
తగ్గిన మడ్డువలస నీటిమట్టం
వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయు డు ప్రాజెక్టు వద్ద నీటిమట్టం గణనీయంగా తగ్గింది. ఈ ఏడాది రబీసీజన్‌కు పూర్తిస్థాయిలో 10వేల ఎకరాలకు సాగునీరు సరఫరా చేయడంతో కొంతమేర నీరు ఆయకట్టుకు వినియోగించారు. దీంతో ప్రస్తుతం 62.65 మీటర్ల నీటి నిల్వ నమోదైంది. ఈ ప్రాజెక్టు నీటిమట్టం 65 మీటర్లు కాగా వర్షాల లేమి, ఇన్‌ఫ్లో లేకపోవడంతో ప్రాజెక్టు పరిసర ప్రాంతం నీరులేక వెలవెలబోతోంది. రానున్న ఖరీఫ్ సీజన్‌కు సాగునీరందించేందుకు ప్రాజెక్టులో 1.4 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. వర్షాలు కురిస్తే నీటినిల్వలు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
బిత్రపాడులో ఏనుగులు
జియ్యమ్మవలస: మండలంలోని బిత్రపాడు గ్రామ సమీపంలో ఆదివారం ఏనుగులు దర్శనమిచ్చాయి. మధ్యాహ్నం వరకు నాగావళి నదిలో ఉండి అనంతరం పామాయిల్ తోటలో తిష్ఠ వేశాయి. అరటి, పామాయిల్ తోటలను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయని అటవీ శాఖాధికారులు వాటిని తరలించే ప్రయత్నం చేయాలని రైతులు కోరుతున్నారు. రాత్రి సమయాన పంట పొలాలలకు వెళ్లడానికి భయపడుతున్నామని అటవీ సిబ్బంది తగుచర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కళ్లికోట చేరుకున్న గజరాజులు
కొమరాడ: ఇటీవల నాగావళి నది ఆవైపు ఉన్న గ్రామాల్లో సంచారం చేసిన ఏడు గజరాజుల గుంపు ఆదివారం కళ్లికోట, దుగ్గి గ్రామ పరిసరాల్లోకి చేరుకుంది. దీంతో కళ్లికోట,దుగ్గి, గుణానుపురం తదితర గ్రామాల ప్రజలు వేసవికాలం నేపథ్యంలో గ్రామాల్లో రాత్రిపూట బయట పడుకోవద్దని ఏనుగులు చొరబడే పరి స్థితి ఉందని జాగ్రత పాటించాలని అటవీశాఖ సిబ్బంది ఆయా సూచిస్తున్నారు. రైతులు పొలాల్లోకి వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. ఏనుగులు కనపడితే కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని హితవు పలుకుతున్నారు.
రామతీర్థంలో ప్రత్యేక పూజలు
నెల్లిమర్ల రూరల్: వైశాఖ మాసాన్ని పురస్కరించుకుని పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజ లు కొనసాగుతున్నాయి. వేకువజామున స్వా మికి ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో విశేష హోమాలు జరిపించారు. అనంతరం వెండి మంటపం వద్ద స్వామి నిత్య కల్యాణ మహోత్సవం జరి పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి తరలివచ్చిన భక్తులతో రామతీర్థం పరిసర ప్రాంతాలు కిటకిటలా డాయి. ఆదివారం కావడంతో పలువురు సందర్శకులు బోడికొండపై సందడి చేశారు.
మహిళల క్రికెట్ జట్ల ఎంపికకు స్పందన
విజయనగరం: జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి మహిళల క్రికెట్ జట్టు ఎంపిక పోటీలకు స్పందన లభించింది. నగర శివారులో గల విజ్జి స్టేడియంలో అండర్ –15, అండర్–19, సీనియర్స్ విభాగాల్లో నిర్వహించిన ఎంపిక పోటీలకు జిల్లా అనుమానం నుంచి 60 మంది క్రీడాకారిణులు హాజరయ్యారు. వారికి అసోసియేషన్ కార్యదర్శి ఎంఎల్‌ఎన్ రాజు ఆధ్వర్యంలో పలువురు కోచ్‌లు ఎంపిక పోటీలు నిర్వహించారు. క్రీడాకారులకు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో వ్యక్తిగత సామర్థ్య పరీక్షలు నిర్వహించి అందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి జిల్లా జట్టులో స్థానం కల్పించారు. మూడు విభాగాల్లో జరిగిన ఎంపిక పోటీల్లో ఒక్కో జట్టుకు 15 మంది చొప్పున క్రీడాకారులను ఎంపిక చేసినట్టు అసోసియేషన్ కార్యదర్శి రాజు తెలిపారు.

తగ్గిన మడ్డువలస నీటిమట్టం

తగ్గిన మడ్డువలస నీటిమట్టం