్గాల మహిళలను మోసం చేస్తున్నారు. అప్పుల్లోనే కాదు, అవినీతిలోనూ రికార్డు సృష్టించారు. బాబు ష్యూరిటీ, అవినీతి గ్యారెంటీగా మారిపోయింది. NDA అంటే నారా దోపిడీ అలియెన్సుగా మారిందిమహిళ మంత్రిగా ఉన్న శాఖలో అవినీతి జరగటం దారుణం. కొద్దిరోజులుగా ఈ కుంభకోణంపై ఆరోపణలు వస్తుంటే ప్రభుత్వం ఎందుకు నోరు మెదపటం లేదు? , జగన్ హయాంలో ఇళ్ల పట్టాల దగ్గర్నుంచి అనేక పథకాలను మహిళల కోసం తెచ్చారు.కాపు మహిళల కోసం జగన్ కాపునేస్తం తెచ్చారు. చంద్రబాబు కాపు మహిళలకు ఏం చేశారు? , ఇసుక, మట్టి, మద్యం, అమరావతి నిర్మాణాలు, ఉర్సా భూములు ఇలా ప్రతిదానిలోనూ స్కాం చేస్తున్నారు. కుట్టుమిషన్ల స్కీంని కమీషన్ల స్కాంగా మార్చారు. రూ.7,300 వేలు ఖర్చయ్యే దానికి రూ. 23 వేలు ఖర్చు ఎందుకు పెడుతున్నారు?, రూ.157 కోట్లు దోచుకునేందుకు ప్లాన్ చేశారు.మొబలైజేషన్ అడ్వాన్సులు కూడా ఇచ్చి అవినీతికి రెడీ చేశారు. L1 కి ఐదు శాతం వర్కు ఇచ్చి L2, L3 కాంట్రాక్టరుకి 95% వర్కు ఇవ్వటం వెనుకే కుట్ర ఉంది.దానిపై ఏసీబి కేసు నమోదు చేసి, విచారణ జరపాలి. వెంటనే టెండర్ ని రద్దు చేయాలి. లేకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటుంది. దీనిపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం’ వరుదు కళ్యాణి హెచ్చరించారు. -
అప్పుల్లో చంద్రబాబు ప్రభుత్వం రికార్డు
-
అనంతపురం ఎస్పీ కార్యాలయం దగ్గర హైడ్రామా
-
అప్పుల్లో చంద్రబాబు సర్కార్ రికార్డు
అమరావతి: అప్పుల్లో చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోంది. మరో రూ.7 వేల కోట్లు ప్రభుత్వం అప్పు చేసింది. ఒకే రోజు రూ.7 వేల కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. రిజర్వ్ బ్యాంకులో సెక్యూరిటీల వేలం ద్వారా సమీకరించింది. గత నెలలో రూ.5,750 కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం.. ఆర్థిక సంవత్సరం రెండో నెలలోనూ భారీగా అప్పు చేసింది.మళ్లీ రూ.7 వేల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు సర్కార్.. ఇప్పటివరకు లక్షా 59 వేల కోట్లు అప్పు చేసింది. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వం.. హామీలు అమలు చేయకుండానే భారీ అప్పులు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు.. ఇప్పుడు అప్పులు చేయడంలో రికార్డు సృష్టిస్తున్నారు.ఏడాది కాలంలోనే రికార్డు స్థాయిలో అప్పులు చేయడం చూస్తే చంద్రబాబు ‘సంపద సృష్టి’ భలేగా ఉంది అంటూ జనాలు నవ్వుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఆదాయం తిరోగమనంలో ఉందని కాగ్ తేల్చేసింది. ఒకవైపు రెవెన్యూ రాబడి తగ్గిపోతుండగా.. మరోవైపు అప్పులు భారీగా పెరిగిపోతున్నాయని స్పష్టంచేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు బడ్జెట్ రాబడులు, వ్యయాలకు సంబంధించిన గణాంకాలను కాగ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
చంద్రబాబుకు మాజీ ఎంపీ మార్గాని భరత్ ఓపెన్ ఛాలెంజ్
-
కరెంట్ ఛార్జీలు పెంచబోమని.. అధికారంలోకి వచ్చాక పెంచారు: దేవినేని
-
చంద్రబాబుకు మాజీ ఎంపీ మార్గాని భరత్ సవాల్
సాక్షి, తూర్పుగోదావరి: విద్యుత్ ఒప్పందాలపై చర్చకు సిద్ధమా? అంటూ చంద్రబాబుకు వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ సవాల్ విసిరారు. ‘‘విద్యుత్ ఒప్పందాల్లో రూ.11 వేల కోట్ల స్కాం జరిగింది. ఎక్కువ ధరలకు విద్యుత్ ఒప్పందాలు ఎలా చేసుకుంటారు?. చంద్రబాబు బినామీలకు వాటాలు వెళ్లాయి. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపడం అన్యాయం కాదా?’’ అంటూ మార్గాని భరత్ ప్రశ్నించారు.మంగళవారం.. మార్గాని భరత్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో యూనిట్ రెండు రూపాయల 49 పైసలకు ఏడు వేల మెగా వాట్లు రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం అతి తక్కువ ధర కొనుగోలు చేయడం ఒక రికార్డు. మార్కెట్లో విద్యుత్ తక్కువగా దొరుకుతున్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేయటం చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న అతిపెద్ద కుంభకోణమేనన్నారు. చంద్రబాబును ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టాలని మార్గాని భరత్ డిమాండ్ చేశారు.‘‘ఈ ఒప్పందంతో సంవత్సరానికి రూ. 400 కోట్ల రూపాయలు అధిక భారం రాష్ట్ర ప్రజలపై పడుతుంది. కనీసం ప్రజలు ఏమన్నా అనుకుంటారేమోనన్న ఆలోచన కూడా చంద్రబాబు లేకపోవడం దారుణం. ఇప్పటివరకు బషీర్ బాగ్ ఘటన ఎవరు మర్చిపోలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరగబడే రోజు త్వరలోనే వస్తుంది. ఓ వైపు సింహాచలంలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో గోడ కూలిపోయింది. పేక మేడలాంటి నిర్మాణాలతో ప్రభుత్వం అమాయకులను బలి చేస్తుంది. టీటీడీలో గోవులు చనిపోతున్నాయి. తిరుమలలో వైకుంఠ ఏకాదశి టికెట్లు కోసం భక్తులు ప్రాణం కోల్పోయారు. ప్రభుత్వ తప్పులు మీద తప్పులు చేస్తుంది’’ అని మార్గాని భరత్ మండిపడ్డారు.విద్యులు తగ్గించకపోతే వైఎస్ జగన్ పిలుపుతో రాష్ట్ర ప్రజలంతా ఉద్యమిస్తారు. సింహాచలం ఘటనలో మంత్రులకు బాధ్యత లేదా?. పర్యవేక్షణ అంటే ఏసీ రూములో కూర్చుని కాఫీలు తాగడమా?’’ అంటూ మార్గాని భరత్ మండిపడ్డారు. -
Amarnath: 60 అడుగుల గోడకే దిక్కులేదు అమరావతి కడతాడంట!
-
నాడు జగన్‌పై విష ప్రచారాలు.. నేడు అవినీతి ఒప్పందాలు
-
కూటమిపై తిరుగుబాటు మొదలైంది: దేవినేని అవినాష్
సాక్షి, విజయవాడ: విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. కరెంట్ చార్జీలు పెంచమని చెప్పిన కూటమి సంవత్సర కాలంలోనే 15వేల కోట్లు భారం వేశారని.. 200 కరెంటు బిల్లు వచ్చిన వాళ్లకు బిల్లు మోత మోగిస్తున్నాయని దేవినేని అవినాష్ మండిపడ్డారు.‘‘కరెంట్ చార్జీలు తగ్గించపోగా భారీగా పెంచారు. పెరిగిన కరెంట్ ఛార్జీలత్ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కూటమి పాలనలో సంక్షేమం లేదు.. అభివృద్ధి లేదు. జగన్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి బాగా నడిచిందని ప్రజలు అంటున్నారు. కరెంట్ ఛార్జీలు పెంచం అని కూటమి నేతలు బాండ్లు ఇచ్చి ఓట్లు అడిగారు. నాడు బాండ్లు ఇచ్చిన ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ప్రజల్లో తిరగగలరా?. సంక్షేమం, అభివృద్ధి చేయకుండా అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఎస్సి, ఎస్టీలకు ఇచ్చిన ఉచిత విద్యుత్‌ని కూడా తొలగించారు’’ అని దేవినేని అవినాష్ ధ్వజమెత్తారు.అధికారులు.. ప్రతిపక్ష పార్టీల నేతలు అర్జీలు ఇస్తామన్న తీసుకోవడానికి భయపడుతున్నారు.. మేము ప్రజల తరపున పోరాటం చేస్తున్నాం. వైఎస్సార్సీపీ నేతలను చూస్తే అధికారులకు భయం వేస్తోంది. ప్రజలను అన్యాయం చేసిన ప్రతి అధికారిపై చర్యలు తీసుకొంటాం. విద్యుత్ చార్జీల తగ్గింపు, ఎస్సీ. ఎస్టీలకు ఉచిత విద్యుత్, సంక్షేమ పథకాల అమలు కోసం పోరాటం చేస్తాం. వర్షాల్లో దెబ్బ తిన్న రైతులకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయడం లేదు. కనీసం గోని సంచులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది’’ అని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. -
సింహాచలం ప్రమాద బాధితులకు పరిహారంలో చంద్రబాబు వక్రబుద్ధి
-
ఆర్ధిక పరిస్థితిపై మరోసారి చేతులెత్తేసిన తెలంగాణ సర్కార్
-
Garam Garam Varthalu: గరం గరం వార్తలు ఫుల్ ఎపిసోడ్..
-
సింహాచలం ఘటన: బాబూ.. ఇదేం వక్రబుద్ధి.. భక్తుల ఆగ్రహం
సాక్షి, విశాఖపట్నం: సింహాచలం ప్రమాద బాధితులకు పరిహారంలోనూ సీఎం చంద్రబాబు తన వక్ర బుద్ధిని చాటుకున్నారు. బాధితులకు పరిహారం సింహాచలం దేవస్థానం నుంచి చెల్లించారను. చనిపోయిన ఒక్కొక్కరికి 25 లక్షలు, గాయపడిన వారికి మూడు లక్షల పరిహారం అందించగా, మొత్తంగా కోటి 78 లక్షల రూపాయలు దేవస్థానం నుంచి చెల్లింపు చేశారు. ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.దేవాలయ అభివృద్ధికి వినియోగించాల్సిన నిధులను బాధితులకు ఇవ్వడంపై భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిహార విషయంలో ప్రభుత్వానికి బాధ్యత లేదా అంటూ భక్తులు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వాల్సిన పరిహారాన్ని సింహాచలం దేవస్థానం నుంచి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, సింహాచలం ఘటనపై తూతూ మంత్రంగా చర్యలు చేపట్టారు. చివరికి సింహాచలం ప్రమాదంపై ఉద్యోగులే బలయ్యారు. కూటమి ప్రజా ప్రతినిధులందరూ సేఫ్‌గా బయటపడ్డారు.ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు, కూటమి ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోని ప్రభుత్వం.. ఈవో సహా మరో ఆరుగురు ఇంజనీరింగ్ సిబ్బందిపై వేటు వేయడానికి నిర్ణియించింది. ఇంజనీరింగ్ సిబ్బందిలో కాంట్రాక్ట్ ఉద్యోగిపైన చర్యలకు సిద్ధమైంది. కాంట్రాక్టర్‌పై క్రిమినల్ చర్యలు కోవడానికి కూటమి సర్కార్ సిద్ధమైంది. కూటమి నాయకులను తప్పించి అధికారులను బలి పశువుల చేశారనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టే కమిటీ నివేదిక ఇచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
మద్యం కేసులో కేశినేని చిన్ని దంపతులను విచారించాలి
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం నమోదు చేసిన మద్యం కుంభకోణం కేసులో విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఆయన భార్య జానకీలక్ష్మిపై సత్వరం విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) సీఎం చంద్రబాబును కోరారు. ఈ కేసులో సిట్ అరెస్టు చేసిన రాజ్ కేసిరెడ్డి వ్యాపార సంస్థల్లో కేశినేని చిన్ని దంపతులు భాగస్వాములని ఆయన పేర్కొన్నారు.ఈ మేరకు చంద్రబాబుకు సోమవారం రాసిన లేఖను ‘ఎక్స్’లో పోస్టు చేశారు. రాజ్ కేసిరెడ్డికి చెందిన ‘ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీ’లో కేశినేని చిన్ని దంపతులు వాటాదారులని ఆయన తెలిపారు. ఇషన్వీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రైడే ఇన్ఫ్రా ఎల్ఎల్పీ హైదరాబాద్‌లోని ఒకే చిరునామాతో (జూబ్లీ హిల్స్, సర్వే నంబర్ 403, ప్లాట్ నంబర్ 9)తో రిజిస్టర్ కావడంతోపాటు ఆ రెండు కంపెనీలు ఒకే మెయిల్ ఐడీ (accounts@ wshanviinfraprojects.com)నే ఉపయోగిస్తుండటం గమనార్హమని చెప్పారు. కేశినేని చిన్ని హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్, విదేశీ కంపెనీల ద్వారా భారీగా నల్లధనాన్ని విదేశాలకు తరలించి భారీ పెట్టుబడులు పెట్టారన్నారు. దుబాయ్, అమెరికాలో అక్రమ పెట్టుబడులు కేశినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్, కేశినేని గ్లోబల్ ఎంటర్‌ప్రైజస్ కంపెనీలు దుబాయ్, అమెరికాలో అక్రమంగా పెట్టుబడులు పెట్టినట్టు కేశినేని నాని తెలిపారు. ఈ కంపెనీలు భారీఎత్తున నిధులను అక్రమంగా విదేశాలకు తరలించి మనీలాండరింగ్‌కు పాల్పడ్డాయన్నారు. రాజ్ కేసిరెడ్డి, ఆయన సహచరుడు దిలీప్ కంపెనీల్లో ఎంపీ కేశినేని చిన్ని, ఆయన భార్య జానకీలక్ష్మి భాగస్వాములుగా ఉన్నారని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్, హవాలా, మూడో పార్టీ ఒప్పందాల పేరుతో భారీగా అక్రమ నిధులు విదేశాలకు తరలించారని తెలిపారు. తక్షణం కేశినేని చిన్ని దంపతులపై విచారణ చేపట్టి రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరిస్తుందనే విషయాన్ని నిరూపించుకోవాలన్నారు. కేశినేని చిన్ని విదేశాలకు అక్రమంగా నిధులు తరలించేందుకు ఉపయోగించిన కంపెనీల పేర్లను కేశినేని నాని ఆ లేఖలో పేర్కొన్నారు. -
యాక్సిస్ పవర్.. దేశ విద్యుత్ రంగ చరిత్రలోనే కనీవినీ ఎరుగని స్కామ్
సాక్షి, అమరావతి: యాక్సిస్ పవర్‌తో కూటమి ప్రభుత్వం ఒప్పందం వెనుక భారీ అవినీతి ఉందని మాజీ చీఫ్ విప్, వైఎస్సార్సీపీ సీనియర్ నేత గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. యూనిట్ రూ.4.60 చొప్పున కొనుగోలుతో ప్రజలపై పెనుభారం పడనుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ విద్యుత్తు రంగ చరిత్రలోనే ఇది కనీవినీ ఎరుగని స్కామ్ అని, బినామీల జేబులు నింపడానికే సీఎం చంద్రబాబు దీనికి తెగించారని అన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శ్రీకాంత్‌రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు.‘వైస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఐఎస్‌టీసీ చార్జీలు లేకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ ద్వారా యూనిట్ విద్యుత్తు రూ.2.49కు కొనుగోలుకు ఒప్పందం చేసుకుంటేనే కూటమి పారీ్టలు గగ్గోలు పెట్టాయి. ప్రభుత్వానికి వైఎస్ జగన్ రూ.1.10 లక్షల కోట్లు నష్టం చేశారంటూ చంద్రబాబు, ఆయన వర్గం దారుణమైన అబద్ధపు ప్రచారం చేశారు. మరి యాక్సిస్ పవర్ నుంచి యూనిట్ రూ.4.60కు కొనుగోలుకు ప్రస్తుత ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. ఈ అడ్డగోలు ఒప్పందం ద్వారా మరో భారీ కుంభకోణానికి ప్రణాళికలు రచించింది.పైగా 25 ఏళ్ల పాటు ఈ ధర తగ్గించడానికి వీల్లేకుండా సీలింగ్ షరతు విధించి కాంట్రాక్టర్ల ఆదాయానికి రాజమార్గం చూపింది. యూనిట్ మీద రూ.2.11 అధికంగా చెల్లించి కొనడం, ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలిని సెక్షన్ 108 పేరుతో బెదిరించి మరీ ఒప్పందాన్ని ఆమోదించుకోవడం చూస్తుంటే ఎంత భారీ అవినీతికి తెగించారో తెలుస్తోంది’ అని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు పాలనంతా చీకట్లే ‘గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో ఎప్పుడూ లో ఓల్టేజీ సమస్యలతో రైతులు అల్లాడేవారు. పంపిణీ సంస్థలను దివాలా తీయించారు. వైఎస్సార్ సీఎం అయ్యాక విద్యుత్తు రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. పగటి పూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందించి వ్యవసాయాన్ని పండుగ చేశారు. మళ్లీ 2014లో బాబు సీఎం అయ్యాక తప్పుడు ఒప్పందాలతో దోపిడీకి తెరతీశారు. ఉమ్మడి ఏపీ విడిపోయేనాటికి రూ.29 వేల కోట్ల విద్యుత్తు బకాయిలు ఉండగా, 2019లో దిగిపోయే నాటికి అవి రూ.86,300 కోట్లకు చేర్చారు. సీఏజీఆర్ (కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్) 24 శాతం పెరిగింది. 2019లో వైఎస్ జగన్ సీఎం అయ్యాక కరోనా సంక్షోభంలోనూ సీఏజీఆర్ రేషియో 7.2 శాతమే నమోదైంది’ అని శ్రీకాంత్‌రెడ్డి వివరించారు. వైఎస్ జగన్ 2019–24 మధ్య డిస్కంలకు రూ.47,800 కోట్లు చెల్లిస్తే, 2014–19 నడుమ టీడీపీ సర్కారు రూ.13,255.76 కోట్లు మాత్రమే చెల్లించిందని, రైతులకు ఉచిత విద్యుత్తు బకాయిలు రూ.8,845 కోట్లు ఎగ్గొట్టిందని, వాటిని కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించిందని తెలిపారు. 2014 వరకు 11 పీపీఏలు (పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు) మాత్రమే ఉంటే, 2014–19 మధ్య చంద్రబాబు 39 సోలార్ పీపీఏలు చేసుకున్నారని, అన్నీ 25 ఏళ్ల కాల పరిమితితో, మూడేళ్లకోసారి ధరలు పెంచేలా ఒప్పందం కుదుర్చుని ప్రజల నెత్తిన అప్పు మోపారని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. 2014 వరకు 91 విండ్ పీపీఏలు జరిగితే చంద్రబాబు ఐదేళ్ల పాలనలో 133 ఒప్పందాలు జరిగాయి. ఇవన్నీ యూనిట్ రూ.4.84 కనీస చార్జితో చేసుకున్నవే అని చెప్పారు. -
రైతులపై కూటమి నిర్లక్ష్యం YS జగన్ ఆగ్రహం
-
పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుపై ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన కామెంట్స్
-
‘కాస్ట్ లీ కరెంట్’ ఒప్పందం: ‘ప్రజలపై రూ. 15 వేల కోట్లు భారం వేస్తారా?’
విజయవాడ: యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో కూటమి సర్కారు ఇప్పుడు యూనిట్ ఏకంగా రూ.4.60 చొప్పున కొనుగోలుకు సిద్ధం కావడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వం రూ. 2.49 పైసలకే యూనిట్ ను కొనుగోలు చేస్తేనే విషం కక్కిన కూటమి పెద్దలు.. ఇప్పుడు ఏకండా రూ. 4.60 పైసలకు ఎలా ఒప్పందం చేసుకుంటారని ప్రశ్న వినిపిస్తోంది. ఈ ఒప్పందాన్ని ఏపీ ప్రభుత్వం వెంటనే రద్దు చేసుకోవాలని సీపీఎం డిమాండ్ చేస్తోంది.దీనిపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘2018లో తిరస్కరించిన ఒప్పందాన్ని తిరిగి తీసుకుని రావడం దారుణం. రాష్ట్ర ప్రజలపై రూ.15 వేల కోట్లు భారం మోపి, యాక్సిస్ కంపెనీకి కట్టబెట్టడానికి టిడిపి కూటమి ప్రభుత్వం చేయించిన ఈ ఒప్పందం ఎంత మాత్రమూ అనుమతించం. రాష్ట్ర ప్రజలపై పాతికేళ్ళపాటు రూ.15 వేల కోట్లు భారం వేసే ఈ ఒప్పందాన్ని విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (ఏపిఈఆర్సి) ఆమోదముద్ర వేయడం అన్యాయం. దేశంలోని అనేక రాష్ట్రాల్లో యూనిట్ రూ.2 లు, 2.50లకి ఒప్పందాలు జరుగుతున్నాయి.గతంలో అదానీ సంస్థతో సెకీ ద్వారా సోలార్ విద్యుత్ యూనిట్ రూ.2.49లు ఒప్పందం చేసుకోగా అది అధిక రేటు అని తెలుగుదేశంతో సహా అన్నిపక్షాలు విమర్శించాయి. నేడు దానికంటే రూ.2.10లు అధికంగా చేసే ఒప్పందాలు చేసుకోవడం దారుణం. దీన్ని వెంటనే రద్దు చేసుకోవాలి’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.సంపద సృష్టి అన్న బాబు.. ఇప్పుడు దోచుకుంటున్నారు‘యాక్సిస్’ తో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ మండిపడింది. సంపద సృష్టిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇప్పుడు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని వైఎస్సార్సీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ‘కూటమి పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం. మేం సెకీతో ఒప్పందం చేసుకుంటే గగ్గోలు పెట్టారు. వైఎస్ జగన్ ప్రభుత్వం రూ. 2.49పైసలకు ఒప్పందం చేసుకుంది. దీనిపై విషం కక్కారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రూ. 4.60 పైసలకు ఒప్పందం చేసుకుంది. ఇవి ఎల్లో మీడియాకు కనబడటం లేదా?, అని ప్రశ్నించారు.‘యాక్సిస్’తో అడ్డగోలు ఒప్పందం.. ప్రజలకు పాతికేళ్ల 'షాక్' -
వైఎస్ జగన్ వెళ్లిన చోటుకి వేలాది మంది ప్రజలు తరలివస్తున్నారు: అమర్నాథ్
-
పట్టాభిపురం పిఎస్ లో సీమరాజు, కిర్రాక్ ఆర్పీపై ఫిర్యాదు
-
‘60 అడుగుల గోడకే దిక్కులేదు.. అమరావతి కడతారా?’
సాక్షి, అనకాపల్లి: కూటమి పాలన రాక్షస పాలనను తలపిస్తోందని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. ఏపీని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని ఆరోపించారు. టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. అలాగే, చంద్రబాబు పాపాలకు భక్తులు శిక్ష అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అనకాపల్లి జిల్లాలో సోమవారం వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, బుడి ముత్యాల నాయుడు, ధర్మశ్రీ, పెట్ల ఉమా శంకర్ గణేష్, వరుదు కళ్యాణి, కంబాల జోగులు, అదీప్ రాజు, కన్నబాబు రాజు, మలసాల భరత్, శోభ హైమవతి, మాజీ ఎంపీ సత్యవతి, బొడ్డెడ ప్రసాద్, కేకే రాజు, పార్టీ నేతలు హాజరయ్యారు.👉ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళుగా వైఎస్ జగన్ పరిపాలన చేశారు. చంద్రబాబు మోసపూరిత హామీలతో వైఎస్సార్సీపీ ఓడిపోయింది. కూటమి పాలనలో ప్రజలకు ఏం మేలు జరిగిందో ఒకసారి ఆలోచించాలి. 11 నెలల పాలనలో ప్రజలకు చేసింది శూన్యం. 11 నెలల్లో లక్ష 50 వేల కోట్లు అప్పు చేశారు. ఇంత అప్పు చేసిన చరిత్ర గతంలో ఎన్నడూ లేదు.అప్పు చేసిన లక్ష 50 వేల కోట్లు ఏం చేశారో చెప్పాలి.కూటమి పాలనలో ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు. భర్త చనిపోతేనే కొత్త పెన్షన్ భార్యకు ఇవ్వాలని జీవో ఇచ్చారు. వైఎస్ జగన్ పాలనలో అర్హులకు పెన్షన్ లు అందజేశారు. మళ్ళీ పెళ్లి అన్నట్లు అమరావతికి పున: ప్రారంభం చేశారు. అమరావతికి లక్ష కోట్లు తెచ్చుకోవాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబుకు లేదా?. విశాఖ నూతన రైల్వే జోన్ ఏమైంది?. రైల్వే భవనాలు ఎందుకు నిర్మించలేదు. మూడు టీవీలు మూడు పేపర్లతో పబ్బం గడుపుతున్నారు. 99 పైసలకు ఎకరా భూమి ఇస్తున్నారు. రాష్ట్రాన్ని ఏం చేయాలని చూస్తున్నారు. సింహాచలం కొండ మీద మరణాలు సంభవించాయి. నాయకుల ప్రచార పిచ్చితో ఏడుగురు భక్తులు మరణించారు. సింహాచలంలో మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే.👉మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. టీడీపీ ఓడిపోయిన తరువాత నాలుగేళ్ల పాటు టీడీపీ కార్యకర్తలు, నాయకులు బయటకు రాలేదు. ఆరు నెలలకే వైఎస్సార్సీపీ కార్యకర్తలు ధైర్యంగా రోడ్డు మీదకు వస్తున్నారు. వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వేలాది మంది ప్రజలు తరలి వస్తున్నారు. రానున్న రోజుల్లో జగనన్న 2.0 పాలన వస్తుంది. కార్యకర్తలకు అండగా వైఎస్ జగన్ ఉంటారు. 60 అడుగుల గోడ కట్టలేని వ్యక్తి అమరావతి కడతానని మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఎప్పుడూ అధికారంలోకి వచ్చిన భక్తులు చనిపోతున్నారు. చంద్రబాబు పాపాలకు భక్తులు శిక్ష అనుభవిస్తున్నారు.👉ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ..‘వైఎస్ జగన్ రామరాజ్య పాలన అందించారు. కూటమి రాక్షస పాలనను తలపిస్తుంది. ఏపీని అప్పుల ఆంధ్ర ప్రదేశ్‌గా మార్చివేశారు. ప్రతీ కార్యకర్తకు వైఎస్ జగన్ అండగా ఉంటారు.👉కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. అమర్నాథ్కు అనకాపల్లి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం సంతోషం. కష్టపడిన కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు ఉంటుంది. పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలి. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రతి నాయకుడు కృషి చేయాలి.👉మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక తప్పుడు కేసులు పెడుతుంది. వాటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కుంటున్నాము. ప్రభుత్వంపై వ్యతిరేకత మూడు నెలలకే బయట పడింది. టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు..👉కన్నబాబు రాజు మాట్లాడుతూ.. కూటమిలో గొడవలు అప్పుడే మొదలయ్యాయి. 2026లో కూటమిలో చీలిక ఏర్పడుతుంది. చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎన్నడూ అమలు చేయరు. రానున్న రోజుల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుంది.👉బుడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ..‘పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరగదు. వైఎస్ జగన్ నాయకులకు కార్యకర్తలకు న్యాయం చేస్తారు. రాష్ట్రంలో మరోసారి వైఎస్సార్సీపీ అధికారంలోకి రాబోతుంది. ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేసే రోజు దగ్గరలోనే ఉంది అని అన్నారు. -
Usha Sri : చేసిన తప్పులు కప్పిపుచ్చడానికి ఈ తప్పుడు కేసులు
-
వృద్ధులు,వికలాంగుల పెన్షనర్లపై టీడీపీ నేతలు కక్ష
-
పవన్ మర్చిపోవచ్చు.. మోదీ కూడా యూటర్న్!
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత దేశ ప్రధానిగా ఎన్నికైన తొలి నాళ్లలో అందరికీ నరేంద్ర మోదీ అంటే బాగా గౌరవం ఉండేది. కానీ, కాలం గడిచే కొద్ది ఆయనలో రాజనీతిజ్ఞుడు బదులు ఫక్తు రాజకీయవేత్త కనిపిస్తున్నారు. సొంత అవసరాలకోసం అవకాశవాద రాజకీయాలు చేసే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ప్రధాని మోదీకి పెద్ద తేడా లేదేమో అన్న అభిప్రాయం కలిగేలా వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తుంది.అమరావతి పనుల పునః ప్రారంభానికి మోదీ ఏపీకి వచ్చిన సందర్భంలో జరిగిన సభ, ఆయనతోపాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌ల స్పీచ్ గమనిస్తే, ప్రజలను మభ్య పెట్టడానికి ఒకరికొకరు పోటీ పడినట్లు కనిపిస్తుంది. దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ ఒక విధంగా తండ్రి పాత్రలో ఉన్నట్లు లెక్క. కుటుంబంలోని పిల్లలు ఎవరైనా తప్పుడు మార్గంలో ఉంటే తండ్రి ఏ రకంగా మందలిస్తారో, అదే రీతిలో మోదీ కూడా రాష్ట్రాలలో జరుగుతున్న తప్పులను ఎత్తిచూపి అలా చేయవద్దని చెప్పాలి. కానీ, దురదృష్టవశాత్తు, అందుకు విరుద్దంగా ఆయన కూడా అల్లరిచేసే పిల్లాడిని గారాబం చేసినట్లు వ్యవహరిస్తున్నారన్న సందేహం వస్తుంది.ఏపీలో ఇప్పటికే పలుమార్లు శంకుస్థాపనలు జరిగిన అమరావతిలో.. అందులోనూ తానే గతంలో ఒకసారి శంకుస్థాపన చేసిన ప్రదేశానికి మళ్లీ వచ్చి అదేమీ తప్పు కాదన్నట్లు ఉపన్యసించి వెళ్లారు. దేశంలో కొత్తగా వచ్చిన రాష్ట్రాలలో ఏర్పడిన రాజధానులలో అవసరమైన భవనాల నిర్మాణాలకు ఎంత ఖర్చు అయింది మోదీకి తెలిసే ఉండాలి. ఎన్ని వేల ఎకరాల భూమి ఆ రాష్ట్రాలు సేకరించాయన్న సమాచారం ఆయన వద్ద ఉండి ఉండాలి. ఏపీ తప్ప మిగిలిన కొత్త రాష్ట్రాలలో లక్ష ఎకరాల భూమి సమీకరించలేదు. ఆ రాష్ట్రాలలో నేతలు తామే నగరాలు నిర్మిస్తామని చెప్పి, రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చలేదు. కానీ ఏపీలో మాత్రం తొలుత ఏభైమూడువేల ఎకరాలు సిద్దం చేసుకుని, తిరిగి ఇంకో 44వేల ఎకరాలు తీసుకుంటామని చెబుతుంటే మోదీ వారించనవసరం లేదా?.అసలు ఇంత భూమి తీసుకుని ఏమి చేస్తారు?. మూడు పంటలు పండే పచ్చటి పొలాలను ఎందుకు ఈ స్థాయిలో తీసుకుంటున్నారు? అని అడగాలా?లేదా?. తెలంగాణలో 400 ఎకరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏవో అభివృద్ది పనులు చేపట్టాలని తలపెడితే, పర్యావరణం దెబ్బతినిపోయిందని గగ్గోలు పెట్టిన ఆయన లక్ష ఎకరాలలో పర్యావరణ విధ్వంసానికి ఎందుకు పాల్పడుతున్నారని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కదా?. అలా చేయకపోగా తగుదునమ్మా అంటూ ఆ పర్యావరణ విధ్వంసంలో తాను కూడా భాగస్వామి అవడం మోదీ ప్రత్యేకత అనుకోవాలి. ఇదే అమరావతికి సంబంధించి 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబును ఏ స్థాయిలో మోదీ విమర్శించారో గుర్తు చేసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అవినీతి కోసమే పధకాలను తయారు చేస్తున్నారని, రాజధాని నుంచి అన్నిటా అవినీతి రాజ్యమేలుతోందని చంద్రబాబుపై ధ్వజమెత్తిన మోదీ, ఇప్పుడు చంద్రబాబు గొప్ప పని చేస్తున్నారని మెచ్చుకోవడం అవకాశవాదం అవ్వదా?.అమరావతి ఏపీకి ఒక శక్తి అవుతుందని అన్నారు. నిజంగా అలా జరిగితే ఎవరూ కాదనరు. కానీ, అదెలా సాధ్యం?. అందుకోసం అయ్యే లక్షల కోట్ల వ్యయం ఎక్కడ నుంచి వస్తుందో మోదీ చెప్పాలి కదా!. ఏపీ ప్రభుత్వం సుమారు లక్ష కోట్ల పనులు చేపడుతోందని మంత్రి నారాయణ ప్రకటించారు. గతంలో 33వేల ఎకరాల భూమిలో మౌలిక సదుపాయాల కల్పనకు లక్షాతొమ్మిదివేల కోట్ల రూపాయలు అవసరం అని కేంద్రాన్ని చంద్రబాబు కోరారు. ఆ లేఖను మోదీ సర్కార్ చెత్తబుట్టలో పడేసినట్లుగా పక్కనబెట్టేసి కేవలం 2500 కోట్ల రూపాయలు మాత్రం మంజూరు చేసింది. తాజాగా 2024 ఎన్నికలలో మళ్లీ స్నేహం కుదిరింది కనుక మోదీ, చంద్రబాబు ఒకరినొకరు పొగుడుకుంటూ జనాన్ని పిచ్చోళ్లను చేస్తున్నారు. చంద్రబాబును యూటర్న్ బాబు అని, పోలవరం, అమరావతిలను ఏటీఎంల మాదిరి వాడుకుంటున్నారని గతంలో ధ్వజమెత్తిన మోదీ.. ఇప్పుడు పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేయడంలో చంద్రబాబుకు అనుభవం ఉందని అంటున్నారు. మోడీ కూడా యూటర్న్ తీసుకున్నట్లే కదా!.ప్రస్తుతం లక్ష కోట్లు వ్యయం చేస్తామని చెబుతున్న ఏపీ ప్రభుత్వానికి ఆ మొత్తం కేంద్రం నుంచి వచ్చే అవకాశమే లేదు. అదంతా రుణమే. అంటే అమరావతిని అప్పుల చిప్పగా మార్చుతున్నారన్నమాట. అమరావతి సభలో ఒక్క నయాపైసా కూడా కొత్తగా ఇస్తున్నట్లు మోదీ చెప్పలేదు. ఇదంతా అయ్యే పని కాదని, లక్షల కోట్ల అప్పు భారం ఏపీ ప్రజలపై పడుతుందని తెలిసి కూడా మోదీ మాట మాత్రం కూడా హెచ్చరించకపోవడం దారుణంగా ఉంటుంది. ఇప్పటికే ఒక సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు ఉన్నాయి కదా!. మళ్లీ ఆ స్థాయిలో నిర్మాణాలు చేపట్టవలసిన అవసరం ఏమిటి అని ప్రధాని హోదాలో ప్రశ్నించలేదు.అంతేకాదు.. కేవలం రెండువేల మంది పనిచేసే సచివాలయానికి ఏభై, నలభై అంతస్తుల టవర్లు దేనికి అని అడగలేదు. ఏపీలో కూటమి నేతలు కోరగానే వాటికి మరోసారి శంకుస్థాపన చేసేశారు. దీనిపై సోషల్ మీడియాలో చెల్లి పెళ్లి మళ్లీ మళ్లీ జరగాలన్న పిచ్చి కవిత్వాన్ని ప్రస్తావిస్తూ ఎద్దేవ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున కూడా చిన్న, చిన్న రోడ్ల విస్తరణ పనులకు ప్రధాని శంకుస్థాపనలు చేసి అవేదో చాలా పెద్ద పనులు అన్నట్లుగా పిక్చర్ ఇచ్చే ప్రయత్నం జరిగినట్లు అనిపిస్తుంది. మండుటెండలో లక్షల సంఖ్యలో జనాన్ని బలవంతంగా అధికార యంత్రాంగం ద్వారా తరలించి వందల కోట్లు ఖర్చు చేయడం మినహా ఏమీ ప్రయోజనం జరిగిందన్నది ప్రశ్నగా ఉంది.సూపర్ సిక్స్ హామీల అమలులో ప్రజలను మోసం చేస్తున్న నేపధ్యంలో కూటమి ప్రభుత్వంపై ప్రజలలో పెరుగుతున్న నిరసనను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా ఈ సభను ఏర్పాటు చేసినట్లు అనిపిస్తుంది. బీజేపీ కూడా కూటమిలో భాగస్వామి కనుక ప్రధాని కూడా ఒక పాత్ర పోషించారనుకోవాలి. చంద్రబాబు తన ప్రసంగంలో మోదీని ఆకాశానికి ఎత్తివేశారు. ఒకప్పుడు మోదీ అంత అవినీతిపరుడు లేడన్న నోటితోనే, మోదీ ప్రపంచంలోనే పవర్ పుల్ నేత అని, 2047 నాటికి వికసిత్ భారత్ ఆయన వల్లే సాధ్యమని చెబుతున్నారు. 