మీ ఇంటిని చక్కదిద్దుకోండి..! | Sakshi
Sakshi News home page

మీ ఇంటిని చక్కదిద్దుకోండి..!

Published Sun, May 26 2024 5:14 AM

Arvind Kejriwal Replies To Pakistan Fawad Hussain Over Remark On Lok Sabha Polls

సమస్యల్ని పరిష్కరించుకునే సత్తా మాకుంది

పాక్‌ నేత ‘శాంతి’ వ్యాఖ్యలకు బదులిచ్చిన కేజ్రీవాల్‌ 

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభు త్వంలో మంత్రిగా ఉన్న చౌదరి ఫవాద్‌ హుస్సేన్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో భారత్‌లో విద్వే షం, ఉగ్రవాద శక్తులను శాంతి సామరస్యా లు ఓడించాలని ఆకాంక్షించారు. దీనికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ దీటైన సమాధానమిచ్చారు. ‘చౌదరి సాహిబ్, నేను, మా దేశ ప్రజలకు సమస్యల్ని పరిష్కరించుకునే సమర్థత ఉంది. మీ ట్వీట్‌ అవసరం లేదు. 

పాకిస్తాన్‌లో ప్రస్తుతం పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. మీ దేశం సంగతి చూసుకోండి. ఎన్నికలు భారత్‌ అంతర్గత వ్యవహారం. ఉగ్రవాదానికి అతిపెద్ద స్పాన్సర్‌గా ఉన్న పాకిస్తాన్‌ మా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించబోం’అని హెచ్చరించారు. ఆ తర్వాత కేజ్రీవాల్‌ అభిప్రాయాలపై చౌదరి ఫవాద్‌ హుస్సేన్‌ స్పందించారు.

 ‘ఉగ్రవాదానికి సరిహద్దులతో సంబంధంలేదు. పాక్‌లో ప్రస్తుతం పరిస్థితులు బాగానే ఉన్నాయి. మెరుగైన సమాజం కావాలనే ఎవరైనా కోరుకుంటారు’అని పేర్కొన్నారు. ఈ పరిణామంపై బీజేపీ స్పందించింది.  ‘ఆప్‌ నేత అవినీతి రాజకీయాలకు పాక్‌ నుంచి కూడా వంతపాడుతున్నారు. ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్న ప్రతిసారీ పాక్‌ నుంచి స్పందిస్తుంటారు. దేశ శత్రువులతో కేజ్రీవాల్‌ అంటకాగుతున్నారనడానికి ఇదే రుజువు’ ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement