
అనంతపురం: సీఎం చంద్రబాబు నాయుడుకు జిల్లా పర్యటనలో నిరసన సెగ గట్టిగానే తగిలింది. ఈరోజు(శుక్రవారం) ఉరవకొండ నియోజకవర్గం చాయపురంలో చంద్రబాబు పర్యటించిన క్రమంలో ఏబీవీపీ ఆందోళనకు దిగింది.. జీవో 77ను రద్దు చేయాలంటూ ఏబీవీపీ కార్యకర్తంలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. గో బ్యాక్ సీఎం అంటూ ఫ్లకార్డు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు.
సీఎం చంద్రబాబు ఎదుట నిరసన తెలిపేందుకు వెళ్తున ఏబీవీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని సీఎం చంద్రబాబు ఎదుట నిరసన తెలపకుండా అడ్డుకున్న పోలీసులు.. అరెస్ట్ చేశారు. వీరిని అరెస్ట్ చేసిన తర్వాత చిన్నహోతూరు ప్రభుత్వ పాఠశాలలో పోలీసులు నిర్భందించారు. బీజేపీ అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘం ఏబీవీపీ నిరసనపై సర్వత్రా చర్చ నడుస్తోంది. చంద్రబాబు ఒకవైపు ఎన్డీఏ కూటమిలో ఉండగా, బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ నిరసన వ్యక్తం చేయడం చర్చకు దారి తీసింది.