ఇస్పేట్‌ జూదరుల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

ఇస్పేట్‌ జూదరుల అరెస్టు

Nov 1 2026 4:55 AM | Updated on Nov 1 2026 4:55 AM

సాక్షి, బళ్లారి: బళ్లారి తాలూకా కొళగల్‌ గ్రామ సమీపంలోని చెరువు కట్ట వద్ద పేకాట స్ధావరంపై పోలీసులు దాడి చేసి దాదాపు రూ.3 లక్షల నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు 13 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్‌ చేశారు. అంతేకాకుండా వారి వద్ద నుంచి 13 మొబైల్‌ ఫోన్లు, 8 ద్విచక్ర వాహనాలను కూడా వశపరుచుకున్నారు.

చెరకు ధర పెంచకుండా సర్కారు నాటకం

హుబ్లీ: చెరకుకు శాసీ్త్రయ ధర కల్పించడంతో పాటు వివిధ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో లక్షలాది రైతులు వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం చెరకు ధర పెంచకుండా సంబంధిత ఫ్యాక్టరీ యజమానులు, రైతుల మధ్య నాటకం ఆడుతోంతుందని ప్రగతిశీల రైతు నేత బసవరాజ బుతాలి ఆరోపించారు. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చెరకు ఉపఉత్పత్తి అయిన మద్యం విక్రయాల ద్వారా లభించే ఎకై ్సజ్‌ సుంకం లాభాల్లో నుంచే రైతుల చెరకుకు అధిక ధర చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఓ వైపు ఎంఎస్‌పీ కేంద్రానికి చెందిందని అంటున్న రాష్ట్ర ప్రభుత్వం మరో వైపు తమ ఖజానాలో డబ్బుల్లేక దివాలా తీసిందని స్వయంగా సీఎం ప్రకటించడం సిగ్గుచేటన్నారు. రైతుల సమావేశంలో సీఎం డీకే.శివకుమార్‌ తన జేబు నుంచి డబ్బులు ఇవ్వడం లేదు. బాధ్యతారహితంగా మాట్లాడటం తగదన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించక పోతే హైవేల బంద్‌కు బదులుగా ప్రభుత్వ కార్యాలయాలు, ఎకై ్సజ్‌ విక్రయాలు చేసే మద్యం అంగళ్లను బంద్‌ చేస్తామని ఆయన హెచ్చరించారు.

రాజ్యోత్సవానికి నగరం ముస్తాబు

● జోరుగా విద్యుద్దీపాలంకరణలు

● జెండాల విక్రయాలతో సందడి

బళ్లారిఅర్బన్‌: కర్ణాటక రాజ్యోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్‌ 1న వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా బళ్లారి నగరంలోనూ ఉత్సవాలకు ముందస్తు సన్నాహాలు పూర్తయ్యాయి. కన్నడ రక్షణ వేదిక సంఘాల ఆధ్వర్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో కన్నడ పతాకాన్ని ఎగురవేసేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లతో పాటు పలు ప్రాంతాల్లో విద్యుద్దీపాలతో ప్రత్యేక అలంకరణలు చేపట్టారు. మరో వైపు బెంగళూరు రోడ్డులో కన్నడ జెండాల విక్రయాలు జోరుగా సాగాయి. రాజ్యోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు ప్రజలు జెండాలను కొనుగోలు చేస్తూ కనిపించారు. నగరమంతా పండుగ వాతావరణం నెలకొంది.

ఘనంగా విశ్వ ఆయుర్వేద సమ్మేళనం

హుబ్లీ: విశ్వ ఆయుర్వేద సమ్మేళనం సందర్భంగా ఆయుర్వేద కళాశాల ఆస్పత్రి ఆధ్వర్యంలో సంభవ యుగేయుగే సమగ్ర సంతానోత్పత్తి వైద్యం అనే అంశంపై 11వ ఉపసమ్మేళనం నగరంలో ఘనంగా జరిగింది. వ్యంధత్వ నివారణ ఆయుర్వేద పాత్ర పురుషులు, మహిళల్లో ఫలవర్థక, పంచకర్మ చికిత్స, గర్భసంస్కారం, భ్రూణం ఎదుగుదల, ఆధునిక సంతానోత్పత్తి సాంకేతిక అంశాలు, ఆధునిక సంతానోత్పత్తి విజ్ఞానం, సాక్ష్యాథభిధారిత ఆయుర్వేద చికిత్సా పద్ధతులను సమన్వయ పరచడం ద్వారా ఫలవత్తత, పితృత్వం, మాతృత్వం, సంతానోత్పత్తి ఆరోగ్యాన్ని చక్కబరుచుకోవడం గురించి నిపుణులు కీలక విషయాలను వెల్లడించారు. డాక్టర్‌ మాధవ్‌ దిగ్గావి, డాక్టర్‌ సూరజ్‌ ప్రత్యేకంగా ప్రసంగించారు. కార్యక్రమంలో డాక్టర్‌ గోవింద్‌ మీరజ్‌, డాక్టర్‌ సుహాస్‌కుమార్‌ శెట్టి, డీన్‌ డాక్టర్‌ సుజాత, గోవింద జోషి, సంజీవ్‌ జోషి, ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ ఏఎస్‌ ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

భక్తిభావాలు పెంచుకోవాలి

రాయచూరు రూరల్‌: మానవుడు తన జీవితంలో భక్తిభావాలు పెంచుకోవాలని కాశీ జగద్గురువులు పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి సింధనూరు తాలూకాలోని సిద్ధ పర్వతం అంబామఠంలో నూతన కలశారోహణ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆశీర్వదించి మాట్లాడారు. నేడు మానవుడు పని ఒత్తిళ్ల కారణంగా నిత్యం ఎంతో మదనపడుతున్నాడన్నారు. రోజు కొంత సమయాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సమయం కేటాయించాలన్నారు. స్వామీజీలు, శాసన సభ్యులు హంపనగౌడ, బసనగౌడ, వసంతకుమార్‌, బసనగౌడలున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement