సులభ పద్ధతుల్లో బోధించాలి
గుర్ల: ఉపాధ్యాయులు సులభ పద్ధతుల్లో విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించాలని డీఈఓ ఎం.మాణిక్యం నాయుడు సూచించారు. మండలంలోని తెట్టంగి హైస్కూల్‌ను ఆయన శుక్రవారం సందర్శించారు. విద్యార్థుల అభ్యాసన స్థాయిని పరీక్షించారు. పదోతరగతి విద్యార్థులు పట్టుదలతో చదివి శతశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఆయన వెంట ఎంఈఓ భానుప్రకాష్ ఉన్నారు.
31న పింఛన్ల పంపిణీ
విజయనగరం అర్బన్: సామాజిక పింఛన్‌దారులకు ఈ నెల 31వ తేదీన పింఛన్లు అందజేస్తామని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వచ్చి పింఛన్లు అందజేస్తారన్నారు. డిసెంబర్ నెలకుగాను జిల్లాలో 2,71,691 మంది పింఛన్‌దారులకు రూ.116.25 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. ఈ నగదును 30 తేదీన బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని, సంబంధిత సచివాలయ సిబ్బంది నగదు విత్‌డ్రా చేసుకొని పింఛన్ల పంపిణీకి సిద్ధంకావాలన్నారు.
33వేల టన్నుల చెరకు క్రషింగ్
రేగిడి: మండంలోని సంకిలి వద్ద ఉన్న ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారంలో ఇంతవరకు 33వేల మెట్రిక్ టన్నుల చెరకు క్రషింగ్ పూర్తయినట్టు యాజమాన్యం శుక్రవారం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి చెరకును కర్మాగారానికి తీసుకువస్తున్నామని పేర్కొంది. ఈ ఏడాది 2.50 లక్షల మెట్రిక్ టన్నుల చెరకు క్రషింగ్ చేయనున్నట్టు వెల్లడించింది.
పార్వతీపురం: వినూత్న కార్యక్రమాల అమల తో జిల్లాకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర్‌రెడ్డికి డీఎంహెచ్‌ఓ ఎస్.భాస్కరరావు, వైద్య సిబ్బంది అభినందనలు తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ ఓ కెవీఎస్ పద్మావతి, ప్రోగ్రాం అధికారులు టి. జగన్‌మోహన్‌రావు, రఘుకుమార్, వినోద్ కు మార్, ఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్‌ఎస్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
సులభ పద్ధతుల్లో బోధించాలి
సులభ పద్ధతుల్లో బోధించాలి


