బెల్ట్‌తో కొట్టి.. చితకబాది... పొట్టన పెట్టుకున్నాడు! | Kannada Actor Darshan And Pavithra Arrested In Renuka Swamy Murder Case, More Details Inside | Sakshi
Sakshi News home page

బెల్ట్‌తో కొట్టి.. చితకబాది... పొట్టన పెట్టుకున్నాడు!

Jun 13 2024 5:08 AM | Updated on Jun 13 2024 10:54 AM

Kannada Actor Darshan and Pavithra Arrested In Renuka Swamy Murder Case

కన్నడ నటుడు దర్శన్‌ నిర్వాకం

బెంగళూరు: కర్నాటకలో సంచలనం సృష్టించిన ఫార్మసీ ఉద్యోగి రేణుస్వామి హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం కన్నడ నటుడు దర్శన్, అతని అభిమానులు రేణుస్వామిని దారుణంగా కొట్టి చంపారు! రేణుస్వామికి తగిన ‘బుద్ధి’ చెప్పాలంటూ నటి పవిత్ర దర్శన్‌ను ఉసిగొలి్పందని తెలుస్తోంది. తన అభిమాన సంఘాల సమన్వయకర్త రాఘవేంద్రను ఈ పనికి దర్శన్‌ పురమాయించారు.

 రాఘవేంద్ర తన భర్తను ఇంటి సమీపంలో వాహనం ఎక్కించుకుని తీసుకెళ్లాడని రేణుస్వామి భార్య చెప్పారు. అతన్ని బెంగళూరు సమీపంలో ఒక షెడ్డులో దర్శన్‌ బెల్ట్‌తో చితకబాదారు. అభిమానులు కర్రలతో కొట్టారు. ఎముకలు విరిగి, సున్నిత ప్రాంతాల్లో అంతర్గత గాయాలై రేణుస్వామి అక్కడిక్కడే మరణించారు. మృతదేహాన్ని మురికికాలువలో పడేశారు. దాన్ని వీధి కుక్కలు తినడం చూసి ఫుడ్‌ డెలివరీ బాయ్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ కేసులో దర్శన్, పవిత్రతో పాటు 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారందరినీ బుధవారం ఘటనా స్థలికి తీసుకెళ్లి సీన్‌ రీ కన్‌స్ట్రక్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement