ఢిల్లీలో అధిక ఉష్ణోగ్రత.. విమానంలో సాంకేతిక లోపం | Indigo Flight To Bagdogra Effected Due To High Temperature In Delhi, Delayed By 4 Hours | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో అధిక ఉష్ణోగ్రత.. ఇండిగో విమానంలో సాంకేతిక లోపం

Published Mon, Jun 17 2024 9:45 PM | Last Updated on Tue, Jun 18 2024 11:49 AM

Indigo Flight Effected Due To High Temperature In Delhi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఢిల్లీ నుంచి బెంగాల్‌లోని బాగ్‌డోగ్రా వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.

దీంతో విమానం బయలుదేరడం రెండు గంటలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏసీ పనిచేయకపోవడంతో విమానంలో గాలి లేక కొందరు అస్వస్థతకు గురయ్యారు. 

విమానం డోర్‌ మూసివేయడంతో వేడి తీవ్రత ఎక్కువైంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై స్పందించిన ఇండిగో సంస్థ వివరణ ఇచ్చింది. 

‘ప్రయాణికుల భద్రతకు ఇండిగో ప్రాధాన్యతనిస్తుంది. ఈ ఘటనపై చర్యలు తీసుకుంటున్నాం. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం’అని తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement