రాజధానిలో పేదలు ఉండకూడదా? | 2:03 Jupudi Prabhakar Rao Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

రాజధానిలో పేదలు ఉండకూడదా?

May 4 2025 4:34 AM | Updated on May 4 2025 4:34 AM

2:03 Jupudi Prabhakar Rao Fires On Chandrababu

సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ నేత జూపూడి ఆగ్రహం 

వైఎస్‌ జగన్‌ హయాంలో ఇచ్చిన 50 వేల ఇళ్ల పట్టాల రద్దు దుర్మార్గం 

ఏకంగా ఆర్‌5 జోన్‌నే తొలగించడం అన్యాయం 

ఇలాంటప్పుడు అమరావతి ప్రజా రాజధాని ఎలా అవుతుంది?

సాక్షి, అమరావతి: అమరావతి రాజధానిలో పేదలు, బడుగువర్గాలు ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2014–19లో మట్టి, నీరు తెచి్చచ్చారంటూ విమర్శించిన ప్రధానినే మరోసారి పిలిచి పెద్ద ఈవెంట్‌ నిర్వహించారని చెప్పారు. గతంలో ప్రారంభించిన పనులకే మళ్లీ శంకుస్థాపన చేయించడం నాలుగుసార్లు సీఎం అయిన చంద్రబాబుకే చెల్లిందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే రాజధాని అంటే చంద్రబాబు దృష్టిలో ఆయనకు అనుకూలమైన సామాజిక వర్గం మాత్రమే ఉండే రాజధాని అని అర్థం అన్నారు. కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైన దానిని ప్రజా రాజధాని అనగలమా? అని నిలదీశారు.

‘గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రాజధాని ప్రాంతంలో ఆర్‌5 జోన్‌ను ఏర్పాటు చేసి.. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ.. ఇలా అన్ని వర్గాల వారు ఉండాలని భావించింది. అందుకోసం వారికి దాదాపు 900 ఎకరాలను కేటాయించింది. మొత్తం 50,793 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచి్చంది. అయితే దీనిపై టీడీపీ న్యాయస్థానాల్లో 26 పిటీషన్లు వేయించింది. రాజధానిలో పేదలు ఉంటే, అది ప్రజా రాజధానికే వ్యతిరేకమని మాట్లాడారు. జీఓ 45ను రద్దు చేయాలని న్యాయస్థానాల్లో వాదనలు వినిపించారు. అన్ని వర్గాల వారు లేకుండా రాజధాని ఎలా ఉంటుందని న్యాయస్థానం సైతం పిటిషనర్‌ను ప్రశ్నించింది.

దీనిపై చంద్రబాబు డైరెక్షన్‌లో సుప్రీంకోర్టు వరకు తీసుకువెళ్లారు. అత్యున్నత న్యాయస్థానం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ కేసులను కొట్టేసింది. అయినప్పటికీ గత ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేయడం, ఆర్‌5 జోన్‌నే తొలగించడం దుర్మార్గం, అన్యాయం’ అని మండిపడ్డారు. అలాంటప్పుడు రాజధాని అప్పులతో మిగిలిన వారికి సంబంధం లేదని ప్రకటిస్తారా.. అని నిలదీశారు. ప్రధాని ఎదుట విభజన హామీల గురించి, పోలవరం గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశి్నంచారు.

Advertisement
 
Advertisement
Advertisement