దళారుల రాజ్యం.. రైతన్నకు నష్టం
ఎవరికి చెప్పుకోవాలో
తెలియడం లేదు..
పోట్టి చిక్కుడు ధరలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. వారం రోజుల కిందట కిలో చిక్కుడు సుమారు రూ.60 ఉండగా, ఇప్పుడు రూ.25కు కొనుగోలు చేస్తున్నారు. ఈ ధరలు ఇలానే ఉంటే పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఏదైనా ఒక ధరను నిలకడగా ఉంచడం లేదు. మార్కెటింగ్ శాఖ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. రైతులు ఎవరితో చెప్పుకోవాలో తెలియడం లేదు.
– చొక్కాపు రామారావు,
రైతు, రామభద్రపురం
నష్టపోతున్నాం.. ఆదుకోవాలి..
విత్తనాలు నాటి మొక్కవుతున్న సమయంలో తీవ్ర తుఫాన్ ప్రభావం వల్ల అధిక వర్షాలు కురవడంతో పంట పొలాల్లో నీరు నిల్వకు కొంత మేర పంటలు కుళ్లిపోయి నష్టాల బారిన పడ్డాం. అధిక పెట్టుబడులు పెట్టి ఏదోలా కొద్దో గొప్పో పంటలు కాపాడుకున్నా.. పంట చేతికొచ్చే సమయానికి వాతావరణం కలిసిరాక తెగుళ్లు, చీడపీడలు ఆశించి పంట దిగుబడులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. చేతికందిన కొద్దిపాటి పంటను మార్కెట్‌కు తెచ్చేసరికి ధరలు పూర్తిగా పతనమవుతున్నాయి. ఓ వైపు తుఫాన్‌లకు పంటపాడై నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పైసా పరిహారం అందజేయలేదు. ఇప్పుడు దళారులు పంటను దోపిడీ చేస్తున్నారు. కూరగాయ రైతుల మొరవినేవారే కరువయ్యారు.
– పొందూరు శంకరరావు, రైతు రామభద్రపురం
చిక్కుడు ధర పతనం
వారం రోజుల కిందట కిలో ధర రూ.60, నేడు రూ.25
అదే కోవలో ఉల్లికాడల ధర
దళారులే ధర నిర్ణీతలు
నష్టాల బాటలో చిక్కుడు, ఉల్లికాడ రైతులు
చోద్యం చూస్తున్న మార్కెటింగ్ శాఖ
అధికారులు
పెట్టుబడులు కూడా రావని రైతన్నల గగ్గోలు
దళారుల రాజ్యం.. రైతన్నకు నష్టం
దళారుల రాజ్యం.. రైతన్నకు నష్టం
దళారుల రాజ్యం.. రైతన్నకు నష్టం
దళారుల రాజ్యం.. రైతన్నకు నష్టం
దళారుల రాజ్యం.. రైతన్నకు నష్టం


