సాక్షి,బళ్లారి: సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే మహిళల భాగస్వామ్యం, చురుకై న పాత్ర ఎంతో అవసరమని పలువురు వక్తలు అభిప్రాయ పడ్డారు. శనివారం దావణగెరె జిల్లా హరిహరలో భాగీరథి బాయి కళ్యాణ మండపంలో కర్ణాటక రాష్ట్ర ఎస్ఎస్కే సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా సమ్మేళనంలో మహిళల సాధికారత, మహిళాభివృద్ధి అనే అంశంపై చర్చ జరిగింది. కార్యక్రమంలో కలబుర్గి జిల్లా చిత్తాపుర తాలూకా దండోటి గ్రామంలోని బలభీమేశ్వర ఆశ్రమానికి చెందిన డాక్టర్ బాలయోగిని జయశ్రీ మాతాజీ దివ్యసాన్నిధ్యంలో, అవధూత వినయ్ గురూజీ తదితరులు మహిళాభివృద్ధి గురించి మాట్లాడారు. రాజ్యసభ సభ్యుడు నారాయణ కే.భాండగే, హరిహర ఎమ్మెల్యే హరీష్ తదితరులు పాల్గొన్నారు.


