ఇంత దారుణంగా మాట్లాడిన ప్రధాని దేశ చరిత్రలోనే లేరు: ప్రియాంక | Sakshi
Sakshi News home page

ఇంత దారుణంగా మాట్లాడిన ప్రధాని దేశ చరిత్రలోనే లేరు: ప్రియాంక

Published Sun, May 26 2024 4:48 AM

Using words that no PM in India history would have used says Priyanka Gandhi

ఇండియా కూటమి, మోదీ, ప్రియాంకా గాంధీ, దేశ చరిత్ర

న్యూఢిల్లీ/గోరఖ్‌పూర్‌(యూపీ): ప్రతిపక్ష ఇండియా కూటమినుద్దేశించి ‘ముజ్రా’అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ వాద్రా తీవ్రంగా మండిపడ్డారు. ఇంత దారుణంగా మాట్లాడిన ప్రధానమంత్రి దేశ చరిత్రలోనే లేరని పేర్కొన్నారు. ‘ప్రధానమంత్రి పదవిని దేశం యావత్తూ గౌరవిస్తుంది. అటువంటి పదవికున్న ఔన్నత్యాన్ని కాపాడండి’అని మోదీకి హితవు పలికారు. 

యూపీలోని గోరఖ్‌పూర్‌లో శనివారం ఆమె మాట్లాడారు. ‘బిహార్‌లో ప్రధాని మోదీ ఏమన్నారో విన్నారా? దేశ చరిత్రలోనే అటువంటి భాష ను వాడిన ప్రధాని మరొకరు లేరు. అటువంటి మాటలు ప్రధాని నోట రాకూడదు. సహనం కోల్పోయిన మోదీ దేశానికి, దేశ ప్రజలకు ప్రతినిధిననే విషయం మర్చిపోతున్నారు. ఆయన అసలు రూపం బట్టబయలైంది’అని ప్రియాంక అన్నారు. ‘దేశమే తన కుటుంబమని చెప్పుకుంటున్న వ్యక్తి అనాల్సిన మాటలు కావవి. కుటుంబసభ్యులు పరస్పరం గౌరవించుకోవాలి. ఎప్పటికీ అది అలాగే కొనసాగాలి’ అని ప్రియాంక అన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement