జన్నివలస అనాథ బాలురకు కలెక్టర్ అండ
విజయనగరం అర్బన్/జామి: తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన జామి మండలం జన్నివలస గ్రామానికి చెందిన ఇద్దరు బాలురను కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి అక్కున చేర్చుకు న్నారు. వారికి ఇల్లు మంజూరు చేయడంతోపాటు, చదువుకు అవసరమైన సహకారం అందించి, హాస్టల్ సీట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. జన్నివలస గ్రామానికి చెందిన మైలపల్లి విజయ్ (12), గౌతమ్ (10) చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు. వారి తండ్రి కొంతకాలం కిందట క్యాన్సర్‌తో మృతి చెందగా, తల్లి ఆరు నెలల కిందట గుండెపోటుతో చనిపోయారు. విజయ్ జామి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి, గౌతమ్ జన్నివలస ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నారు. బాలురు ఇద్దరు అనాథులుగా మారడం, పూరిపాకలో బిక్కుబిక్కుమంటూ జీవిస్తూ, పాఠశాలలో పెట్టిన మధ్యాహ్న భోజనంతోనే కాలంనెట్టుకొస్తున్న చిన్నారుల దీనగాథను ఇటీవల ‘పాపం పసివాళ్లు’ శీర్షికన సాక్షిలో కథ నం ప్రచురితమైంది. దీనికి పలువురు దాతలు స్పందించి తమ చేయూతను అందించారు. ఐసీడీఎస్ పీడీ టి.విమలారాణి స్పందిస్తూ బాలు రు, వారి పెద్దమ్మ కొండమ్మను కలెక్టర్ వద్దకు శుక్రవారం తీసుకెళ్లారు. వారి దయనీయ పరిస్థి తిని వివరించగా కలెక్టర్ చలించిపోయారు. బాలురకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని బాలురకు సూచించారు.
ఇల్లు, హాస్టల్ సీట్ల
మంజూరుకు హామీ
సాక్షి వార్తకు
స్పందన
జన్నివలస అనాథ బాలురకు కలెక్టర్ అండ


