వంద రోజుల ప్రణాళికను అమలు చేయాలి
● డీఈఓ మాణిక్యంనాయుడు
నెల్లిమర్ల రూరల్: పదో తరగతి విద్యార్థులకు వంద రోజుల బోధన ప్రణాళికను అమలుచేయాలని డీఈఓ మాణిక్యంనాయుడు ఉపాధ్యాయులకు సూచించారు. మండలంలోని మొయిద ఉన్నత పాఠశాలను మంగళవారం సందర్శించారు. పదో తరగతిలో శతశాతం ఉత్తీర్ణత నమోదుకు కృషిచేయాలన్నారు. రోజువారీ బోధన ప్రణాళిక, వారానికోసారి మోడల్ టెస్ట్ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం మహాలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.
30 ఆలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు
● టీటీడీ జిల్లా ప్రోగ్రాం అధికారి
జె.శ్యామసుందర్
రేగిడి: జిల్లాలో 30 రామాలయాల నిర్మాణానికి శ్రీవాణి ట్రస్టు తరఫున ఆర్థిక సహకారానికి ప్రతిపాదనలు పంపించామని టీటీడీ జిల్లా ప్రోగ్రాం అధికారి జె.శ్యామసుందర్ తెలిపారు. రేగిడి మండలం సంకిలిలో నిర్మాణంలో ఉన్న రామాలయాన్ని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాలతో పాటు విగ్రహాలు, మైక్‌సెట్లు, ఇతర సామగ్రికి శ్రీవాణి ట్రస్టు ద్వారా సహకారానికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జిల్లాలో 30 ఆలయాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని వెల్లడించారు. ఆయన వెంట టీటీడీ సహాయకులు సీహెచ్ ప్రసాద్, సంకిలి ఆలయ కమిటీ సభ్యులు బి.తవిటినాయుడు, కొరికాన వెంకటేశ్, ఆర్.శ్రీకాంత్, జి.రామకృష్ణ, ఆర్.కోదండం ఉన్నారు.
ఆవిష్కరణలు భళా
● ఆకట్టుకున్న ఐటీడీఏ స్థాయి
అన్వేష సైన్స్ ఫెస్ట్
● 53 విద్యాసంస్థల నుంచి
300ల ప్రాజెక్టుల ప్రదర్శన
సీతంపేట: గిరిజన విద్యార్థులు సృజనకు పదునుపెట్టారు. సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలతో ఆకట్టుకున్నారు. సీతంపేట గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో మంగళవారం నిర్వహించిన అన్వేష సైన్స్‌ఫెస్ట్‌ను పాలకొండ సబ్‌కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ పవార్ స్వప్నిల్ ప్రారంభించారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలోని పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలోని 53 గిరిజన విద్యాసంస్థల నుంచి 300లకు పైగా ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు. వీటిలో కొన్నింటిని పీఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి శాస్త్రవేత్తగా ఎదగాలని, చదువుతో పాటు శాసీ్త్రయదృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. నిత్యజీవితంలో ప్రశ్నించడం అలవాటు చేసుకున్నప్పుడే విద్యార్థులు శాస్త్రవేత్తలుగా తయారవుతారన్నారు. సమాజంలో సమస్యలకు పరి ష్కారం కనుగొనే దిశగా విద్యార్థులు ఆలోచించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో నిత్యం ఎదుర్కొనే సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనాలన్నారు. ఖరీదైన టెక్నాలిజీని సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చేలా తక్కువ ఖర్చుతో కూడిన ఆవిష్కరణలు రావాలని సూచించారు. ఇక్కడ ప్రదర్శించిన ప్రాజెక్టులను ఎంపిక చేసి ఇస్రోకు పంపిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ చిన్నబాబు, డీడీ అన్నదొర, డిప్యూటీ ఈఓ రామ్మోహన్‌రావు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పి.భూదేవి పాల్గొన్నారు.
వంద రోజుల ప్రణాళికను అమలు చేయాలి
వంద రోజుల ప్రణాళికను అమలు చేయాలి


