వ్యాన్‌ ఢీకొని వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

వ్యాన్‌ ఢీకొని వ్యక్తి మృతి

Published Mon, May 27 2024 4:20 PM

వ్యాన్‌ ఢీకొని వ్యక్తి మృతి

బొండపల్లి: మండలంలోని అంబటివలస – గొట్లాం గ్రామాల మధ్య జాతీయ రహదారి 26పై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమా దంలో ఒక వ్యక్తి అక్క డికక్కడే మృతి చెందాడు. ఎస్సై కె.లక్ష్మణరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం మండలం గుంకలాం గ్రామానికి చెందిన తాడ్డి తాతబాబు (35) అదే మండలంలోని కొండకరకాం గ్రామంలో ఒక వ్యక్తి వద్ద ట్రాక్టరు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. విధులు ముగించుకుని తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా విజయనగరం వైపు నుంచి వస్తున్న వ్యాన్‌ బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తాతబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడినికి భార్య సంతోషి, మూడేళ్ల వయసున్న కుమార్తె అనూ ఉన్నారు. కుటుంబ పెద్ద చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేంద్ర సర్వజన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement