-
Delhi liquor scam: కేజ్రీవాల్ పిటిషన్‌పై ఈడీకి సుప్రీం నోటీస్
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సీఎం కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. ఈ నెల 24వ తేదీ లోగా సమాధానమివ్వాలని ఈడీని ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణ ఈ నెల 29వ తేదీన చేపడతామని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం సోమవారం పేర్కొంది. సాధ్యమైనంత త్వరగా విచారణ చేపట్టాలన్న అభిషేక్ సింఘ్వి వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధం కాదంటూ ఢిల్లీ హైకోర్టు ఈ నెల 9వ తేదీన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఇలా ఉండగా, ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 23వ తేదీ వరకు పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన 15 రోజుల కస్టడీ గడువు ముగియడంతో సోమవారం సీబీఐ, ఈడీ కేసుల ప్రత్యేక జడ్జి కావేరీ బవేజా వర్చువల్‌గా విచారణ చేపట్టారు. ఏప్రిల్ 23వ తేదీ వరకు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలిచ్చారు. ఇదే కేసులో బీఆర్ఎస్ నేత కె.కవిత తదితర నిందితుల కస్టడీ గడువు కూడా అదే రోజుతో ముగుస్తోందని ఆమె తెలిపారు. -
కేజ్రీవాల్ అరెస్ట్ వెనుక బీజేపీ సీనియర్ కుట్ర
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీలో అవకతవకల కేసులో బీజేపీ సీనియర్ నేత ఒకరు కుట్ర పన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయించారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. కేసులో అప్రూవర్‌గా మారిన మాగుంట రాఘవ్‌పై ఒత్తిడి చేసి కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా తప్పుడు వాంగ్మూలం ఇచ్చేలా చేశారని శుక్రవారం ఢిల్లీలో పత్రికాసమావేశంలో సంజయ్ చెప్పారు. ఇదే కేసులో చాలా వారాలపాటు జ్యుడీíÙయల్ కస్టడీలో ఉండి సంజయ్ రెండు రోజుల క్రితమే బెయిల్‌పై విడుదలైన సంగతి విదితమే. ‘‘ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని లోక్‌సభ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై బీజేపీ ఒత్తిడి చేసింది. అందుకు ఆయన ఒప్పకోలేదు. దీంతో ఆయన కుమారుడు మాగుంట రాఘవ్‌ను లక్ష్యంగా చేసుకుని అరెస్ట్‌చేశారు. పలుమార్లు అధికారులు ప్రశ్నించడంతో మాగుంట రాఘవ్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా తప్పుడు వాంగ్మూలం ఇచ్చారు. ఇలా పెద్ద కుట్రలో భాగమయ్యారు. ఢిల్లీ సీఎంను కటకటాల వెనక్కి పంపడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది’ అని సంజయ్ అన్నారు. -
సునీత.. మరో రబ్డీ అయ్యేనా...?!
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కసారిగా భారీ కుదుపుకు లోనైంది. చాన్నాళ్లుగా ఊహిస్తున్నదే అయినా, ఆప్‌లో నాయకత్వ లేమిని ఈ పరిణామం బట్టబయలు చేసింది. మద్యం కేసులోని ఇతర నిందితుల్లా కేజ్రీవాల్ కూడా దీర్ఘకాలం పాటు జైలుకే పరిమితమైతే ఆప్ పరిస్థితేమిటన్న ప్రశ్నకు బదులుగా ఆయన భార్య సునీత పేరు తెరపైకి వస్తోంది. భర్త స్థానంలో ఆప్ పగ్గాలతో పాటు ఢిల్లీ సీఎం బాధ్యతలనూ ఆమె చేపట్టవచ్చంటూ ఊహాగానాలు విని్పస్తున్నాయి. సోషల్ మీడియాలో అందుకు అనుకూల, వ్యతిరేక వాదనలు జోరుగా సాగుతున్నాయి... 1997లో నాటి బిహార్ సీఎం లాలూప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణంలో జైలుపాలు కావడంతో భార్య రబ్డీదేవిని ముఖ్యమంత్రిని చేసిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అచ్చం అలాగే సునీత కూడా రాజకీయ అరంగేట్రం చేయవచ్చంటూ ఊహాగానాలు విని్పస్తున్నాయి. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ శనివారం ప్రజలనుద్దేశించి పంపిన వీడియో సందేశాన్ని పార్టీ నేతలకు బదులు సునీత చదివి విని్పంచడం ఇందుకు సంకేతమంటూ జోరుగా విశ్లేషణలు సాగుతున్నాయి. ఆ సందర్భంగా ఆమె కేజ్రీవాల్ కురీ్చలో కూర్చోవడం యాదృచ్చికమేమీ కాదని కూడా అంటున్నారు. అరవింద్, సునీత ఇద్దరూ ఐఆర్ఎస్ అధికారులే. శిక్షణ సందర్భంగా ఏర్పడ్డ సాన్నిహిత్యం పెళ్లికి దారితీసింది. ముందుగా కేజ్రీవాల్ పదవికి రాజీనామా చేసి హక్కుల కార్యకర్తగా మారారు. రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టారు. ఆయన సీఎం అయ్యాక సునీత కూడా ఐఆర్ఎస్కు రాజీనామా చేశారు. అప్పుడప్పుడు భర్తతో పాటు పార్టీ ప్రచారంలో పాల్గొనడం, ఆప్ ఎన్నికల విజయాలపై స్పందించడం తప్ప రాజకీయంగా చురుగ్గా ఉన్నది లేదు. పారీ్టలో కూడా ఆమె ఎలాంటి పదవిలోనూ లేరు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ సందేశాన్ని ఆప్ నేతలు కాకుండా సునీత చదివి విని్పంచడం ఒక్కసారిగా ఊహాగానాలకు తావిచ్చింది. వాటిపై మిశ్రమ స్పందనలూ వస్తున్నాయి. ‘‘సునీతకు పగ్గాలప్పగిస్తే సానుభూతి కూడా ఆప్‌కు కలిసొస్తుంది. కష్టకాలం నుంచి పార్టీని ఆమె బయట పడేస్తారు. కీలకమైన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ లోటును కూడా భర్తీ చేస్తారు’’ అని కొందరంటున్నారు. భర్త తరఫున ఆయన సందేశాన్ని విని్పంచినంత మాత్రాన రాజకీయాల్లోకి వస్తారని అనుకోలేమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ‘‘ఆమె కూర్చున్నది సీఎం కుర్చీ ఏమీ కాదు. తమ నివాసంలో కేజ్రీవాల్ మీడియాతో భేటీ అయ్యే కురీ్చలో కూర్చున్నారంతే. దాన్ని అధికార మార్పిడికి సంకేతంగా చూడటం సరికాదు’’ అన్నది వారి వాదన. సునీత రాజకీయ ఎంట్రీ వార్తలపై ఆప్ మౌనం వహిస్తోంది. ఆప్ నేతల్లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మాత్రమే దీనిపై పెదవి విప్పారు. ఆయన కూడా ఈ విషయమై తనకెలాంటి సమాచారమూ లేదని చెప్పడంతోనే సరిపెట్టారు. బీజేపీ మాత్రం అప్పుడే ముందస్తు విమర్శలతో హోరెత్తిస్తోంది. ఆప్ నాయకత్వ రేసులో చివరికి కేజ్రీవాల్ భార్య కూడా చేరారంటూ కేంద్ర మంత్రి, బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు. కేజ్రీవాల్ గతంలో చేసిన వాగ్దానాలను వరుసబెట్టి తుంగలో తొక్కుతుంటే సునీత ఎక్కడున్నారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సీఎం కేజ్రీవాల్ ఇలా చేస్తారనుకోలేదు.. ‘సుప్రీం’ మాజీ న్యాయమూర్తి
సాక్షి, బెంగళూరు: ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టైన ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీరుపట్ల సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, మాజీ సొలిసిటర్ జనరల్ ఎన్ . సంతోష్ హెగ్డే అసంతృప్తిని వ్యక్తం చేశారు. 2011లో ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే అవినీతి ( India Against Corruption) కి వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. అన్నా హజారే నేతృత్వంలో జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిలో కేజ్రీవాల్‌తో పాటు ఎన్.సంతోష్ హెగ్డేలు ఉన్నారు. అయితే నాడు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన కేజ్రీవాల్ నేడు లిక్కర్ కేసులో అరెస్ట్ కావడంపై హెగ్డే స్పందించారు. కేజ్రీవాల్ తీరుపై తీవ్ర నిరాశ చెందాను. ఆప్ (అధికారంలోకి వచ్చిన తర్వాత) అవినీతి లేని పరిపాలన కొనసాగిస్తుందని అనుకున్నాను. కానీ అది జరగలేదు.అధికారంతో భ్రష్టుపట్టించారని పీటీఐతో మాట్లాడారు. ఉద్యమం నుంచి బయటకు రావడానికి కారణం ‘‘ ఈరోజు రాజకీయాలు అవినీతి గుహగా మారాయి. ఏ రాజకీయ పార్టీ కూడా దాని నుండి విముక్తి పొందలేదు. అవినీతికి వ్యతిరేకంగా చేసే ఇండియా ఎగెనెస్ట్ కరప్షన్ ఉద్యమం నుంచి బయటకు రావడానికి కారణం కూడా అదే. రాజకీయాలకు దూరంగా ఉంటూ రాజకీయాలను ప్రక్షాళన చేయాలన్నదే మా సూత్రం. ఉద్యమం కాస్త రాజకీయ పార్టీగా కానీ ఆ తర్వాత కొంతమంది వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఆప్‌ను స్థాపించారు. అప్పుడే నేను ఉద్యమం నుంచి బయటకు వచ్చాను. పార్టీ పెట్టి అవినీతి నిర్మూల చేస్తానని అనుకోలేదు. అది జరగదు కూడా. అందుకు కేజ్రీవాల్ అరెస్టే ఉదాహరణ’’ అన్నారు. ఉద్యమం కొనసాగుతుండగానే ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపన జరిగింది. అందులో చేరాలంటూ కేజ్రీవాల్ తనని స్వయంగా ఇంటికి వచ్చి ఆహ్వానిస్తే అందుకు నేను ఒప్పుకోలేదని నాటి పరిస్థితుల్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. విపక్షాల విమర్శల్లో అర్ధం లేదు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తుందని, వారిపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుందన్న విపక్షాలు ఆరోపణలపై హెగ్డే తన అభిప్రాయాలను పంచుకున్నారు . ప్రతిపక్షాన్ని నాశనం చేయడం కోసమే అధికార పార్టీ ఇలా చేస్తోందంటూ ప్రతిపక్షాల ఆరోపణల్ని నేను నమ్మను. అవును.. ఎంపిక చేసి నేతల్ని దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేస్తున్నాయి. కానీ అది నేరం కాదు. ఎందుకంటే న్యాయ శాస్త్రంలో కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని సీబీఐ,ఈడీలు ఇలా చేస్తున్నాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, మాజీ సొలిసిటర్ జనరల్ ఎన్ . సంతోష్ హెగ్డే మద్దతు పలికారు. -
కేజ్రీకి ఢిల్లీ హైకోర్టులో దక్కని ఊరట
న్యూఢిల్లీ: కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పిటిషన్‌పై అత్యవసర విచారణకు కోర్టు నిరాకరించింది. తనను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఆయన శనివారం పిటిషన్ దాఖలు చేశారు. తన అరెస్టు, రిమాండ్ చట్టవిరుద్ధమని, వెంటనే విడుదల చేసేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్‌ను అత్యవసరంగా, వీలైతే ఆదివారమే విచారించాలని కోరారు. అయితే బుధవారం విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. జర్మనీ ప్రకటన, రాయబారికి భారత్ సమన్లు కేజ్రీవాల్ అరెస్ట్‌పై జర్మనీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘‘ఈ అరెస్ట్‌ను మేం గమనిస్తున్నాం. న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రమాణాలు, ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రాలు ఈ కేసుకు వర్తిస్తాయని ఆశిస్తున్నాం. కేజ్రీవాల్ న్యాయమైన, నిష్పక్షపాత విచారణకు అర్హులు. చట్టపరమైన పరిష్కారాలను పరిమితుల్లేకుండా ఉపయోగించుకునే హక్కు ఆయనకుండాలి’’ అని జర్మనీ విదేశాంగ మంత్రి పేర్కొంది. దీనిపై విదేశాంగ శాఖ తీవ్ర నిరసన తెలిపింది. ఇది తమ అంతర్గత వ్యవహారాల్లో, న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని ఆక్షేపించింది. జర్మనీ వ్యాఖ్యలను అసమంజసం, పక్షపాతపూరితమని పేర్కొంటూ ఢిల్లీలోని జర్మనీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ జార్జి ఎన్జ్వీలర్కు సమన్లు జారీ చేసినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ చెప్పారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement