
అనుమానాస్పద వ్యక్తులపై నిఘా
విజయనగరం క్రైమ్: అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టేందుకు టూటౌన్ పరిధిలో ఉన్న వైఎస్సార్ నగర్‌లో ఆదివారం వేకువజామున టూ టౌన్ సీఐ కోరాడ రామారావు నేతృత్వంలో జిల్లా పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. అనుమానా స్పద వ్యక్తుల కదలికల గురించి, రికార్డులు సక్రమంగా లేని వాహనాలు, అసాంఘిక కార్యకలాపా ల నియంత్రణకు కాలనీలోని ప్రతి ఇంటి పరిసరా ల్లో, వీధుల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తుల్ని ప్రశ్నించి, వారు ఎవరింటికి, ఏ పని మీద వచ్చారన్న విషయాలపై ఆరా తీశారు. అదేవిధంగా వాహన రికార్డులు సక్రమంగా లేని 31 మోటార్‌సైకిళ్లను స్టేషన్‌కు తరలించారు. వాహనపత్రాలు పరిశీలించి, పత్రాలు సక్రమంగా ఉన్న వాహనాలను రిలీజ్ చేస్తామని, రికార్డులు సక్రమంగా లేని వాహనాలను సీజ్ చేసి, చట్టపరమైన చర్యలు చేపడతామని టూటౌన్ సీఐ కోరాడ రామారావు స్పష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఏర్పాటుచేసేందుకు ఎస్పీ ఎం.దీపిక ఆదేశాలతో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించామన్నారు. భవిష్యత్తులో మరికొన్ని ప్రాంతాల్లో ఇదే తరహా ఆపరేషన్స్ చేపడతామని చెప్పారు. కార్డన్ సెర్చ్‌లో ఎస్సైలు దుర్గాప్రసాద్, రాజేష్, ఏఎస్సై పైడితల్లి, సిబ్బంది పాల్గొన్నారు.