కాలేజీకి పోదాం పద..! | - | Sakshi
Sakshi News home page

కాలేజీకి పోదాం పద..!

May 27 2024 4:20 PM | Updated on May 27 2024 4:20 PM

కాలేజ

కాలేజీకి పోదాం పద..!

విజయనగరం
సోమవారం శ్రీ 27 శ్రీ మే శ్రీ 2024
పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకునేందుకు సమయం ఆసన్నమైంది. ఇంటర్‌మీడియట్‌లో ప్రవేశించి కళాశాలలో అభ్యసించే చదువు, చూపించే ప్రతిభ..ఉన్నతోద్యోగాలు సాధించేందుకు మార్గం చూపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కళాశాలల్లో చేరాలని విద్యార్థులకు పిలుపునిస్తూ జూనియర్‌ కళాశాలల అధ్యాపకులు గ్రామాల్లో ప్రచారం ప్రారంభించారు. కళాశాలల్లో ఉన్న వసతులపై అవగాహన కల్పిస్తున్నారు.
● ఇంటర్మీడియట్‌లో ప్రవేశానికి వేళాయె ● ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ కళాశాలల క్యాంపెయినింగ్‌

కీటక జనిత వ్యాధులకు చెక్‌..

కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం పార్వతీపురం మన్యం జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతోంది.

8లో

ఘనంగా ఘటాల ఊరేగింపు

భామిని: మండలంలోని దిమ్మిడిజోలలో నిర్వహిస్తున్న శ్రీ పెద్దమ్మతల్లి గ్రామ దేవత సంబరాల్లో భాగంగా ఆదివారం ఘటాల ఊరేగింపు

ఘనంగా నిర్వహించారు.

పేదల ఆరోగ్య ప్రదాయిని...

జిల్లా ఆస్పత్రిని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగా మార్చడంతో రోగులకు మెరుగైన వైద్యసేవలు

అందుతున్నాయి.

8లో

రాజాం సిటీ: విశాలమైన క్రీడామైదానం ఉన్న సంతకవిటి కళాశాల

రాజాం సిటీ/పార్వతీపురం టౌన్‌:

ఏడాది ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలకు వేళయింది. ఈ నెల 31 వరకు మొదటి విడత ప్రవేశాలు కల్పించడంతోపాటు జూన్‌ 1 నుంచి తరగతులు నిర్వహించేందుకు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాచరణ చేపట్టింది. రెండో విడత ప్రవేశాలు జూన్‌ 1 నుంచి 15వ తేదీ వరకు చేపట్టనున్నారు.

ప్రైవేట్‌కు దీటుగా ప్రచారం

ప్రైవేట్‌ కళాశాలల్లో అడ్మిషన్లు పెంచేందుకు ఆయా యాజమాన్యాలు సిబ్బందితో ప్రచారం నిర్వహించ డం పరిపాటిగా మారింది. అయితే వారికి దీటుగా ఇప్పుడు ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులు సైతం ప్రభుత్వ, వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని కళాశాలల్లో ప్రవేశాలు పెంపుదలకు ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టింది. అలాగే కళాశాలల్లో సాధించిన ప్రగతి, వసతులు, అందిస్తున్న కోర్సులను కరపత్రాల ద్వారా వివరిస్తున్నారు. గ్రామాల్లో పదో తరగతి పూర్తిచేసుకున్న విద్యార్థుల వివరాలు సేకరించి వారి తల్లిదండ్రులతో మాట్లాడుతూ కళాశాలల్లో ఉన్న వసతులపై వివరిస్తున్నారు. ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలకు కళాశాల పనివేళల్లో వచ్చి దరఖాస్తు చేసుకుని నేరుగా ప్రవేశాలు పొందవచ్చు. దరఖా స్తుతోపాటు అవసరమైన సర్టిఫికెట్లు, జిరాక్స్‌లు, ఆధార్‌కార్డులు, బ్యాంకు అకౌంట్‌ జిరాక్స్‌లు, పాస్‌ పోర్టు సైజు ఫొటోలను తీసుకురావాల్సి ఉంటుంది.

కాలేజీల్లో మెరుగైన సౌకర్యాలు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం విద్యావ్యవస్థను మెరుగుపర్చేందుకు నాడు–నేడు కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభు త్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేసింది. ప్రస్తుతం ప్రతి కళాశాలలో అనుభవం కలిగిన అధ్యాపకులు, విశాలమైన తరగ తి గదులు, అధునాతన ప్రయోగశాలలు, క్రీడాస్థలం మంచినీటి వసతి, మరుగుదొడ్లు ఉన్నాయి. వాటితోపాటు బస్‌పాస్‌ సౌకర్యం, హాస్టల్‌ వసతి, స్టడీ అవర్స్‌ నిర్వహణతోపాటు విద్యార్థుల్లో సేవా భావం పెంపొందించేందుకు ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్ర మం అమలు చేస్తున్నారు.

న్యూస్‌రీల్‌

జూన్‌ 1 నుంచి తరగతులు..

ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో కళాశాలల్లో సీట్లు పెంపుదలకు కృషి చేస్తున్నాం. ఇప్పటికే అన్ని కళాశాలల ప్రిన్సిపాల్స్‌, అధ్యాపకులకు దిశానిర్దేశం చేశాం. ఈ ఏడాది తరగతులు జూన్‌ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. అన్ని కళాశాలల్లో రెండు విడతలుగా అడ్మిషన్లు చేపడుతున్నాం. మొదటి విడత ఈ నెల 31 వరకు రెండో విడత జూన్‌ 1 నుంచి 15 వరకు అడ్మిషన్లు జరగనున్నాయి. పదో తరగతి పాసైన విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

–ఎం.ఆదినారాయణ, ఆర్‌ఐఓ, విజయనగరం

ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాం

కళాశాలలో అడ్మిషన్ల పెంపునకు గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాం. ప్రతిరోజూ విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారికి కళాశాలలో వసతుల గురించి వివరించడంతోపాటు కళాశాలలో చేరే విధంగా అవగాహన కల్పిస్తున్నాం. కోర్సుల వివరాలు, సీట్ల సంఖ్య తదితర వాటిపై విద్యార్థులతోపాటు తల్లిదండ్రులకు వివరిస్తున్నాం.

–కె.జనార్దనరావు, ప్రిన్సిపాల్‌,బాలికల జూనియర్‌ కళాశాల, రాజాం

కాలేజీకి పోదాం పద..!1
1/6

కాలేజీకి పోదాం పద..!

కాలేజీకి పోదాం పద..!2
2/6

కాలేజీకి పోదాం పద..!

కాలేజీకి పోదాం పద..!3
3/6

కాలేజీకి పోదాం పద..!

కాలేజీకి పోదాం పద..!4
4/6

కాలేజీకి పోదాం పద..!

కాలేజీకి పోదాం పద..!5
5/6

కాలేజీకి పోదాం పద..!

కాలేజీకి పోదాం పద..!6
6/6

కాలేజీకి పోదాం పద..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement