చిన్న హీరో అంటూ ఆ హీరోయిన్‌ చులకనగా మాట్లాడింది: నవదీప్‌ | Sakshi
Sakshi News home page

Navdeep: పెద్ద హీరోలకు హిట్లు ఇచ్చిన లక్కీ హీరోయిన్‌ అని తెగ ఫీలైపోయింది

Published Sun, May 26 2024 1:57 PM

Actor Navdeep About Heroine Ankitha

జై సినిమాతో హీరో నవదీప్‌ తన కెరీర్‌ మొదలుపెట్టాడు. హీరోగానే కాకుండా విలన్‌గా, సహాయక నటుడిగానూ సినిమాలు చేశాడు. ఓటీటీలోనూ సినిమాలు, సిరీస్‌లతో ఆకట్టుకుంటున్నాడు. అతడు హీరోగా నటించిన లవ్‌ మౌళి మూవీ జూన్‌ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్ల స్పీడు పెంచాడు నవదీప్‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను గూర్చి మాట్లాడాడు.

రెండో సినిమాకే..
'నా రెండో సినిమా మనసు మాట వినదు సమయంలోనే కాంట్రవర్సీ మొదలైంది. సక్సెస్‌కు చాలా గ్యాప్‌ వచ్చిన పెద్ద హీరోలకు హిట్లు ఇచ్చిన లక్కీ పర్సన్‌ తానే అని హీరోయిన్‌ అంకిత ఫీలైంది. అలాంటి నన్ను ఈ చిన్న హీరో డేట్ల కోసం ఇబ్బందిపెడతారా? అని నిర్మాతను ప్రశ్నించింది. అప్పుడు నాకింకా 17 ఏళ్లు. అసలేం జరుగుతుందో అర్థం కాలేదు. 

అప్పటినుంచే..
తర్వాత ఆ గొడవ సద్దుమణిగింది. ఆ సినిమా నుంచే నన్ను వివాదాలు చుట్టుముట్టడం మొదలయ్యాయి. రేవ్‌ పార్టీ, ఈడీ కేసులు.. అని ఏదేదో ప్రచారం చేస్తుంటారు. నాకు సంబంధం లేకపోయినా నా పేరు తీసుకొస్తుంటారు. కానీ అందులో ఏమాత్రం నిజముండదు. అసలు నాపై ఒక్క కేసు కూడా లేదు' అని నవదీప్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: 'సలార్ 2' పక్కన పెట్టేశారని రూమర్స్.. ఒక్క ఫొటోతో క్లారిటీ

Advertisement
 
Advertisement
 
Advertisement