11న ఏపీ ఎన్‌జీజీఓఎస్ జిల్లా కమిటీ ఎన్నికలు
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ మరియు గెజిటెడ్ అధికారుల సంఘం (ఏపీ ఎన్‌జీజీఓఎస్) జిల్లా నూతన కమిటీ ఎన్నికలు వచ్చేనెల 11వ తేదీన నిర్వహించనున్నట్టు సంఘ ఎన్నికల అధికారి ఎం.వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. ఎన్నికలకు డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎన్‌జీజీఓఎస్ అధ్యక్షుడు ఎం.వెంకటేశ్వర్లు ఎన్నికల అధికారిగా, అదే జిల్లా కార్యదర్శి కేపీవీఎన్‌బీ కృష్ణ అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారని పేర్కొన్నారు. అమరావతికి చెందిన సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.శ్రీనివాసులు ఎన్నికల అబ్జర్వర్‌గా బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు. విజయనగరం జిల్లా కమిటీలో సుమారు 6,001 మంది ఉద్యోగులు సభ్యులుగా ఉండగా ఈ ఎన్నికల్లో 283 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని చెప్పారు. జిల్లా అధ్యక్షుడు, జిల్లా కార్యదర్శి, కోశాధికారి, అసోసియేట్ ప్రెసిడెంట్, ఆర్గనైజింగ్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ, మహిళా వైస్ ప్రెసిడెంట్, ఆర్గనైజింగ్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ, మహిళా వైస్ ప్రెసిడెంట్, మహిళా జాయింట్ సెక్రటరీతో పాటు మొత్తం 17 పోస్టులకు ఎన్నికలు జరుగుతాయన్నారు. ఎన్నికలకు సంబంధించి ఈ నెల 30న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్లను స్వీకరిస్తామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం విజయనగరం ఏపీఎన్‌జీజీఓహోంలో జరుగుతుందని వెల్లడించారు. జిల్లాలోని అన్ని తాలూకాల నుంచి ఎన్నికై న ఆఫీస్ బేరర్స్, డీసీ, డీఈసీ, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఎన్నికలను విజయవంతం చేయాలని కోరారు.
గిరిప్రదక్షిణను
విజయవంతం చేయండి
● రామతీర్థం సేవా పరిషత్ పిలుపు
నేడు వీర్‌బాల్ దివస్
పార్వతీపురం: కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు వీర్‌బాల్ దివస్‌ను నిర్వహిస్తామని కలెక్టర్ డా.ఎన్, ప్రభాకరరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో సిబ్బంది అంతా పాల్గొనాలని కోరారు. బాలలనుద్దేశించి పీఎం నరేంద్ర మోదీ భారత్ మండపం, న్యూఢిల్లీ నుంచి ప్రసంగిస్తారన్నారు.