2047 నాడికి మోదీకి 96 ఏళ్లు వస్తాయి. అప్పటి వరకు ఆయనే దేశానికి సారధ్యం వహించడం సాధ్యమేనా అని ఎవరు అడుగుతారు!. మరో పదిహేనేళ్లు చంద్రబాబే సీఎంగా ఉండాలని పవన్ కళ్యాణ్ పొగిడినట్లే ఇది కూడా ఉంది. మోడీ ఒకటి, రెండు అంశాలలో చంద్రబాబును పొగిడినా, మరీ అతి చేయలేదు.కానీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు మాత్రం హద్దులు లేకుండా పొగిడారు. ఒకరకంగా నమో సంకీర్తన చేశారనిపిస్తుంది. పోనీ ఇంతగా పొగిడితే పొగిడారులే.. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, ఇతర హామీల విషయంలో మోదీకి ఏమైనా విజ్ఞప్తి చేస్తారేమోలే అని ఆశించినవారికి మాత్రం ఆశాభంగమే ఎదురైంది. అమరావతికి లక్ష కోట్ల అప్పు చేస్తున్నాం.. ఇందులో మీరు ఇంత శాతం భరించండి .. అని అడగలేదు. ప్రత్యేక హోదా ఊసే లేదు. అసలు ఈ నేతలెవ్వరూ లక్ష కోట్ల అప్పు చేస్తున్న విషయాన్నే ప్రజలకు చెప్పకుండా దాటవేయడంలోనే కుట్ర ఉందనిపిస్తుంది. ఒకపక్క భారీ ఎత్తున పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ, లక్షల కోట్లను కేవలం 30 గ్రామాలలో వ్యయం చేస్తూ ఆర్ధిక విధ్వంసానికి పాల్పడుతున్న చంద్రబాబు.. గత జగన్ ప్రభుత్వం విధ్వంసం చేసిందని విమర్శించారు.చంద్రబాబు ప్రభుత్వం 2014 టర్మ్‌లో నిర్మించిన అసెంబ్లీ, సచివాలయం తదితర నీరు కారే భవనాలను ఏమైనా జగన్ ప్రభుత్వం విధ్వంసం చేసిందా?. ఉన్నవాటిని వాడుకుందాం.. విశాఖ కార్యనిర్వాహణ రాజధాని అయితే పదివేల కోట్లతో గ్రోత్ ఇంజన్ అవుతుంది అని జగన్ చెబితే విధ్వంసం అని తప్పుడు ప్రచారం చేశారు. అప్పట్లో అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ నగరం అని ప్రచారం చేసిన చంద్రబాబు ఈ సభలో ఆ మాట ఎందుకు అనలేకపోయారు. ఖర్చుకు అవసరమైన నిధులు ఎలా సేకరిస్తున్నది, దాని భారం ప్రజలపై ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలను వివరించలేకపోయారు. పైగా మూడేళ్లలో లక్ష కోట్ల పనులు పూర్తి చేస్తామని అనడం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. దానికి ఎంతో యంత్రాంగం అవసరం అవుతుంది. ఏ ప్రభుత్వం అయినా ఏడాదికి ఒక ప్రాజెక్టుకు ఐదువేల నుంచి పదివేల కోట్లు వ్యయం చేయగలిగితే గొప్ప. కానీ, ఏడాదికి 33 వేల కోట్ల చొప్పున ఖర్చు చేయడం అంటే అందులో మతలబు ఉన్నట్లే అవుతుంది. ఆయా పనుల రేట్లు డబుల్ చేసి కాంట్రాక్టర్లకు మేలు చేస్తారేమో తెలియదు.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో రాజధానిపై ఏ విమర్శలు చేసింది మర్చిపోయి మాట్లాడారు. పనిలో పని చంద్రబాబును గొప్పగా పొగిడి మార్కులు తెచ్చుకున్నారు. లోకేష్ అయితే విభజన తర్వాత హైదరాబాద్ నుంచి తరిమేశారని చెప్పి నవ్వులపాలయ్యారు. ఓటుకు నోటు కేసులో పట్టుబడి రాత్రికి రాత్రి చంద్రబాబు విజయవాడ వెళ్లిపోయిన సంగతిని అంతా గుర్తు చేసుకుంటున్నారు. విశేషం ఏమిటంటే బాబు, లోకేష్, పవన్‌లు పహల్గామ్ ఉగ్రదాడిని ప్రస్తావించి తన నాయకత్వం గురించి విశేషంగా పొగిడినా, మోదీ మాత్రం ఆ ప్రస్తావనే తేలేదు.అలాగే జగన్ ప్రభుత్వాన్ని వారు విమర్శించినా, మోదీ మాత్రం అందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఏతావాతా చెప్పవచ్చేదేమిటంటే, అమరావతి పనుల పునఃప్రారంభ సభ నిర్వహణకు, పబ్లిసిటీకి వందల కోట్లు ఖర్చు అయినా, ఆ మందం అయినా ఏపీ ప్రజలకు మేలు జరగలేదన్న భావనే కలుగుతుంది. కాకపోతే, పవన్‌కు మోదీ నుంచి ఒక చాక్లెట్ లభించింది. ఆయనకు అదే మంచి లడ్డూ అనుకోవాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో చంద్రబాబు సర్కారు అడ్డగోలు ఒప్పందం... అత్యధిక ధరకు 400 మెగావాట్ల విద్యుత్ కొనడానికి అంగీకారం
-
సింహాచలం ఘటనలో సీఎం చంద్రబాబు నాన్చుడు ధోరణి
-
అత్యంత ఖరీదైన విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్న కూటమి ప్రభుత్వం
-
ఎందుకీ కాలయాపన?
సాక్షి, అమరావతి : ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఏడుగురు భక్తులు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోతే ముఖ్యమంత్రి మంత్రి స్థానంలో ఉన్న వారెవరైనా అందుకు బాధ్యత వహిస్తారు. తక్షణమే తప్పు ఒప్పుకుని, దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తారు. అయితే ఘనత వహించిన విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం తాను అందుకు భిన్నం అని చాటుకుంటున్నారు. తనకు కానీ, తన మంత్రి వర్గ కమిటీకి కానీ ఏమాత్రం బాధ్యత లేదని నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. సింహాచలంలో చందనోత్సవం రోజున గోడ కూలి ఏడుగురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతే చంద్రబాబులో ఇసుమంత అయినా బాధ లేదు.. బాధ్యత అంతకంటే లేదని స్పష్టమవుతోంది.ఎందుకంటే ఘటన జరిగి ఐదు రోజులైనా జరిగిన తప్పిదాన్ని ప్రభుత్వ తప్పిదంగా ఒప్పుకోడానికి ఆయనకు మనసు ఒప్పడం లేదు. పైగా నాన్చుడు ధోరణి అవలంబిస్తూ తనకు కావాల్సిన వారిని కాపాడేందుకు విచారణ పేరుతో సరికొత్త డ్రామాకు తెరలేపారు. చందనోత్సవం సందర్భంగా ముందుగానే నలుగురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసినప్పుడు.. ఈ ఘటనకు ముమ్మాటికీ ఆ మంత్రులనే బాధ్యులుగా చేయాలి. దేవదాయ శాఖలో ముఖ్య అధికారులకు కూడా ఇందులో బాధ్యత ఉంటుందని చెప్పాలి. ఇది వెనువెంటనే జరగాల్సిన పని.అలా చేస్తేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. నిన్నటికి నిన్న గోవాలోని ఓ గుడిలో ఇదే తరహా ఘటన చోటుచేసుకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందించిందో దేశం మొత్తం చూసింది. కనీసం అది చూసి అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నిజాయితీగా వ్యవహరించక పోవడం రాష్ట్ర ప్రజల దురదృష్టమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సింహాచలంలో ఈవో సెలవుపై వెళ్లారంటే ఇక అక్కడ ఏం జరిగినా ప్రభుత్వానికి బాధ్యత ఉండదా? మరో సమర్థవంతమైన అధికారి ఎవరూ లేరా? ఇలాంటి సమయంలో మరింత కట్టుదిట్టంగా వ్యవహరించే యంత్రాంగం లేదా? లేక ఆ యంత్రాంగాన్ని పని చేయనీయక పోవడం వల్ల ఈ ఘటన జరిగిందా? ప్రభుత్వ ముఖ్యుల ఇష్టారాజ్యం వల్లే ఈ ఘటన జరిగిందని స్పష్టమవుతోంది. వీళ్లంతా ఇన్నాళ్లు ఏం చేశారు?ఆలయ ధర్మకర్తగా కొనసాగుతున్న అశోక్‌గజపతిరాజు, దేవదాయ శాఖ ముఖ్య అధికారి ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వారు కావడం వల్లే విచారణ పేరుతో కూటమి సర్కారు కాలయాపన చేస్తోందన్న విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. ఉత్సవాల ఏర్పాట్లపై నలుగురు మంత్రులతో ఏర్పడిన కమిటీ రెండు నెలలుగా అక్కడ జరుగుతున్న పనులను దగ్గరుండి పర్యవేక్షించింది. ఆక్కడ గోడ అవసరమనే విషయాన్ని ముందుగా ఎందుకు గుర్తించలేదు? తీరా చందనోత్సవానికి ముందు హడావుడిగా నాలుగు రోజుల్లో అంత భారీ గోడ నిర్మించారంటే దాని నాణ్యత సంగతి ప్రత్యేకించి చెప్పాలా? గోడ పక్కనే లక్షలాది మంది భక్తులు నడిచి వెళ్లేందుకు క్యూలైన్ ఏర్పాటు చేయడంలో మంత్రుల కమిటీ, అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆ అధికారి అతి జోక్యం వల్లే సెలవుపై ఈవో!సింహాచలం ఆలయ ఈవో కీలక చందనోత్సవాలకు మూడు నెలల ముందు వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళ్లడానికి దేవదాయ శాఖ ముఖ్య అధికారి అతి జోక్యమే కారణమని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆలయ రోజు వారీ కార్యకలాపాల్లోనూ ఆ అధికారి అతిగా కల్పించుకునేవారని తెలుస్తోంది. ప్రస్తుతం దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్–2గా పని చేస్తున్న రామచంద్రమోహన్ కమిషనర్‌గా పూర్తి స్థాయి అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్నారు. దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలోని అధికారులు.. పెద్ద ఆలయాల ఈవోలుగా కొనసాగుతున్న జాయింట్ కమిషనర్ స్థాయి అధికారుల మధ్య ఏళ్ల తరబడి ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి ఉంది.రామచంద్రమోహన్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది మరింత ముదిరినట్టు ఆ శాఖ ఉద్యోగ వర్గాల్లో చర్చ సాగుతోంది. జాయింట్ కమిషనర్ స్థాయి అధికారి ఈవోగా కొనసాగే పెద్ద ఆలయాలు ఏడు వరకు ఉండగా, ఆ ఆలయాల్లో రెండింటికే దేవదాయ శాఖకు సంబంధించిన జాయింట్ కమిషనర్ స్థాయి అధికారులు ఉన్నారు. మిగిలిన ఆలయాలకు రెవెన్యూ శాఖ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన డిప్యూటీ కలెక్టరు స్థాయి అధికారులు ఈవోలుగా కొనసాగుతున్నారు. అయితే కొన్ని నెలలుగా దేవదాయ శాఖ పరిధిలోని పెద్ద ఆలయాల్లో అక్కడి ఈవో రోజువారీ నిర్వహించాల్సిన కార్యక్రమాల్లోనూ కమిషనర్ కార్యాలయ ముఖ్య అధికారే ఎక్కువగా జోక్యం చేసుకుంటుండడంతోపాటు ఆలయాల్లో పనిచేసే తన అనుచర సిబ్బంది ద్వారా నేరుగా నిర్ణయాలు తీసుకుంటున్నారని.. అందువల్లే కొందరు అధికారులు అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే సింహాచలం ఈవో మూడు నెలల క్రితం సెలవుపై వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజమండ్రి ఆర్జేసీగా కొనసాగుతున్న సుబ్బారావును సింహాచల ఆలయ ఇన్చార్జి ఈవోగా ప్రభుత్వం నియమించింది. కీలక చందనోత్సవ సమయంలోనూ పూర్తిస్థాయి ఈవోను నియమించలేకపోయింది. ఈ పరిణామాలన్నీ సింహాచలం దుర్ఘటనకు పరోక్షంగా కారణమయ్యాయనే చర్చ సాగుతోంది.గోదావరి పుష్కరాల ఘటనలోనూ విచారణకే పరిమితం 2015లో గోదావరి పుష్కరాల సందర్భంగా తొక్కిసలాట జరిగి 29 మంది మరణించినా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం విచారణకే పరిమితమైంది. ఘటన జరిగిన రెండు నెలల తర్వాత తాపీగా విచారణకు ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. నాటి ఘటనకు కారకులు ఎవరన్న దానిని నిర్ధారించకుండానే విచారణను ముగించింది. గోవాలో తొక్కిసలాట ఘటనపై తక్షణ చర్యలు గోవా రాష్ట్రం షిర్గావ్లోని శ్రీలైరాయ్ దేవి ఆలయంలో రెండు రోజుల క్రితం తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించడంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అప్పటికప్పుడే స్పందించింది. ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు ఐదుగురు సీనియర్ అధికారులపై బదిలీ వేటు వేసింది. సమగ్ర విచారణకు ఆదేశించింది. అన్ని ఆలయాల్లో పరిస్థితిపై సమీక్షించింది. అయితే మన రాష్ట్రంలో మాత్రం సర్కారు విచారణల పేరుతో కాలయాపన చేస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మొన్న తిరుపతిలో, నేడు సింహాచలంలో భక్తులు ప్రాణాలు కోల్పోయారన్నది నిర్వివాదాంశం. -
‘యాక్సిస్’తో అడ్డగోలు ఒప్పందం.. ప్రజలకు పాతికేళ్ల 'షాక్'
సాక్షి, అమరావతి: వ్యవసాయ విద్యుత్తు అవసరాలకు దాదాపు 30 ఏళ్ల పాటు ఢోకా లేకుండా రైతులకు పగటి పూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందించేలా కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’తో ఏడువేల మెగావాట్ల విద్యుత్తు ఒప్పందాన్ని కారుచౌకగా యూనిట్ రూ.2.49కే అందించేలా కుదుర్చుకోవడం ద్వారా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.లక్ష కోట్లకుపైగా ఆదా చేశారు. దీన్ని అభినందించాల్సింది పోయి.. కుంభకోణంగా వర్ణించిన కూటమి సర్కారు ఇప్పుడు యూనిట్ ఏకంగా రూ.4.60 చొప్పున కొనుగోలుకు సిద్ధమైంది. తద్వారా దేశ విద్యుత్తు రంగ చరిత్రలోనే కనీవిని ఎరుగని స్కామ్‌కు తెర తీసింది! ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలిని సెక్షన్ 108 పేరుతో బెదిరించి మరీ ఈ ఒప్పందానికి ఆమోద ముద్ర వేయించుకోవడం, ఇలా బరి తెగించి భారీ ధరకు కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడం ఎన్నడూ చూడలేదని విద్యుత్తు రంగ నిపుణులు, అధికారులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్తు ఒప్పందాల్లో దీన్ని అతిపెద్ద స్కామ్‌గా అభివర్ణిస్తున్నారు. గత ప్రభుత్వం అత్యంత చౌకగా, ఐఎస్టీఎస్ చార్జీలు లేకుండా కేంద్ర సంస్థ సెకీ నుంచి సోలార్ కొనుగోలు ఒప్పందాన్ని చేసుకుంటే బురద జల్లి దేశమంతా రాద్దాంతం చేసిన కూటమి సర్కారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సెకీతో చేసుకున్న ఒప్పందం సహేతుకమేనని ఇప్పటికే విద్యుత్తు నియంత్రణ మండలి నిర్థారించిందని, తద్వారా పెద్ద ఎత్తున ప్రజాధనం ఆదా అయిందని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్తు ఒప్పందాల్లో నిజానిజాలను ఒకసారి పరిశీలిద్దాం.. ఏడాదిగా హామీల అమలు ఊసు లేకుండా.. టీడీపీ కూటమి సర్కారు ఏడాది పాలన పూర్తి కావస్తోంది. ఈ తరుణంలో కనీసం ఇప్పుడైనా ఓ అమ్మ ఒడి, అన్నదాతా సుఖీభవ గురించో.. సూపర్ సిక్స్ హామీల అమలుపై సీఎం చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేస్తారని రాష్ట్ర ప్రజలంతా ఆశగా ఎదురు చూస్తుంటే మరో పిడుగు పడింది! ఇప్పటికే రూ.15 వేల కోట్లకుపైగా బిల్లుల బాదుడుతో చుక్కలు చూపిస్తుండగా ఈసారి అడ్డగోలు విద్యుత్తు ఒప్పందాలతో బాదేశారు! 25 ఏళ్ల పాటు ప్రజలను పీల్చి పిప్పి చేసే ఖరీదైన విద్యుత్తు ఒప్పందానికి పచ్చ జెండా ఊపారు. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా గతంలో ఏపీఈఆర్సీ తిరస్కరించిన ఈ అడ్డగోలు ఒప్పందాన్ని మెడపై కత్తి పెట్టి ఆమోదించుకోవడం ద్వారా సర్కారు లాలూచీ వ్యవహారాలు మరోసారి నిరూపితమయ్యాయని, ఇదో పెద్ద కుంభకోణమని విద్యుత్తు రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు సోలార్, రాత్రి పూట అంతా పవన విద్యుత్తు అందుబాటులో ఉంటుందని.. ఎప్పుడో కొద్ది రోజులు డిమాండ్ ఉంటుందంటూ ఆ పేరుతో యూనిట్ రూ.4.60 చొప్పున పాతికేళ్ల పాటు చెల్లించేందుకు సిద్ధం కావటాన్ని తప్పుబడుతున్నారు. పీక్ అవర్స్‌లో డిమాండ్ 3 – 4 గంటలు మాత్రమే ఉంటుందని.. అలాంటప్పుడు అన్ని గంటలకూ ఒకే ధర చెల్లించడం ఏమిటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఆలస్యం ఉచిత ఇసుక పేరుతో పచ్చముఠాల దోపిడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వర్షాకాల అవసరాల కోసం గత ప్రభుత్వం నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకను టీడీపీ నేతలు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఇక నూతన మద్యం విధానం పేరుతో టీడీపీ నేతలు సిండికేట్‌గా మారి పోలీసుల అండతో దౌర్జన్యంగా షాపులు దక్కించుకున్నారు. ఊరూరా బెల్టు షాపులు ఏర్పాటు చేసుకుని విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రభుత్వ పెద్దల అండతో గనుల యజమానులను బెదిరిస్తూ కప్పం వసూలు చేస్తున్నారు. ఇక రాజధాని అమరావతి పనుల్లో టెండర్లలో ముఖ్యనేతలు అంచనాలను ఎడాపెడా పెంచేశారు. ఐకానిక్ టవర్లు పేరుతో అవినీతికి గేట్లు తెరిచారు. అంచనాలు పెంచేసి కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సుల ముసుగులో పనుల విలువలో పది శాతం చెల్లించి తిరిగి 8 శాతం కమీషన్ల రూపంలో వసూలు చేసుకుంటున్నారు. విశాఖలో లూలూకు భూ పందేరంతోపాటు రూ.3,000 కోట్ల అత్యంత ఖరీదైన భూమిని ఊరూ పేరు లేని అనామక సంస్థ ఉర్సాకు ఎకరం 99 పైసలకే కేటాయిస్తూ క్యాబినెట్లో ఆమోద ముద్ర వేయించారు. గత 11 నెలలుగా ఇలా విచ్చలవిడి అవినీతి వ్యవహారాలతో చంద్రబాబు సర్కారు ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘మేం వస్తే విద్యుత్తు చార్జీలను పెంచం.. ఇంకా తగ్గిస్తాం..! గత ప్రభుత్వం విద్యుత్తు రంగాన్ని నాశనం చేసింది. ఐదేళ్లలో రూ.1.29 లక్షల కోట్లకుపైగా నష్టం జరిగింది..’’ అంటూ ఎన్నికల ముందు, ఆ తరువాత శ్వేతపత్రంలో విమర్శలు చేసిన సీఎం చంద్రబాబు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. పాతికేళ్ల పిడుగు.. యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) దాఖలు చేసిన పిటిషన్‌ను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) శనివారం ఆమోదించింది. యాక్సిస్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (పవన–సౌర హైబ్రీడ్) 400 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను స్థాపించి వాటి నుంచి ఏపీఎస్పీడీసీఎల్ పాతికేళ్ల పాటు యూనిట్ కు రూ.4.60 చొప్పున చెల్లించి కొనుగోలు చేసేందుకు అంగీకారం తెలిపింది. 25 ఏళ్ల పాటు ఈ ధర తగ్గించటానికి వీల్లేకుండా ఒప్పందంలో ‘సీలింగ్’ షరతు విధించడం గమనార్హం. అంటే భవిష్యత్తులో పవన, సౌర విద్యుత్తు రేట్లు తగ్గినా ఒప్పందంలో చెప్పిన ధర తగ్గించకుండా మెలిక పెట్టారు. ఒకపక్క మార్కెట్లో సగానికిపైగా తక్కువ ధరకు దొరుకున్నప్పటికీ రెట్టింపు ధర ఇచ్చి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడంపై అంతా విస్తుపోతున్నారు. ఎక్కువ ధరకు ఎందుకు కొనాలి? డిస్కమ్‌ల పిటిషన్‌పై కర్నూలులో ఇటీవల జరిగిన బహిరంగ విచారణలో నేరుగా, ఆన్లైన్ ద్వారా వివిధ వర్గాల ప్రజలు, పలు పార్టీలకు చెందిన నాయకులు పాల్గొని యాక్సిస్‌తో ఒప్పందాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అధిక ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేయడం వల్ల అంతిమంగా ఆ భారం ప్రజలపైనే ట్రూఅప్ చార్జీల రూపంలో వేస్తున్నారని.. ఇప్పటికే రూ.15,485 కోట్లు భారం మోపి వసూలు చేస్తున్నారని ఈ విచారణలో వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా మార్కెట్లో ఇప్పుడు పునరుత్పాదక విద్యుత్ తక్కువ ధరకే లభిస్తున్నందున యాక్సిస్ నుంచి అంత రేటు పెట్టి విద్యుత్ కొనాల్సిన అవసరం లేదంటూ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ వారి వాదనలను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. తాననుకున్నదే చేసింది. యాక్సిస్ నుంచి విద్యుత్ కొనుగోలుకు అనుమతిస్తూ ఏపీఈఆర్సీ జారీ చేసిన ఆదేశాలు మంచి చేస్తే అభినందించాల్సింది పోయి..గాడి తప్పిన విద్యుత్ రంగాన్ని అభివృద్ధి పథం పట్టించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టింది. వ్యవసాయానికి ఉచితంగా, వివిధ వర్గాలకు రాయితీతో విద్యుత్ అందించింది. డిస్కంలకు 2019–24 మధ్య ఏకంగా రూ.47,800.92 కోట్లను అందించింది. 2014–19 వరకు టీడీపీ సర్కారు రూ.13,255.76 కోట్లు మాత్రమే చెల్లించడం గమనార్హం. రైతులకు ఉచిత విద్యుత్ బకాయిలు రూ.8,845 కోట్లు ఇవ్వకుండా ఎగవేసింది. వాటిని కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించింది. 2019–2023 మధ్య గత ప్రభుత్వం రెండు లక్షలకు పైగా అగ్రికల్చరల్ డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేసింది. ఇప్పుడేమంటావు కరపత్రమా ? కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’తో గత వైఎస్ జగన్ ప్రభుత్వం అతి తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే ఈనాడు అడ్డగోలుగా రాసిన అసత్య కథనాలు గతంలో చంద్రబాబు పాలనలో 3.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయగా వైఎస్ జగన్ ప్రభుత్వం సుమారు 5 లక్షల వ్యవసాయ పంపుసెట్లు మంజూరు చేసింది. రాష్ట్రంలో 6,663 ఫీడర్లను 9 గంటలు వ్యవసాయానికి పగటి పూట విద్యుత్ సరఫరా చేసేలా రూ.1,700 కోట్లతో వాటి సామరŠాధ్యన్ని వైఎస్ జగన్ పెంచారు. విద్యుత్ రంగానికి ఆయన ఇంత మంచి చేస్తే.. సెకీ విద్యుత్ ఒప్పందంలో లంచాలు తీసుకున్నారని, ధర ఎక్కువని, ఐఎస్టీఎస్ చార్జీలు కట్టాల్సి వస్తుందంటూ కూటమి నేతలు, కరపత్రికలు తప్పుడు ఆరోపణలు చేశాయి. అదే కూటమి సర్కారు ఇప్పుడు యాక్సిస్‌తో అధిక ధరకు ఒప్పందం చేసుకుని అసలు సిసలైన అవినీతికి గేట్లు తెరిచింది. నేడు సెక్షన్ 108తో మండలిని బెదిరించి.. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా గతంలో ఏపీఈఆర్సీ తిరస్కరించిన ఈ అడ్డగోలు ఒప్పందాన్ని మెడపై కత్తి పెట్టి కూటమి ప్రభుత్వం ఆమోదించేలా చేసింది. విద్యుత్ చట్టం 2003 సెక్షన్ 108 ప్రకారం యాక్సిస్‌తో పీపీఏలను అంగీకరించాలంటూ గతేడాది సెప్టెంబర్ 24న ప్రభుత్వం లేఖ రాసిందని ఏపీఈఆర్సీ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. అంటే దీన్ని తిరస్కరించడానికి వీల్లేదని, ఒకవేళ ఏపీఈఆర్సీ తిరస్కరిస్తే ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం ఒప్పందంపై ముందుకు వెళుతుందని పరోక్షంగా బెదిరించినట్లు తేటతెల్లమవుతోంది. 400 మెగావాట్ల విద్యుత్తు కోసం ఈ చట్టాన్ని ప్రయోగిస్తామంటూ బెదిరించాల్సిన అవసరం చంద్రబాబు సర్కారుకు ఎందుకు వచ్చింది? ఈ ఒప్పందం వెనుక కేవలం కుంభకోణం మినహా రాష్ట్ర ప్రజల ప్రయోజనం ఎక్కడుందని విద్యుత్తు రంగ నిపుణులు నిలదీస్తున్నారు. సెక్షన్ 108 ప్రకారం.. యాక్సిస్ పీపీఏలను ఆమోదించాలంటూ ప్రభుత్వం చెప్పిందని ఏపీఈఆర్సీ ఆదేశాల్లో పేర్కొన్న భాగం నాడు స్వయంగా ప్రతిపాదించిన ‘సెకీ’ రైతులకు పగటి పూట 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ పథకాన్ని దీర్ఘకాలికంగా అమలు చేసేందుకు సెకీ నుంచి 17 వేల మిలియన్ యూనిట్ల (7 వేల మెగావాట్లు) సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం గత ప్రభుత్వంలో జరిగింది. అది కూడా అత్యంత చౌక ధరతో.. యూనిట్ కేవలం రూ.2.49కే అందించేలా ఒప్పందం కుదుర్చుకుంది. 2022–23లో యూనిట్ రూ.5.13గా ఉన్న సగటు విద్యుత్ సేకరణ ఖర్చుతో పోల్చితే ఇది రూ.2.64 తక్కువ. అదీగాక ఏపీకి సౌర విద్యుత్‌ను అతి తక్కువ ధరకే సరఫరా చేస్తామన్న ప్రతిపాదన స్వయంగా సెకీ నుంచే వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా యూనిట్ ధర రూ.2.80కి పెరిగినప్పటికీ మనకు మాత్రం ఒప్పందం మేరకు యూనిట్ రూ.2.49కే ఇచ్చేందుకు నాడు సెకీ అంగీకరించింది. అంతేకాకుండా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ (ఐఎస్టీఎస్) చార్జీల నుంచి పూర్తి మినహాయింపు కల్పించారు. ఇదే విషయం కేంద్ర విద్యుత్ శాఖ, సెకీ లేఖ, ఒప్పందంలోనూ స్పష్టంగా ఉంది. ఇంత మంచి ఒప్పందాన్ని చేసుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్‌ను అభినందించాల్సిందిపోయి చంద్రబాబు, టీడీపీ అనుబంధ కరపత్రికలు బురద చల్లేందుకు యత్నించారు. అయితే సెకీతో ఒప్పందం సక్రమమేనని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) తేల్చి చెప్పడంతో ఈ కుట్రలన్నీ పటాపంచలయ్యాయి. ఇప్పుడు పవన, సౌర హైబ్రీడ్ విద్యుత్ మార్కెట్లో యూనిట్ రూ.2.90కి అంతకన్నా తక్కువకే దొరుకుతోంది. అలాంటప్పుడు ఓ ప్రైవేట్ డెవలపర్ నుంచి యూనిట్ రూ.4.60 చెల్లించి కొనాల్సిన అవసరం ఏమిటో, దాని వెనుక అసలు కారణాలేమిటో చెప్పే ధైర్యం చంద్రబాబు సర్కారుకు, ఈ కుంభకోణాలపై నిలదీసే ధైర్యం ఎల్లో మీడియాకు ఉందా? -
‘అలాంటిదే.. మరో స్కాం బయటకొచ్చింది: చెల్లుబోయిన వేణు
సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ స్కీం రచించినా దాని వెనుక స్కాం తప్పకుండా ఉంటుందని.. దానికి చరిత్రలో ఎన్నోవందల ఉదాహరణలున్నాయని తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అలాంటిదే కొత్తగా మరో స్కాం బయటకొచ్చిందని.. బలహీనవర్గాల మహిళలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తామని చెప్పుకుంటూ కూటమి ప్రభుత్వం భారీ అవినీతికి తెరదీసిందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..చంద్రబాబు మాటలకు చేతలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. పేదల పేరుతో సంపద కొల్లగొట్టడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. పేదలకు లబ్ధి చేకూర్చినట్టు పైకి చెప్పకుంటూ ఆయన ఆయన మనుషులు లాభపడతారు. చంద్రబాబు ఐటీ తెచ్చానని చెప్పుకుంటారు. ఏఐ టెక్నాలజీ గురించి మాట్లాడతారు. డ్రోన్లు వాడాలంటాడు. ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఉద్యోగి ఉండాలంటాడు. చివరికి మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తాడు. కుట్టు మిషన్ల పంపిణీ ద్వారా వారిని ఏ విధంగా ఐటీ ఉద్యోగులను చేస్తాడో అర్థంకాని పెద్ద శేష ప్రశ్న. కుట్టుమిషన్ల పంపిణీ పేరుతో తన అనుచరుల జేబులు మాత్రం బాగానే నింపుతున్నారు. ఒక్కో లబ్ధిదారు పేరుతో రూ. 16 వేలు దోపిడీరూ. 221 కోట్లతో కూటమి ప్రభుత్వం కుట్టుమిషన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టింది. 1,02,832 మంది మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు అందించే పేరుతో చేపట్టిన స్కీమ్‌లోదాదాపు రూ.154 కోట్లకు పైగా దండుకోవడానికి సిద్ధమైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న మహిళలకు శిక్షణ ఇస్తామని చెప్పిన చంద్రబాబు, ఆ పనులు ప్రారంభించకుండా దోపిడీకి మాత్రం డోర్లు బార్లా తెరిచారు. 1,02,832 మంది మహిళలకు శిక్షణ కోసం మొత్తం రూ. 221.08 కోట్లు కేటాయించారు. ఇందులో కుట్టుమిషన్‌కి రూ. 4300, ఒక్కో మహిళకు శిక్షణ కోసం రూ. 3 వేలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఈ విధంగా మొత్తం అయ్యే ఖర్చు రూ. 75.06 కోట్లే. మిగిలిన రూ. 154 కోట్లకు మాత్రం లెక్కలే లేవు. ఒక్కో లబ్ధిదారు పేరు మీద దాదాపు రూ. 16 వేల వరకు దోపిడీకి పాల్పడుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మొబిలైజేషన్ అడ్వాన్సు పేరుతో రూ. 25 కోట్లుశిక్షణ పేరుతో 50 రోజుల్లోనే మొత్తం బిల్లులు కింద లాగేసేందుకు పథకం రూపొందించారు. టెండర్ నిబంధనల ప్రకారం బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు మహిళలకు టైలరింగ్ శిక్షణ ప్రారంభమైన 15 రోజులకు 33 శాతం, 30 రోజులకు మరో 33 శాతం, 50 రోజులకు మిగిలిన 33 శాతం బిల్లులు చెల్లించాలి. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా పూర్తిస్థాయిలో కుట్టు శిక్షణే ప్రారంభం కాలేదు. మొబిలైజేషన్ అడ్వాన్సు కింద రూ.25 కోట్లను కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. నీకింత.. నాకింత రూల్ ప్రకారం ప్రభుత్వ ఖజానాను దోచుకోవడానికి బీసీ మహిళలను పావులుగా వాడుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఒక్కో లబ్ధిదారుకి 45 రోజులపాటు దాదాపు 360 గంటల శిక్షణ ఇవ్వాల్సి ఉంటే, కేవలం 135 గంటల మాత్రమే శిక్షణ ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. లబ్ధిదారులకు ట్రైనింగ్ కిట్ కూడా ఇవ్వడం లేదు.పేరున్న శిక్షణ సంస్థలను కాదని..కుట్టు శిక్షణ ఇచ్చేందుకు సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (సీడాప్), ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, సాంకేతిక కన్సల్టెన్సీ సంస్థ (ఏపీఐటీసీవో)తో పాటు కేంద్ర సంస్థ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్ యోజన (డీడీయూజీకేవై) ఉన్నాయి. వీటికి శిక్షణ కేంద్రాలు, శిక్షణ భాగస్వాములు ఉన్నారు. స్కిల్ పోర్టల్స్, అన్ని జిల్లాల్లో పర్యవేక్షణ వ్యవస్థ, సిబ్బంది సైతం ఉన్నారు. అయినా వాటిని కాదని ఆంధ్రప్రదేశ్ బీసీ సహకార ఆర్థిక సంస్థ ద్వారా స్కీమ్‌ను చేపట్టి భారీ స్కామ్‌కు మార్గం సుగమం చేసుకున్నారు. ఈ స్కీమ్ రచనలో కీలకపాత్ర పోషించిన ఒక రిటైర్డ్ అధికారికి తగిన ప్రోత్సాహకం ఇచ్చారని నాకు సమాచారం ఉంది.టెండర్లలోనూ మాయాజాలందోచుకోవడమే లక్ష్యంగా ఈ పథకాన్ని సిద్ధం చేసిన చంద్రబాబు, టెండర్ల దశ నుంచే చక్రం తిప్పడం మొదలైంది. ప్రి బిడ్‌లో మొత్తం 65 కంపెనీలు పాల్గొంటే 56 సంస్థలను ముందే తిరస్కరించారు. కుట్టు శిక్షణలో విశేష అనుభవంతో పాన్ ఇండియా కంపెనీగా గుర్తింపున్న ఐసీఏ కూడా ఇందులో ఉండటం విచిత్రం టెండర్లలో తక్కువ మొత్తానికి కోట్ చేసిన సంస్థను కాదని అంతకంటే ఎక్కువకు కోట్ చేసిన మరో రెండు సంస్థలను కలిపి రంగంలోకి దించారు.మిగిలిన 9 కంపెనీల్లో ఆరు సంస్థల టెండర్లను తెరవకముందే తమదైన శైలిలో పక్కకు తప్పించేశారు. అంటే.. మొత్తం 65 కంపెనీల్లో 62ను తొలగించేశారు. ఇది కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందే. చంద్రబాబు ప్రభుత్వం తమవారికి శిక్షణ కాంట్రాక్టు అప్పగించడానికి ఇన్ని అడ్డంకులు పెట్టినా తట్టుకుని.. శ్రీ టెక్నాలజీ తక్కువ మొత్తానికి కోట్ చేసి ఎల్1గా నిలిచింది. కానీ, దానిని బెదిరించి 5 శాతం పని మాత్రమే అప్పగించారు. ఎల్2, ఎల్3గా నిలిచిన సంస్థలకు మాత్రం 95 శాతం పని ఇచ్చారు.గతంలోనూ ఆదరణ పేరుతో మిషన్ పంపిణీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం మహిళలను వంచించారు. వైయస్ జగన్ హయాంలో మహిళలను తలెత్తుకుని జీవించేలా పథకాలను రూపొందించడం జరిగింది. ఈబీసీ నేస్తం, జగనన్న చేయూత, ఆసరా, అమ్మ ఒడి పథకాల ద్వారా మహిళలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచారు. బీసీల జీవితాల్లో వెలుగులు నింపితే, చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బీసీలను అడ్డం పెట్టుకుని భారీ దోపిడీకి పాల్పడుతోంది. -
జడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉండే వైఎస్ జగన్ కు భద్రత తగ్గించారు: పుత్తా
-
ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ’కూటమి’ అడ్డదారులు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి నేతలు వ్యవస్థలను తమ చేతిలో పెట్టుకుని రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతిపక్షం గొంతులను అణగదొక్కుతున్నారంటూ ధ్వజమెత్తారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉండే వైఎస్ జగన్‌కు భద్రతా సిబ్బందిని తగ్గించారు. పదిహేనేళ్ల క్రితం మూలాన పడ్డ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కేటాయించారు. జగన్ సెక్యూరిటీ విషయంలో కూటమి ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన నిలదీశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..ఉద్దేశపూర్వకంగా భద్రత కుదింపుకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్సీపీ నాయకుల మీద కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ నుంచి కిందిస్థాయి వైఎస్సార్సీపీ కార్యకర్త వరకు ఎవర్నీ వదలకుండా కూటమి నాయకులు ప్రతీకార రాజకీయాలకు దిగుతున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రత విషయంలోనూ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. ఎస్సార్సీ కమిటీ రివ్యూ కూడా చేయకుండా వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కూడా ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కనీసం ఏసీ కూడా సరిగ్గా పనిచేయని వాహనాన్ని ప్రతిపక్ష నాయకుడికి కేటాయించి అవమానించారు.ఈ వాహనం ఇప్పటికే ఒకసారి రోడ్డు మీద సడెన్‌గా ఆగిపోయిన పరిస్థితి రాష్ట్ర ప్రజలంతా చూశారు. జిల్లాల పర్యటనకు వెళ్లిన సందర్భాల్లో ఉద్దేశపూర్వకంగానే సెక్యూరిటీ కేటాయించడం లేదు. గుంటూరు మిర్చి యార్డుకి వెళ్లినప్పుడు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న హై ప్రొఫైల్ పర్సన్‌కి ఒక్క పోలీస్ అధికారి భద్రతను కూడా కేటాయించకపోవడం దుర్మార్గం. వైఎస్ జగన్ రామగిరి మండలం పర్యటనలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించింది. హెలిప్యాడ్ దగ్గర సరైన భద్రత కల్పించకపోవడంతో విండ్ షీల్డ్ దెబ్బతిని బెంగళూరుకు రోడ్డు మార్గాన వెళ్లాల్సి వచ్చింది. ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో 1100 మందిని మోహరించామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. 1100 మంది ఉన్నా కంట్రోల్ చేయలేని అధికారులపై ఏమైనా చర్యలు తీసుకున్నారా అంటే అదీ లేదు.నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఉన్న వారికి నిబంధనల ప్రకారం మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 2 ప్లస్ 8 ఆర్మ్డ్ ఫోర్స్ కేటాయించాలి. ఒకవేళ జనాలు ఎక్కువైతే 40 నుంచి 50 మంది వంద మీటర్ల వెలుపల సివిల్ ఫోర్స్ పెట్టాల్సి ఉంటుంది. ఇంకా జనాల తాకిడి ఎక్కువైతే ఆ ప్రాంతాన్ని బట్టి పోలీసులను రౌండ్స్‌గా ఏర్పాటు చేయాలి. ఈ నిబంధనలన్నీ ప్రభుత్వం పాటించి ఉంటే హెలిప్యాడ్ వరకు జనాలు రాగలిగేవారా? పోలీసులకు సహకరించిన తోపుదుర్తిప్రభుత్వ వైఫల్యాలను, పోలీసుల నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆరోజు కార్యక్రమానికి హాజరైన వైయస్సార్సీపీ ముఖ్య నాయకుల మీద ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఆయన సోదరుల మీద అక్రమ కేసులు బనాయించి వేధింపులకు పాల్పడుతున్నారు. జనం నవ్వుతారనే కనీస విచక్షణ కూడా లేకుండా తోపుదుర్తి సోదరులే ప్రజలను రెచ్చగొట్టి హెలిప్యాడ్ వద్దకు తీసుకెళ్లారని నమ్మశక్యం కాని అక్రమ కేసులు పెట్టారు. ఆరోజు జనాన్ని కంట్రోల్ చేయలేక చేతులెత్తేసిన డీఎస్పీ, తన హ్యాండ్ మైకుని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చేతికిచ్చారు.అభిమానులను కంట్రోల్ చేసే బాధ్యతను ఆయన చేతుల్లోనే పెట్టారు. ఇదంతా చూసి కూడా జగన్ పర్యటనకు 1100 మంది పోలీసులను మోహరించామని ప్రభుత్వం చెప్పుకోవడం విడ్డూరం అనిపించుకోదా? పైగా పోలీసులకు సహకరించి అభిమానులను కంట్రోల్ చేసిన తోపుదుర్తి మీద అభిమానులను రెచ్చగొట్టి పంపారని పోలీసులతోనే కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం? ఈ అక్రమ కేసుల మీద ఆయన న్యాయస్థానాల్లో పోరాడుతుంటే ఆయన తప్పించుకుని తిరుగుతున్నారంటూ ఆయన కోసం నియోజకవర్గంలోని వైయస్సార్సీపీ నాయకులను వేధిస్తున్నారు. వేకువజామున వారి ఇళ్లకు పోయి ఇబ్బందులు పెడుతున్నారు.అవినీతి అధికారుల భరతం పడతాం2019-24 మధ్య వైయస్సార్సీపీ పాలనలో నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పది నెలల్లో మళ్లీ పగలు ప్రతీకారాలు రాజ్యమేలుతున్నాయి. అమాయకులైన వైయస్సార్సీపీ నాయకులను అక్రమ కేసులతో వేధింపులకు గురిచేస్తున్నారు. కొంతమంది పొలీసులను అడ్డంపెట్టుకుని అంతరించిపోయిన రౌడీయిజాన్ని మళ్లీ తట్టిలేపుతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం.కూటమి నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి వారి ప్రతీకార రాజకీయాలకు సహకరిస్తున్న పోలీసులు భవిష్యత్తులో శిక్షను అనుభవించకతప్పదని గుర్తుంచుకోవాలి. ఏడాది పాలన పూర్తికాకుండానే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. 2029లో వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రావడం ఖాయం. ఇలాంటి అవినీతి అధికారుల భరతం పట్టడం ఖాయం. -
Janatantram: రాజధాని మతలాబ్
-
సింహాచలం బాధితుల్ని పరామర్శించకుండా మొహం చాటేసిన చంద్రబాబు, పవన్
-
చంద్రబాబు అమరావతి గ్రాఫిక్స్ పై శైలజానాథ్ మాస్ ర్యాగింగ్
-
కుట్టు స్కీమ్ లో స్కామ్
-
కూటమి ప్రభుత్వం రైతుల గోడు పట్టించుకోవడంలేదు: వైఎస్ జగన్
-
అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా?... కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
-
అన్నం పెట్టే రైతులకు సున్నమా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు కనీస మద్దతు ధర లభించక రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా, టీడీపీ కూటమి ప్రభుత్వంలో పట్టించుకునే వారు కరువయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఒక్క ఎకరాకు సంబంధించి ఒక్క క్వింటాల్ కూడా కొనకుండా అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3 వేల కోట్లు పెట్టి, ఐదేళ్లలో రికార్డు స్థాయిలో మార్కెట్లో ధర లేని పంట ఉత్పత్తుల సేకరణ ద్వారా రైతులను ఆదుకునేందుకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రూ.7,796 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.చరిత్రాత్మక నిర్ణయాలతో కనీస మద్దతు ధరల జాబితాలో లేని పొగాకు సహా అనేక పంటల రైతులను ఆదుకున్నామని గుర్తు చేశారు. ‘మీరు కొత్తగా ఏమీ చేయకపోయినా, కనీసం మా విధానాన్ని కొనసాగించి ఉంటే రైతులకు ఊరట లభించేది కదా?’ అని ప్రశ్నిచారు. రాష్ట్రంలో రైతుల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ‘ఎక్స్’ వేదికగా శనివారం ఆయన ఎండగట్టారు. ఆ పోస్ట్‌లో ఇంకా ఏమన్నారంటే.. కనీస బాధ్యతను విస్మరించారు⇒ చంద్రబాబు గారూ.. కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడు పట్టించుకోవడం లేదు. కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులు కూడా రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు. మీరు, మీ మంత్రులు, యంత్రాంగం వారి వైపు కన్నెత్తి కూడా చూడక పోవడం ధర్మమేనా? ⇒ మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, వేరుశనగ, టమాటా, అరటి, చీని, పొగాకు ఇలా ఏ పంట చూసినా కనీస మద్దతు ధర రావడం లేదు. చొరవ చూపి, మార్కెట్లో జోక్యం చేసుకోవాలన్న కనీస బాధ్యతను విస్మరించారు. పైగా డ్రామాలతో రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ఇది న్యాయమేనా? ⇒ మిర్చి విషయంలో కూడా మీరు రైతులను నమ్మించి మోసం చేశారు. మిర్చి కొనుగోలు అంశం కేంద్రం పరిధిలో లేకపోయినా, నాఫెడ్ కొనుగోలు చేస్తుందని మొదట నమ్మబలికారు. క్వింటాకు రూ.11,781కు కొంటామని చెప్పి, ఒక్కపైసా కూడా ఖర్చు పెట్టకుండా, ఒక్క రైతు నుంచి కానీ, ఒక్క ఎకరాకు సంబంధించి కానీ, ఒక్క క్వింటాల్ గానీ కొనకుండా అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారు. ఇది వాస్తవం కాదా?⇒ మా హయాంలో ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3 వేల కోట్లు పెట్టి, ఐదేళ్లలో రూ.7,796 కోట్లు ఖర్చు చేశాం. చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని కనీస మద్దతు ధరల జాబితాలో లేని పొగాకు సహా అనేక పంటల రైతులను ఆదుకున్నాం. మీరు కొత్తగా ఏమీ చేయకపోయినా, కనీసం మా విధానాన్ని కొనసాగించి ఉంటే రైతులకు ఊరట లభించేది కదా? పైగా ఈ ఏడాది బడ్జెట్లో కేవలం రూ.300 కోట్లు కేటాయించడం దారుణం కాదా? ఇందులో కూడా కనీసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయా? ⇒ ధాన్యం, కోకో, పొగాకు, ఆక్వా రైతులు ఆయా జిల్లాల్లో ఆందోళనలు చేస్తుంటే, ఇప్పటికీ రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారు. జనాభాలో 60 శాతం మంది ప్రజలు ఆధారపడే వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అది తీవ్ర సంక్షోభానికి దారితీస్తే, లక్షల మంది ఉపాధికి గండి పడితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? వెంటనే ప్రభుత్వం తరఫున మార్కెట్లో జోక్యం చేసుకోవాలి. కనీస మద్దతు ధరలు లభించని పంటల విషయంలో ప్రభుత్వమే జోక్యం చేసుకుని, మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలి. -
రాజధానిలో పేదలు ఉండకూడదా?
సాక్షి, అమరావతి: అమరావతి రాజధానిలో పేదలు, బడుగువర్గాలు ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2014–19లో మట్టి, నీరు తెచి్చచ్చారంటూ విమర్శించిన ప్రధానినే మరోసారి పిలిచి పెద్ద ఈవెంట్ నిర్వహించారని చెప్పారు. గతంలో ప్రారంభించిన పనులకే మళ్లీ శంకుస్థాపన చేయించడం నాలుగుసార్లు సీఎం అయిన చంద్రబాబుకే చెల్లిందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే రాజధాని అంటే చంద్రబాబు దృష్టిలో ఆయనకు అనుకూలమైన సామాజిక వర్గం మాత్రమే ఉండే రాజధాని అని అర్థం అన్నారు. కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైన దానిని ప్రజా రాజధాని అనగలమా? అని నిలదీశారు.‘గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాజధాని ప్రాంతంలో ఆర్5 జోన్‌ను ఏర్పాటు చేసి.. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ.. ఇలా అన్ని వర్గాల వారు ఉండాలని భావించింది. అందుకోసం వారికి దాదాపు 900 ఎకరాలను కేటాయించింది. మొత్తం 50,793 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచి్చంది. అయితే దీనిపై టీడీపీ న్యాయస్థానాల్లో 26 పిటీషన్లు వేయించింది. రాజధానిలో పేదలు ఉంటే, అది ప్రజా రాజధానికే వ్యతిరేకమని మాట్లాడారు. జీఓ 45ను రద్దు చేయాలని న్యాయస్థానాల్లో వాదనలు వినిపించారు. అన్ని వర్గాల వారు లేకుండా రాజధాని ఎలా ఉంటుందని న్యాయస్థానం సైతం పిటిషనర్‌ను ప్రశ్నించింది.దీనిపై చంద్రబాబు డైరెక్షన్లో సుప్రీంకోర్టు వరకు తీసుకువెళ్లారు. అత్యున్నత న్యాయస్థానం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ కేసులను కొట్టేసింది. అయినప్పటికీ గత ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేయడం, ఆర్5 జోన్నే తొలగించడం దుర్మార్గం, అన్యాయం’ అని మండిపడ్డారు. అలాంటప్పుడు రాజధాని అప్పులతో మిగిలిన వారికి సంబంధం లేదని ప్రకటిస్తారా.. అని నిలదీశారు. ప్రధాని ఎదుట విభజన హామీల గురించి, పోలవరం గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశి్నంచారు. -
వేదనలో రాజ్యం... వేడుకలో రాజధాని!
‘‘ఠండా మతలబ్ కోకాకోలా...’’ ఇండియాలో బాగా పాపులరయిన వాణిజ్య ప్రకటనల్లో ఒకటి. మరి కోకాకోలా మతలబు? రెండొందల మిల్లీలీటర్ల కోక్ తయారు చేయడానికి గరిష్ఠంగా యాభై పైసలు ఖర్చవుతాయని మార్కెట్ టాక్. పది పైసల కంటే ఎక్కువ కాదనే వాళ్లు కూడా ఉన్నారు. కానీ మనం గరిష్ఠాన్నే లెక్కేసుకుందాం. దానికి పదింతలు ఎక్కువ ఖర్చు పెట్టి మార్కెటింగ్ నైపుణ్యాన్ని జోడిస్తారు. వినియోగదారుకు ఇరవై రూపాయలకు అమ్ముతారు. రవాణా ఖర్చులు, కమీషన్లు తీసేసినా మినిమమ్ నూటా యాభై శాతం లాభాలు కంపెనీ గల్లా పెట్టెలో పడతాయి. దీన్నే బ్రాండ్ బిల్డింగ్, మార్కెటింగ్ టెక్నిక్ వంటి పేర్లతో ఘనంగా చెప్పుకుంటారు.ఈ ధోరణి రాజకీయాల్లోకి, ప్రభుత్వ పాలనలోకి కూడా దిగుమతయింది. ఇందులో ఉద్దండులైన ఇద్దరు అగ్ర నాయ కులు నిన్న ఉద్దండరాయునిపాలెం సమీపంలో అమరావతి బ్రాండ్ షూటింగ్‌ను పునఃపునఃప్రారంభించారు. ప్రధాని సంగతి తెలిసిందే. భారతీయ వ్యాపార రంగంలో ఆరితేరిన వారైన గుజరాతీల ముద్దుబిడ్డ. అంతటా దొరికే వస్తువుపై కూడా అరుదైన సరుకుగా ముద్రవేసి అమ్మగల నేర్పరులు వారు. లేకపోతే, ఓ పిడికెడు మంది మినహా సమస్త ప్రజల్లో ఉండే సహజ లక్షణాలైన దేశభక్తి, దైవభక్తి వంటి అంశాలపై కూడా తమకే పేటెంట్ హక్కులున్నాయని ఎలా ప్రకటించు కోగలరు?ఏపీ ముఖ్యమంత్రి కూడా ప్రధానికి దీటైనవారే. నిజం చెప్పాలంటే కొంచెం ఎక్కువ కూడా! మీడియా ప్రచారంతో ముఖ్యమంత్రి స్థాయికి ఎదగవచ్చన్న కిటుకును ఆయన తొలి రోజుల్లోనే కనిపెట్టారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద, సెల్ఫోన్ల మీదా తనకే పేటెంట్ దక్కాలని చిరకాలంగా ఆయన పోరాటం చేస్తున్నారు. ఇద్దరూ కలిసి అమరావతి షోలో పాల్గొని అమరా వతి బ్రాండ్ వ్యాల్యూ పెంచే ప్రయత్నాన్ని చేశారు. ఈ షో జరగడానికి ముందునుంచే అమరావతి ప్రమోషన్ కార్యక్రమాన్ని ఏకసూత్ర పథకంగా భావించి, పరిపాలన సైతం పక్కన పెట్టి చంద్రబాబు ప్రయాసపడుతున్నారు. అప్పిచ్చువాడి కోసం డప్పు కొడుతూనే ఉన్నారు. ప్రపంచబ్యాంకూ, మరో రెండు సంస్థలూ 31 వేల కోట్ల షరతులతో కూడిన అప్పును మంజూరు చేసిన వెంటనే 47 వేల కోట్లకు టెండర్లను పిలవనే పిలిచారు. ఇందులో భారీ కమీషన్ల కోసం అంచనాలను అసహజంగా పెంచేశారన్న విమర్శలు వినిపించాయి.ఇందులో చాలా పనులకు ఏడేళ్ల కింద కూడా టెండర్లను పిలిచారు. అప్పటి అంచనా వ్యయానికీ, ప్రస్తుతానికీ పోలికే లేదు. ఒక్క సెక్రటేరియట్ టవర్ల అంచనాయే నూరు శాతం పెరిగింది. 2018లో సెక్రటేరియట్ నాలుగు టవర్లూ, సీఎం కార్యాలయానికి కలిపి అంచనా వ్యయం 2,271 కోట్లుంటే ఇప్పుడది 4,688 కోట్లకు ఎగబాకింది. ఏడేళ్లలో నూరు శాతం ద్రవ్యోల్బణం పెరిగిందా? నిర్మాణ రంగంలో ప్రధాన పద్దులైన సిమెంటు, ఇనుము ధరలు పెరక్కపోగా అంతో ఇంతో తగ్గాయని మార్కెట్ సమాచారం. అమరావతి బ్రాండ్ బాజా మిరు మిట్లలో ఇటువంటి వాస్తవాలు మరుగున పడిపోవాలని పాల కుల ఉద్దేశం కావచ్చు.అమరావతి కాసుల వేటలో పడి ప్రజాపాలనను పడకేయించిన పర్యవసానం ఎలా ఉన్నదో మచ్చుకు ఒక సన్నివేశాన్ని పరిశీలిద్దాం. రైతు పండించిన పంటలకు మార్కెట్లో పలికిన ధరలేమిటో ఒకసారి గమనించండి. మిరపకు జగన్ పాలనలో పలికిన సగటు ధర 24 వేల రూపాయలైతే, ఇప్పుడు 6,500. పత్తికి నాడు 10,500 పలికితే నేటి సగటు ధర 4,900. కందులు నాడు 11 వేలు, నేడు 5,850. పసుపు, మినుము, పెసలు, శనగలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, పొగాకు, చీనీపండ్లు, అరటి, బొప్పాయి, టమాటా, ఉల్లి... ఇలా ఏ వ్యవసాయిక ఉత్పత్తినైనా తీసుకొని పరిశీలించండి. ఒకే రకమైన రాజధాని పనులకు ఏడేళ్ల కాలంలో కాంట్రాక్టర్లకు ఇస్తున్న సొమ్ము నూరు శాతం ఎట్లా పెరిగింది? ఆరుగాలం కష్టించిన రైతన్నకు లభిస్తున్న ధర ఏడాది కాలంలోనే నూరు శాతం ఎట్లా పడి పోయింది? ఇదేమి రాజ్యం? అదేమి రాజధాని? పైగా అది ప్రజా రాజధానట! జన జీవితాల మీద ఇంతకంటే క్రూరమైన పరిహాసం ఇంకొకటి ఉంటుందా?ఈ రాజధాని నిర్మాణానికి అర్జెంటుగా ఇంకో 47 వేల కోట్లు కావాలట! మరో 44 వేల ఎకరాలు సమీకరించాలట! అప్పుడు గానీ ఈ వ్యవహారం ఓ కొలిక్కి రాదట! పనుల పునఃప్రారంభం నాటికే రాష్ట్ర వ్యవసాయ రంగం వెన్ను విరిగింది. ఆ పనులన్నీ కొలిక్కి వస్తే ఇంకెన్ని దారుణాలు చూడాలో! గిట్టుబాటు ధర లేకపోవడం ఒక్కటే కాదు. రైతు కుటుంబాల మీద ఏడాది పొడుగునా పిడుగులే కురుస్తున్నాయి. రైతు భరోసా లేదు. అప్పిచ్చువాడి గడప తొక్కక తప్పలేదు. పంటల బీమా లేదు. దేవుడి మీదే భారం. ఇన్పుట్ సబ్సిడీ, కరువు సాయం బకాయీల ఊసెత్తితే ఒట్టు. ఆర్బీకేలు అలంకార ప్రాయంగా మారి ఆసరా ఇవ్వడం లేదు. ఒక్క అమరావతి కలవరింత తప్ప, సాధారణ పరిపాలనపైన కూడా ఈ ప్రభుత్వం పట్టు కోల్పో యింది. విజయవాడ వరదలు, తిరుపతి తొక్కిసలాట, సింహా చలం దుర్ఘటన వగైరాలు పాలనా వైఫల్యానికి నిదర్శనాలు.అదే రాష్ట్రం, అవే వనరులు, అదే ఆదాయం. ఏ ఖర్చయినా అందులోంచే పెట్టాలి. ఏ అప్పయినా అందులోంచే చెల్లించాలి. లేదంటే మరిన్ని అప్పులు చేయాలి. ఎన్నికల ముందు చంద్ర బాబు హామీ ఇచ్చిన అద్భుతం ఆవిష్కృతం కాలేదు. సంపద సృష్టి జరగలేదు. ఎప్పుడు సృష్టిస్తారో కూడా చెప్పడం లేదు. రాజధాని మీద లక్ష కోట్ల దాకా ఖర్చు పెట్టాలని చెబుతున్నారు. ఆ ఖర్చుకు అప్పులే మార్గం. ఉన్న ఆదాయ వనరుల్లోంచే ఈ అప్పులు తీర్చాలి. అమరావతే తన అప్పుల్ని తీర్చుకుంటుందని మొదట్లో ఊదరగొట్టారు. ఎన్ని వేల ఎకరాలను అభివృద్ధి చేసి అమ్మితే అంత అప్పును తీర్చాలి? అన్ని వేల ఎకరాలను ఎగబడి కొనేందుకు ఎవరు ముందుకొస్తారు? ఇది జరగడానికి ఎన్ని పుష్కరాలు పడుతుంది? ఇటువంటి సందేహాలకు సమాధానా లేవీ ఇంతవరకు రాలేదు.ఈలోగా ఒక్క ఏడాదిలోనే వ్యవసాయ రంగం కుదేలైంది. రాజధాని కోసం భూములను ‘త్యాగం’ చేసిన 28 వేల మంది రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లయినా దక్కుతాయని చెబు తున్నారు. కానీ, అమరావతి పేరుతో ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతున్న రాష్ట్రంలోని 60 లక్షల మంది రైతుల త్యాగానికి ఎవరు వెల కట్టాలి? వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధినిస్తున్న ఎం.ఎస్. ఎం.ఈ. రంగంలో ఈ సంవత్సరం 20 లక్షల మంది ఉపాధి కోల్పోయారని పార్లమెంటుకిచ్చిన సమా ధానంలో కేంద్రం తెలియజేసింది. ఈ లెక్కన అమరావతి నిర్మాణం కోసం ఇంకెన్ని సెక్షన్లు బలవ్వాలి? ఎంత విధ్వంసం జరగాలి? ‘‘మా కండలు పిండిన నెత్తురు, మీ పెండ్లికి చిలికిన అత్తరు’’ అన్నాడు ఒక కవి. అమరావతి కోసం ఆంధ్రదేశమంతా ఈ పాట పాడుకోవాలేమో?శుభమా అని రాజధాని పనులు ప్రారంభిస్తుంటే ఈ కుశంకలేమిటనే వారు లేకపోలేదు. కుశంకలు కావు, వాస్తవాల పునా దులపై తలెత్తుతున్న సందేహాలు ఇవి. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, ఇల్లాలు ఏడ్చిన ఇల్లు బాగుపడవంటారు. రైతు ఇప్పుడు దుఃఖిస్తున్నాడు అన్నది ఒక వాస్తవం. రాష్ట్రంలోని మహిళలకు ‘సూపర్ సిక్స్’ పేరుతో పాలక కూటమి ఎన్నో ఆశలు పెట్టిందన్నది ఒక వాస్తవం. ఏడాది తర్వాత కూడా వారి ఆశలు అడియాసలుగానే మిగిలాయన్నది ఒక వాస్తవం. సంపద సృష్టి పేరు చెప్పి ఎడాపెడా అప్పులతో రాష్ట్రాన్ని ఊబి లోకి తోస్తున్న మాట వాస్తవం. ఈ అప్పుల ఊబి నుంచి బయట పడే మార్గం ఏమిటో ఇప్పటిదాకా ప్రభుత్వం విడమరచి చెప్ప లేకపోయిన మాట కూడా వాస్తవం.రమారమి 500 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి నిన్న అమరా వతిలో ‘పునరపి జననం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రిని తీసుకొచ్చి పొగడ్తల్లో ముంచారు. స్తోత్రకై వారాలు గావించారు. ఈ దేశ ప్రధానిని గౌరవించడం తప్పేమీ కాదు. గౌరవించాలి కూడా! అదే సందర్భంలో రాష్ట్ర ముఖ్య మంత్రి కూడా రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా నిలబడాలి. తమ నాయకుడు సాగిలపడ్డంత పనిచేయడాన్ని, నంగి నంగి మాట్లాడటాన్ని ప్రజలు హర్షించరు. బిల్లు మంజూరు చేసే అధి కారి తనిఖీకి వచ్చినప్పుడు చిన్నపాటి కాంట్రాక్టర్లు వ్యవహరించినట్టుగా బాడీ లాంగ్వేజ్ ఉండకూడదు. బహిరంగ సభల్లో బీజేపీ నాయకులు జనం చేత మూడుసార్లు ‘వందేమాతరం’ అనిపించడం చాలాకాలంగా వస్తున్న సంప్రదాయం. ఆ దీక్షను కూడా చంద్రబాబు ఈ సభలో స్వీకరించారు. నిజానికి తెలుగు దేశం పార్టీలో ఈ ఆచారం లేదు.ఆరేళ్ల క్రింద నరేంద్ర మోదీని ఉద్దేశించి చంద్రబాబు చేసిన విపరీత విమర్శలు చాలామందికి ఇంకా గుర్తున్నాయి. కానీ, అటువంటిదేమీ జరగనట్టుగానే సభలో ఆయన ప్రవర్తన కనిపించింది. సాధారణంగా ఐటీ రంగానికి సంబంధించినంత వరకు ఘనత అంతా తనకే దక్కాలని కోరుకుంటారు. దాన్ని ఇంకెవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. కానీ ఆశ్చర్యకరంగా నిన్నటి సభలో ‘‘టెక్నాలజీ అంటే మోదీ, మోదీ అంటే టెక్నాలజీ’’ అని పొగిడేశారు. ఈ భజన కార్యక్రమం వెనుకనున్న ఉద్దేశం ఏమిటో గాని ప్రధాని మాట్లాడుతున్నప్పుడు అమరావతి కోసం అదనంగా తానేం చేస్తానన్నది మాత్రం చెప్పలేదు. చంద్రబాబు పొగడ్తలకు పొగడ్తలతోనే ఆయన సమాధానం చెప్పారు. మొదటి ప్రారంభానికి వచ్చినప్పుడు మట్టి–నీళ్లు తెచ్చిన ప్రధాని, ఈసారి పవన్ కల్యాణ్‌కు మాత్రమే ఒక చాక్లెట్ తీసుకువచ్చారు.ఏదో వ్యూహం ప్రకారమే లోకేశ్‌తో ఈ సభలో మాట్లాడించి నట్టుగా కనిపించింది. తన కుమారుడికి మోదీ ఆశీస్సులు లభించవలసిన సమయం ఆసన్నమైందని బాబు భావిస్తుండవచ్చు. ప్రసంగం ప్రారంభానికి ముందు లోకేశ్ ‘నమో నమః’ అంటూ మూడుసార్లు సంబోధించారు. ఆ నమస్కారం మోదీ కోసమే అనే సంగతి ఆయనకు అర్థమైందో లేదోనన్న అనుమానం కలిగి నట్టుంది. మోదీని గురించి చెప్పాల్సిన ప్రతి చోట ‘నమో గారు, నమో గారు’ అంటూనే మాట్లాడారు. ‘‘వంద పాకిస్తాన్‌లు దండెత్తి వచ్చినా నమో మిస్సైల్ ముందు బలాదూర్’’ అన్నారు. ప్రధాన మంత్రిని లోకేశ్ పొగుడుతున్నంతసేపు చంద్రబాబు ఉత్కంఠగా కనిపించారు. లోకేశ్ పొగడ్తలు ప్రధానికి అర్థమవుతున్నాయో లేదో తెలుసుకోవాలన్న కుతూహలం ఆయన మోములో కనిపించింది. అనూహ్యంగా ఆయన చాలాసార్లు చిరునవ్వులు చిందించారు. ఇటువంటి సైడ్ లైట్స్ తప్ప ఈ సభ గురించి చెప్పు కోవడానికి ఇంకో విశేషం లేదు. అమరావతికి బ్రాండ్ వ్యాల్యూ పెంచడానికి జరిగిన ఒక ఈవెంట్‌గా మాత్రమే ఇది చరిత్రలో మిగిలిపోతుంది. రాజ్యమంతటా ఆవేదన అలుముకుంటున్న వేళ వేడుకలు చేసుకున్న రాజధానిగా కూడా చరిత్రలో అమరా వతి స్థానం సంపాదించుకుంటుంది.వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
సీఎంవా లేక ఈవెంట్ మేనేజర్ వా .. కాంగ్రెస్ నేత సంచలన కామెంట్స్
-
బుగ్గమఠం భూముల సర్వే పేరుతో ప్రభుత్వం కక్షసాధింపు
-
పునఃనిర్మాణ సభతో ఏపీ ప్రజలకు ఒరిగింది ఏమి లేదు
-
రైతుల ఆందోళనపై వైఎస్ జగన్ ట్వీట్
-
ఆంధ్రా అంటే అమరావతి ఒక్కటే కాదు: సాకే శైలజానాథ్
సాక్షి, అనంతపురం: ఆంధ్రా అంటే ఒక్క అమరావతి మాత్రమే కాదని, ఉత్తరాంధ్ర, రాయలసీమ కూడా రాష్ట్రంలో భాగమని, ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు. అప్పులన్నీ తెచ్చి అమరావతిలో పెట్టడం తగదన్న ఆయన, ఇది కచ్చితంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని ఫణంగా పెట్టడమే అని తేల్చి చెప్పారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఇంకా ఏమన్నారంటే..రాజధాని ప్రాంతమైన అమరావతికి కృష్ణా నది ముంపు ప్రమాదం ఉంది. నిజంగా ఆ భయం లేకపోతే దాదాపు రూ.1100 కోట్లతో ఐదు ఎత్తిపోతల పథకాలు ఎందుకు నిర్మిస్తున్నారు? ఆ 5 లిప్టు స్కీమ్‌లు చేపట్టకపోతే, అమరావతి నిర్మాణానికి రుణాలు ఇవ్వలేమని బ్యాంకులు హెచ్చరించాయి. ఇంకా దేశంలో జాతీయ రహదారులను కిలోమీటరుకు రూ.20 కోట్ల వ్యయంతో నిర్మిస్తుంటే, రాజధాని అమరావతిలో మాత్రం కిలోమీటర్ రోడ్డుకు ఏకంగా రూ.59 కోట్లు ఖర్చు చేస్తున్నారు. పైగా ఆ పనుల కాంట్రాక్టులన్నీ టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో తమ వారికే కట్టబెడుతున్నాడు. మరోవైపు ఊరూ పేరూ లేని ఉర్సా కంపెనీకి విశాఖలో దాదాపు రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కట్టబెడుతున్నారు.ఏడేళ్ల కిందట అమరావతిలో ఐకానిక్ టవర్లు, ఆకాశహర్మ్యాలు, సీ ప్లేన్, నది మీద హ్యాంగింగ్ బ్రిడ్జి అంటూ గ్రాఫిక్స్‌తో ప్రచారం చేసి ఊదరగొట్టారు. ఐదేళ్లు గడిచాక చూస్తే అమరావతిలో తాత్కాలిక హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ తప్ప వేరే నిర్మాణాలు కనిపించలేదు. అమరావతి కోసం రైతుల నుంచి సేకరించిన 34 వేల ఎకరాల భూమిని బీడు పెట్టేశారు. ఇప్పుడు మళ్లీ మరో 44 వేల ఎకరాలు సేకరిస్తానని మంత్రి పి.నారాయణ చెబుతున్నారు. ఇష్టంగా ఇస్తే ఇష్టంగా తీసుకుంటాం.. కష్టంగా ఇస్తే కష్టంగానే తీసుకుంటామని ఆయన రైతులను ముందే హెచ్చరిస్తున్నారు.ఒక పక్క బస్టాండ్ కట్టడానికే నిధులు లేవని చెప్పే చంద్రబాబు, విజయవాడలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పెట్టుకుని మళ్లీ అమరాతిలో విమానాశ్రయం కడతామని డాబు మాటలు చెబుతున్నాడు. 11 నెలల్లో రూ.1.50 లక్షల కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేసిన పాపాన పోలేదు. ఇదిచాలదన్నట్టు రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వ ఖజానా నుంచి నేరుగా నిధులు డ్రా చేసుకునే హక్కును ప్రైవేటు సంస్థలకు అప్పగించారు.కమీషన్ల కోసం, తమ వారి జేబులు నింపేందుకు అమరావతి అంచనా వ్యయాన్ని ఏకంగారూ. 44 వేల కోట్ల నుంచి రూ.77 వేల కోట్లకు పెంచేశారు. కమీషన్లు తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని నాడు వైయస్ జగన్ తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్, జ్యుడీషియల్ ప్రివ్యూ విధానాలను చంద్రబాబు రద్దు చేశారు. కొత్తగా మొబిలైజేషన్ విధానం తీసుకొచ్చి, కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ కిందకు 10 శాతం నిధులు ఇచ్చి, అందులో నుంచి 8 శాతం కమిషన్ల కింద వసూలు చేసుకుంటున్నారు. ఒకవేళ ఇదంతా నిజం కాకపోతే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధిని ఫణంగా పెడుతూ, అప్పులన్నీ చేసి మొత్తం అమరావతిలోనే ఖర్చు చేయాల్సిన అవసరం ఏముందని సాకే శైలజానాథ్ నిలదీశారు. -
చంద్రబాబు వీడియో ప్లే చేసి.... ఏకిపారేసిన పుష్ప శ్రీవాణి
-
చంద్రబాబూ.. రైతుల గోడు వినిపించడం లేదా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో రైతుల ఆందోళనలపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ఇది న్యాయమేనా? అని ప్రశ్నించారు. జిల్లాల్లో రైతులు ఆందోళనలు చేస్తుంటే, ఇప్పటికీ రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘చంద్రబాబు.. కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడు పట్టించుకోవడం లేదు. కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులూ రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారు. మీరు, మీ మంత్రులు, యంత్రాంగం కనీసం వారివైపు కన్నెత్తికూడా చూడకపోవడం ధర్మమేనా?మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, వేరుశెనగ, టమోటా, అరటి, చీని, పొగాకు ఇలా ఏ పంట చూసినా కనీస మద్దతు ధరలు రావడం లేదు. చొరవ చూపి, మార్కెట్లో జోక్యం చేసుకోవాలన్న కనీస బాధ్యతను విస్మరించారు. పైగా డ్రామాలతో ఆ రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ఇది న్యాయమేనా?మిర్చి విషయంలో కూడా మీరు రైతులను నమ్మించి మోసం చేశారు. మిర్చి కొనుగోలు అంశం కేంద్రం పరిధిలో లేకపోయినా, నాఫెడ్ కొనుగోలు చేస్తుందని మొదట నమ్మబలికారు. క్వింటాలు రూ.11,781కు కొంటామని చెప్పి, ఒక్కపైసా కూడా ఖర్చు పెట్టకుండా, ఒక్క రైతు నుంచి కాని, ఒక్క ఎకరాకు సంబంధించి కాని, ఒక్క క్వింటాల్ గాని కొనకుండా అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారు. మా హయాంలో ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3వేల కోట్లు పెట్టి, ఐదేళ్లలో రూ.7, 796 కోట్లు ఖర్చుచేశాం. చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని కనీస మద్దతు ధరల జాబితాలో లేని పొగాకు సహా అనేక పంటల రైతులను ఆదుకున్నాం. మీరు కొత్తగా ఏమీ చేయకపోయినా, కనీసం మా విధానాన్ని కొనసాగించి ఉంటే రైతులకు ఊరట లభించేది కదా? పైగా ఈ ఏడాది బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించడం దారుణం కాదా? ఇందులో కూడా కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయా?.ధాన్యం, కోకో, పొగాకు, ఆక్వా రైతులు ఆయా జిల్లాల్లో ఆందోళనలు చేస్తుంటే, ఇప్పటికీ రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారు. జనాభాలో 60శాతం మంది ప్రజలు ఆధారపడే వ్యవసాయరంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అది తీవ్ర సంక్షోభానికి దారితీస్తే, లక్షల మంది ఉపాధికి గండిపడితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? వెంటనే ప్రభుత్వం తరఫున మార్కెట్లో జోక్యం చేసుకోవాలని, కనీస ధరలు లభించని పంటల విషయంలో ప్రభుత్వమే జోక్యంచేసుకుని, మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు..@ncbn గారూ… కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడు పట్టించుకోవడం లేదు. కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులూ రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారు. మీరు, మీ మంత్రులు, యంత్రాంగం కనీసం వారివైపు కన్నెత్తికూడా చూడకపోవడం… pic.twitter.com/cW0REI1bV6— YS Jagan Mohan Reddy (@ysjagan) May 3, 2025 -
అమరావతి నిర్మాణంలో చంద్రబాబు విఫలమయ్యారు
-
‘5000 కోట్లు.. 2014-19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు?’
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలతో ఏపీ తీవ్రంగా నష్టపోతోందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అమరావతి అంతా భ్రమరావతి అని ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. 2014-19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు?. ఇప్పుడు మూడేళ్లలో ఎలా పూర్తి చేస్తారు? అని ప్రశ్నించారు. విభజన హామీలు అడగరు కానీ.. వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మిస్తారా? అంటూ మండిపడ్డారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు జిమ్మిక్కులను ప్రజలు అర్థం చేసుకోవాలి. గతంలో ప్రధాని మోదీ మట్టి, నీరు తీసుకొచ్చి మా ముఖాన కొట్టారని చంద్రబాబు అనలేదా?. మోదీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని గతంలో పవన్ విమర్శించలేదా?. మోదీ, చంద్రబాబు పరస్పర అవసరాల కోసం రాజధానిని వాడుకుంటున్నారు. అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు. విభజన హామీలు అడగరు కానీ.. వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మిస్తారంట. ఒకరిని ఒకరు పొగుడుకోవడానికే సభ నిర్వహించినట్టు ఉంది.చంద్రబాబు విధానాలతో ఏపీ తీవ్రంగా నష్టపోతోంది. అమరావతి అంతా భ్రమరావతి అని ప్రజలు గమనిస్తున్నారు. అమరావతిపై ఇప్పటికే రూ.52వేల కోట్లు అప్పు చేశారు. ఈ అప్పులు ఎవరు తీర్చుతారు?. ఈ 52 వేల కోట్లను పారదర్శకంగా ఖర్చు పెడుతున్నారా?. 2014-19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు?. అన్నీ తాత్కాలిక భవనాలనే నిర్మించారు కదా?. తాత్కాలికం అంటూనే రూ.5000 కోట్లు ఖర్చు చేశారు. చదరపు అడుగుకు రూ.11వేలు ఖర్చు చేసి, డబ్బులు గంగలో కలిపారు. రాజధాని నిర్మాణానికి 53వేల ఎకరాలు సరిపోదా.. మరో 45వేల కావాలంట!. గన్నవరం పక్కనే అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మిస్తారట. 2014-19 మధ్యలో పూర్తి చేయని రాజధానిని వచ్చే మూడేళ్లలో ఎలా పూర్తి చేస్తారు?’ అని ప్రశ్నించారు.అమరావతి పున:ప్రారంభ సభలో చంద్రబాబు, లోకేష్ అసత్యాలు చెప్పారు. అమరావతి ఒక అంతులేని కథ. అమరావతి నిర్మించడంలో చంద్రబాబు అట్టర్ ప్లాప్ అయ్యారు. అందుకే చంద్రబాబును చిత్తుచిత్తుగా ఓడించారు. పది సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా విభజన చట్టంలో అవకాశం కల్పించారు. చంద్రబాబును అక్కడ తంతే ఇక్కడికి వచ్చి పడ్డాడు. రాత్రికి రాత్రే ఎందుకు హైదరాబాద్ నుండి వచ్చేశారు?. అమరావతి పేరుతో చంద్రబాబు అందరినీ ముంచేశారు. అమరావతి విధ్వంసం చేసిన వ్యక్తి చంద్రబాబు. అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ నగరం అని చెప్తున్నారు. సెల్ఫ్ సస్టైనబుల్ నగరానికి 52 వేల కోట్లు ఎందుకు అప్పు చేశారు. వర్షం పడితే అమరావతి పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
అంతా ఎల్లో మాయ.. రుషికొండా గోంగూరా అంటున్న కూటమి!
రుషికొండ నిర్మాణాల విషయంలో ఎల్లోమీడియా చేసిన రాద్ధాంతం గుర్తుందా?. టూరిజం శాఖ ఆధ్వర్యంలోని పాత భవనాలను తొలగించి అత్యాధునిక సదుపాయాలతో కొత్త భవనాలను నిర్మించే యోచన చేసినందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తెలుగుదేశం, జనసేన, ఈనాడు, ఆంధ్రజ్యోతి నానా విమర్శలూ చేశాయి. పర్యావరణం నాశనమైపోతోందని గగ్గోలు పెట్టారు. రిషికొండకు గుండు కొడుతున్నారని దుర్మార్గపు ప్రచారం చేశారు.సీన్ కట్ చేస్తే.. ఆ అభిప్రాయాలు ఇప్పుడు మారిపోయాయి. రుషికొండ వృథాగా పడి ఉన్న భూమి అయిపోయింది. రుషులు నడయాడిన భూమి కాస్తా ప్రైవేటు సంస్థలకు సంపద సృష్టించే కొండలయ్యాయి. ఆ ప్రాంతాన్ని బోడిగుండు చేసినా, పర్యావరణం విధ్వంసమైనా ఫర్వాలేదు. అది అభివృద్ది కింద లెక్క. జగన్ ప్రభుత్వం తరఫున భవనాలు నిర్మిస్తే అదంతా ఆయన వ్యక్తిగత అవసరాల కోసం కడుతున్నట్లు. ప్రస్తుతం వందల కోట్ల రూపాయల విలువైన భూమిని ఉత్తపుణ్యానికి ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతుంటే అది గొప్ప పని.అదేమిటి! మీరే కదా.. రిషికొండపై ఎలాంటి నిర్మాణాలు జరగరాదని చెప్పారే! అని ఎవరైనా ప్రశ్నిస్తే, లోపల నవ్వుకుని పిచ్చోళ్లారా? మేము ఏది రాస్తే దానిని నమ్మాలి?. మళ్లీ మేము మాట మార్చి అబద్దాలు రాస్తే అవే నిజమని నమ్మాలి.. అన్న చందంగా ఎల్లో మీడియా కథనాలు ఉంటున్నాయి. ఎల్లో మీడియా ఇప్పుడు ఏం రాస్తోందో చూశారా!. రిషికొండ భూముల గురించి ప్రశ్నించినా, అమరావతి రాజధానిలో లక్ష ఎకరాల పచ్చటి పంట భూములను ఎందుకు నాశనం చేస్తున్నారని అడిగినా.. అది రాష్ట్ర ప్రగతిపై పగ పట్టినట్లట.. గతంలో ఏ మీడియా అయితే తెలుగుదేశం, జనసేన వంటి పార్టీల కోసం దారుణమైన అసత్యాలు ప్రచారం చేశాయో, ఇప్పుడు అదే మీడియా మొత్తం రివర్స్‌లో రాస్తోంది. కూటమి ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించకూడదట. వారు ఎకరా 99 పైసలకు ప్రైవేటు వారికి, ఉర్సా కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నా అడిగితే విషనాగు బుసలు కొడుతున్నట్లట. ఇలా నీచంగా తయారైంది వీరి జర్నలిజం.ఒకప్పుడు పవిత్రమైన వృత్తిగా ఉన్న ఈ పాత్రికేయాన్ని వ్యభిచార వ్యాపారంగా మార్చేశారన్న బాధ కలుగుతుంది. అయినా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎవరు ఏమీ చేయలేరు. రిషికొండపై ఐదెకరాల భూమిలో భవనాలు కడితేనే విధ్వంసం అయితే, మరి రాజధాని పేరుతో లక్ష ఎకరాలలో పర్యావరణ విధ్వంసం జరుగుతుంటే ఎవరూ ప్రశ్నించకూడదట. అది పెట్టుబడులను అడ్డుకోవడమట. ఊరూపేరులేని ఉర్సా కంపెనీకి సంబంధించి ప్రభుత్వమే ఇంతవరకు వివరణ ఇవ్వలేకపోయినా, తెలుగుదేశం పక్షాన ఎల్లో మీడియా మాత్రం భుజాన వేసుకుని అది గొప్ప కంపెనీ అని చెబుతోంది. రెండు నెలల క్రితం ఏర్పడిన సంస్థకు ఏకంగా మూడు వేల కోట్ల విలువైన అరవై ఎకరాల భూమిని ఎవరైనా ఇస్తారా?. అదానీకి గత జగన్ ప్రభుత్వం డేటా సెంటర్ నిమిత్తం ఎకరా కోటి రూపాయల చొప్పున భూమి ఇస్తే ఏపీని అదానీకి జగన్ రాసిచ్చేస్తున్నారంటూ ప్రచారం చేసిన వారికి, బోగస్ అని ఆరోపణలు ఎదుర్కుంటున్న కంపెనీ మాత్రం అంతర్జాతీయ సంస్థ. వినేవాడు ఉంటే చెప్పేవాడు ఏమైనా చెబుతాడని సామెత.ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లోమీడియా రీతి అలాగే ఉంది. జగన్ ప్రభుత్వంలో ఏవైనా లోపాలు ఉంటే వార్తలు ఇస్తే తప్పు కాదు. కానీ, ఉన్నవి, లేనివి రాసి పాఠకులను మోసం చేసి, ప్రజలను ప్రభావితం చేయడానికి పత్రికలను పార్టీ కరపత్రాలుగా, టీవీలను బాకాలుగా మార్చేసుకుని నిస్సిగ్గుగా పనిచేస్తుండటమే విషాదకరం. అదే చంద్రబాబు ప్రభుత్వం రాగానే అంతా బ్రహ్మండం, భజగోవిందం అని ఒకటే భజన చేస్తున్నారు. ఇక, అమరావతి విషయానికి వద్దాం. అమరావతి రాజధానికి ఏభై వేల ఎకరాలు సరిపోతుందనే కదా గత ప్రభుత్వ హయాంలో చెప్పింది. మళ్లీ ఇప్పుడు కొత్తగా 45 వేల ఎకరాలు ఎందుకు అని అడిగితే అంతర్జాతీయ నగరం కావాలా? మున్సిపాల్టీగానే ఉంచాలా అన్నది తేల్చుకోవాలన్నట్లుగా ముఖ్యమంత్రే బెదిరిస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం లేకపోతే అది ప్రపంచ నగరం కాదట. అంతర్జాతీయ స్టేడియం లేకపోతే గుర్తింపు ఉండదట. 2014 టర్మ్‌లో నవ నగరాలు అంటూ ఓ పెద్ద కాన్సెప్ట్ చెప్పారు కదా? అందులో క్రీడా నగరం కూడా ఉంది కదా? అప్పుడు కూడా స్టేడియం ప్లాన్ చేశారు కదా? మళ్లీ ఇప్పుడు ఈ పాట ఏమిటి అని అడగకూడదు. అడిగితే అమరావతికి అడ్డుపడినట్లు అన్నమాట.లక్ష ఎకరాలు, లక్ష కోట్ల రూపాయల విలువైన పనులు చేపడుతున్నామని మంత్రి నారాయణ ప్రకటించారు. లక్ష కోట్ల రూపాయల విలువైన పనులు కేవలం రాజధాని పేరుతో ఉన్న ఆ ముప్పై, నలభై గ్రామాలలోనే చేపడితే, మిగిలిన ప్రాంతం పరిస్థితి ఏమిటని ఎవరూ ప్రశ్నించకూడదు. అందుకే వ్యూహాత్మకంగా రాయలసీమకు ఏదో ఇస్తున్నామని, ఉత్తరాంధ్రకు ఇంకేదో ఇస్తున్నామని ఆ ప్రాంత ప్రజలను భ్రమలలో పెట్టడానికి కొన్ని కార్యక్రమాలు చేయడం, ప్రచారం సాగించడం జరుగుతోంది.ఉదాహరణకు ఎప్పటి నుంచో కడప సమీపంలోని కొప్పర్తి పారిశ్రామిక వాడను కొత్తగా ఇవ్వబోతున్నట్లు ఎల్లో మీడియా రాసింది. ఇదంతా డైవర్షన్ రాజకీయం అన్నమాట. మరో వైపు అమరావతి అంటే ఎంత విస్తీర్ణం, పరిధులు ఏమిటి అన్నదానిపై కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు నోటిఫై చేయలేదట. ఇప్పుడు దానిపై ఆలోచన చేస్తారట. ఇంకో సంగతి చెప్పాలి. గత టర్మ్‌లో మోదీ శంకుస్థాపన చేయడానికి ముందు, ఆ తర్వాత, ఆయా నిర్మాణాలకు స్వయంగా చంద్రబాబు తన కుటుంబ సమేతంగా పూజలు, పునస్కారాలు చేసి మళ్లీ శంకుస్థాపనలు చేశారు. కేంద్రం నుంచి కొందరు ప్రముఖులను కూడా అందులో భాగస్వాములను చేశారు. గతంలో మాదిరే ఇప్పుడు కూడా ఆర్భాటాలకు వందల కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకో మాట చెప్పాలి.తెలంగాణలో హైదరాబాద్‌లో 400 ఎకరాల భూమిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏవో నిర్మాణాలు చేయతలపెడితే పర్యావరణం విధ్వంసం అయిందని మోదీనే నానా యాగీ చేశారు. అలాంటిది ఏపీలో లక్ష ఎకరాలలో పర్యావరణాన్ని నాశనం చేస్తుంటే, పచ్చటి పంట భూములను బీడులుగా మార్చుతుంటే, అదంతా అభివృద్ది అని మోదీ కూడా భావిస్తున్నారేమో తెలియదు. చంద్రబాబు, మోదీ.. 2019 టైమ్ లో తీవ్రంగా ఒకరినొకరు విమర్శించుకున్నారు. దేశ ప్రధానిని ఉగ్రవాది అని చంద్రబాబు అంటే, ఈయనను పెద్ద అవినీతిపరుడని, పోలవరంను ఏటీఎంగా మార్చుకున్నారని మోదీ ధ్వజమెత్తారు. 2024 నాటికి మళ్లీ సీన్ మారింది. వీరిద్దరూ ఒకరినొకరు పొగుడుకుంటున్నారు. ఇదేమిటి.. ఇంత సీనియర్ నేతలు ఇలా చేయవచ్చా అని ఎవరైనా అమాయకులు అడిగితే అది వారి ఖర్మ అనుకోవాలి.గతసారి మోదీ అమరావతి వచ్చి చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చి వెళ్లారని అప్పట్లో చంద్రబాబు నిందించేవారు. ప్రస్తుతం కేంద్రం బ్రహ్మాండంగా సాయం చేస్తోందని చెబుతున్నారు. అది నిజమో కాదో అందరికీ తెలుసు. రిషికొండ అయినా, అమరావతి అయినా తమ రాజకీయ అవసరాలకు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఎన్ని డ్రామాలు అయినా ఆడగలుగుతున్నారు. అదే వారి గొప్పదనం.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అర్చకుల మాట వినకుండా గోడ నిర్మాణం.. ఇంత నిర్లక్ష్యమా?
