ఆ అధికారితో వేగలేం..!
విచారణ జరుగుతోంది..
ఐసీడీఎస్‌లో మహిళా ఉద్యోగినిపై వాటర్ బాటిల్ విసిరిన అధికారిపై విచారణ చేపడుతున్నాం. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తాం.
– టి.విమలారాణి, పీడీ, ఐసీడీఎస్
విజయనగరం ఫోర్ట్: ఆ అధికారి అంటే ఐసీడీఎస్ ఉద్యోగులకు హడల్. టీడీపీ నేత అండతో మహిళా ఉద్యోగులపై ఇష్టారాజ్యంగా రెచ్చిపోతుండం, పెద్దపెద్ద కేకలు వేయడం, చేతిలో ఏది ఉంటే దానిని వారిపై విసిరేస్తుండడంతో బెదిరిపోతున్నారు. ఉద్యోగం చేసేందుకు భయపడుతున్నారు. తాము కూడా ఉద్యోగులమన్న కనీసం జ్ఞానం లేని అధికారితో వేగలేకపోతున్నామంటూ తెలిసినవారి దగ్గర గోడు వెళ్లబోస్తున్నారు. అయితే, ఆయనకు అధికార పార్టీ నేత అండదండలు ఉండడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు కూడా భయపడుతున్నారు. తమ వల్లే ఉన్నతాధికారులకు ఆయన విషయం తెలిసిందన్న సమాచారం తెలిస్తే.. ఏ స్థాయిలో రెచ్చిపోతారోనన్న బెంగ వారిని వెంటాడుతోంది. ఆయన సీటుకు ఎవరైనా అడ్డువస్తారని అనుమానం వస్తే చాలు.. వారిని గిరిజన ప్రాంతాలకు బదిలీ, లేదంటే డిప్యుటేషన్‌పై పంపించేస్తున్నారు. సహోద్యోగులపై అధికారి వేధింపులు తెలిసినా ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అంతకు ముందు కూడా ఒక సీడీపీఓను సదరు అధికారి గిరిజన ప్రాంతానికి బదిలీచేయించినట్టు విశ్వసనీయ సమాచారం.
విజయనగరం అర్బన్ సీడీపీఓగా పనిచేసిన జి.ప్రసన్నను అల్లూరి సీతారామరాజు జిల్లాకు డిప్యుటేషన్‌పై ఏసీడీపీఓగా బదిలీచేశారు. ఈ వ్యవహారంలో ఐసీడీఎస్‌కు చెందిన ఓ అధికారి హస్తం ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వారంరోజుల కిందట ఐసీడీఎస్‌లో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిపై ఆ అధికారి పెద్దగా అరుపులు, కేకలు వేశాడు. అంతటితో ఆగకుండా ఆమైపె వాటర్ బాటిల్ విసిరారు. తోటి ఉద్యోగుల ముందే దాడికి దిగడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. బెదిరిపోయి స్పృహకోల్పోవడంతో తోటి ఉద్యోగులు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఐసీడీఎస్ అధికారులు విచారణ చేపట్టారు.
ఐసీడీఎస్‌లో ఓ అధికారి వేధింపులతో హడిలిపోతున్న ఉద్యోగులు
టీడీపీ నేత అండతో రెచ్చిపోతున్న అధికారి
ఆయనకు నచ్చకుంటే గిరిజన
ప్రాంతాలకు బదిలీ
అధికారి వేధింపులు తట్టుకోలేక ఆస్పత్రిపాలైన ఓ మహిళా ఉద్యోగి
ఆ అధికారితో వేగలేం..!


