104 ఉద్యోగుల ఆందోళన బాట
● ‘భవ్య’తో మాకు భవిష్యత్తు లేదంటూ ఆవేదన
● సెలవుపెడితే వేతనంలో కోత విధిస్తున్నారు..
● సమస్యలు చెబితే సస్పెండ్ చేస్తామని బెదిరింపులు
● సామూహిక సెలవు పెట్టి ఆందోళనకు దిగిన ఉద్యోగులు
● వేధింపులు ఆపాలని డిమాండ్
విజయనగరం ఫోర్ట్:
పల్లె ప్రజలకు వైద్యసేవలందించే 104 వాహన సేవలపై చంద్రబాబు ప్రభుత్వం కినుకవహిస్తోంది. వాహనాల్లో పనిచేసే ఉద్యోగులను సమస్యల వలయంలోకి నెట్టేసింది. అరకొర వేతనాలు, సెలవు పెడితే జీతాల్లో కోతవేయడం, సమస్యలు చెప్పుకునే దారిలేకపోవడం, ప్రశ్నించే ఉద్యోగులను ఆకారణంగా తొలగించడం, బెదిరించడంపై ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. సామూహికంగా సెలవుపెట్టి ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ వద్ద టెంట్ వేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్యోగభద్రత కల్పించాలంటూ డిమాండ్ చేశారు.
గతంలో 108, 104 వాహనాల నిర్వాహణ బాధ్యతలను అరబిందో కంపెనీ నిర్వహించేది. ఆ బాధ్యతలను ఏడునెలల కిందట భవ్య అనే సంస్థకు చంద్రబాబు సర్కారు అప్పగించింది. అప్పటి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయంటూ ఉద్యోగులు చెబుతున్నారు. సమస్యలను ప్రస్తావించినా ఉద్యోగులపై వేటు వేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పల్లెలకు వెళ్లి ప్రజలకు మెరుగైన వైద్యసేవలందిస్తున్న సిబ్బందిని పురుగుల్లా చూస్తున్నారని వాపోతున్నారు.
వేధింపులు ఆపాలి...
104 ఉద్యోగులకు సమస్యలు ఉన్నాయని, అధికారులకు విన్నవించించేందుకు వీలులేని విధంగా భవ్య సంస్థ వ్యవహరిస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగుల సమస్యలపై ఆరోగ్యశ్రీ అడిషనల్ సీఈఓకు వినతి పత్రం ఇచ్చారని రాంబాబు అనే ఉద్యోగిని సస్పెండ్ చేశారన్నారు. జిల్లాలో 104 వాహనాలు 46 ఉన్నాయి. ఇందులో డ్రైవర్‌లు 48 మంది, డీఈఓలు 47 మంది పనిచేస్తున్నారు. వీరిలో ఏ ఉద్యోగి కూడా సెలవు మంజూరు చేయకపోవడంపై మండిపడుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి చూడలేదన్నారు.
ఏడు నెలల
కాలంలోనే ...
కనీస వేతనం ఇవ్వడంలేదని, అదనపు బాధ్యతలు అప్పగించి ఒత్తిడికి గురిచేస్తున్నారని, అనారోగ్యంతో సెలవు పెట్టినా జీతంలో కోత విధిస్తున్నారని చెబుతున్నారు.
104 ఉద్యోగుల ఆందోళన బాట
104 ఉద్యోగుల ఆందోళన బాట


