● ఒకే ఇంటితో ఓ గ్రామం
అదో మారుమూల ప్రాంతం. కొండల నడుమ ఓ గిరిజనుడు ఓ ఇంటిని నిర్మించుకున్నాడు. ఆ గ్రామంలో ఆయన కుటుంబం ఒక్కటే నివసిస్తోంది. ఆ గ్రామం పేరు పైగుజ్జి. సీతంపేట మండలం తాడిపాయి పంచాయతీ పరిధిలో ఉంది. ఈ గ్రామంలో సవర తోటన్న తన భార్య మంగమ్మతో పాటు కుమారులు వైకుంఠ, సునీల్, కుమార్తె ప్రియాంకతో కలిసి నివసిస్తున్నారు. విశేషమేమిటంటే ఈ గ్రామానికి వెళ్లేందుకు దారి, విద్యుత్ సౌకర్యం కూడా ఉంది. దశాబ్ధాలుగా ఇక్కడ నివాసముంటున్నామని, కొండపోడు పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్టు తోటన్న తెలిపారు. – సీతంపేట


