పిల్లలే వికసిత్ భారత్‌కు పునాది
● కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
విజయనగరం ఫోర్ట్: పిల్లలే వికసిత్ భారత్‌కు పునాది అని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం వీర్‌బాల్ దివస్ వేడుకలు నిర్వహించారు. ముందుగా కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్స్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువ మనస్సులను సంస్కరించడం, వారిలో సృజనాత్మకతను పెంపొందించడం, ఆత్మవిశ్వాసాన్ని నింపడం కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు. దేశాభివృద్ధిలో పిల్లలు, యువత చురుగ్గా పాల్గొనేలా చూడాలన్నారు. పిల్లలో ధైర్యం, దేశ భక్తి, త్యాగం వంటి విలువలు పెంపొందించాలని తెలిపారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ విమలరాణి, డీఎంసీ సుజాత, డీసీపీయూ లక్ష్మి, రామకోటి, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.


