ఉద్యోగాల కల్పనకు ముందడుగు | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల కల్పనకు ముందడుగు

Published Mon, May 27 2024 4:25 PM

ఉద్యో

యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. నిరుద్యోగ యువత ఎంప్లాయిమెంట్‌ రిజిస్ట్రేషన్‌ ఆన్‌లైన్‌ ద్వారా ఇంటివద్ద నుంచే చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. httpr://empoyment.a p.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వెంటనే లాగిన్‌ వివరాలు, రిజిస్ట్రేషన్‌ నంబర్‌ సదరు ఫోన్‌ నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌, ఈ మెయిల్‌ ద్వారా పొందవచ్చు. ఎంప్లాయిమెంట్‌ కార్డును సైతం లాగిన్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రింట్‌ తీసుకోవచ్చు. దీంతో పాటు ఎంప్లాయిమెంట్‌ కార్డ్‌ రెన్యూవల్‌, అదనపు విద్యార్హతల నమోదు వంటి సేవలు సైతం ఆన్‌లైన్‌ ద్వారా పొందేందుకు అవకాశం ఉంటుంది.

అతిసులువుగా ఉద్యోగ సమాచారం

రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన నోటిఫికేషన్ల సమగ్ర సమాచారం, ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాల ఖాళీల వివరాలు ఎంప్లాయిమెంట్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న అభ్యర్థులకు నేరుగా ఎప్పటికప్పుడు అతి సులువుగా ఉద్యోగావకాశాల సమాచారం అందుతుంది. విద్యార్హతల ప్రకారం ఉద్యోగాల ఖాళీలు వివరాలు యువత ఫోన్‌ నంబర్లకు, ఈమెయిల్‌కు అలెర్ట్‌ మెసేజ్‌ వస్తుంది. వీటితో పాటు ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్‌మేళాల సమాచారం అందిస్తూ అటు యువతకు, ఇటు సంస్థలకు వారధిగా ఉపాధి కల్పన కార్యాలయ సిబ్బంది నిలుస్తున్నారు.

ఉపాధి కల్పనే ధ్యేయంగా ప్రత్యేక పోర్టల్‌

ఒక క్లిక్‌ దూరంలో ఉద్యోగ అవకాశం

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌తో సులువుగా ఉద్యోగ సమాచారం

నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌ పోర్టల్‌తో అనుసంధానం

మోడల్‌ కెరీర్‌ సెంటర్లుగా

ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్స్చేంజీలు

యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ నూతన సంస్కరణలకు నాంది పలికింది. ఉపాధి కల్పనే ధ్యేయంగా సాంకేతిక వ్యవస్థను ఉపయోగించి జిల్లాలో ఉన్న ఉపాధి కార్యాలయాల స్వరూపాన్ని మార్చివేసింది. గతంలో అభ్యర్థులు ఎంప్లాయిమెంట్‌ కార్యాలయాలకు రోజుల తరబడి తిరిగి క్యూలో నిలబడి విద్యార్హతల వివరాలను నమోదు చేసుకునేవారు. ఉద్యోగాల సమాచారం అభ్యర్థికి తెలిసేది కాదు. నేడు ఒక్క క్లిక్‌తో సులభంగా రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా వెసులుబాటు వచ్చింది. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించారు. దీనిని నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌ పోర్టల్‌తో అనుసంధానం చేశారు.

– తిరుపతి సిటీ

జిల్లాలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ షురూ

తిరుపతి జిల్లాలో ఎంప్లాయిమెంట్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. తద్వారా యువత పెద్ద ఎత్తున తమ విద్యార్హతలను నమోదు చేసుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని, ప్రైవేటు సంస్థలలోని ఉద్యోగావకాశాల వివరాలను పోర్టల్‌ ద్వారా పొందుతూ, ఎప్పటికప్పుడు తమ వివరాలను అప్‌డేట్‌ చేసుకుంటున్నారు. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఎంప్లాయిమెంట్‌ రిజిస్ట్రేషన్‌ కార్డు నంబర్‌ తప్పనిసరి అనే నిబంధన ఉండేది. ప్రస్తుతం అటువంటి నిబంధనలకు చరమగీతం పాడుతూ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం నూతన సంస్కరణలు తీసుకువచ్చింది.

అవకాశాలను ఉపయోగించుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యువత కోసం పెద్ద ఎత్తున జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నాం. పదోతరగతి నుంచి ఉన్నత విద్య అభ్యసించిన వారు ఆన్‌లైన్‌ ఎంప్లాయిమెంట్‌ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. దీంతో ఎప్పటికప్పుడు యువతకు కేంద్ర, రాష్ట్ర, ప్రైవేటు ఉద్యోగాల ఖాళీల సమాచారం పొందవచ్చు. రిజిస్ట్రేషన్‌ సమయంలో సమర్పించిన ఫోన్‌ నంబర్‌ యూజర్‌ ఐడీగా పరిగణిస్తారు. యువత ప్రభుత్వం కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. – గోపికృష్ణ శ్రీనివాస్‌,

ఎంప్లాయిమెంట్‌ కార్యాలయ అధికారి, తిరుపతి

ఉద్యోగాల కల్పనకు ముందడుగు
1/3

ఉద్యోగాల కల్పనకు ముందడుగు

ఉద్యోగాల కల్పనకు ముందడుగు
2/3

ఉద్యోగాల కల్పనకు ముందడుగు

ఉద్యోగాల కల్పనకు ముందడుగు
3/3

ఉద్యోగాల కల్పనకు ముందడుగు

Advertisement
 
Advertisement
 
Advertisement