కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య | Married Woman Commits Suicide Over Stomach Pain In Karnataka, Details Inside | Sakshi
Sakshi News home page

కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య

Published Mon, May 27 2024 10:16 AM

Woman commits suicide over stomach pain

శివమొగ్గ : బ్యూటీ పార్లర్‌ నిర్వహిస్తున్న మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన శివమొగ్గ జిల్లా సొరభలో జరిగింది.భద్రావతికి చెందిన అక్షిత(30) సొరభ పట్టణానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకొని ఇదే పట్టణంలోని విద్యుత్‌ నగరలో నివాసం ఉంటోంది. పట్టణంలోనే బ్యూటీ పార్లర్‌ నిర్వహిస్తోంది. కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతూ పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందింది. అయినా నయం కాలేదు. దీంతో ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సొరభ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.   

Advertisement
 
Advertisement
 
Advertisement