నటి హేమ లవ్ స్టోరీ.. ఇంతకీ భర్త ఎవరో తెలుసా? | Sakshi
Sakshi News home page

Hema: హేమ అసలు పేరు ‍అదే.. ఆమె భర్త ఎవరంటే?

Published Sun, May 26 2024 9:29 PM

Tollywood Actress Hema Love Story Goes Viral After Bangalore Rave Party

ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీ టాలీవుడ్‌ను కుదిపేసింది. పలువురు టాలీవుడ్ ‍ప్రముఖులు ఉన్నట్లు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. అయితే ఈ పార్టీకి టాలీవుడ్‌ నటి హేమ హాజరైనట్లు బెంగళూరు పోలీసులు ఫోటోను కూడా రిలీజ్‌ చేశారు. మొదటి తాను పార్టీలో లేనంటూ వీడియో రిలీజ్ చేసినప్పటికీ ఆ తర్వాత హేమకు పాజిటివ్‌గా వచ్చినట్లు పోలీసులు స్పష్టం చేశారు.

ఇదంతా పక్కనపెడితే.. టాలీవుడ్‌లో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా వందలకు పైగా సినిమాల్లో నటించింది. విభిన్నమైన పాత్రలతో వెండితెరపై అలరించింది. ఇటీవల రేవ్ పార్టీలో హేమ పేరు రావడంతో ఆమె గురించి నెట్టింట చర్చ మొదలైంది. హేమ ఫ్యామిలీకి సంబంధించిన వివరాల గురించి ఆరా తీస్తున్నారు. అయితే హేమ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. ఇంతకీ అతనెవరో తెలుసా? ఆ వివరాలేంటో చూసేద్దాం.

నటి హేమ లవ్ స్టోరీ

తూర్పుగోదావరి జిల్లా రాజోలుకి చెందిన హేమ అసలు పేరు కృష్ణవేణి. తెలుగులో 1989లో బలకృష్ణ హీరోగా నటించిన ‘భలేదొంగ’ చిత్రం ద్వారా ఆమె టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ‍అయితే హేమకి ఫేమ్ తీసుకొచ్చిన చిత్రం క్షణక్షణం. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హేమ.. శ్రీదేవికి స్నేహితురాలిగా కనిపించారు. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హేమకి మంచి గుర్తింపు దక్కింది.

hema

ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తినే ప్రేమ పెళ్లి చేసుకున్నారు హేమ. ఆమె  భర్త పేరు సయ్యద్ జాన్ అహ్మద్ కాగా.. గతంలో ఓ ఇంటర్య్వూలో తన లవ్ స్టోరీ గురించి నోరువిప్పింది. తాను దూరదర్శన్‌లో పనిచేసే సమయంలో అతను పరిచయమైనట్లు హేమ తెలిపింది. అక్కడే అతను అసిస్టెంట్ కెమెరా మెన్‌గా పనిచేసేవారని వెల్లడించింది. ఓసారి అతన్ని మొదటిసారి కలిసినప్పుడే పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడని పేర్కొంది. మొదటిసారి కలిసిన వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో  కాదనలేకపోయానని హేమ వివరించింది. కాగా.. వీరిద్దరికీ ఈషా అనే కూతురు కూడా ఉంది. బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీతో హేమ పేరు బయటకొచ్చిన సంగతి తెలిసిందే. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement