కరాటే చాంపియన్‌షిప్‌లో పతకాలు
విజయనగరం అర్బన్: విశాఖలో ఇటీవల జరిగిన 19వ కెన్యూరియో కరాటే చాంపియన్‌షిప్–2025లో పట్టణానికి చెందిన సత్య డిగ్రీ/పీజీ కళాశాల విద్యార్థులు పతకాలు సాధించారు. బంగారు పతకాలు సాధించిన వారిలో పి.హర్షవర్ధన్(2), సీహెచ్.రిషిత, పి.గురుసిద్దిక్, ఎన్.వేవన్ష్, ఎస్.శ్రీవత్సవ్, ఎస్.నవ్య, కె.ప్రేమేష్ ఉన్నారు. కాంస్య పతకాలు సాధించిన వారిలో కె.తనుశ్రీ, సీహెచ్.రిషిత, ఎన్.దేవాన్ష్, కె.ప్రేమేష్, వి.ఇందిరా ప్రియదర్శిని, మహమ్మద్ సమీర్, ఎం.హర్హవర్ధన్, కె.శివగణేష్, పి.గగన్‌సాయి, బి.లేవాన్ ఉన్నారు. రజత పతకం సాధించిన వారిలో కె.తనుశ్రీ, ఎం.యోగిత, పి.గురుసిద్ధిక్, ఎస్.శ్రీవత్సవ్, ఎస్.నవ్య, ఎన్.జనని, వి.ఇందిరా ప్రియదర్శిని, జి.వివేక్ వర్మ రెండు, మహమ్మద్ సమీర్, ఎం.హర్షవర్ధన్, కె.శివగణేష్, పి.కుష్వంత్‌కుమార్ (2), పి.గగన్ సాయి, బి.లేవాన్ ఉన్నారు. విజేతలను, కోచ్ కె.సంతోష్‌కుమార్, అసిస్టెంట్ కోచ్ శ్రీభార్గవ్‌ను కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు, కళాశాల ప్రిన్సిపాల్ ఎంవీసాయిదేవమణి అభినందించారు.


