Top Stories
ప్రధాన వార్తలు
వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
ఏపీలో శాసనసభ ఎన్నికలు ముగిశాయి కనుక ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియాలో మార్పు వస్తుందేమోలే అని ఆశించినవారికి యధాప్రకారం ఆశాభంగమే ఎదురైంది. ఎన్నికల ముందు ఎలాగైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిను, ఆయన ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి విశ్వయత్నం చేశారో, వైఎస్సార్సీపీపై విషం కక్కారో అదే ధోరణి ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అవే అబద్దాలు, అవే మోసపూరిత కథనాలు, కక్ష, విద్వేషంతో కూడిన వార్తలు రాస్తూ ప్రజలను ఇంకా తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు.ఎన్నికల పోలింగ్ జరిగిన రోజున, పోలింగ్ అయిన తర్వాత జరిగిన హింసపై వారు తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకున్న తీరు నీచంగా ఉంది. టీడీపీ వారిని రక్షించడానికి, వారి ప్రమేయంతో నియమితులైన పోలీసు అధికారులకు ఎలాంటి సమస్య రాకుండా చేయాలన్న లక్ష్యంతో వారు రాస్తున్న వార్తలు జర్నలిజం ప్రమాణాలను దిగజార్చుతూనే ఉన్నాయి. ఈ ఘటనలలో ఇరు వర్గాల తప్పులు ఉంటే వాటిని రిపోర్టు చేయవచ్చు. అలాకాకుండా ఏకపక్షంగా రాస్తున్న తీరును బట్టే ఈ అల్లర్లు పెత్తందార్లే చేశారని అర్థం అవుతుంది. బలహీనవర్గాలపై జరిగిన దాడుల పట్ల కూడా మానవత్వం లేకుండా రామోజీ వార్తలు రాయించారంటే పేదలపై ఎంతటి పగ పట్టారో తెలుస్తుంది.ఎన్నికల సంఘం ఈ దాడులపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలని ఆదేశిస్తే, ఆ ప్రకారం ప్రభుత్వం కొంతమంది అధికారులను ఎంపిక చేసింది. అంతే!ఈనాడు రామోజీకి నచ్చలేదట. వారందరికి రాజకీయాలు అంటగడుతూ రాసేశారు. అంటే ముందస్తుగానే సిట్ అధికారులను ప్రభావితం చేయడానికి, భయపెట్టడానికి వీరు ప్రయత్నం చేశారన్నమాట. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై వారు ఇచ్చిన స్టోరీలు చూస్తే వీరు ఉగ్రవాదుల కన్నా ఘోరంగా మారారన్న సంగతి ఇట్టే అర్థం అయిపోతుంది. ఈనాడు రామోజీరావు రాస్తే ఎవరినైనా ఉద్యోగం నుంచి తీసివేయాల్సిందే. ఆయన ఎవరిని కోరితే వారిని ఆయా పోస్టులలో నియమించాల్సిందే. లేకుంటే వారిపై బండలు వేస్తాం. వారిని నైతికంగా దెబ్బతీస్తాం. ఈ క్రమంలో వారు చెప్పినట్లు వింటే సరి.. ఎక్కడైనా ఒకటి, రెండు విషయాలలో మరీ బాగుండదని వినకపోతే.. ఇంకేముంది.. ఎన్నికల సంఘాన్ని వదలిపెట్టం అన్న రీతిలో దారుణమైన కథనాలు వండి పాఠకులను మోసం చేస్తున్నారు.ఇలా ఒకటి కాదు.. ఎక్కడ వీలైతే అక్కడ మళ్లీ బురద వేయడం చేస్తున్నారు. ఎన్నికలు అయ్యాయో, లేదో ఇంకా డీబీటీ కింద లబ్దిదారులకు డబ్బులు ఎందుకు వేయలేదని రాశారు. పేదలకు కాకుండా కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తున్నారని ప్రచారం చేశారు. కానీ ప్రభుత్వం తన డ్యూటీ ప్రకారం ఆయా స్కీముల కింద నిధులు విడుదల చేసింది. ఇంకా వారికి ఇవ్వలేదు.. వీరికి ఇవ్వలేదు.. అంటూ పిచ్చి కథనాలు ఇస్తున్నారు. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకపోతే చేసిన పనులకు బిల్లులు రాక వారు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని రాసేది వీరే. బిల్లులు చెల్లిస్తుంటే స్కీముల డబ్బును కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని రాసేది వీళ్లే.రాజకీయ నేతలు డబుల్ టాక్ చేయడంలో దిట్టలని అనుకుంటాం. అందులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి నేతలు డాక్టరేట్ సంపాదించారని అంతా భావిస్తారు. కానీ వారిని మించి రామోజీరావు, రాధాకృష్ణ వంటి ఎల్లో మీడియా వారు ఏది పడితే అది రాసి పరువు పోగొట్టుకుంటున్నారు. వీరి పరిస్థితి ఎలా ఉందంటే ఒకసారి పరువు పోయాక, కొత్తగా పోయేదేముందిలే అని సిగ్గు విడిచి వ్యవహరిస్తున్నారని చెప్పాలి. ఎన్నికల సంఘం పల్నాడు, తాడిపత్రి, తిరుపతి వంటి చోట్ల జరిగిన హింసపై సిట్ దర్యాప్తు చేయాలని ఆదేశించగానే, టీడీపీకి కొమ్ముకాసి తప్పులు చేసిన అధికారులను రక్షించడానికి ఈ మీడియా పూనుకుంది. వైఎస్సార్సీపీవారే హింసకు పాల్పడ్డారని పిక్చర్ ఇవ్వడానికి ప్రయత్నించింది.వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కానీ, స్వయంగా ఒక మంత్రిగాని ఫోన్ చేస్తే బదులు ఇవ్వని ఎస్పీలను గొప్పవారిగా ప్రొజెక్టు చేయడానికి యత్నించారు. బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి టీడీపీ వారు రాసిన పిర్యాదుపై సంతకం చేసి ఎన్నికల కమిషన్‌కు పంపించారు. అందులో ఏ ఏ అధికారిని తొలగించాలో రాయడమే కాకుండా, ఫలానా వారిని నియమించాలని కూడా కోరడం చిత్రమైన సంగతి. ఎన్నికల సంఘం కూడా ప్రామ్ట్ గా వారు కోరిన విధంగా అధికారులను మార్పు చేసింది. ఆ సమయంలో డీజీపీ, సీఎస్‌ను, ఇంటెలెజజెన్స్ ఉన్నతాధికారిని బదిలీ చేయాలని ఈనాడు పెద్ద ఉద్యమంలా చెడరాసింది. ఈసీ ఒక్క సీఎస్‌ను తప్ప వారు కోరిన వారందరిని బదిలీ చేసింది.కొత్త అధికారులు వైఎస్సార్సీపీ ఓటర్లను బెదిరించి ఓటింగ్‌కు రాకుండా చేస్తారని వీరు ఆశించినట్లు ఉన్నారు. అది పూర్తి స్థాయిలో జరగలేదు. అయినా పేదలంతా వెల్లువలా ఓటింగ్‌కు తరలిరావడంతో వీరు ఆశించిన రీతిలో టీడీపీకి ప్రయోజనం కల్పించి ఉండకపోవచ్చు. దాంతో మరుసటి రోజు టీడీపీ వారు హింసాకాండకు దిగారు. నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆస్పత్రిపైన దాడి చేశారు. తాడిపత్రిలో టీడీపీ రౌడీ మూకలు అల్లర్లకు దిగితే పోలీసులు చోద్యం చూస్తున్నట్లు చూస్తూ కూర్చున్నారు. పైగా కొందరు పోలీసులు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిలోకి వెళ్లి అరాచకం చేశారు. అది కనిపించకుండా సీసీ కెమెరాలను కూడా పోలీసులే పగులకొట్టారు. మరో సీసీ కెమెరాలో చిక్కడంతో వారు దొరికిపోయారు. ఈ సన్నివేశం మొత్తం పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చింది. దాంతో అనంతపురం, పల్నాడు కొత్త ఎస్పీలను ఈసీ సస్పెండ్ చేసింది.ఇది కేవలం తెలుగుదేశం వారి నిర్వాకమే. రామోజీ వంటివారి నీచమైన రాతల ఫలితమే అని చెప్పాలి. మరి కొందరిపై బదిలీ వేటు పడింది. ఇప్పుడు వారిని రక్షించడానికి కంకణం కట్టుకున్న ఈనాడు రామోజీరావు సీఎస్‌పై అడ్డగోలు కథనం రాశారు. మొత్తం ఈ హింసాకాండకు సీఎస్ బాధ్యుడని రామోజీ తేల్చేశారు. ఆయన ఎలా బాధ్యుడు అవుతారో అర్థం కాదు. కొత్తగా నియమితుడైన డీజీపీ బాధ్యుడు కాదట. టీడీపీ, ఈనాడు ఏరికోరి వేయించుకున్న ఎస్పీలు బాధ్యులు కాదట. అర్థం, పర్థం లేకుండా ఎన్నికల సంఘం ఎన్నికలకు రెండు, మూడు రోజుల ముందు చేసిన తెలివితక్కువ నిర్ణయాలు కారణం కాదట. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక సీఎస్ వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారని రామోజీ తేల్చేశారు.జవహర్ రెడ్డి ఏమి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు? ఈసీ ఏమి చెబితే అది చేశారు తప్ప సొంతంగా ఆయన చేసింది ఏముంది? అయినా రామోజీ మరి అది పార్టీ పక్షపాతమో, కుల పక్షపాతమోకానీ, నిర్లజ్జగా ప్రభుత్వ ఉన్నతాధికారి నైతికస్థైర్యం దెబ్బతినేలా చెత్త వార్తలు రాసి పారేశారు. చేతిలో టీవీ, పేపర్ ఉంది కదా అని, ఎలాగూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆయా వ్యవస్థలలో తమకు పలుకుబడి ఉంది కదా అని ఇంత ఘోరంగా వార్తలు ఇస్తారా? నిజానికి ఇలాంటి వార్తలు రాసిన ఈనాడు రామోజీరావుపై కేసు పెట్టాలి! ఈసీ ఛీఫ్ సెక్రటరీపై ఆధారపడుతూ నిర్ణయాలు చేసిందట. అంటే చంద్రబాబుకో, రామోజీకో ఫోన్ చేసి వారు ఏమి ఆదేశిస్తే అది చేయాలన్నది వీరి కోరిక కావచ్చు. అక్కడికి వీరు అడిగినవన్నీ ఈసీ చేసినా కనీసం కృతజ్ఞత లేకుండా ఈసీని ఆక్షేపిస్తూ వార్తలు ఇచ్చారంటేనే వీరు ఎంత అవకాశవాదులో అర్థం చేసుకోవచ్చు.వృద్దులకు ఇళ్ల వద్ద వలంటీర్ల ద్వారా పెన్షన్ ఇవ్వద్దని ఈసీ ద్వారా చెప్పించిందే తెలుగుదేశం, ఈనాడు రామోజీ వంటి వారు అయితే దానికి జవహర్ రెడ్డి బాధ్యుడట. ఈసీ సూచనలను పరిగణనలోకి తీసుకునే సీఎస్ గ్రామ సచివాలయాలకు వెళ్లి పెన్షన్ తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినా ఆయనపైనే ఏడుపుగొట్టు వార్తలు. బ్యాంకుల ద్వారా పెన్షన్ ఇవ్వాలని కోరింది నిమ్మగడ్డ రమేషే కదా! అయినా ఆయన తప్పు లేదట. జనం అందరికి ఇది అర్థం అయినా రామోజీకి ఇంకా తెలియలేదు. వృద్దులంతా చంద్రబాబును, నిమ్మగడ్డను, రామోజీ వంటివారిని బండబూతులు తిట్టిన సంగతి జనానికి తెలియదా! సీఎస్‌నుంచి ఈసీ నివేదిక తెప్పించుకుని అధికారులను నియమించిందట.రామోజీ కొత్త రాజ్యాంగం రాయాలి. ప్రతిపక్ష నేతనో, లేక రామోజీనో నివేదికలు అడగాలి కాబోలు. పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగితే ఛీఫ్ సెక్రటరీని బాధ్యుడిని చేయకపోవడం ఏమిటి? అని ఈనాడు రాసిందంటే వారు జర్నలిజం చేస్తున్నారా? లేక ఇంకేమైనా చేస్తున్నారా? అనే అనుమానం వస్తుంది. ఈసీకి జాబితాలు పంపించి, వారు ఎవరిని నియమించమని చెబితే వారిని అప్పాయింట్ చేస్తే అది కూడా జవహర్ రెడ్డి తప్పేనట. ఈయన ఉంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని విపక్షాలు అన్నాయట. అది వేద వ్యాఖ్యమట.ఆయా స్కీములకు కొన్ని నెలలు డబ్బు వేయకుండా, ఎన్నికల ముందు లబ్దిదారులకు ఇచ్చేయత్నం చేశారని అన్నారు. మరి చంద్రబాబు ఎన్నికల ముందు పసుపు-కుంకుమ అని, అన్నదాత సుఖీభవ అని డబ్బులు వేస్తే గొప్ప విషయమని ఇదే ఎల్లో మీడియా ఆ రోజుల్లో ప్రచారం చేసింది. ఇప్పుడు ఎన్నికల సమయంలో లబ్దిదారులకు డబ్బులు పడకుండా ఆపింది టీడీపీ, ఎల్లో మీడియానే కదా! ఇంక వైఎస్సార్సీపీకి వచ్చిన లాభం ఏముంది. చివరిగా వీరి అసలు బాధ బయటపెట్టేశారు. ఏపీ ప్రభుత్వం వివిధ ఆరోపణలపై సస్పెండ్ చేసిన ఏబీ వెంకటేశ్వరరావుకు వెంటనే పోస్టింగ్ ఇవ్వలేదట. అదట వీరి కడుపు నొప్పికి కారణం. ఈయనేమో టీడీపీ ఆఫీస్‌లో కూర్చుని పోలీసు అదికారులను ప్రభావితం చేయడానికి కృషి చేశారని వైఎస్సార్సీపీ ఆరోపించింది. అయినా పోస్టింగ్ ఎందుకు ఇవ్వలేదని ఈనాడు గొడవ చేస్తోంది. దీనిని బట్టే వారి మధ్య ఎలాంటి సంబంధ, బాంధవ్యాలు ఉన్నాయో గమనించవచ్చు.ఆంధ్రజ్యోతి అయితే హీనంగా మరో అబద్దపు కథనాన్ని ప్రచారం చేసింది. నీతి అయోగ్ లాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తమకు తెలియదని అన్నదట. ఎన్నికల సమయంలో అబద్ధాలు ప్రచారం చేశారంటే ఓట్ల కోసం అని అనుకోవచ్చు. ఇప్పుడు కూడా అదే రకంగా అబద్ధాలు చెబుతున్నారంటే వారికి బుద్ది, జ్ఞానం లేదని అనుకోవాలి. నీతి అయోగ్ ముసాయిదా పంపించామని తెలిపినా వీరు ఒప్పుకోరన్నమాట. ఎన్నికలు అయిపోయాక కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి తెగబడి ఇలాంటి అసత్య కథనాలు ఇవ్వడం ద్వారా సాధించేది ఏమిటో తెలియదు! అంటే ఎన్నికలలో గెలవడం కష్టమనే అభిప్రాయానికి ఎల్లో మీడియా వచ్చేసిందా? అందుకే అప్పుడే మళ్లీ దాడి ఆరంభించిందా!– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
సాక్షి, విజయవాడ: ఎల్లో మీడియాకు చెప్పకుండా చంద్రబాబు ఎక్కడికి వెళ్లారని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. చంద్రబాబు కనిపించకుండా పోతే టీడీపీ అడ్రస్ గల్లంతవుతుందని అన్నారు. దోచిన డబ్బంతా దుబాయ్‌లో దాచడానికి వెళ్లరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పరార్‌తో టీడీపీ నాయకుల నోటికి తాళాలు పడ్డాయని విమర్శించారు. కూటమి పేరుతో చంద్రబాబు కుట్రలు చేశారన్నారు జోగి రమేష్. ఎస్పీలను, కలెక్టర్లను మార్చిన చోటే గొడవలు జరిగాయని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని విధ్వంసాలు సృష్టించినా.. ప్రజాస్వామ్యంలో వైఎస్సార్సీపీ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలంతా సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.చంద్రబాబు వ్యవస్థలను భ్రష్టుపట్టించారని మండిపడ్డారు జోగి రమేష్. పల్నాడులో అల్లర్లకు కారణం చంద్రబాబే కారణమని దుయ్యబట్టారు. టీడీపీ అడ్రస్ గల్లంతు కాబోతుంది కాబట్టే చంద్రబాబు విధ్వంసానికి పాల్పడ్డాడని విమర్శించారు. పురందేశ్వరి ఈసీకి తప్పుడు సమాచారం ఇవ్వడం వల్లే అధికారులను మార్చారనిన్నారు.కాగా అడుగు తీసి అడుగేస్తే మీడియాలో ప్రచారం కోరుకునే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గప్‌చుప్‌గా విదేశాలకు ఉడాయించారు. తన సతీమణి భువనేశ్వరితో కలిసి హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లిన చంద్రబాబు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారనే విషయంపై గోప్యంగా వ్యవహరిస్తున్నారు. వైద్య పరీక్షల కోసం ఆయన అమెరికా వెళ్లినట్లు టీడీపీ తొలుత మీడియాకు లీకులిచ్చింది.అయితే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ ఎన్నారై విభాగం నేత కోమటి జయరాం మాత్రం ఆయన అసలు అమెరికా రాలేదని ప్రకటించడం గమనార్హం. విదేశాల నుంచి అక్రమ నిధులను భారత్‌లోని షెల్ కంపెనీలకు మళ్లించిన చరిత్ర ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నారు? ఏం చేస్తున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా విదేశీ పర్యటన వెనుక లోగుట్టు ఏమిటన్నది సస్పెన్స్‌గా మారింది. అయితే తాజా విశ్వసనీయ సమాచారం ప్రకారం చంద్రబాబు ఇటలీలో ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది.చదవండి: ఇట్లు ఇటలీకి
