కలెక్టరేట్‌లో క్రిస్మస్ వేడుకలు
విజయనగరం అర్బన్: కలెక్టరేట్‌లో మంగళవారం సాయంత్రం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని వేడుకలను ప్రారంభించారు. కేక్‌ను కట్‌చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దైవదూతగా వచ్చిన యేసు త్యాగం, ప్రేమ, కరుణతో ప్రజలందరికీ ఒక మార్గం చూపారని తెలిపారు. యేసు చూపిన మార్గం స్ఫూర్తిదాయకమన్నారు.
అనంతరం క్యాండిల్ వెలుగులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చిన్నారులు ఆటపాటలతో అలరించారు. కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమశాఖ ఈడీ షేక్ మహబూబ్ షరీఫ్, క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పి.ప్రేమానందం, రెవరెండ్ పిల్లా ఆనంద్‌బాబు, రెవరెండ్ ఎస్.మధు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ రఘురాం, వివిధ విభాగాల జిల్లా అధికారులు, క్రైస్తవ ప్రతినిధులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో క్రిస్మస్ వేడుకలు