-
KSR Live Show: అమరావతి కేరాఫ్ అవినీతి
-
తూర్పుగోదావరిజిల్లా అనపర్తి నియోజకవర్గంలో కూటమి అరాచక రాజ్యం
-
కూటమి కుట్రలపై మండిపడ్డ ఎంపీ గురుమూర్తి
-
అమరావతి సభలో పాచిపోయిన భోజనం.. కూటమిపై మహిళలు ఫైర్
-
అధికారంలో లేకున్నా అరటి రైతులను ఆదుకున్న వైఎస్సార్సీపీ
-
సింహాచలం ఘటన నుంచి తప్పించుకునేందుకు కూటమి సర్కారు ప్రయత్నాలు
-
Big Question: మన రాజధానికి అడ్డెవరు? ప్రధాని ముందే పచ్చి అబద్దాలు
-
పొగడ్తలేనా.. ప్రయోజనాలు పట్టవా..!
-
దేశాభివృద్ధికి ఏపీని ఇంజన్‌గా చేస్తాం
సాక్షి, అమరావతి : ‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మీ భుజంతో పాటు నా భుజం కలిపి పనిచేస్తా. రాష్ట్రాభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆంధ్రప్రదేశ్ యువకుల కలలను నిజం చేసేందుకు అంకిత భావంతో పనిచేస్తామని హామీ ఇస్తున్నా’ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అమరావతి పునఃప్రారంభంలో భాగంగా రూ.58 వేల కోట్ల విలువైన పనులకు ప్రధాని శుక్రవారం శంకుస్థాపన చేశారు. వెలగపూడిలోని సచివాలయం వెనుక భాగంలో నిర్వహించిన సభలో ప్రధాని మాట్లాడుతూ తల్లి దుర్గాభవాని కొలువైన పుణ్యభూమిపై మీ అందరినీ కలవడం ఆనందంగా ఉందన్నారు. ‘దాదాపు రూ.60 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం. ఇవి కేవలం కాంక్రీట్ నిర్మాణాలు మాత్రమే కాదు. ఏపీ ఆశలకు, వికసిత్ భారత్ ఆశయాలకు బలమైన పునాది. ఈ సందర్భంగా వీరభద్రస్వామికి, అమరలింగేశ్వరస్వామికి, తిరుపతి వెంకన్న పాదాలకు నమస్కరిస్తూ ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు. ప్రసంగాన్ని తెలుగులోనే ప్రారంభించిన ప్రధాని మోదీ మధ్యలో కొన్ని తెలుగు వాక్యాలు పలికారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. పదేళ్లుగా చేయూతనిచ్చాం... ఇంద్రుడి రాజధాని అమరావతి.. ఏపీ రాజధాని అమరావతి. ప్రతి యువకుడి కలలు నిజమయ్యే నగరంగా అమరావతి తయారవుతోంది. ఐటీ, ఏఐ, గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఇండస్ట్రీస్, విద్య, ఆరోగ్య రంగాల్లో రానున్న రోజుల్లో అమరావతి దేశంలోనే ప్రధాన నగరంగా నిలవబోతోంది. 2015లో అమరావతికి శంకుస్థాపన చేశా. ఈ పదేళ్లలో అమరావతికి అన్ని రకాలుగా సంపూర్ణ మద్దతు ఇచ్చాం. వికసిత్ ఏపీ కోసం నాడు ఎన్టీఆర్ కలగన్నారు. మనందరం కలసి అమరావతి, ఏపీని వికసిత్ భారత్ దేశానికి గ్రోత్ ఇంజన్‌గా తయారు చేయాలి. రైలు, రోడ్డు ప్రాజెక్టులకు రూ.వేల కోట్లు.. రైలు, రోడ్డు ప్రాజెక్టులకు కేంద్రం రూ.వేల కోట్లు అందిస్తోంది. దీనివల్ల ఏపీలో జిల్లాల మధ్య అనుసంధానం, పక్క రాష్ట్రాలతో కనెక్టివిటీ మెరుగుపడుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల తరలింపు, పర్యాటకం పెరిగేందుకు దోహదం చేస్తుంది. రేణిగుంట నుంచి నాయుడుపేట మధ్య నిర్మిస్తున్న కొత్త హైవే వల్ల తిరుపతి వెంకన్నను తక్కువ సమయంలో దర్శించుకోవచ్చు. రైల్వే బడ్జెట్లో ఉమ్మడి రాష్ట్రానికి రూ.900 కోట్లకు మించి కేటాయింపులుండేవి కావు. ఇప్పుడు విభజిత ఏపీకి రూ.9 వేల కోట్లకు పైగా అందిస్తున్నాం. ఏపీలో వంద శాతం ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేసుకున్నాం. 8 సరికొత్త వందేభారత్ రైళ్లు ప్రారంభించాం. 750కిపైగా రైల్వే ఫ్లైఓవర్లు, అండర్ పాసేజ్‌లు నిర్మించాం. 70కిపైగా రైల్వేస్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ కింద అభివృద్ధి చేశాం. నాలుగు స్తంభాలు కేంద్ర బిందువుగా పేదలు, రైతులు, యువత, మహిళాశక్తి.. ఈ నాలుగు స్తంభాలపై వికసిత్ భారత్ నిర్మాణం ఆధారపడి ఉంటుంది. రైతులపై భారం పడకుండా పదేళ్లలో ఎరువుల సబ్సిడీ కోసం రూ.12 లక్షల కోట్లు ఖర్చు చేశాం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై) ద్వారా ఒక్క ఏపీలోనే సుమారు రూ.5,500 కోట్ల బీమా పరిహారం అందించాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం (పీఎం కిసాన్) ద్వారా రాష్ట్రంలో రైతులకు రూ.17,500 కోట్ల మేర పెట్టుబడి సాయం అందించాం. పోలవరం ప్రాజెక్టు పూర్తికి సహాయ సహకారాలు అందిస్తాం. నవదుర్గా మిస్సైల్ లాంచ్ కేంద్రం.. అంతరిక్ష శక్తిగా దేశం అవతరించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. శ్రీహరికోట నుంచి లాంచ్ అయ్యే ప్రతీ రాకెట్ కోట్లాది మంది భారతీయులు గర్వించేలా చేస్తుంది. కోట్లాది మంది దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో డీఆర్డీవో నవదుర్గా మిస్సైల్ లాంచింగ్ రేంజ్‌కు శంకుస్థాపన చేశాం. నాగాయలంకలో నిర్మించబోయే ఈ కేంద్రం కనక దుర్గమ్మలా దేశ రక్షణకు నిరంతరం శక్తిని ఇస్తుంది. దేశవ్యాప్తంగా ఏక్తా మాల్స్ నిర్మించబోతున్నాం. ఇందులో ఒకటి విశాఖపట్నంలో నిర్మించేందుకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉంది. దేశవ్యాప్తంగా హస్తకళాకారుల ఉత్పత్తులు ఒకే చోటకు తెచ్చేందుకు వీలుంటుంది.21న విశాఖలో యోగా దినోత్సవం.. జూన్ 21న విశాఖలో నిర్వహించే యోగా దినోత్సవానికి నన్ను ఆహ్వానించడం ఆనందంగా ఉంది. ఆరోజు ప్రపంచ ప్రజలంతా ఏపీ వైపు చూసేలా చేయాలి. అందుకోసం ఈ 50 రోజుల్లో ప్రతి గ్రామం, ప్రతి వీధి, ప్రతి ఇంట్లో యోగాకు ప్రాముఖ్యత కల్పించేలా, వరల్డ్ రికార్డు సాధించేలా కృషి చేయాలి. ఏపీలో కలలు గనే వారి సంఖ్య తక్కువేమీ కాదు. వాటిని నిజం చేసే వారూ తక్కువేమీ లేరు. మూడేళ్లలో అమరావతి పనులు పూర్తి చేస్తామంటున్నారు. అమరావతి పనులు పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ జీడీపీ ఏ స్థాయిలోకి దూసుకెళ్తుందో ఊహించగలను.ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలబెడతాం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్అమరావతి ఆర్కిటెక్చరల్ జోన్‌గా, కాంక్రీట్ జంగిల్‌గా మిగిలిపోకుండా జవాబుదారీతనంతో ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పాలనలో అమరావతి వరల్డ్ క్లాస్ రాజధానిగా ఎదుగుతుందన్నారు. గత ప్రభుత్వం అమరావతి భవిష్యత్తును, ప్రజల ఆకాంక్షలను దివిసీమ ఉప్పెన మాదిరి తుడిచి పెట్టాలని చూసిందని విమర్శించారు. అమరావతితో పాటు రాష్ట్రాభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ప్రపంచంలోనే టాప్ 5 రాజధానుల్లో అమరావతిని నిలబెట్టాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్టు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు.కక్షతో నిలిపేశారు: మంత్రి లోకేశ్ సీఎం చంద్రబాబుపై వ్యక్తిగత కక్షతోనే అమరావతి నిర్మాణాన్ని నిలిపివేశారని మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ విమర్శించారు. గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో ఐదేళ్లు కాలం గడిపేసిందన్నారు. మోదీ శంకుస్థాపన చేసిన రాజధానిని అపే దమ్ము ఎవరికీ లేదన్నారు. నరేంద్ర మోదీ అనే మిస్సైల్ ఉండగా వందల పాకిస్తాన్‌లు వచ్చినా భారత్‌ను ఏమీ చేయలేరన్నారు.మూడేళ్లలో నిర్మిస్తాంమోదీ ఆశీస్సులతోనే అమరావతి పనులు పట్టాలెక్కించాం: సీఎం చంద్రబాబు ప్రపంచంలోనే శక్తిమంతమైన నాయకుడు మోదీ 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం సాక్షి, అమరావతి: అమరావతి పనులను మూడేళ్లలో పూర్తి చేసి ప్రధాని మోదీ చేతుల మీదుగా కొత్త రాజధానిని ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా అమరావతిని నిర్మించి ప్రపంచ పటంలో నిలబెడతామన్నారు. శుక్రవారం ‘అమరావతి పునః ప్రారంభ’ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 2015లో ప్రధాని మోదీ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే ఆ తర్వాత ప్రభుత్వం విధ్వంసం చేసిందని విమర్శించారుగత పది నెలల్లో కేంద్ర సహకారం, మోదీ ఆశీస్సులతో అమరావతి పనులను పట్టాలెక్కించామన్నారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిని క్వాంటం వ్యాలీ సిటీగా మారుస్తామన్నారు. కేంద్రం సహకారంతో 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో ఐదు కోట్ల ఆంధ్రులు ప్రధాని మోదీకి మద్దతుగా ఉంటారన్నారు. మోదీ నాయకత్వంలో మనదేశం ప్రపంచంలో గొప్ప శక్తిగా ఆవిర్భవిస్తోందన్నారు. -
వచ్చే మంగళవారం.. మరో భారీ అప్పుకు బాబు సిద్ధం!
విజయవాడ: ఇప్పటివరకూ రికార్డ్ స్థాయిలో అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. మరో భారీ అప్పుకు రెడీ అయ్యింది. రాష్ట్రాన్ని అప్పులు చేసి నడిపించడంలో భాగంగా వచ్చే మంగళవారం రూ. 7వేల కోట్ల అప్పుకి ఇండెంట్ పెట్టింది. రిజర్వ్ బ్యాంకుకి ఇండెంట్ పెట్టింది చంద్రబాబు సర్కార్. ఇప్పటివరకూ లక్షా 52 వేల కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. మళ్లీ రూ. 7వేల కోట్ల అప్పుకి సిద్ధం కావడం గమనార్హం.ఎన్నికల సమయంలో సంపద సృష్టి తనతోనే సాధ్యమని చెప్పిన చంద్రబాబు.. ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుల సృష్టి కోసమే వేట కొనసాగిస్తున్నారు. ఏడాది కాలంలోనే రికార్డు స్థాయిలో అప్పులు చేయడం చూస్తే చంద్రబాబు ‘సంపద సృష్టి’ భలేగా ఉంది అంటూ జనాలు నవ్వుకుంటున్నారు. -
ప్రధాని సభలో ఏపీ హక్కులపై బాబు, పవన్‌లు మౌనం
అమరావతి: అమరావతి పునః ప్రారంభ కార్యక్రమంలో భాగంగా ఏపీకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఎదుట.. రాష్ట్ర హక్కులపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు మౌనం పాటించారు. రాష్ట్ర విభజన నాటి ఏపీ హక్కుల గురించి ప్రధాని మోదీ వద్ద.. వీరు కనీసం ప్రస్తావించలేదు. కేవలం ప్రధాని మోదీపై పొగడ్తల వర్షం కురిపించిన బాబు.. విభజన సమస్యల పరిష్కారం అంశానికి సంబంధించి మోదీ నుంచి ఎటువంటి ప్రకటన చేయించలేకపోయారు.విభజన హామీలు పెండింగ్ లో ఉన్నందను చంద్రబాబు, పవన్‌లు కనీసం మోదీ వద్ద ఆ ప్రస్తావన తెచ్చి ఉంటే బాగుండేది. కానీ వారు ఆ పని చేయలేదు. అమరావతిని రీలాంచ్ చేసే కార్యక్రమం వరకే పెట్టుకున్నట్లే చంద్రబాబు, పవన్‌ల ధోరణి కనబడింది. ప్రధాని బ్లెస్సింగ్స్ కావాలన్నారే కానీ ఏపీ హక్కుల కోసం మాత్రం అడగలేదు చంద్రబాబు. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరణ, పోలవరం ఎత్తు తగ్గింపుపై స్పష్టత తదితర అంశాలు మోదీ వద్ద చంద్రబాబు, వవన్‌లు ప్రస్తావించలేదు.అమరావతి రీలాంచ్ కార్యక్రమంలో భాగంగా కొత్తగా మరో శిలాఫలకాన్ని ఆవిష్కరించారే కానీ, విభజన నాటి ఏపీ హక్కుల గురించి మాత్రం మోదీ ప్రసంగంలో కానీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల ప్రసంగంలో కానీ కనీసం మచ్చుకైనా కనిపించకపోవడం గమనార్హం.పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు -
అమరావతిలో మోదీ స్పీచ్
-
అమరావతిలో బాబు స్పీచ్ ఆసక్తిగా వింటున్న జనం
-
అమరావతి సభలో పాచిపోయిన భోజనం కూటమిపై మహిళలు ఫైర్
-
వెలగపూడిలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
-
ఏపీలో రూ. 49 వేల కోట్లతో చేపడుతున్న పనులకు మోదీ శంకుస్థాపన
-
KSR: చంద్రబాబు సర్కార్ భూదాహానికి వంత పాడుతున్న ఎల్లో మీడియా