ఎరువుకోసం రైతన్న పాట్లు
వణికిస్తున్న చలిలో..
గరికవలస ఆర్‌ఎస్‌కే వద్ద
యూరియా కోసం ఉదయం
నుంచే వేచివున్న రైతులు
ఆనందపురం ఆర్‌ఎస్‌కే వద్ద దుప్పట్లు కప్పుకొని క్యూ కట్టిన రైతులు
రైతన్నల ఎరువు కష్టాలకు ఈ చిత్రాలే నిలువెత్తు నిదర్శనం. బస్తా యూరియా కోసం వణికిస్తున్న చలిలో ఉదయం నుంచి ఆర్‌ఎస్‌కేలు, ప్రైవేటు దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. గుర్ల మండలంలోని ఆనందపురం, గరికివలస ఆర్‌ఎస్‌కేల వద్ద యూరియా పంపిణీ చేస్తామని అధికారులు చెప్పడంతో శుక్రవారం ఉదయం నుంచి రైతులు బారులు తీరారు. గరికివలసలో సుమారు 500 మంది రైతులు వేచిఉన్నా యూరియా పంపిణీ చేయలేదు. ఆనందపురం ఆర్‌ఎస్‌కే వద్ద రైతుకు బస్తా చొప్పున పంపిణీ చేశారు. ఎంత భూమి ఉన్నా ఒక బస్తా యూరియా ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు.
చంద్రబాబు ప్రభుత్వంలో రైతన్నకు కష్టాలు తప్పడం లేదని, ఓట్లేసి గెలిపించినందుకు తగిన శాస్తిచేస్తున్నారంటూ పలువురు వాపోయారు. యూరియా కోసం రోజుల తరబడి తిరిగితే పొలంపని ఎప్పుడు చేస్తామంటూ మరికొందరు ప్రశ్నించారు.
– గుర్ల
ఎరువుకోసం రైతన్న పాట్లు