అయోమయంలో పురందేశ్వరి భవితవ్యం
పురందేశ్వరి కుట్ర రాజకీయాలు ఆమెకు ఎసరు తెచ్చిపెట్టనున్నాయా.. ఎన్నికల సమయంలో చిన్నమ్మ రాజకీయాలతోనే ఏపీలో బీజేపీ మరింత బలహీనపడిన పడిందని భావిస్తున్న సీనియర్లు ఆమె నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారా.. ఏపీ బీజేపీలో ఇపుడు గ్రూపు రాజకీయాలకి పురందేశ్వరి వైఖరే కారణమని సీనియర్లు గుర్రుగా ఉన్నారు.. ఎన్నికల వేళ పార్టీని ఏకతాటిపై నడిపించాల్సిన సమయంలో ఆమె వ్యక్తిగత స్వార్థ రాజకీయాలకు పార్టీని బలి చేశారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత ఏపీ బీజేపీలో ఏం జరగబోతోంది. పురందేశ్వరి ఓడితే ఆమె రాజకీయ భవిష్యత్‌కి బ్రేక్ పడినట్లేనా...ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రాజకీయ భవితవ్యం అయోమయంగా ఉంది. ఎన్నికల ఏడాదిలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న పురందేశ్వరి తన వైఖరితో పార్టీలో గ్రూపు రాజకీయాలకి ఆజ్యం పోశారు. అప్పటివరకు సోము వీర్రాజు నాయకత్వంలో ఏకతాటిపై నడిచిన పార్టీని రెండు గ్రూపులుగా మార్చేసారు. ఏపీలో గడిచిన మూడేళ్లగా సోము వీర్రాజు నాయకత్వంలో బీజేపీ క్షేత్రస్ధాయిలో బలోపేతంపై దృష్టి సారించింది. ముఖ్యంగా ప్రభుత్వంపై వ్యతిరేకతను బీజేపీకి అనుకూలంగా మార్చుకునేలా నిత్యం ప్రజలలో ఉంటూ కార్యక్రమాలు నిర్వహించేవారు.అయితే పురందేశ్వరి గత ఏడాది ఏపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదట నుంచి బీజేపీలో ఉన్న నేతలపై గురి పెట్టారు. సోము వీర్రాజు నాయకత్వంలో పనిచేసిన పలు జిల్లాల అధ్యక్షులని కావాలని మార్పు చేశారు. దీంతో పాటు రాష్ట్ర కార్యాలయంలోనూ బీజేపీలో దీర్ఘకాలంగా ఉంటున్న నేతలని తొలగించి మరీ తన సొంత టీంని నియమించుకున్నారు. అక్కడ నుంచి ప్రారంభమైన గ్రూపు రాజకీయాలు ఎన్నికల సమయానికి తారాస్ధాయికి చేరుకున్నాయి. ఎన్నికలకు ముందు వరకు ఏపీలో బీజేపీ, జనసేనతో మాత్రమే కలిసి పోటీ చేస్తుందని భావించిన నేతలు. .ఆ దిశగానే ప్రయత్నించారు.జనసేన.. టీడీపీతో కలిసిన తర్వాత ఒంటరి పోరు వైపే మెజార్టీ నేతలు మొగ్గుచూపారు. ఏపీలో బీజేపీకి భవిష్యత్ ఉండాలనే దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలని.. అందు కోసం ఒంటరిపోరే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతర పరిణామాలలో చంద్రబాబు బీజేపీ అగ్రనేతలను కలుసుకుని ఎన్డీఎలో చేరడం వెనుక పురందేశ్వరి చక్రం తిప్పారని బీజేపీ నేతలు చెబుతుంటారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి సొంతపార్టీ కంటే సొంత బంధువర్గానికి ప్రాదాన్యతనిచ్చారనేది జరిగిన పరిణామాలే చెబుతున్నాయి.చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పుడు స్వయంగా లోకేష్‌ని ఢిల్లీకి తీసుకెళ్లి హోంమంత్రి అమిత్ షాని కలిపించడం వెనుక పురందేశ్వరే ప్రధాన పాత్ర పోషించారు. ఆ తర్వాత టీడీపీతో బీజేపీ జత కట్టడం.. టిక్కెట్లు ఖరారు ఇవన్నీ బీజేపీ కనుసన్నల్లో కంటే చంద్రబాబు చెప్పినట్లుగానే జరిగాయని విమర్శలున్నాయి. గత నాలుగన్నరేళ్లగా క్షేత్రస్ధాయిలో బీజేపీ బలోపేతంగా ఉన్న స్థానాలను తీసుకోవాల్సిన సమయంలో పురందేశ్వరి మాట్లాడకపోవడం ఏపీ బీజేపీకి మైనస్‌గా మారింది. ఎన్నికల వేళ ఏపీలో బీజేపీ కనీసం 25 అసెంబ్లీ స్ధానాలు, ఎనిమిది పార్లమెంట్ స్దానాలలో పోటీ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు ఆశించారు. ఇందుకోసం టీడీపీతో గట్టిగా సంప్రదింపులు చేయాలని సీనియర్లు ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తెచ్చారు.అయితే అబ్ కీ బార్ చార్ సౌ పార్ అనే మైకంలో ఉన్న బీజేపీ పెద్దలకి ఏపీ బీజేపీలో పరిస్ధితులని పట్టించుకోలేదు. .ఇదే సమయంలో టీడీపీతో పొత్తులో భాగంగా పురందేశ్వరి చంద్రబాబు ఆశించినట్టుగా వ్యవహరించి కేవలం ఆరు ఎంపీలు, పది అసెంబ్లీ స్ధానాలకి పరిమితం చేశారు. ఆ తర్వాతైనా బీజేపీ పట్టున్న స్ధానాలను కోరుకుందా అది కూడా లేదు.. బీజేపీ ఓడిపోయే స్ధానాలను బిజెపికి అండగట్టినా కూడా ఎపి బిజెపి అధ్యక్షురాలిగా పురందేశ్వరి పెదవి విప్పలేదు... సరికదా తనకు ఎంపి టిక్కెట్ వస్తే చాలని ఊరుకున్నారు.దీనికి తోడు బిజెపితో పొత్తుకు ముందే కొన్ని స్ధానాలను టిడిపి ప్రకటించడం కూడా ఎపి బిజెపిలో మొదట నుంచి నేతలకి నచ్చలేదు.. బిజెపిలో మొదటి నుంచి సీనియర్లకి అవకాశం ఇవ్వాలని...బిజెపి గెలిచే స్ధానాలను తీసుకోవాలని సీనియర్లు నెత్తీ నోరూ బాదుకున్నా కూడా పురందేశ్వరి తన మరిది చంద్రబాబుతో కలిసి చేసిన కుట్రలు ఎపి బిజెపి భవితవ్యాన్ని పూర్తిగా చిదిమేశాయివిశాఖపట్టణం ఎంపీ స్ధానం కోసం రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహరావు చివరి వరకు ప్రయత్నించారు.బిజెపి జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు విశాఖలో ఇల్లు కొనుక్కుని ఆ పార్లమెంట్ పరిధిలో బిజెపి బలోపేతం కావడానికి మూడేళ్లకి పైగా కృషి చేసిన జివిఎల్ ఆ స్ధానంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.అయితే పురందేశ్వరి కనీసం టిడిపి, బిజెపి ఉమ్మడి చర్చలలో విశాక సీటుని కనీసం ప్రస్తావించలేదని తెలుస్తోంది. విశాఖలో పార్టీ బలంగా ఉందని..ఆ సీటు బిజెపికి ఇవ్వాలని పురందేశ్వరి గట్టిగా పట్టుపట్టకపోవడంతోనే ఆ సీటు టిడిపి తీసుకుందని చెబుతున్నారు.కేవలం తన సోదరుడు బాలకృష్ణ చిన్నల్లుడు గీతం విద్యాసంస్ధల చైర్మన్ భరత్ కోసమే జివిఎల్ కి టిక్కెట్ రాకుండా చేశారని చెబుతున్నారు.ఆ తర్వాత విజయనగరం లేదా అనకాపల్లి కోసం జివిఎల్ ప్రయత్నించినా కూడా అవి కూడా దక్కలేదు.దీంతో జివిఎల్ పురందేశ్వరి వైఖరిపై అలిగి ఎన్నికల సమయంలో ఢిల్లీకే పరిమితమయ్యారు.ఇక అనకాలపల్లి ఎంపి స్ధానంపై మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ ఆశలు పెట్టుకుంటే ఆయనని కాదని కడప నుంచి సిఎం రమేష్ కి టిక్కెట్ ఇప్పించారు.ఇది కూడా చంద్రబాబు డైరక్టన్ లో జరిగిందని బిజెపి సీనియర్లు విమర్శిస్తున్నారు.ఉత్తరాంద్రలో ఉన్న బిసి నేతలకి అవకాశం ఇవ్వకుండా గత ఎన్నికల తర్వాత టిడిపి నుంచి బిజెపిలో చేరిన సిఎం రమేష్ కి టిక్కెట్ ఇవ్వడం ఉత్తరాంద్ర బిజెపిలో వివాదం రాజేసింది. బిజెపిలో ఉంటూ చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడిగా ఉండే సిఎం రమేష్ అభ్యర్ధిత్వాన్ని ఉత్తరాంద్ర బిజెపి నేతలు జీర్ణించుకోలేకపోయారు.ఇక రాజమండ్రి స్ధానం నుంచి పోటీ చేయాలని మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు భావించారు. రాజమండ్రిలోనే పుట్టి నాలుగన్నర దశాబ్ధాలగా బిజెపిలో ఉన్న సోము వీర్రాజు రాజమండ్రి ఎంపి టిక్కెట్ ఆశిస్తే పురందేశ్వరి చక్రం తిప్పి టిక్కెట్ ఆమె దక్కించుకున్నారు.ఇక సోము వీర్రాజుని అనపర్తి అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని సూచించినా ఓడిపోయే స్ధానంలో పోటీచేయలేనని తిరస్కరించారు.ఇక ఏలూరు స్ధానం కోసం దశాబ్ధకాలంగా బిజెపిలో పనిచేస్తున్న తపనా చౌదరికి కూడా టిక్కెట్ ఇప్పించడంలో పురందేశ్వరి విఫలమయ్యారు.ఈ సీటుని బిజెపికి ఇవ్వకుండా టిడిపి తీసేసుకుని కడప జిల్లాకి చెందిన యనమల అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ ని రంగంలోకి దింపారు. ఇక హిందూపూర్ ఎంపి కానీ కదిరి అసెంబ్లీ కానీ ఆశించిన విష్ణువర్ధన్ రెడ్డికి కూడా టిక్కెట్ దక్కలేదు.ఇలా వరుసగా పార్టీనే నమ్ముకుని దశాబ్ధాలగా రాజకీయాలు చేసిన సీనియర్లెవరకి కూడా టిక్కెట్లు దక్కలేదు కానీ టిడిపి నుంచి బిజెపిలో చేరిన సిఎం రమేష్, సుజనా చౌదరి లాంటి నేతలకి టిక్కెట్లు దక్కడం సీనియర్లకి తీవ్ర నిరాశ కలిగించింది.దీంతో పాటు అనపర్తి టిక్కెట్ విషయంలో మాజీ సైనికుడికి అన్యాయం చేస్తూ రాత్రికి రాత్రి టిడిపి ఇన్ చార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బిజెపిలో చేర్చుకుని టిక్కెట్ ఇవ్వడం...బద్వేలులో కూడా ఉప ఎన్నికలలో పోటీ చేసిన బిజెపి నేతని పక్కన పెట్టి టిడిపి ఇన్ చార్జి రోషన్ ని ముందు రోజు బిజెపిలో చేర్చుకుని టిక్కెట్లు ఇవ్వడం బిజెపిలో తీవ్ర వివాదాస్పదమైంది.అలాగే ఎన్నికలకి ముందు వైఎస్సార్ సిపి ఎమ్మెల్యే వరప్రసాద్ ని బిజెపిలో చేర్చుకుని తిరుపతి ఎంపి టిక్కెట్ ఇవ్వడం కూడా పార్టీలో వ్యతిరేకత తెచ్చింది.ఇలా ఉద్దేశపూర్వకంగా బిజెపిలో మొదట నుంచి పనిచేసిన నేతలని పక్కనపెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకి టిక్కెట్లు ఇవ్వడం వెనుక పురందేశ్వరి ప్రధాన పాత్ర పోషించారని సీనియర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.టిడిపి నుంచి బిజెపిలో చేర్చుకుని టిక్కెట్లు ఇచ్చే బదులు ఆ సీట్ల స్ధానంలో బిజెపి వేరే సీట్లని తీసుకోవాలని... దీని వల్ల బిజెపి నష్టపోతోందంటూ మాజీ సిఎం బిజెపి సీనియర్ నేత ఐవిఆర్ కృష్ణరావు పలుమార్లు ట్విట్లర్ వేదికగా ప్రశ్నించారు. ఇలా పురందేశ్వరి పెట్టిన చిచ్చుతో ఎన్నికల సమయంలో ఎపి బిజెపి రెండుగా చీలిపోయింది.ఎన్నికల ప్రచారంలో సీనియర్లు ఎవరూ కూడా ప్రచారంలో పాల్గొనకపోవడానికి పురందేశ్వరి వైఖరే ప్రధానకారణంగా తెలుస్తోంది.ఇక రాజమండ్రి నుంచి కూటమి అభ్యర్ధిగా పోటీ చేసిన పురందేశ్వరి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మాదిరిగానే అక్కడా సొంత టీం నే ఏర్పాటు చేసుకున్నారు.స్ధానికుడైన సీనియర్ నేత సోము వీర్రాజుని పురందేశ్వరి ఎక్కడా కలుపుకుపోలేదు. నామినేషన్ రోజున మాత్రం సోము వీర్రాజుతో కలిసి ర్యాలీగా వెళ్లి పురందేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు.ఆ తర్వాత సోము వీర్రాజు ఎక్కడా ప్రచారంలో కనిపించకపోవడానికి పురందేశ్వరి వైఖరే కారణమని తెలుస్తోంది. సోము వీర్రాజు స్ధానంలో రాజమండ్రి టిక్కెట్ దక్కించుకున్న పురందేశ్వరి మర్యాదపూర్వకంగా కూడా కనీసం సోము వీర్రాజు ఇంటికి వెళ్లకపోవడం...ఎన్నికల ప్రచారానికి ఆయనను పిలవకపోవడంతోనే ఆయన ప్రచారంలో పాల్గొలేదని తెలుస్తోంది. దీనికి తోడు రాజమండ్రిలో సోము వీర్రాజు హయాంలో కట్టిన బీజేపీ కార్యాలయాన్ని కాదని ఎన్నికల వేళ పురందేశ్వరి ప్రత్యేకంగా వేరే చోట ఎన్నికల కార్యాయాల్ని ప్రారంభించడం కూడా సోము వీర్రాజుకి తీవ్ర మనస్తాపం కలిగించినట్లు తెలుస్తోంది. బీజేపీ కార్యాయాలన్ని కాకుండా ప్రైవేట్‌గా వేరేచోట ఎన్నికల కార్యాలయం ఏర్పాటు చేయడం కూడా ఏపీ బీజేపీలో గ్రూపు రాజకీయాలను రాజేసింది. ఇలా సొంత పార్టీ కార్యాలయాన్ని.. సొంత పార్టీ నేతలను నమ్మకుండా టీడీపీ నేతలను పురందేశ్వరి నమ్మడం కూడా ఆమెకు మైనస్‌గా మారిందంటున్నారు.ఇలా వరుస తప్పిదాలతో ఏపీ బీజేపీ రెండుగా చీలిపోయిందంటున్నారు. ఒకవర్గం పురందేశ్వరి అనుకూలంగా ఉంటే...మరొక వర్గం పురందేశ్వరిని వ్యతిరేకిస్తోందంటున్నారు.ఇలాంటి పరిణామాలు గతంలో ఎపుడూ ఏపీ బీజేపీలో చోటుచేసుకోలేదని.. కేవలం పురందేశ్వరి వైఖరి కారణంగానే బిజెపిలో గ్రూపు రాజకీయాలు ఏర్పడ్డాయని అంటున్నారు.ఇపుడా గ్రూపు రాజకీయాలే పురందేశ్వరికి ఎసరు తెచ్చేలా కన్పిస్తున్నాయంటున్నారు.రాజమండ్రితో పాటు బిజెపి పోటీ చేసిన మొత్తం ఆరు ఎంపి స్ధానాలు, పది అసెంబ్లీ స్ధానాలలో కనీసం సగం సీట్లైనా బిజెపి గెలిస్తేనే పురందేశ్వరి రాజకీయ భవితవ్యానికి ఇబ్బంధి ఉండకపోవచ్చునంటున్నారు. కానీ బిజెపి గెలుపొందే స్ధానాలను కాకుండా ఓడిపోయే స్ధానాలను తీసుకునే ఓటమిని ముందే డిసైట్ చేసుకున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ గెలుపు మాట తర్వాత కనీసం పురందేశ్వరి అయిన రాజమండ్రిలో గెలుస్తోందో లేదోనేని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వేళ రాజమండ్రిలో పురందేశ్వరి ఓడిపోతే ఆమె రాజకీయ భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఆమె ఓడిపోతే ఆమె తీసుకున్న నిర్ణయాలు ఆమెకు శాపంగా మారి బీజేపీ అధ్యక్షరాలి పదవి నుంచి తొలగించే అవకాశాలు లేకపోలేదని బీజేపీ నేతలు చెబుతున్నారు.ఇప్పటికే ఎన్నికల సమయంలో పురందేశ్వరి కుట్ర రాజకీయాలపై సీనియర్లు అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారంటున్నారు. ఇలా వరుస ఫిర్యాదుల నేపధ్యంలో ఆమె ఓడిపోతే శాశ్వతంగా పురందేశ్వరి చేజేతులా రాజకీయ భవిష్యత్‌ని నాశనం చేసుకున్నట్లేనని చెబుతున్నారు. కాంగ్రెస్‌లో దశాబ్ధకాలం పాటు ఎంపిగా.. కేంద్ర మంత్రిగా పనిచేయడానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ హవా ఆమెకు కలిసివచ్చిందని.. ఇపుడు మాత్రం ఆమె తీసుకున్న నిర్ణయాలే ఆమె భవితవ్యాన్ని సమాది చేస్తాయంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల తర్వాత ఏపీ బీజేపీ గప్ చుప్‌గా ఉంది.. నేతలెవరూ కూడా ఎన్నికల తర్వాత పెదవి విప్పడానికి సాహసించడం లేదు.. గెలుపుపై నమ్మకం లేక ఏ నేతా కూడా మీడియా ముందుకురావడానికి ఇష్టపడకపోవడం ఏపీ బీజేపీలో గ్రూపు రాజకీయాలు.. తాజా పరిస్థితులను తెలియజేస్తున్నాయంటున్నారు.
BJP Vs Congress: ఈశాన్య ఢిల్లీ ఎవరిది?..
దేశరాజధాని ఢిల్లీలో అందరినీ ఆకర్షిస్తున్న సీటు ఈశాన్య ఢిల్లీ. హ్యట్రిక్‌పై కన్నేసిన బీజేపీ ఎంపీ మనోజ్ తివారీపై, యువనాయకుడు కన్హయ్య కుమార్‌ను కాంగ్రెస్ పోటీకి దింపింది. గత ఎన్నికల్లో బెగుసరాయ్‌లో ఓడిపోయిన కన్హయ్యకుమార్‌ను రాహుల్ గాంధీ ఈసారి ఢిల్లీలో పోటీకి దింపడం చర్చనీయాంశంగా మారింది. 20శాతం ముస్లింలు, 11శాతం ఎస్సీల సమీకరణను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ఈ ప్రయోగానికి దిగిందనే చర్చ జరుగుతోంది.ఈశాన్య ఢిల్లీ ప్రాంతం దేశ రాజధానిలో అతిపెద్ద జిల్లా. నార్త్ ఈస్ట్ సీటు భారతదేశం మొత్తంలో అత్యంత జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం. ఇక్కడ అత్యధిక జనాభా పూర్వాంచల్‌కు చెందినవారే. ఈ లోక్‌సభ స్థానంలో అనేక అనధికార కాలనీలు ఉన్నాయి. ఇక్కడ వివిధ రాష్ట్రాల నుండి వలస వచ్చినవారు స్థిరపడ్డారు. ఉత్తరప్రదేశ్‌తో ఈశాన్య ఢిల్లీ సరిహద్దు కారణంగా, ఇందులో ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా నుండి వలస వచ్చిన వారి జనాభా ఎక్కువగా ఉంది.ఈ లోక్‌సభ స్థానంలో భజన్‌పురా, బురారీ, తిమర్పూర్, సీలంపూర్, ఘోండా, బాబర్పూర్, గోకల్‌పూర్, సీమాపురి, రోహతాస్ నగర్, ముస్తఫాబాద్, కరవాల్ నగర్‌లతో కలిపి 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో దాదాపు 16.3 శాతం షెడ్యూల్డ్ కులాలు, 11.61 శాతం బ్రాహ్మణులు, 20.74 శాతం ముస్లింలు, 4.68 శాతం వైశ్య (బనియా), 4 శాతం పంజాబీ, 7.57 శాతం గుర్జార్ మరియు 21.75 శాతం ఓబీసీ కమ్యూనిటీ వారి వాటాను కలిగి ఉంది.గతంలో 2009 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై కాంగ్రెస్ 59.03 శాతం ఓట్లతో భారీ ఆధిక్యం సాధించగా బీజేపీకి 33.71 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 2014 నుంచి వరుసగా బీజేపీ విజయకేతనం ఎగరేస్తోంది. 2014లో సినీ నటులు మనోజ్ తివారీకి 45.38 శాతం ఓట్లతో గెలుపొందగా, 2019లో 53.86 శాతం రెండోసారి విజయకేతనం అందుకున్నారు. ఈ సీటులో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ల అభ్యర్థులకు ప్రజల్లో మంచి పేరుంది.ఒకవైపు రాజకీయాలకు అతీతంగా నటుడిగా, గాయకుడిగా మనోజ్ తివారీ బాగా పాపులర్ అయితే, మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ జేఎన్‌యూ స్టూడెంట్ లీడర్‌గా దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కన్హయ్య కుమార్ కూడా చాలా చురుకుగా కనిపించారు. ఈ యాత్రలతో యువతను కనెక్ట్ చేయడంలో ఆయన చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. అయితే తుక్డేతుక్డే గ్యాంగ్ నాయకుడని బీజేపీ.. కన్హయ్య కుమార్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. ఢిల్లీలో బీజేపీ సీఎం అభ్యర్థి మారేందుకు ఈ ఎన్నిక మనోజ్ తివారీకి కీలకంగా మారనుంది. ఇప్పటికే రెండుసార్లు గెలిచి సత్తా చాటిన తివారీ మూడోసారి హ్యాట్రిక్ సాధించడం ద్వారా ఢిల్లీ బీజేపీ అగ్రనాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే అవకాశం ఉంది. ఢిల్లీ బీజేపీకి నాయకుడు లేక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓడుతున్న పార్టీకి తివారీ సారథ్యం వహించడానికి ఇదొక అవకాశమనే అంచనాలొస్తున్నాయి.ఇటు షీలా దీక్షిత్ తర్వాత ఢిల్లీకి ఫైర్ బ్రాండ్ కాంగ్రెస్ లీడర్ కరువయ్యారు. కన్హయ్య కుమార్ గనుక ఈశాన్య ఢిల్లీ నుంచి గెలిస్తే ఆయన కూడా ఢిల్లీ కాంగ్రెస్‌కు ఫ్యూచర్ సీఎం లీడర్‌గా ఎదిగే అవకాశముంది. మరి ఈసారి ఢిల్లీ ఈశాన్యంలో కమలం ఉదయిస్తుందా? హస్త రేఖలు మారతాయా? అన్నది ఓటరు చేతిలో ఉంది.
IPL 2024: ధోనిని అవమానించిన ఆర్సీబీ ప్లేయర్లు!.. తప్పు ‘తలా’దేనా?
‘‘ప్రపంచకప్ ఫైనల్ గెలిచినా.. భావోద్వేగాలు ప్రతిబింబించేలా సంబరాలు చేసుకుంటున్న సమయంలోనూ ప్రత్యర్థి జట్టుతో కరచాలనం చేయడం మర్యాద. ‘మన మధ్య పోరు ముగిసిపోయింది.మన మధ్య ఇక ఎలాంటి శత్రుత్వం లేదు. ఇప్పటికి ఇది ముగిసిపోయింది’ అని ఇరు జట్లు పరస్పరం చెప్పుకోవడానికి ఇది(షేక్‌హ్యాండ్) ప్రతీక’’- హర్షా భోగ్లే, కామెంటేటర్.‘‘అతడొక ఐకానిక్ ప్లేయర్. వచ్చే ఏడాది ఆడతాడో లేదో కూడా తెలియదు. బహుశా ఇదే చివరి మ్యాచ్ కూడా అయి ఉండవచ్చు. అలాంటి లెజెండ్‌ను కలవడానికి ఆటగాళ్లు ఆసక్తిగా ఎదురుచూడటం సహజం.ఆ తర్వాత ఎంతసేపు సంబరాలు చేసుకున్నా ఎవరూ ఏమీ అనరు. కానీ అంతా ముగిసి తెల్లారిన తర్వాత.. ‘అయ్యో.. ఎంఎస్ ధోని రిటైర్మెంట్ ప్రకటించాడు.కానీ మనం ఆయనకు డీసెంట్‌గా ఓ షేక్‌హ్యాండ్‌తో వీడ్కోలు పలకలేకపోయామే’ అని బాధ పడితే ప్రయోజనం ఉంటుందా?’’- ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్.ధోనికి అవమానంచెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని పట్ల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు వ్యవహరించిన తీరుపట్ల ఇలా కామెంటేటర్లు, మాజీ క్రికెటర్లు విరుచుకుపడ్డారు. ఐపీఎల్లో రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్)తో పాటు ఐదుసార్లు ట్రోఫీ సాధించిన దిగ్గజం పట్ల ఆర్సీబీ ప్లేయర్లు ప్రవర్తించిన విధానం అవమానకరమని మండిపడుతున్నారు.ఇక ధోని అభిమానులైతే ఆర్సీబీ జట్టును సోషల్ మీడియా వేదికగా పదునైన కామెంట్లతో తూర్పారబడుతున్నారు. అయితే, తాజాగా ఓ నెటిజన్ కొత్త వీడియోను తెరమీదకు తెచ్చారు. ధోనికి మద్దతుగా మాట్లాడే వారందరూ ఒక్కసారి ఈ దృశ్యాలను చూడాలంటూ కొత్త చర్చకు దారితీశారు.ఇంతకీ ఏం జరిగింది?... ఐపీఎల్-2024 ఆరంభం నుంచి వరుస పరాజయాలతో చతికిలపడ్డ ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్ రేసులో వరుసగా ఆరు మ్యాచ్‌లలో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది.లీగ్ దశలో సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా చెన్నైని ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పించి.. టాప్-4 బెర్తును ఖరారు చేసుకుంది.ధోనిని పట్టించుకోని ఆర్సీబీ ఆటగాళ్లు?ఈ క్రమంలో ఆర్సీబీ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ఫైనల్ గెలిచినంతంగా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ధోని సహా మిగిలిన చెన్నై ఆటగాళ్లు కరచాలనం చేసేందుకు వచ్చారు. అయితే, ఆర్సీబీ సెలబ్రేషన్స్ పూర్తికాకపోవడంతో వీళ్లను పట్టించుకోలేదు. దీంతో చిన్నబుచ్చుకున్న ధోని డ్రెసింగ్‌రూంకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మిగతా ఆటగాళ్లు కాసేపు వేచి చూడగా.. ఎట్టకేలకే ఆర్సీబీ ప్లేయర్లు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు.ఈ నేపథ్యంలో ధోని మూడు నిమిషాల పాటు ఎదురుచూసినా ఆర్సీబీ ఆటగాళ్లు షేక్‌హ్యాండ్ కోసం రాలేదని.. తలాను ఘోరంగా అవమానించారంటూ విరాట్ కోహ్లి సహా ఆర్సీబీ ఆటగాళ్లందరిపై సీఎస్కే ఫ్యాన్స్ మండిపడ్డారు.అసలు నిజం ఇదేనంటూఈ క్రమంలో ఓ వ్యక్తి నిజం ఇదేనంటూ.. ‘‘ధోని మూడు నిమిషాలు వేచి చూశాడని అభిమానులు అంటున్నారు. అయితే, అతడు కాసేపు కూడా ఎదురుచూడకుండా వెళ్లిపోయాడు. గెలిచిన జట్టుకు ఆమాత్రం సెలబ్రేట్ చేసుకునే హక్కులేదా? సీఎస్కే గతేడాది ట్రోఫీ గెలిచినపుడు సంబరాలు చేసుకుందా? లేదంటే షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి వెళ్లిందా? ’’ అని ఓ వీడియోను పంచుకున్నారు. ఇది ఇప్పుడు ఆర్సీబీ- సీఎస్కే ఫ్యాన్స్ మధ్య మరోసారి మాటల యుద్ధానికి తెరతీసింది.చదవండి: KKR vs SRH: ప్రమాదకారి.. ఫైనల్ చేరే తొలి జట్టు ఇదే: పాక్ లెజెండ్I can understand he’s pissed but every other player came to shake hands. Those players deserved to have that moment. When CSK won last year should they have gone around celebrating or gone to shake hands? https://t.co/MPXQ9zVOYo pic.twitter.com/TxKA2My6xD— Pradhyoth (@Pradhyoth1) May 19, 2024#THALAFOREVER 🦁💛@msdhoni pic.twitter.com/zOu5KABAcP— Chennai Super Kings (@ChennaiIPL) May 19, 2024
May 21st: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 21st AP Elections 2024 News Political Updates2:32 PM, May 21st, 2024ఎల్లో మీడియాకు చెప్పకుండా చంద్రబాబు ఎక్కడికెళ్లారు?: మంత్రి జోగి రమేష్‌దోచినడబ్బంతా దుబాయ్‌లో దాచడానికి వెళ్లారా?చంద్రబాబు కనిపించకుండా పోతే టీడీపీ అడ్రస్ గల్లంతుటీడీపీ నాయకులు నోటికి తాళాలు పడ్డాయి.కూటమి పేరుతో చంద్రబాబు కుట్రలు చేశారుఎస్పీలను, కలెక్టర్లను మార్చిన చోటే గొడవలు జరిగాయిచంద్రబాబు ఎన్ని విధ్వంసాలు సృష్టించినా.. ప్రజాస్వామ్యంలో వైఎస్సార్సీపీ గెలుపు ఖాయంచంద్రబాబు వ్యవస్థలను భ్రష్టు పట్టించారువైఎస్సార్‌సీపీ కార్యకర్తలంతా సంబరాలకు సిద్ధం కావాలిపల్నాడులో అల్లర్లకు కారణం చంద్రబాబే2:24 PM, May 21st, 2024ఈనాడు వార్తలను ఖండించిన సీఎస్‌డీఎస్‌ఏపీలో మేం పోస్ట్ పోల్ సర్వే నిర్వహించాంమా సర్వే రిపోర్ట్ నాలుగు రోజుల్లో వస్తుందిటీడీపీకే జనం అనుకూలంగా ఉన్నారనే వార్త అవాస్తవంసెఫాలజిస్ట్ సంజయ్‌కుమార్ మాటలు కూడా నిరాధారమే: సీఎస్డీఎస్ ఏపీ కోఆర్డినేటర్ వెంకటేష్2:01 PM, May 21st, 2024జూలకంటి బ్రహ్మారెడ్డి దుర్మార్గుడు: ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిమాచర్ల టీడీపీ అభ్యర్థి బ్రహ్మరెడ్డిపై మండి పడ్డ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిజూలకంటి బ్రహ్మరెడ్డి చరిత్ర మర్డర్లు చేసే చరిత్రఅభివృద్ది చేసే చరిత్ర మాదిసిట్టింగ్ జడ్జితో విచారణకు నేను కూడా సిద్దంఏడు మర్డర్ల కేసులో ఏ1 ముద్దాయి జూలకంటి బ్రహ్మారెడ్డిజూలకంటి బ్రహ్మారెడ్డి దుర్మార్గుడు 2009లో నాపై ఓడిపోయి మాచర్ల నుంచి పారిపోయాడువైఎస్సార్‌సీపీ పాలనలో మాచర్ల నియోజకవర్గం అభివృద్ధినీతి కబుర్లు చెబుతూ షో చేస్తూ చందాల మీద బతికే వ్యక్తి జూలకంటి బ్రహ్మారెడ్డి11:32 AM, May 21st, 2024ఎస్సీలంతా వైఎస్సార్సీపీకే ఓటు వేశారు: మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు నత్తా యోనారాజుఆ అక్కసుతోనే దళితులపై దాడులు జరిపారువదినా మరిది అయిన పురందేశ్వరి, చంద్రబాబు పోలీసులను మార్చారుపోలీసు అధికారులు మారిన చోటే ప్లాన్ ప్రకారం దాడులు జరిపారుఎలక్షన్ కమిషన్ కిందే వ్యవస్థలు పని చేస్తున్నాయిచంద్రబాబు తన మనమడికి 6 నెలల వయసున్నపుడే వందలకోట్లు జమ చేశాడుపాలన ద్వారా జగన్ పేదల పాలిట దైవంగా మారారుసీఎం జగన్‌ను ఓడించే దమ్ము, ధైర్యం టీడీపీకి లేవుపేదలకు జరిగే లబ్ధిని చూసి ఓర్వలేకే దాడులు జరిపారుపేదల పిల్లలు ఐక్య రాజ్య సమితికి వెళ్లి మాట్లాడుతున్నారుఎస్సీల్లో ఎవరు పుట్టాలని కోరుకుంటారని ప్రశ్నించిన వ్యక్తి చంద్రబాబుబీసీల తోకలు కత్తిరిస్తానంటూ మాట్లాడిన వ్యక్తి చంద్రబాబుబీజేపీతో కలిసి చంద్రబాబు రాష్ట్రాన్ని మరో మణిపూర్ చేయాలని చూస్తున్నారుఎస్సీలంతా జగన్ వైపే ఉన్నారు10:43 AM, May 21st, 2024కేంద్ర ఎన్నికల సంఘానికి చేరిన సిట్ నివేదిక150 పేజీల ప్రాథమిక నివేదికను సీఈసీకి పంపిన ఏపీ సీఎస్ఏపీలో ఎన్నికల రోజు, తర్వాత హింసపై సిట్ ప్రాథమిక నివేదికపల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో.. మొత్తం 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు గుర్తించిన సిట్1370 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు, 124 మంది అరెస్ట్ఇంకా 1152 మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని సిట్ నివేదికఎఫ్‌ఐఆర్‌లో కొత్త సెక్షన్ల చేర్చే విషయంపై సిఫార్సు చేసిన సిట్8:40 AM, May 21st, 2024దుష్ప్రచారం చేయడం డాక్టర్ లోకేశ్‌కు అలవాటే: ప్రముఖ ఎన్ఆర్ఐ డాక్టర్ వాసుదేవరెడ్డి వెల్లడికోర్టుల్లో తప్పుడు కేసులు వేయడంలో నేర్పరి చీవాట్లు పెట్టి జరిమానా విధించిన అమెరికా కోర్టుపలువురు రోగుల మరణానికి కారకుడయ్యాడని ప్రాక్టీస్ పైనా నిషేధంఏపీలో ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని మేధావిగా చలామణి అవుతున్నారుఅయితే అమెరికాలో 18 ఏళ్లుగా ఆయన ప్రాక్టీస్‌పై నిషేధం కొనసాగుతోందిగుంటూరు మెడికల్ కాలేజీలో 1983లో లోకేశ్ గ్రాడ్యుయేట్ అయ్యాడుగ్యాస్ట్రో విభాగంలో ఎండీ పూర్తిచేసిన ఆయన అమెరికాలోని వర్జీనియాలో తొలుత ప్రాక్టీస్ మొదలెట్టాడుఅప్పటి నుంచే ఎదుటి వ్యక్తులపై అవాస్తవ ఆరోపణలు చేయడం, కోర్టుల్లో తప్పుడు కేసులు ఫైల్ చేయడం లోకేశ్‌కు అలవాటుప్రాక్టీస్ ప్రారంభించిన తొలినాళ్లలో ఆస్పత్రి యాజమాన్యంపై, సహచర వైద్యులపై కోర్టులో కేసులు వేసి, ఆ ఆరోపణలను రుజువు చేయడంలో విఫలమయ్యాడుఇదే తరహాలో 2022లో భారత ప్రధాని మోదీ, ఏపీ సీఎం వైఎస్ జగన్, అదానీ మీద వాషింగ్టన్ డీసీ కోర్టులో కేసులు ఫైల్ చేశాడుఇండియా నుంచి కంటైనర్లలో డబ్బుతో పాటు, ఇజ్రాయిల్ నుంచి స్పైవేర్ కొనుగోలు చేసి అమెరికాకు అక్రమంగా తరలిస్తున్నారంటూ ఆరోపణలు చేశాడు. తప్పుడు ఆరోపణలతో కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నావని లోకేశ్‌కు కోర్టు చీవాట్లు పెట్టడంతో పాటు జరిమానా విధించిందివైద్య నిబంధనలకు విరుద్ధంగా రోగులకు చికిత్సలు అందించి పలువురి మరణానికి లోకేశ్ కారకుడయ్యాడు2006లో వర్జీనియా బోర్డ్ ఆఫ్ మెడిసిన్ లోకేశ్ మెడికల్ లైసెన్స్‌ను రద్దు చేసిందిఅనంతరం న్యూయార్క్, న్యూజెర్సీ వంటి ఇతర ప్రాంతాలకు వెళ్లాడు. ఆయా రాష్ట్రాల్లోనూ లైసెన్స్‌ను రీవోక్ చేశారుఅయితే ఈ వాస్తవాలను కప్పిపుచ్చి అమెరికాలో ప్రముఖ వైద్యుడిగా చలామణి అవుతూ ఏపీ సీఎం జగన్‌పై అవాస్తవ ఆరోపణలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు వాస్తవాలను ఓ సారి తెలుసుకోవాలిమేధావులుగా చలామణి అవుతున్న లోకేశ్ వంటి కులోన్మాదులు సీఎం జగన్‌పై దాడులకు పాల్పడుతున్నారు.7:52 AM, May 21st, 2024సిట్ నివేదికలో సంచలన విషయాలుఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై డీజీపీకి ఇచ్చిన సిట్ నివేదికలో సంచలన విషయాలు150 పేజీల ప్రాథమిక నివేదికను డీజీపీకి అందజేసిన సిట్ ఛీఫ్ వినీత్ బ్రిజ్ లాల్సిట్ ప్రాథమిక నివేదికలో బయటపడిన పోలీసుల వైఫల్యాలుపల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలలో హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తునాలుగు బృందాలుగా మూడు జిల్లాలలో పర్యటించిన సిట్33 ఘటనలలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు, సీసీ కెమెరాలు పరిశీలనఈ అల్లర్లలో 1370 మంది నిందితులకి 124 మందినే అరెస్ట్ చేసిన పోలీసులుఇందులో 639 మంది నిందితులని ఇంకా గుర్తించాల్సి ఉందన్న సిట్1100 మందిని ఇంకా అరెస్ట్ చేయకపోవడంలో పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన సిట్దర్యాప్తులో పోలీస్ శాఖ వైఫల్యాలు ఉన్నట్లు గుర్తించిన సిట్రాళ్ల దాడిని తీవ్రంగా పరిగణించిన సిట్రెండు గ్రూపుల మధ్య రాళ్ల దాడులు మరణాలకి కారణమయ్యాయని పేర్కొన్న సిట్ప్లీ ప్లాన్డ్‌గానే రాళ్లు, కర్రలతో దాడి జరిగినట్లు గుర్తింపుదాడులను ముందస్తుగా ఊహించడంలో అధికారులు విఫలమయ్యారని సిట్ నివేదికఎన్నికలకి ముందు పోలీస్ అధికారుల బదిలీలే ఘటనలకి కారణంగా సిట్ నివేదికపరారీలో ఉన్న వారిని త్వరితగతిన అరెస్ట్ చేయాలని సిట్ సూచనకోర్టులో మెమో దాఖలు చేసి అదనపు సెక్షన్లు జోడించాలన్న సిట్సిట్ నివేదిక ఆధారంగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీలు, అనంతపురం డీఐజీ, గుంటూరు రేంజ్ ఐజీలను ఆదేశించిన డీజీపీ7:16 AM, May 21st, 2024ఇట్లు.. ఇటలీకి!వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్తున్నట్లు చంద్రబాబు లీకులుఅబ్బే.. ఇటు రాలేదన్న టీడీపీ ఎన్నారై విభాగం నేతటీడీపీ అధినేత ఇటలీలో ప్రత్యక్షమైనట్లు సమాచారంగతంలో విదేశాల నుంచే షెల్ కంపెనీలకు అక్రమ నిధుల మళ్లింపుస్కిల్ స్కామ్‌లోనూ బాబు దుబాయ్ బంధంఈసారి అదే షెల్ దందాయేనా..!గోప్యంగా విదేశీ పర్యటన వెనుక లోగుట్టు అదే 7:07 AM, May 21st, 2024కుమ్మక్కుతో విధ్వంసకాండకాల్ డేటా విశ్లేషించి కఠిన చర్యలు తీసుకోవాలిసిట్‌ను కోరిన వైఎస్సార్సీపీ నేతలుకొందరు పోలీసు అధికారులు టీడీపీతో కుమ్మక్కై విధ్వంస కాండకు కొమ్ము కాశారుటీడీపీ రౌడీమూకల విధ్వంసకాండపై పారదర్శకంగా విచారణ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలిదాడులు జరిగిన ప్రాంతాల్లో ఎస్సైలు, సీఐల కాల్ డేటా సేకరించి విచారణ నిర్వహించాలి 7:05 AM, May 21st, 2024పల్నాడులో మహిళలపై ఇంతటి దాడులా?మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి ఆగ్రహంనిందితులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీలకు లేఖరాజకీయాల్లో ఎన్నడూ లేనివిధంగా తమకు ఓట్లు వేయలేదనే కక్షతో ఎస్సీ, బీసీ మహిళలపై దాడులకు దిగడం దారుణంఎస్సీ, బీసీ మహిళలనే టార్గెట్‌గా చేసుకుని ఇంతలా దాడులు చేయడం దుర్మార్గం6:53 AM, May 21st, 2024బదిలీలతో బరితెగింపుఎన్నికల సందర్భంగా జరిగిన హింసపై డీజీపీకి సిట్ నివేదికదాడులు అరికట్టడం, కేసుల దర్యాప్తులో పోలీసులు విఫలంపోలింగ్‌కు ముందు ఆకస్మిక బదిలీలతో యథేచ్చగా విధ్వంసకాండదర్యాప్తు సక్రమంగా లేదు.. అదనపు సెక్షన్లు చేర్చాలి
బెంగళూరు రేవ్ పార్టీ: ఆ ఇద్దరు నటులు ఎవరు?
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ దర్యాప్తుపై సీపీ దయానంద కీలక విషయాలు వెల్లడించారు. ఈ రేవ్ పార్టీలో ఇద్దరు నటులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. అలాగే, అనుమానితుల బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నట్టు స్పష్టం చేశారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని వెల్లడించారు.కాగా, సీపీ దయానంద మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బెంగళూరు రేవ్ పార్టీ కేసును ఎప్పుగూడ పీఎస్‌కు బదిలీ చేయడం జరిగింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. రేవ్ పార్టీలో 150 మంది పాల్గొన్నారు. ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న వారి బ్లడ్ శాంపుల్స్ స్వీకరించాము. ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయి. రేవ్ పార్టీకి డ్రగ్స్ తీసుకొచ్చిన ఐదుగురిని అరెస్ట్ చేశాము. డ్రగ్స్ కొనుగోలుపై ప్రత్యేక చట్టల ద్వారా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటాము. బెంగళూరు రేవ్ పార్టీలో ఇద్దరు నటులు దొరికారు. ఇద్దరు నటుల రక్త నమునాలు తీసుకున్నాము. ఈ ఈవెంట్లో రాజకీయ ప్రముఖులెవరూ పాల్గొనలేదు. పోలీసులు వాసు, అరుణ్, సిద్ధిఖీ, రణధీర్, రాజును అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై లోతుగా దర్యాప్తు జరుగుతోంది. డ్రగ్స్ తెచ్చిన పెడ్లర్లను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అసలు వారు ఎక్కడి నుంచి డ్రగ్స్ తెస్తున్నారు. ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారు అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది’ అని అన్నారు.
గాజాలో జరుగుతోంది మారణహోమం కాదు: జో బైడెన్
న్యూయార్క్: అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC)నుంచి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, హమాస్ అగ్రనేతలపై అరెస్టు వారెంట్లు ఇవ్వాలని కోరిన చీఫ్ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మండిపడ్డారు. గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడులతో మారణ హోమం సృష్టిస్తుందన్న కరీం ఖాన్ ఆరోపణలను బెడెన్ తీవ్రంగా ఖండించారు. వైట్‌హౌజ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో జో బైడెన్ మాట్లాడారు.‘‘గాజాలో జరగుతున్నది.. మారణహోమం కాదు. అటువంటి ఆరోపణలను మేము తిరస్కరిస్తున్నాం. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు చేసిన మెరుపు దాడుల్లో ఇజ్రాయెల్ బాధిత పక్షంగా మిగిలింది. హమాస్ దాడుల్లో 1200 మంది ఇజ్రాయెల్ అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు, కొందరు హమాస్ చెరలో ఇంకా బంధీలుగా ఉన్నారు. .. మేము(అమెరికా) ఇజ్రాయల్ రక్షణ, భద్రత కోసం కట్టుబడి ఉంటాం. హమాస్ మిలిటేంట్లను అంతం చేసేవరకు ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలుస్తాం. హమాస్ ఓడిపోవటమే మా లక్ష్యం. హమాస్‌ను ఒడించేందుకు ఇజ్రాయెల్ కోసం పనిచేస్తాం. హమాస్ నుంచి ఇజ్రాయెల్ బంధీల విడుదల విషయంలో వెనక్కి తగ్గము’’ అని బెడెన్ అన్నారు. మరోవైపు.. గాజాలో తక్షణ కాల్పుల విరమణ జరగాలని బైడెన్ పేర్కొనటం గమనార్హం.గాజా, ఇజ్రాయెల్‌లో యుద్ధ నేరాలు, మానవాళిపై అకృత్యాలకు గాను నెతన్యాహు, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్, హమాస్ నేతలు యోహియా సిన్వర్, మహ్మద్ దీఫ్, ఇస్మాయిల్ హనియేహ్‌లు బాధ్యులని చీఫ్ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ అన్నారు. వారికి అరెస్టు వారెంట్లు ఇవ్వాలని ఐసీసీని కోరిన విషయం తెలిసిందే.
'లూసిఫర్2'లో మాఫియా డాన్‌గా మోహన్‌లాల్ లుక్ రివీల్
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నేడు (మే 21) 64వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా లూసిఫర్ సీక్వెల్ నుంచి ఆయన లుక్‌ను రివీల్ చేశారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ లూసిఫర్ 2 పోస్టర్‌ను డైరెక్టర్, హీరో పృథ్వీరాజ్ పోస్ట్ చేశాడు.మలయాళ ప్రముఖ హీరో పృథ్వీరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం లూసిఫర్.. 2019వ విడుదలైన ఈ సినిమా రూ. 200 కోట్లు రాబట్టింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా 'లూసిఫర్2: ఎంపురాన్(రాజు కన్నా గొప్పవాడు)' అనే టైటిల్‌తో ఈ ఏడాదిలో విడుదల చేయనున్నారు. సీక్వెల్ కోసం మురళీ గోపి అందించగా పృథ్వీరాజ్‌నే దీనికి కూడా దర్శకత్వం వస్తున్నారు. గతేడాదిలోనే షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ చిత్రంలో మోహన్‌లాల్‌తో పాటు మంజు వారియర్, టోవినో థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.'లూసిఫర్'లో స్టీఫెన్ గట్టుపల్లి అనే రాజకీయ నాయకుడిగా మోహన్‌లాల్ కనిపించాడు. అయితే, ఆయన రాజకీయ ప్రవేశానికి ముందు ఈ ప్రపంచాన్నే శాసించే మాఫియాకు అధినేతగా ఉంటారు. మాఫియా డాన్ అబ్రహాం ఖురేషి సాధారణ వ్యక్తిగా జీవితం ప్రారంభించి అంత స్థాయికి ఎలా చేరుకున్నాడు. రాజకీయాలకు ముందు ఆయన ఏం చేశాడు..? ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడు..? అనేది తెలియాలంటే లూసిఫర్2 వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే. లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో గాడ్‌ఫాదర్ పేరుతో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేసిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Prithviraj Sukumaran (@therealprithvi)
వివాదంలో చాట్‌జీపీటీ.. అడ్డంగా బుక్కైన సీఈఓ శామ్ ఆల్ట్‌మన్
ఓపెన్ ఏఐ సీఈఓ, చాట్‌జీపీటీ సృష్టికర్త శామ్ ఆల్ట్‌మన్ అడ్డంగా దొరికిపోయారు. ఇక చేసిది లేక తన చాట్‌జీపీటీ స్కై వాయిస్‌ను నిలిపి వేశారు.యాపిల్ సిరి వాయిస్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ తరహాలో చాట్ జీపీటీ యూజర్లకు వాయిస్ అసిస్టెంట్ సేవల్ని అందించేందుకు సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ పనిచేస్తున్నారు. స్కై వాయిస్ పేరుతో తెచ్చే ఈ ఫీచర్లో ప్రముఖుల వాయిస్ వినిపిస్తుంది. మీకు ఎవరి వాయిస్ కావాలనుకుంటారో.. దాన్ని సెలక్ట్ చేసుకుంటే చాట్ జీపీటీ సమాధానాల్ని టెక్ట్స్ కాకుండా వాయిస్‌లో రూపంలో అందిస్తుంది.నా అనుమతి లేకుండా నా వాయిస్‌ను దీన్ని డెవలప్ చేసే సమయంలో శామ్ ఆల్ట్‌మన్.. అద్భుత నటిగా, అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఫిమేల్ యాక్టర్‌గా, హాలీవుడ్‌లోని ఎన్నో ప్రముఖ చిత్రాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ స్కార్లెట్ జాన్సన్ వాయిస్‌ను వినియోగించారు. దీంతో తనని సంప్రదించకుండా తన వాయిస్‌ను కాపీ చేసి చాట్‌జీపీటీ స్కైవాయిస్‌లో ఎలా వినియోగిస్తారంటూ స్కార్లెట్ జాన్సన్.. ఓపెన్ ఏఐ సీఈఓపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.వేరే ప్రొఫెషనల్ నటికి చెందినదనిఆరోపణలపై శామ్ ఆల్ట్‌మన్ స్పందించారు. కంపెనీనీ ప్రశ్నార్థకంలో పడేసి చాట్‌జీపీటీ వాయిస్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో స్కై సిస్టమ్ వాయిస్ స్కార్లెట్ జాన్సన్‌ది కాదని, వేరే ప్రొఫెషనల్ నటికి చెందినదని తెలిపారు. స్కార్లెట్ జాన్సన్ ఏమన్నారంటే తన వాయిస్‌ను ఓపెన్ ఏఐ కాపీ చేయడంపై అవెంజర్ ముద్దుగమ్మ స్కార్లెట్ జాన్సన్ మాట్లాడుతూ.. ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ చాట్‌జీపీటీ వాయిస్ ఆప్షన్ కోసం గతేడాది సెప్టెంబర్‌లో నన్ను సంప్రదించారు.అయితే, ఆ ఆఫర్‌ను నేను తిరస్కరించా. అయినప్పటికీ ఆల్ట్‌మన్ తనలాగే వినిపించే 'చాట్‌జీపీటీ 4.0 సిస్టమ్' కోసం నా ప్రమేయం లేకుండా నా వాయిస్‌ని ఉపయోగించుకున్నారు’ అని ఆరోపించారు. జాన్సన్ ఆరోపణల్ని ఖండించిన ఓపెన్ఏఐ అయితే స్కార్లెట్ జాన్సన్ వ్యాఖ్యల్ని శామ్ ఆల్ట్‌మన్ ఖండించారు. చాట్‌జీపీటీ స్కై వాయిస్ స్కార్లెట్ జాన్సన్ వాయిస్ కాదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జాన్సన్ పట్ల ఉన్న గౌరవంతో మేం మా ప్రొడక్ట్‌లలో స్కై వాయిస్ ఉపయోగించడం నిలిపివేశాము. ఈ విషయంలో జాన్సన్‌కు తగిన విధంగా సమాచారం అందించకపోవడం క్షమాపణలు చెప్పారు.
తప్పక చదవండి
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- కెనడాలో భారతీయ విద్యార్థుల నిరసన.. ఎందుకంటే?
- T20: ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో కొత్తగా ఇద్దరు.. స్మిత్‌కు మరోసారి!
- బరువు తగ్గాలనుకుంటే..ఆ ఆహారాలకు దూరంగా ఉండాలంటున్న నిపుణులు!
- 'ఫ్యామిలీస్టార్'ను వాళ్లు కావాలనే టార్గెట్ చేశారు: ఆనంద్
- Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్
- కొన్ని గంటల్లోనే నిర్ణయం వెనక్కి తీసుకున్న బీఐఏఎల్
- తెలంగాణ డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు
- AP: అంతా ప్రీ ప్లాన్డ్‌గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- ఐదో దశ ఓటింగ్‌పై ఎన్నికల సంఘం ఆందోళన?
సినిమా
డల్లాస్‌లో తమన్ భారీ మ్యూజికల్ ఈవెంట్.. ఎప్పుడో తెలుసా?
ప్రస్తుతం దక్షిణాదిలో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. పలు పాన్ ఇండియన్ సినిమాలతో ఇతడు బిజీగా ఉన్నాడు. తమిళ, తెలుగు అనే తేడా లేకుండా ప్రతిచోట తమన్ పాటలు అదరగొట్టేస్తున్నాయి. ఎప్పుడు ఎంతో బిజీగా ఉండే ఇతడితో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ ఓ మ్యూజికల్ ఈవెంట్ ప్లాన్ చేసింది.(ఇదీ చదవండి: పాయల్ రాజ్‌పుత్ వివాదం.. షాకిచ్చిన టాలీవుడ్ నిర్మాతల మండలి!)అమెరికాలోని డల్లాస్‌లో తమన్ అతి పెద్ద మ్యూజికల్ ఈవెంట్ చేయబోతున్నాడు. స్పైస్ టూర్ పేరుతో జరిగే ఈ కార్యక్రమం జూన్ 1న ప్రారంభమవుతుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోలో గుంటూరు కారం నుంచి 'దమ్ మసాలా' అంటూ తమన్ చేసిన హంగామాని చూపించారు. ఇప్పటివరకు డల్లాస్ లో జరగనంత భారీ ఎత్తున ఈ మ్యూజికల్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.(ఇదీ చదవండి: నేనూ మనిషినే.. అలా అంటే తట్టుకోవడం కష్టం: యువ హీరోయిన్)
'ఫ్యామిలీస్టార్'ను వాళ్లు కావాలనే టార్గెట్ చేశారు: ఆనంద్
ఆనంద్ దేవరకొండ హీరోగా, ప్రగతీ శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గం..గం..గణేశా’. ఈ చిత్రం ఈ నెల 31న విడుదలవుతోంది. తాజాగా సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో తన సోదరుడు విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీస్టార్ చిత్రం గురించి ఆయన కామెంట్ చేశాడు.కొద్దిరోజుల క్రితం విడుదలైన 'ఫ్యామిలీస్టార్'కు కావాలనే నెగెటివ్ టాక్‌తో ప్రచారం చేశారు. ఆ సినిమా విడదల కావడానికి 48 గంటల ముందు నుంచే పబ్లిక్ మాట్లాడిని పాత వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. గతంలో విజయ్ సినిమాలకు సంబంధించిన మాటలను తీసుకొచ్చి ఫ్యామిలీస్టార్ రిజల్ట్, రివ్యూలు అంటూ తప్పుడు థంబ్ నెయిల్స్ పెట్టారు. అలాంటి సమయంలో ప్రేక్షకుల్లో కూడా కాస్త నిరుత్సాహం కనిపించింది. కనీసం సినిమా చూసిన తర్వాత అయినా అలా రివ్యూస్ ఇచ్చి ఉంటే.. నిజంగానే ప్రేక్షకులకు మూవీ నచ్చలేదేమోనని అనుకునే వాళ్లం. అలాంటిది ఫ్యామిలీస్టార్ విడుదలకు ముందే కావాలని టార్గెట్ చేసి కొందురు ఎందుకు ఎటాక్ చేశారో తెలియడం లేదు. ఇలాంటి పద్ధతి చిత్ర పరిశ్రమకు చాలా ప్రమాదకరం. ఇలాంటి పని ఎందుకు, ఎవరు చేస్తున్నారో తెలుసుకునేందుకు సైబర్‌క్రైమ్‌కు వారికి ఫిర్యాదు కూడా చేశాం. భవిష్యత్‌లో విజయ్ నుంచి మూడు సినిమాలు వస్తున్నాయి. అవన్నీ మీకు నచ్చుతాయని కోరుకుంటున్నాను. అని ఆయన అన్నారు.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
Miss Universe: సుస్మితా సేన్ అందానికి దక్కిన కిరీటానికి 30 ఏళ్లు పూర్తి
బాలీవుడ్ హీరోయిన్, మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌కు ఈరోజు చాలా ప్రత్యేకం. తాను విశ్వసుందరిగా కిరీటాన్ని గెలుచుకుని నేటితో 30 ఏళ్లు. ఆ రోజులను గుర్తుచేసుకుంటూ ఆమె ఒకఫోటోను షేర్ చేసింది. 1994లో విశ్వ సుందరి కిరీటం గెలిచి భారత జాతి ఖ్యాతి పెంచిన సుస్మిత ఆపై సినిమాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేస్తూ పేరు తెచ్చుకుంది.మే 21, 1994న మిస్ యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి భారతీయురాలుగా సుస్మిత రికార్డ్ క్రియేట్ చేసింది. అప్పటి ఫోటోను షేర్ చేస్తూ సుస్మిత ఇలా చెప్పుకొచ్చింది. 'ఈ ఫొటో తీసినప్పుడు నా వయసు 18ఏళ్లు. నేను అనాథాశ్రమంలో ఈ చిన్నారిని కలిసిన క్షణంలో నేను జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకోవాని నిర్ణయించుకున్నాను. అత్యంత అమాయకమైన ఆ చిన్నారి చూపు నన్ను కట్టిపడేసింది. 30 ఏళ్ల క్రితం నేను ఏదైతే అలాంటి వారికి చేయాలని అనుకున్నానో ఇప్పుడు అదే చేస్తున్నాను.ప్రతి ఏడాది మే 21ని చాలా గర్వంగా సెలబ్రెట్ చేసుకుంటాను. 21 మే 1994 నా జీవిత చరిత్రలో చెరిగిపోని ఒక పేజీ.. ఆ క్షణాలు ఇప్పటికీ నా కళ్లముందు కనిపిస్తున్నాయి. భారతదేశం ఎల్లప్పుడూ నాకు గొప్ప గుర్తింపు, శక్తిని ఇచ్చింది. గత మూడు దశబ్ధాలుగా అభిమానులు అంతులేని ప్రేమను నాకు అందిస్తున్నారు. ఈ సంతోషం సందర్భంగా నాకు మెసేజ్‌లు పంపుతున్న అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది.' అని ఆమె తెలిపింది.1975, నవంబర్ 19న ఓ బెంగాలీ కుటుంబంలో సుస్మితా సేన్ జన్మించింది. తండ్రి షుబీర్ సేన్ భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్‌గా పని చేయగా, తల్లి శుభ్రా సేన్ నగల డిజైనర్. సుస్మిత హైదరాబాద్‌లో జన్మించినా చదువంతా ఢిల్లీలో సాగింది.తెలుగులో నాగార్జున సరసన 'రక్షకుడు' చిత్రంలో నటించింది. 2013 సంవత్సరానికి సుస్మితాసేన్ మదర్‌థెరిస్సా ఇంటర్నేషనల్ అవార్డు అందుకుంది. సామాజిక న్యాయం కోసం కృషిచేసేవారిని గుర్తించి గౌరవించేందుకు ద హార్మనీ ఫౌండేషన్ అనే సంస్థ ఈ అవార్డు నెలకొల్పింది. 2015 లోనే సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సుస్మితా సేన్.. ఓటీటీ కోసం ఆర్య, తాళి వంటి వెబ్ సీరిస్‌లలో నటించింది. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47)
ఫొటోలు
అందానికి పట్టాభిషేకం.. మిస్ యూనివర్స్‌గా 'సుస్మితా సేన్' 30 ఏళ్ల నాటి ఫోటోలు
Vishnu Priya Photos: టీవీ స్టార్లు కూడా ఎక్కడా తగ్గట్లేదుగా! (ఫొటోలు)
‘గ్రేట్‌వాల్ మోటార్’ మొదటి బైక్.. (ఫొటోలు)
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
తిరుపతిలో వైభవంగా గంగమ్మ జాతర (ఫోటోలు)
క్రీడలు
T20: ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో కొత్తగా ఇద్దరు.. స్మిత్‌కు మరోసారి!
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టులో కొత్తగా ఇద్దరు ఆటగాళ్లకు చోటు దక్కింది. ఐపీఎల్-2024లో దుమ్ములేపిన యువ సంచలనం జేక్ ఫ్రేజర్-మెగర్క్‌తో పాటు మరో క్రికెటర్ వరల్డ్‌కప్ జట్టుతో ప్రయాణించనున్నాడు.కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా పొట్టి ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన ప్రధాన జట్టును ప్రకటించింది.అయితే, ఐసీసీ నిబంధనల ప్రకారం మే 25 వరకు జట్టులో మార్పులు, చేర్పులకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా ట్రావెలింగ్ రిజర్వ్స్‌గా ఇద్దరు బ్యాటర్లను ఎంపిక చేసింది. జేక్ ఫ్రేజర్- మెగర్క్‌తో మాథ్యూ షార్ట్‌కు కూడా అవకాశం ఇచ్చింది.స్టీవ్ స్మిత్‌తో పాటు వాళ్లకు మొండిచేయిఈ క్రమంలో సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌తో పాటు జేసన్ బెహ్రాన్‌డార్ఫ్, తన్వీర్ సంగాల ఆశలకు గండిపడినట్లయింది. కాగా ఈసారి వరల్డ్‌కప్‌లో మిచెల్ మార్ష్ సారథ్యంలో ఆస్ట్రేలియా జూన్ 5న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. బార్బడోస్ వేదికగా ఒమన్‌తో తలపడనుంది.దుమ్ములేపిన మెగర్క్ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన జేక్ ఫ్రేజర్-మెగర్క్ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. లుంగి ఎంగిడి స్థానంలో జట్టులోకి వచ్చిన 22 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ తొమ్మిది మ్యాచ్‌లు ఆడి 330 పరుగులు సాధించాడు.ఈ ఓపెనింగ్ బ్యాటర్ స్ట్రైక్‌రేటు ఏకంగా 234.04 ఉండటం విశేషం. ఇక ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్న మెగర్క్.. 15 మంది సభ్యుల ప్రధాన జట్టులో కూడా స్థానం సంపాదించుకునే అర్హతలు కలిగి ఉన్నా సీనియర్లు ఉన్న కారణంగా సాధ్యం కాలేదు.అందుకే ఇలా జరిగిందిఆస్ట్రేలియా హెడ్‌కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్లో జేక్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. వరల్డ్‌కప్ జట్టు ఫైనల్ 15 కోసం అతడి పేరును పరిగణనలోకి తీసుకునేలా చేశాడు.ఇక మాథ్యూ షార్ట్ సైతం బిగ్‌బాష్ లీగ్‌లో అద్భుతంగా రాణించాడు. అయితే, వీరిద్దరు టాపార్డర్ బ్యాటర్లు కావడం వల్లే మొదటి 15 మంది సభ్యుల జాబితాలో వాళ్లకు చోటు దక్కలేదు’’ అని మెక్‌డొనాల్డ్ పేర్కొన్నాడు.టీ20 ప్రపంచకప్-2024కు ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), ఆస్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.ట్రావెలింగ్ రిజర్వ్స్: జేక్ ఫ్రేజర్ మెగర్క్, మాథ్యూ షార్ట్.చదవండి: శివమ్ దూబేపై వేటు.. వరల్డ్‌కప్ జట్టులో ఫినిషర్‌కు చోటు!
KKR vs SRH: ప్రమాదకారి.. ఫైనల్ చేరే తొలి జట్టు ఇదే!
ఐపీఎల్-2024లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఫైనల్ చేరే తొలి జట్టును ఖరారు చేసే క్వాలిఫయర్-1లో మాజీ చాంపియన్లు కోల్‌కతా నైట్ రైడర్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ మంగళవారం తలపడనున్నాయి.అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అమీ తుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లెజెండరీ పేసర్ వసీం అక్రం కీలక వ్యాఖ్యలు చేశాడు. కేకేఆర్ చాలా ప్రమాదకర జట్టు అంటూ ప్రత్యర్థి సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను హెచ్చరించాడు.అగ్రస్థానంలో నిలవడానికి ప్రధాన కారణం‘‘పాయింట్ల పట్టికలో కేకేఆర్ అగ్రస్థానంలో నిలవడానికి ప్రధాన కారణం వారి బౌలింగ్ లైనప్. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వికెట్లు తీయగల సమర్థులు ఆ జట్టులో ఉన్నారు.అలాంటి బౌలర్లు ఉన్న జట్టు ఏదైనా కచ్చితంగా విజయాలు సాధిస్తుంది. ఈ సీజన్లో ఇప్పటికే వరుణ్ చక్రవర్తి 18, హర్షిత్ రాణా 16, ఆల్‌రౌండర్లు ఆండ్రీ రసెల్, సునిల్ నరైన్ చెరో 15, మిచెల్ స్టార్క్ 12 వికెట్లు పడగొట్టారు.ప్రమాదకర జట్టు ముఖ్యంగా ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల స్టార్క్ ఉండటం వారికి ప్రధాన బలం. కేకేఆర్ ఎలాంటి హడావుడి లేకుండా.. పూర్తి ఆత్మవిశ్వాసంతో.. ఫైనల్ చేరేందుకు అర్హతలు ఉన్న ప్రమాదకర జట్టు అని కచ్చితంగా చెప్పగలను.ఇక ఈ జట్టులో ఉన్న ప్రతి ఒక్క బ్యాటర్ కూడా కీలక సమయంలో ఏదో ఒక మ్యాచ్‌లో రాణిస్తూనే ఉన్నాడు. దూకుడుగా ఆడుతున్నట్లుగా కనిపిస్తున్నా ఎక్కడా అతి విశ్వాసం ప్రదర్శించరు’’ అని వసీం అక్రం పేర్కొన్నాడు.కోల్‌కతా నైట్ రైడర్స్‌కే ఎక్కువ అవకాశాలుక్వాలిఫయర్-1 నేపథ్యంలో ఫైనల్ చేరే తొలి జట్టుగా కోల్‌కతా నైట్ రైడర్స్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. అయితే, ఓపెనర్ ఫిల్ సాల్ట్(ఇంగ్లండ్) జట్టుకు దూరం కావడం కచ్చితంగా ప్రభావం చూపుతుందని వసీం అక్రం అభిప్రాయపడ్డాడు. కాగా వసీం అక్రం గతంలో కేకేఆర్ జట్టుతో కలిసి పనిచేశాడు. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో తమ ఆరంభ మ్యాచ్‌లో కేకేఆర్- సన్‌రైజర్స్ పరస్పరం తలపడ్డాయి. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 4 పరుగుల స్వల్ప తేడాతో రైజర్స్‌ను ఓడించింది.చదవండి: MI: ఈ సీజన్లో నిరాశే మిగిలింది.. అయితే: నీతా అంబానీ వ్యాఖ్యలు వైరల్
MI: ఈ సీజన్లో నిరాశే మిగిలింది: నీతా అంబానీ వ్యాఖ్యలు వైరల్
ఐపీఎల్-2024 ముంబై ఇండియన్స్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. గత సీజన్లో ప్లే ఆఫ్స్ చేరిన ఈ జట్టు.. ఈసారి మాత్రం దారుణంగా విఫలమైంది. ఆడిన పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగు మాత్రమే గెలిచి ఎనిమిది పాయింట్లతో పట్టికలో అట్టడుగున నిలిచింది.పేలవ ప్రదర్శనతో ఈ ఎడిషన్‌లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌ను చేసినందుకు ముంబై యాజమాన్యం భారీ మూల్యమే చెల్లించిందనే విమర్శలు వస్తున్నాయి.ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ జట్టును ఉద్దేశించి డ్రెస్సింగ్ రూంలో చేసిన ప్రసంగం ఆసక్తికరంగా మారింది. ‘‘ఈ సీజన్ మనందరినీ ఎంతగానో నిరాశ పరిచింది. మనం ఆశించినట్లుగా ఏదీ జరగలేదు.అయినా నేనెప్పటికీ ముంబై ఇండియన్స్ జట్టుకు వీరాభిమానినే. కేవలం యజమానిగా ఉన్నందుకు మాత్రమే నేను ఈ మాటలు చెప్పడం లేదు. ముంబై ఇండియన్స్ జెర్సీ ధరించడం.. జట్టుతో ఇలా మమేకం కావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను.మన ఆట తీరును సమీక్షించుకుందాం. ఓటములకు గల కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం’’ అని నీతా అంబానీ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపారు. అదే విధంగా టీ20 ప్రపంచకప్-2024 ఆడబోయే భారత జట్టుకు ఎంపికైన ముంబై ఆటగాళ్లకు నీతా అంబానీ ఈ సందర్భంగా ఆల్ ది బెస్ట్ చెప్పారు.‘‘రోహిత్, హార్దిక్, సూర్య, జస్ప్రీత్.. భారతీయులంతా మీ కోసం ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు’’ అంటూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలను విష్ చేశారు. కాగా జూన్ 1 నుంచి వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభం కానుండగా.. జూన్ 5న ఐర్లాండ్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది.Mrs. Nita Ambani talks to the team about the IPL season and wishes our boys all the very best for the upcoming T20 World Cup 🙌#MumbaiMeriJaan #MumbaiIndians | @ImRo45 | @hardikpandya7 | @surya_14kumar | @Jaspritbumrah93 pic.twitter.com/uCV2mzNVOw— Mumbai Indians (@mipaltan) May 19, 2024
జ్యోతిక శ్రీ బృందానికి స్వర్ణం..!
బ్యాంకాక్: ఆసియా రిలే అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ లో అజ్మల్, దండి జ్యోతిక శ్రీ, అమోజ్ జేకబ్, శుభాలతో కూడిన భారత బృందం మిక్స్డ్ రిలే 4్ఠ400 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం గెలిచింది. భారత బృందం 3 నిమిషాల 14.12 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది.ఈ క్రమంలో గత ఏడాది ఆసియా క్రీడల్లో 3 నిమిషాల 14.34 సెకన్లతో నెలకొల్పిన జాతీయ రికార్డు తెరమరుగైంది. భారత్‌కు బంగారు పతకం దక్కడంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతిక శ్రీ కీలకపాత్ర పోషించింది. ఈ ప్రదర్శనతో భారత బృందం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 21వ స్థానానికి చేరుకుంది. జూన్ 30వ తేదీలోపు భారత బృందం టాప్–16లోకి చేరితే పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తుంది.ఇవి చదవండి: World Para Championships: శభాష్ దీప్తి..
బిజినెస్
వాట్సప్‌లో అదిరిపోయే ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే?
వాట్సప్ యూజర్లకు శుభవార్త. యూజర్ల సౌలభ్యం వాట్సప్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. సాధారణంగా వాట్సప్ ఓపెన్ చేయగానే వాట్సప్ నిండా ఇబ్బడి ముబ్బడిగా ఉన్న మెసేజ్‌లు కొన్ని సార్లు చిరాకు తెప్పిస్తుంటాయి.ఈ సమస్యను అదిగమించేందుకు వాట్సప్ యాజమాన్యం కొత్త ఫీచర్ అందుబాటులోకి తేనున్నట్లు వీబీటా ఇన్ఫో తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ఎంపిక చేసిన బీటా వెర్షన్ యూజర్ల వినియోగిస్తున్నట్లు వెల్లడించింది.ఇక ఈ ఫీచర్ వినియోగంలోకి వస్తే.. లేటెస్ట్గా వాట్సప్‌కు వచ్చే మెసేజ్‌లకు నోటిఫికేషన్ వస్తుంది. చదవని వాట్సప్ మెసేజ్‌లు వాటంతట అవే డిలీట్ అవ్వనున్నాయి.
వివాదంలో చాట్‌జీపీటీ.. అడ్డంగా బుక్కైన సీఈఓ శామ్ ఆల్ట్‌మన్
ఓపెన్ ఏఐ సీఈఓ, చాట్‌జీపీటీ సృష్టికర్త శామ్ ఆల్ట్‌మన్ అడ్డంగా దొరికిపోయారు. ఇక చేసిది లేక తన చాట్‌జీపీటీ స్కై వాయిస్‌ను నిలిపి వేశారు.యాపిల్ సిరి వాయిస్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ తరహాలో చాట్ జీపీటీ యూజర్లకు వాయిస్ అసిస్టెంట్ సేవల్ని అందించేందుకు సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ పనిచేస్తున్నారు. స్కై వాయిస్ పేరుతో తెచ్చే ఈ ఫీచర్లో ప్రముఖుల వాయిస్ వినిపిస్తుంది. మీకు ఎవరి వాయిస్ కావాలనుకుంటారో.. దాన్ని సెలక్ట్ చేసుకుంటే చాట్ జీపీటీ సమాధానాల్ని టెక్ట్స్ కాకుండా వాయిస్‌లో రూపంలో అందిస్తుంది.నా అనుమతి లేకుండా నా వాయిస్‌ను దీన్ని డెవలప్ చేసే సమయంలో శామ్ ఆల్ట్‌మన్.. అద్భుత నటిగా, అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఫిమేల్ యాక్టర్‌గా, హాలీవుడ్‌లోని ఎన్నో ప్రముఖ చిత్రాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ స్కార్లెట్ జాన్సన్ వాయిస్‌ను వినియోగించారు. దీంతో తనని సంప్రదించకుండా తన వాయిస్‌ను కాపీ చేసి చాట్‌జీపీటీ స్కైవాయిస్‌లో ఎలా వినియోగిస్తారంటూ స్కార్లెట్ జాన్సన్.. ఓపెన్ ఏఐ సీఈఓపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.వేరే ప్రొఫెషనల్ నటికి చెందినదనిఆరోపణలపై శామ్ ఆల్ట్‌మన్ స్పందించారు. కంపెనీనీ ప్రశ్నార్థకంలో పడేసి చాట్‌జీపీటీ వాయిస్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో స్కై సిస్టమ్ వాయిస్ స్కార్లెట్ జాన్సన్‌ది కాదని, వేరే ప్రొఫెషనల్ నటికి చెందినదని తెలిపారు. స్కార్లెట్ జాన్సన్ ఏమన్నారంటే తన వాయిస్‌ను ఓపెన్ ఏఐ కాపీ చేయడంపై అవెంజర్ ముద్దుగమ్మ స్కార్లెట్ జాన్సన్ మాట్లాడుతూ.. ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ చాట్‌జీపీటీ వాయిస్ ఆప్షన్ కోసం గతేడాది సెప్టెంబర్‌లో నన్ను సంప్రదించారు.అయితే, ఆ ఆఫర్‌ను నేను తిరస్కరించా. అయినప్పటికీ ఆల్ట్‌మన్ తనలాగే వినిపించే 'చాట్‌జీపీటీ 4.0 సిస్టమ్' కోసం నా ప్రమేయం లేకుండా నా వాయిస్‌ని ఉపయోగించుకున్నారు’ అని ఆరోపించారు. జాన్సన్ ఆరోపణల్ని ఖండించిన ఓపెన్ఏఐ అయితే స్కార్లెట్ జాన్సన్ వ్యాఖ్యల్ని శామ్ ఆల్ట్‌మన్ ఖండించారు. చాట్‌జీపీటీ స్కై వాయిస్ స్కార్లెట్ జాన్సన్ వాయిస్ కాదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జాన్సన్ పట్ల ఉన్న గౌరవంతో మేం మా ప్రొడక్ట్‌లలో స్కై వాయిస్ ఉపయోగించడం నిలిపివేశాము. ఈ విషయంలో జాన్సన్‌కు తగిన విధంగా సమాచారం అందించకపోవడం క్షమాపణలు చెప్పారు.
స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ 34 పాయింట్లు నష్టపోయి 22,470కు చేరింది. సెన్సెక్స్ 121 పాయింట్లు దిగజారి 73,899 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.6 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 83.66 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.44 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.09 శాతం లాభపడింది. నాస్డాక్ 0.65 శాతం పుంజుకుంది.‘అంతర్జాయతీ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. ఇది దేశీయ ఈక్విటీ మార్కెట్‌కు కలిసొచ్చే అంశం. అయితే ఎన్నికల సంబంధిత పరిణామాల వార్తలు, కార్పొరేట్ ఆర్థిక ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఒడిదుడుకుల ట్రేడింగ్ కొనసాగొచ్చు. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 22,500 స్థాయిని నిలుకోగలిగితే జీవితకాల గరిష్టాన్ని (22,795) పరీక్షించవచ్చు. అమ్మకాలు నెలకొంటే 22,200 వద్ద మరో కీలక మద్దతు ఉంది’ అని నిపుణులు తెలిపారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియా రాకతో ‘విప్రో’లో సీను మారింది
ప్రముఖ టెక్నాలజీ సంస్థ విప్రోలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విప్రో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ పల్లియా.. రెండు నెలలు లోపే సంస్థ మాజీ సీఈఓ థియరీ డెలాపోర్టే సీఈఓగా పని చేసే సమయంలో పలు విభాగాల్లో ముఖ్యపాత్ర పోషించిన టాప్ మేనేజ్మెంట్ను ఇతర విభాగాలకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు.విప్రోను ముందుకు నడిపించే తన నమ్మకస్తుల్ని అక్కున చేర్చుకుంటున్నారు పల్లియా. ఇందులో భాగంగా థియరీ డెలాపోర్టేకు నమ్మకస్తులైన ముగ్గురు టాప్ ఎగ్జిక్యూటీవ్‌లు బదిలి చేశారు. ఇక విప్రో వ్యాపారం పుంజుకునేలా శ్రీనివాస్ పల్లియా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా విప్రోలో ప్రముఖ పాత్ర పోషించే ఫుల్‌స్ట్రైడ్ క్లౌడ్, ఎంటర్ప్రైజ్ ఫ్యూచరింగ్, ఇంజనీరింగ్ ఎడ్జ్ అండ్ కన్సల్టింగ్ విభాగాల్లో మార్పులు చేశారు.సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎకోసిస్టమ్స్ & పార్ట్నర్షిప్ గ్లోబల్ హెడ్, జాసన్ ఐచెన్‌హోల్జ్ వ్యాపార కార్యకలాపాల గురించి ఇప్పుడు విప్రో ఫుల్‌స్ట్రైడ్ క్లౌడ్ బిజినెస్ లైన్ హెడ్ జో డెబెకర్‌కి రిపోర్ట్ చేయాలి. ఐచెన్‌హోల్జ్ ఆగస్ట్ 2021లో విప్రోలో చేరగా, డెబెకర్ జనవరి 2022లో విప్రోలో బాధ్యతలు చేపట్టారు.విప్రో ఆసియా పసిపిక్, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా (APMEA) స్ట్రాటజిక్ మార్కెట్ యూనిట్‌కు సీఈఓగా వినయ్ ఫిరాకే కొద్ది రోజుల క్రితం నియమించింది. ఆయన నియమాకం తర్వాత విప్రో కంపెనీ బెనెలక్స్, నార్డిక్ దేశాలు కార్యకలాపాలను కలిపి ఒకే ఉత్తర ఐరోపా ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది .ప్రస్తుత బెనెలక్స్ దేశ విప్రో మేనేజింగ్ డైరెక్టర్ శరత్ చంద్ కొత్త ఉత్తర ఐరోపా ప్రాంతానికి నాయకత్వం వహిస్తారని కంపెనీ తెలిపింది.దీంతో పాటు విప్రో ఉనికి ఎక్కువగా ఉన్న యూరోపియన్ దేశాల్లో తన వ్యాపారాన్ని మరింత ముమ్మరం చేసేందుకు యూకే, ఐర్లాండ్, జర్మనీ, స్విట్జర్లాండ్, నార్డిక్స్, బెనెలక్స్, దక్షిణ ఐరోపాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో తన డెలివరీ లొకేషన్లను ఏర్పాటు చేయనుంది.విప్రో ఇంజినీరింగ్ ఎడ్జ్‌లో, నోకియాతో ప్రైవేట్ వైర్లెస్ జాయింట్ సొల్యూషన్ కోసం విప్రో ఎంగేజ్మెంట్ లీడర్‌గా శ్రేయాస్ భోసలే నియమించింది.ఇలా విప్రో కంపెనీ తన యూనిట్లలో భారీ మార్పులు చేసినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి.
వీడియోలు
ఈ ఫోటోలో వ్యక్తి కనబడుట లేదు: జోగి రమేష్
ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ భద్రతా చర్యలపై చర్చ
అడ్డదిడ్డంగా మాట్లాడుతున్న ప్రశాంత్ కిషోర్ ? పీకే నోట బాబు పలుకులు
బెంగళూరు రేవ్ పార్టీ..బయటపడ్డ సంచలన నిజాలు..
బీజేవైఎం నిరసన గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత
వరల్డ్ కప్ నే కాళ్ళ కింద పెట్టుకున్న కెప్టెనే ఇలా అంటే..
RCBని ధోని అవమానించాడా..? ధోనినే ఆర్సీబీ అవమానించిందా..?
రామోజీ ఈ వయసులో ఇదేం పని... ఇప్పటికైనా మారకపోతే..
శ్రీకాకుళంలో ఎగిరేది YSRCP జండానే..
తెలుగు ఓటర్లు కీలకం
ఫ్యామిలీ
అలసిన దేహానికో'టీ'..! భారత్‌లో మొదటిసారిగా..
పొద్దునో టీ.. సాయంత్రమో టీ.. దోస్తులతో టీ.. చుట్టాలతో టీ.. పని ఆపి ఒక టీ.. పనయ్యాకో టీ.. తాగాల్సిందే టీ అంటూ టీ ప్రియులు చెబుతున్నారు. చెమటలు కక్కే వేడిలోనూ పొగలుకక్కే చాయ్ తాగుతున్నారు. చాయ్ కలిగించే కిక్కులను పేద, ధనిక వ్యత్యాసం లేకుండా ఆస్వాదిస్తుంటారు. ఎంత పేదలైనా ఇంటికి వెళ్లామంటే.. ఓ గ్లాసు మంచినీళ్లు, ఓ కప్పు టీ ఇవ్వాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ప్రజలకు టీ అత్యంత ఇష్టమైన పానీయం. అలాంటి టీకి ఒక రోజు ఉంది. 2005 నుంచి ఏటా మే 21న అంతర్జాతీయ ‘టీ’ దినోత్సవం నిర్వహిస్తున్నారు.1793 నుంచే..అలిసిన మనసుకు, దేహానికి ఉత్తేజాన్ని ఇచ్చే పానీయం టీ. అరె భాయ్ చటుక్కున తాగరా చాయ్.. అంటూ ఓ సినీగేయ రచయిత టీ గొప్పతనాన్ని వర్ణిస్తూ పాట రాశాడు. ఎంతో చరిత్ర కలిగిన టీని తేనీరు, చాయ్ అని పిలుస్తారు. 15వ శతాబ్దంలో నాగరిక ప్రపంచానికి టీ పరిచయమైంది. మొట్టమొదటగా మన దేశంలో 1793లో కలకత్తాలోని బొటానికల్ గార్డెన్లో లార్డ్ మెకార్డి టీ మొక్కలు పెంచడం ప్రారంభించాడు. ఇప్పుడు ఇంటింటికీ టీ చేరింది. ప్రపంచ టీ ఉత్పత్తిలో చైనా తర్వాతి స్థానం భారత్‌దే. అంతర్జాతీయంగా 30శాతం టీ పొడిని ఒక్క భారతీయులే వినియోగిస్తున్నారు.సహజమైన పానీయం..టీ సహజమైన పానీయం. ఇంటికి ఎవరు వచ్చినా అతిథి మర్యాదలో మొదట చేరిపోయేది ‘టీ’. స్నేహితులు కాలక్షేపానికి టీ పాయింట్‌కు చేరాల్సిందే. సమావేశాల్లోనూ తేనీటిది ప్రత్యేక స్థానం. ప్రస్తుతం బయట రకరకాల కేఫ్‌లు వెలుస్తున్నాయి. టీలలో కూడా చాలా రకాలు తయారు చేస్తున్నారు. అల్లం టీ, లెమన్ టీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ, మసాలా టీ, కరోనా టీ రకరకాల టీలను టీ ప్రియులు ఆస్వాదిస్తున్నారు. మండల కేంద్రాల్లో సైతం ప్రస్తుతం వివిధ కంపెనీలు వివిధ పేర్లతో టీ పాయింట్లు ఏర్పాటు చేసి ఒక కప్పు చాయ్‌కు రూ.10లకు తగ్గకుండా విక్రయిస్తున్నారు. కానీ పలువురు టీ వ్యాపారులు ఇప్పటికీ రూ.5లకే టీ విక్రయిస్తున్నారు.ఇవి చదవండి: నాలుగు మాటల్లో.. ఈ చిత్రకారుడి కథ!
అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
ప్రతి ఏడాది మే 21వ తేదీ అంతర్జాతీయ టీ దినోత్సవం( International Tea Day! జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 21, 2019న తీర్మానించింది. దీంతో ఏటా ఆహార, వ్యవసాయ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా మే 21వ తేదీని ఘనంగా నిర్వహిస్తున్నాయి. టీని ఉత్పత్తి చేయడం, వినియోగానికి అనుకూలమైన కార్యకలాపాలను అమలు చేసేందుకు సమిష్టి చర్యలు తీసుకోవడం, ప్రోత్సహించడం ఈ రోజు ప్రధాన లక్ష్యం.చరిత్రఈశాన్య భారతదేశం, ఉత్తర మయన్మార్, నైరుతి చైనాలో ఈ టీ (Tea) ఉద్భవించిందని చాలా మంది నమ్ముతారు. కచ్చితమైన ప్రదేశం తెలియనప్పటికీ 5వేల ఏళ్ల క్రితం చైనాలో మొదటిసారిగా టీ తాగినట్టు కొన్ని ఆధారాలున్నాయి. భారతదేశంతో పాటు శ్రీలంక, నేపాల్, వియత్నాం, ఇండోనేషియా, బంగ్లాదేశ్, కెన్యాస మలావి, మలేషియా, ఉగాండా, టాంజానియా వంటి టీ ఉత్పత్తి దేశాల్లో 2005నుంచి అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆ రోజున టీ ఉత్పత్తి చేసే దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన పెంచడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీ వర్కర్స్ సంస్థలు సెమినార్లు, పబ్లిక్ ఈవెంట్లను నిర్వహిస్తూ సమావేశమవుతాయి.పొద్దుపొద్దునే వేడి వేడి చాయ్ కడుపులో పడితేగానీ హాయిగా ఉండదు చాలామందికి. ప్రపంచంలో ఎక్కువ మంది వినియోగించేది టీ. చుట్టాలు వచ్చినా ముందుగా గుర్తొచ్చొది టీ. అలాంటి టీలో ప్రపంచం నలుమూలల ఉన్న వెరైటీలు ఏంటో చూద్దామా..మాచా, జపాన్: గ్రీన్ టీ ఆకులతో ప్రాసెస్ చేసిన టీ పొడి. ఆకుపచ్చరంగులో ఉండే టీ. జపాన్‌లో ఈ టీ బాగా ఫేమస్. ఇది మట్టి రుచిని కలిగి ఉంటుంది. ముందు సిప్ చేస్తే చేదుగా ఉండి రానురాను మాధుర్యంగా ఉంటుంది. దీన్ని ఐస్డ్ టీ, ఐస్‌క్రీమ్‌లు, ఇతర డెజర్ట్‌లలో కూడా ఉపయోగించింది.టెహ్ తారిక్, మలేషియా: టెహ్ తారిక్ అనేది మలేషియా నుంచి వచ్చిన ఒక ప్రసిద్ధ వేడి పాల టీ పానీయం. సాధారణంగా నురుగుతో ఉంటుంది. 'తే తారిక్' అనే పేరుకు "తీసి తీసిన టీ" అని అర్ధం. ఈ తీపి టీలో ఉడికించిన, స్ట్రాంగ్ బ్లాక్ టీ, ఆవిరైన క్రీమర్, పాలు ఉంటాయి. మరింత రుచిగా ఉండేలా ఏలకులను కూడా జోడించవచ్చు. చా యెన్, థాయిలాండ్: చా యెన్ ఒక ప్రసిద్ధ థాయ్ ఐస్డ్ టీ. ఇది మంచి రిఫ్రెష్ నిచ్చే పానీయం. ఇది బ్లాక్ టీ, రూయిబోస్ టీ, స్టార్ సోంపు, లవంగాలు, దాల్చినచెక్క, ఏలకులు, పాలు, పంచదారతో తయారు చేసే పానీయం. ఇది తీపి, క్రీము, సుగంధ రుచిని కలిగి ఉంటుంది. దీన్ని కొబ్బరి పాలను ఉపయోగించి కూడా తయారు చేసుకోవచ్చు. చా యెన్ని ఐస్‌ముక్కలతో సర్వ్ చేస్తారు.మసాలా చాయ్: భారతదేశం ఇది చాలా ఫేమస్. చాలా మంది భారతీయులు తమ రోజును ప్రారంభించేందుకు లేదా సాయంత్రం విశ్రాంతి తీసుకోనే టైంలో ఈ మసాలా చాయ్‌ని ఆస్వాదిస్తారు. ఇది బిస్కెట్లు, రొట్టెలు లేదా పకోరస్ వంటి భారతీయ స్నాక్స్‌తో కూడా బాగా జత చేస్తుంది. మసాలా చాయ్‌ని మొదటగా వేడినీటిలో ఆకుపచ్చ ఏలకులు, లవంగాలు, దాల్చినచెక్క, నల్ల మిరియాలు, అల్లం, సోపు గింజలు వంటి మొత్తం మసాలా దినుసులను టీ ఆకులు వేసి బాగా మరిగిస్తారు. ఆ తర్వాత పాలు జోడించి, కావాల్సిన రంగు వచ్చేలా టీని తయారు చేసుకోవాలి. చాలా మంది ప్రజలు తమ కప్పు మసాలా చాయ్‌ను ప్రిపేర్ చేసేందుకు చక్కెర లేదా బెల్లం కూడా కలుపుతారు.సిలోన్ బ్లాక్ టీ, శ్రీలంక: సిలోన్ అనేది శ్రీలంకకు పూర్వపు పేరు, దీనిని ఇప్పటికీ టీ వ్యాపారంలో ఉపయోగిస్తున్నారు. శ్రీలంకకు చెందిన ఈ బ్లాక్ టీ స్ట్రాంగ్ రుచిని కలిగి ఉంటుంది. ఇది పూల వాసనలా ఉండి గొప్ప రంగును కలిగి ఉంటుంది. దీన్ని కూల్‌గా లేదా వెచ్చగా ఆస్వాదించవచ్చు. మీరు దీన్ని ఐస్డ్ టీ లేదా వెచ్చని బ్లాక్ టీగా ఆస్వాదించవచ్చు.
ఒడిషాలోని బీచ్‌ల గురించి తెలిస్తే.. ఇపుడే ‘ఛలో’ అంటారు
బీచ్‌లు అనగానే మనకు సాధారణంగా గోవా, వైజాగ్ లాంటి ప్రదేశాలు ప్రధానంగా గుర్తుకు వస్తాయి. కానీ భారతదేశానికి తూర్పున ఉన్న రాష్ట్రం, 480 కి.మీ పొడవైన అందమైన తీర ప్రాంతం ఉన్న ఒడిషా కూడా అందమైన బీచ్‌లకు ప్రకృతి రమణీయ దృశ్యాలకు నిలయం. అందమైన తీరప్రాంతం, పురాతన దేవాలయాలు, గిరిజన సంస్కృతి ,వన్యప్రాణుల అభయా రణ్యాలున్నాయి ఇక్కడ. ఓడిషాలోని 7 అందమైన బీచ్‌ల గురించి తెలుసుకుందాం.<Odisha beaches are underrated. pic.twitter.com/ac50CVe6xC— Indian Tech & Infra (@IndianTechGuide) May 21, 2024 1. పూరి బీచ్ఒడిశాలోని అత్యంత ప్రసిద్ధ బీచ్‌లలో ఒకటి పూరీ బీచ్. బీచ్ ప్రేమికులు ,ఆధ్యాత్మిక అన్వేషకులు ఒడిషాలో దీన్ని టాప్ బీచ్‌గా భావిస్తారు. సముద్ర తీరం, గోల్డెన్ ఇసుక ఇక్కడి ప్రత్యేకం. అంతేకాదు అద్భుతమైన సూర్యోదయాలు ,సూర్యాస్తమయ దృశ్యాలను అస్సలు మిస్ కాకూడదు. సమీపంలోని జగన్నాథ ఆలయం మరో పెద్ద ఆకర్షణ.And early morning vibe is damn good in Odisha ⛱️ .❤️❤️#odisha#beaches #indiasbestkeptsecret #JaiJagannatha #Konark pic.twitter.com/HgnTriP7hZ— Adarsh Jyoti (@AdarshJyoti1) May 21, 20242. అస్తరంగ బీచ్పూరీ నగరానికి దగ్గరగా ఉన్న మరో బీచ్, అస్తరంగ బీచ్. ప్రశాంత వాతావరణం, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. చుట్టూ పెద్దగా ఫిషింగ్ కమ్యూనిటీలు ఉన్నాయి. ఈ బీచ్ పక్షులను వీక్షించడానికి బాగా ఇష్టపడే ప్రదేశం.పర్యాటకులు అక్కడ వివిధ రకాల వలస పక్షుల జాతులను చూడ్డానికి వస్తారు.3 ఉన్నట్టుండి మాయమయ్యే చాందీపూర్ బీచ్ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఉన్న చాందీపూర్ బీచ్ దేశంలోనే అరుదైన బీచ్‌గా ప్రత్యేక గుర్తింపు సాధించింది. బాలాసోర్ రైల్వే స్టేషన్ నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ బీచ్ చూడటానికి ఇతర బీచ్‌ల మాదిరే. కానీ నమ్మడానికి ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా ఈ బీచ్ అకస్మాత్తుగా మాయమైపోతుందిట. ఈ బీచ్‌లో భారీ అలలు ఆటుపోట్లకు గురైనప్పుడు సముద్రపు నీరు సుమారు 5 కిలోమీటర్ల దూరం వెనక్కి వెళ్లిపోతుంది. దీంతో అది అక్కడికి వచ్చేవారిని సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తుతుంది. మనం చూస్తున్నంత సేపు కనిపించిన సముద్రం ఉన్నట్టుండి ఒక్కసారిగా కనపడకుండా పోతుండటం విశేషం. మోనాజైట్ , టైటానియం అధికంగా ఉండే నల్ల ఇసుక, సరుగుడు చెట్లతో నిండి ఉంటుంది. ముఖ్యంగా పిక్నిక్లు పక్షులను చూడటం ఇష్టపడేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.4. గోపాల్పూర్ బీచ్ఒడిశాలోని దక్షిణ భాగంలో ఉన్న గోపాల్పూర్ బీచ్. ప్రశాంతత, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. తెల్లటి ఇసుక, కొబ్బరి చెట్లతో గోపాల్పూర్ బీచ్ ఒడిషాలో సందర్శించడానికి ఉత్తమమైన బీచ్‌లలో ఒకటి. ఇక్కడ ఈత కొట్టవచ్చు, చేపలు పట్టవచ్చు.అందుకే ఇది చాలా పాపులర్ అయింది. ఇక్కడ నౌకాశ్రయం కూడా ఉంది.5. రాంచండీ బీచ్, కోణార్క్కోణార్క్ పట్టణానికి దగ్గరగా ఉన్న రాంచండి బీచ్ . UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశం గుర్తింపు పొందిన కోణార్క్ సూర్య దేవాలయానికి ఆనుకొని ఉన్నందున బీచ్ అందాలతోపాటు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు కూడా ప్రసిద్ధి చెందింది. ఈబీచ్ వద్ద ఈత, సన్‌బాత్, బోటింగ్ ఫిషింగ్ లాంటివి ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు.6. బలిఘై బీచ్, పూరిపూరీ నగరానికి దగ్గరగా ఉన్న బలిఘై బీచ్ స్పష్టమైన నీలి జలాలకు ప్రసిద్ధి. చుట్టూ పచ్చని అడవులు, బంగాళాఖాతం యొక్క ఉత్కంఠభరితమైన దృశ్యాలను అందిస్తుంది. ఒంటె , గుర్రపు స్వారీలతోపాటు, బీచ్‌లో తాజా సీఫుడ్ , ప్రాంతీయ వంటకాలను విక్రయించే అనేక చిన్న ఫుడ్ సెంటర్లలో ఆస్వాదించవచ్చు.7. తలసరి బీచ్తలసరి పేరు రెండు ఒడియా పదాలైన తల ( పామ్ లేదా తాటి)సరి(వరుస) నుండి వచ్చింది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న తాటి చెట్లు ఎక్కువ ఉండటం వల్లే ఈ పేరు వచ్చిందని చెబుతారు. తాలా అనే పదానికి లయ అని కూడా అర్థం, ఇది తీరానికి వ్యతిరేకంగా వచ్చే సముద్రపు అలలలో ప్రతిబింబిస్తుందని భావిస్తారు.సువర్ణరేఖ నది తలసరి బీచ్ ఆకర్షణను రెట్టింపుచేస్తుంది. దీనితోటు ఇసుక దిబ్బలు, ఎర్ర పీతలు ఆరో ఆకర్షణ. ఈ బీచ్‌కు సమీపంలో ఉన్న బిచిత్రపూర్లోని ఫిషింగ్ పల్లెలు, మడ చెట్లు టూరిస్టులను ఆకర్షిస్తాయి.
Vishnu Priya Photos: టీవీ స్టార్లు కూడా ఎక్కడా తగ్గట్లేదుగా! (ఫొటోలు)
న్యూస్ పాడ్‌కాస్ట్
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం
దక్షిణాదిలో బీజేపీకే అత్యధిక లోక్‌సభ సీట్లు... ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ విశ్వాసం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలన్న ఆలోచన మానుకోండి... కాంగ్రెస్ పార్టీకి హితవు పలికిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ అనంతరం జరిగిన హింసాకాండపై వినీత్ బ్రిజ్‌లాల్ నేత్వత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు.. ఇంకా ఇతర అప్డేట్స్
రుణమాఫీకి ఏర్పాట్లు చేయండి, ఆగస్టు 15లోగా చేసి తీరాల్సిందే.. అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 81.3 శాతం పోలింగ్... వెల్లడించిన సీఈవో కార్యాలయం వర్గాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో పోటెత్తిన ఓటర్లు. కడపటి వార్తలు అందే సమయానికి 76.50 శాతం పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో వన్స్‌మోర్... రాష్ట్రంలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం తథ్యమని జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 50 సీట్లు కూడా రావు, ప్రతిపక్ష పార్టీ హోదా దక్కదు... తేల్చిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఎక్కడ డ్రగ్స్ పార్టీలు జరిగినా టాలీవుడ్ నటులతో లింక్ పెడుతూ వార్తలు వస్తున్నాయి. ఆదివారం రాత్రి బెంగళూరులో జరిగిన రేవ్‌పారీ్టలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేకమంది ప్రముఖులతో పాటు నటీనటులు పట్టుబడినట్లు వార్తలు వచ్చాయి. నటుడు శ్రీకాంత్, నటి హేమ వీరిలో ఉన్నారనే ప్రచారం జరగ్గా..దానిపై వారు వివరణ ఇచ్చారు. 2018లోనూ తెలంగాణ ఎక్సైజ్‌శాఖ అధికారులు దర్యాప్తు చేసిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు తెలుగు చిత్రపరిశ్రమను కుదిపేసిన విషయం తెలిసిందే. దర్శకుడు పూరీ జగన్నాథ్, నటులు రవితేజ, తరుణ్, నవదీప్, తనీష్, చార్మి, ముమైత్ ఖాన్ సహా పలువురిని ఎక్సైజ్ శాఖ అధికారులు రోజుల తరబడి విచారించడం సంచలనం సృష్టించింది. గతేడాది తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు దర్యాప్తు చేసిన ఓ కేసులో నటుడు నవదీప్‌తో పాటు షాడో, రైడ్ చిత్రాల నిర్మాత ఉప్పలపాటి రవి, డియర్ మేఘ చిత్ర దర్శకుడు అనుగు సుశాంత్ రెడ్డి, మోడల్ శ్వేత, మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ దేవరకొండ విఠల్ రావు కుమారుడు సురేశ్రావు తదితరుల పేర్లు బయటికి వచ్చాయి. తాజాగా బెంగళూరు పార్టీలో శ్రీకాంత్, హేమ ఉన్నారనే వార్తలు రావడం సంచలనం సృష్టించింది.
Phone-tapping case: అసలు కథ ఇంకా ఉంది!
సాక్షి, హైదరాబాద్: రెడ్ కార్నర్ నోటీసుల జారీ ప్రక్రియలో భాగంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావుపై పంజగుట్ట పోలీసులు ఇటీవల అరెస్టు వారెంట్ తీసుకున్నారు. దీనికోసం నాంపల్లి కోర్టులో అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ప్రభాకర్‌రావు ఓ అఫిడవిట్ వేశారు. అందులో ఉన్న అంశాలు ఆయన వాంగ్మూలంతో సమానం కావడం కొత్త ట్విస్ట్‌కు కారణ మైంది. తాను కేవలం కీలక పాత్రధారిని మాత్రమే అని, ట్యాపింగ్ వ్యవహారం మొత్తం అప్పటి డీజీపీలు, నిఘా విభాగాధిపతిగా ఉండే అదనపు డీజీపీ పర్యవేక్షణలో జరిగినట్లు తన వాంగ్మూలంలో ప్రభాకర్‌రావు పేర్కొనడమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.ఆ అధికారులకూ నోటీసులు ఇస్తారా?అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం ప్రభాకర్‌రావు అ«దీనంలోనే జరిగింది. ఇప్పటివరకు అరెస్టయిన డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు, అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న, మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావులు సైతం ఇదే విషయాన్ని తమ వాంగ్మూలాల్లో స్పష్టం చేశారు. ఎస్ఐబీకి ఓఎస్డీ హోదాలో ప్రభాకర్‌రావే నేతృత్వం వహించినప్పటికీ... ఈ విభాగం కూడా ప్రధాన ఇంటెలిజెన్స్‌లో అంతర్భాగమే. దీనికి అదనపు డీజీపీ లేదా ఐజీ స్థాయి అధికారులు బాస్‌లుగా ఉంటారు. మరోపక్క ఎస్ఐబీలో ప్రణీత్‌రావు వార్‌రూమ్‌గా వినియోగించిన రెండు గదులూ ఇంటెలిజెన్స్ చీఫ్ కోసం అధికారికంగా కేటా యించనవే. ఎలాంటి నిఘా ఉపకరణాలు ఖరీదు చేయాలన్నా కచి్చతంగా నిఘా విభా గాధిపతితో పాటు డీజీపీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఇవన్నీ నిబంధనల్లో పొందుపరిచిన అంశాలే. అయితే ఇప్పటివరకు ఈ విషయాలను ఎవరూ తమ వాంగ్మూలాల్లో స్పష్టం చేయలేదు. నాంపల్లి కోర్టులో ప్రభాకర్‌రావు తరఫున ఆయన న్యాయవాదులు దాఖలు చేసిన అఫిడవిట్‌తో మాత్రం డీజీపీ, అదనపు డీజీల వ్యవహారం ప్రస్తావనకు వచి్చంది. తాను పూర్తిగా వారి పర్యవేక్షణలోనే పని చేశానంటూ ప్రభాకర్‌రావు చెప్పడంతో పరోక్షంగా వారి పాత్రనూ ఆయన ఉటంకించినట్లు అయింది. న్యాయ స్థానంలో దాఖలైన అఫిడవిట్‌ను ప్రభాకర్‌రావు వాంగ్మూలంగా పరిగణించాల్సి వస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో ఇద్దరు మాజీ డీజీపీలు, నిఘా విభాగం మాజీ అదనపు డీజీకి నోటీసులు జారీ చేసి వాంగ్మూలం నమోదు చేయడం తప్పనిసరి కానుందని తెలుస్తోంది.ఆ మాజీ సీపీల నుంచి కూడా వాంగ్మూలం?మరోపక్క టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు నేరాంగీకార వాంగ్మూలం నేపథ్యంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్లుగా పని చేసిన సీనియర్ ఐపీఎస్‌ల నుంచి వాంగ్మూలం సేకరించడం తప్పనిసరిగా మారింది. ‘ఎన్నికల టాస్్క’లకు సంబం ధించి తనకు అప్పటి పోలీసు కమిషనర్ ద్వారానే ఆదేశాలు ఇప్పించాలని కోరానని, ప్రభాకర్‌రావు ఆ ప్రకారమే చేశారని రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్, నిఘా అనేది ఎస్ఐబీ అ«దీనంలో స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) చేసింది. అయితే టార్గెట్ చేసిన వారిని పట్టుకోవడం, నగదు స్వాధనం చేసుకోవడం, వసూళ్లకు పాల్పడటం ఫీల్డ్ ఆపరేషన్లు మాత్రం టాస్‌్కఫోర్స్ నిర్వర్తించింది. ఈ విభాగం పోలీసు కమిషనర్ అ«దీనంలో, ఆయన పర్యవేక్షణలో పని చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు మాజీ పోలీసు కమిషనర్ల నుంచి వాంగ్మూలాలు తీసుకోవడమూ అనివార్యంగా మారనుంది.ఎన్నికల ఫలితాల తర్వాత అరెస్టులు? అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు పంజగుట్ట పోలీసుస్టేషన్లో నమోదైంది. అయితే దీన్ని దర్యాప్తు చేయడం కోసం అనధికారికంగా ఓ సిట్ ఏర్పాటైంది. ఇప్పటివరకు ఈ బృందం బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌లోని మొదటి అంతస్తు కేంద్రంగా పని చేసింది. అయితే తాజాగా దీన్ని జూబ్లీహిల్స్ ఠాణాకు తరలించారు. అక్కడ అధికారులు కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. నోటీసుల జారీ, విచారణ, వాంగ్మూలాల నమోదుతో పాటు కొందరు పోలీసులు, ప్రైవేట్ వ్యక్తుల అరెస్టులు చోటు చేసుకుంటాయని సమాచారం.
రూ.200 కోట్లు కొట్టేశారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు (టీఎస్‌సీబీ) మేనేజర్ భర్త, కుమారుడు కలిసి ఏర్పాటు చేసిన ప్రియాంక ఫైనాన్స్ సంస్థ రూ.200 కోట్లు మేర స్వాహా చేసి బిచాణా ఎత్తేసింది. అధిక వడ్డీ పేరుతో అనేక మంది నుంచి డిపాజిట్లు సేకరించి ఐపీ పిటిషన్ దాఖలు చేసింది. బాధితుల ఫిర్యాదుతో సోమ వారం కేసు నమోదు చేసుకున్న నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు దర్యాప్తు బాధ్యతల్ని సిట్‌కు అప్పగించారు. సోమవారం సీసీఎస్ కార్యాలయం వద్ద నిరసన తెలిపిన బాధితులు తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన నిమ్మగడ్డ వాణి బాల, నేతాజీ భార్యాభర్తలు. సైదాబాద్‌లో వీళ్లు నివసిస్తుండగా... వాణి బాల ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంక్‌లో విధుల్లో చేరారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది టీఎస్సీబీగా మారగా ప్రస్తుతం వాణి బాల మేనేజర్ స్థాయిలో పని చేస్తున్నారు. 15 శాతం వడ్డీ ఇస్తామని చెప్పి.. దాదాపు 20 ఏళ్ల నుంచి వాణి బాల ఓ పథకం ప్రకారం బ్యాంక్‌కు వచ్చే వినియోగదారులను ఆకర్షిస్తూ వచ్చారు. టీఎస్సీబీలో డిపాజిట్ చేస్తే సాలీనా కేవలం 6 నుంచి 7% మాత్రమే వడ్డీ వస్తుందని, అబిడ్స్‌లోని టీఎస్‌సీబీ సమీపంలోనే తన భర్త నేతాజీ నెలకొలి్పన ఫైనాన్స్ సంస్థ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్‌లో డిపాజిట్ చేస్తే 15శాతం వడ్డీ వస్తుందని నమ్మబలికారు. బ్యాంకు కస్టమర్లతో పాటు సహోద్యోగులు, స్నేహితులను ఇందులో డిపాజిట్ చేసేలా ప్రేరేపించారు. చాలాకాలం చెల్లింపులు సక్రమంగా జరగడంతో అనేక మంది దృష్టి ఈ ప్రైవేట్ సంస్థపై పడింది.బ్యాంకులో భారీ మొత్తం డిపాజిట్ చేస్తే ప్రతి ఏడాదీ ఐటీ శాఖ వారికి లెక్కలు చూపాలని, తమ సంస్థలో ఆ ఇబ్బంది ఉండదంటూ మరికొందరిని ఆకర్షించారు. డిపాజిట్లుగా సేకరించిన మొత్తంతో ఏం చేస్తున్నారంటూ ఇటీవల కొందరు ప్రియాంక సంస్థ నిర్వాహకులను ప్రశ్నించారు. దీనికి నిర్వాహకులు తమకు జీడిమెట్ల, బెంగళూర్‌లో వ్యాపారాలు, కర్మాగారాలు ఉన్నాయంటూ చెప్పి నమ్మిస్తూ వచ్చారు. దీంతో వీరి వద్ద డిపాజిట్లు పెరిగాయి. గరిష్టంగా రూ.2 కోట్ల వరకు డిపాజిట్ చేసిన వాళ్లూ ఉన్నారు. కాగా, ఆ ఫైనాన్స్ సంస్థలో ఆమె కుమారుడు శ్రీహర్ష కీలకంగా వ్యవహరించాడు. ఆఫీసు, ఇంటికి తాళాలు: ఈ నెల 14న ఆఖరుసారిగా కార్యాలయం తెరిచిన నేతాజీ ఆయన కుమారుడు శ్రీహర్ష సిబ్బందిని హఠాత్తుగా పంపేసి తాళం వేశారు. ఈ విషయం తెలిసిన బాధితులు సైదాబాద్‌లోని ఇంటికి వెళ్లగా అక్కడా తాళమే కనిపించింది. దీంతో తాము మోసపోయామని భావించి అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారీ మొత్తంతో ముడిపడిన కుంభకోణం కావడంతో సీసీఎస్‌కు వెళ్లాల్సిందిగా అక్కడి అధికారులు సూచించారు. దీంతో వాళ్లు సోమవారం సీసీఎస్ డీసీపీ ఎన్.శ్వేతను కలిసి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. బాధితుల్లో అనేక మంది వృద్ధులు ఉన్నారని, వీళ్లంతా తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ప్రియాంక సంస్థలో పెట్టుబడిగా పెట్టారని అధికారులు చెప్తున్నారు. ఆర్నెల్లుగా వడ్డీల చెల్లింపుల్లో జాప్యం గతేడాది నవంబర్, డిసెంబర్ నుంచి వడ్డీల చెల్లింపులు సక్రమంగా జరగట్లేదు. అదేమని కొందరు ప్రశ్నించగా... ఎన్నికల సమయం కావడంతో డబ్బుల లావాదేవీలు తగ్గాయని అందుకే వడ్డీలు ఇవ్వడంలో ఆలస్యం అవుతోందంటూ నిర్వాహకులు చెప్పుకొచ్చారు. ఈ నెలాఖరుకు వాణి బాల సరీ్వసు పూర్తి కావస్తుండటంతో పదవీ విరమణ పొందాల్సి ఉంది. దీంతో ఈ నెల 3న ప్రియాంక సంస్థ నిర్వాహకులు సిటీ సివిల్ కోర్టులో దివాలా పిటిషన్ (ఐపీ) దాఖలు చేశారు.
Hyderabad: హిట్ అండ్ రన్ కేసు నమోదు
నల్లకుంట: మద్యం మత్తులో కారు నడిపి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి వీరంగం సృష్టించిన ఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అడ్మిన్ ఎస్సై శ్రీనివాస్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బాగ్‌అంబర్‌పేట డీడీ కాలనీకి చెందిన యడవల్లి శ్రీనివాస్ సీతారమేష్(46)టీచర్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 18న రాత్రి అతను బైక్‌పై విద్యానగర్ లక్కీ కేఫ్ సమీపంలోని ఐరావత్ ఐ క్లినిక్ రోడ్డులో వెళుతున్నాడు. అదే సమయంలో వేగంగా దూసుకువచి్చన కారు ముందు వెళుతున్న బైక్‌ను ఢీకొట్టడంతో రమేష్ కిందపడ్డాడు. ఈ ఘటనపై బాధితుడు రమేష్ ఈ నెల 19న నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్సై రమాదేవి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయలేదని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఎస్సై పేర్కొన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేశామన్నారు. స్థానికులు కారును అడ్డుకుని కారు నడుపుతున్న వ్యక్తిని నిలదీస్తూ సెల్ ఫోన్లో వీడియో తీశారు. ప్రమాద సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం.కారు కుడివైపు ముందు డోర్ పక్కన బీరు బాటిల్ ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌గా మారింది. కాగా ఘటన జరిగిన సమయంలో కారు నడుపుతున్న వ్యక్తి పక్కన ఓ చిన్నారి కూడా ఉండటం గమనార్హం.