కళ్లు చెదిరే క్యాచ్‌.. క్రికెట్ చరిత్రలోనే ఇప్పటివరకు చూసిండరు! వీడియో | Paul Coughlin pulls off one of the most outrageous catch of all time | Sakshi
Sakshi News home page

కళ్లు చెదిరే క్యాచ్‌.. క్రికెట్ చరిత్రలోనే ఇప్పటివరకు చూసిండరు! వీడియో

Published Mon, Jun 17 2024 1:29 PM | Last Updated on Mon, Jun 17 2024 1:43 PM

Paul Coughlin pulls off one of the most outrageous catch of all time

ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో సంచలన క్యాచ్‌ నమోదైంది. క్రికెట్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో ఉన్న ఈ క్యాచ్‌ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం(జూన్ 16) చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా డర్హామ్, లంకాషైర్ జట్లు తలపడ్డాయి. 

ఈ క్రమంలో డర్హామ్‌ ఆల్‌రౌండర్‌ పాల్ కొగ్లిన్ అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. లంకాషైర్ బ్యాటర్‌ మాథ్యూ హర్ట్స్‌ను సంచలన క్యాచ్‌తో కొగ్లిన్‌ పెవిలియన్‌కు పంపాడు. లంకాషైర్ ఇన్నింగ్స్‌ 7వ ఓవర్‌ వేసిన పాల్ కొగ్లిన్ యార్కర్‌ వేయడానికి ప్రయత్నించాడు. 

కానీ కొగ్లిన్ ప్లాన్‌ను ముందుగానే గమనించిన మాథ్యూ హర్ట్స్‌ ఫ్రంట్‌పుట్‌కు వచ్చి స్టైట్‌గా భారీ షాట్‌ ఆడాడు. ఈ క్రమంలో పాల్ కొగ్లిన్ రిటర్న్‌లో సింగిల్‌ హ్యాండ్‌తో స్టన్నింగ్‌ క్యాచ్‌ను అందుకున్నాడు. బంతి తన తలకు తాకుతుందని భావించిన పాల్ కొగ్లిన్.. ఎవరూ ఊహించని విధంగా మెరుపు వేగంతో క్యాచ్‌ను అందుకున్నాడు.

 ఇది చూసిన బ్యాటర్‌ అలా కాసేపు క్రీజులోనే ఉండిపోయాడు. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు సైతం బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు దశాబ్దంలోనే అత్యుత్తమ క్యాచ్‌గా అభివర్ణిస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement