అక్రమాలపై విచారణకు డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

అక్రమాలపై విచారణకు డిమాండ్‌

Nov 1 2026 4:55 AM | Updated on Nov 1 2026 4:55 AM

రాయచూరు రూరల్‌: బోవి అభివృద్ధి మండలిలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని రైతు సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయచూరు జిల్లాలో భూముల కొనుగోలులో 2023–24లో వ్యవసాయ భూముల విషయంలో రూ.24 కోట్ల మేర నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని, సంబంధిత అధికారులపై విచారణ జరిపి కఠిన చర్యలు చేపట్టాలన్నారు. భూముల కొనుగోలుకు సంబంధించి 48 మంది నుంచి రూ.80 వేల వరకు వసూలు చేశారన్నారు. మార్కెట్‌ విలువ రూ.4.50 లక్షలుంటే వారు దాని విలువను రూ.12 లక్షలకు పెంచారని, సీబీఐకి అప్పగించి పూర్తి స్థాయి విచారణ చేయాలన్నారు. లత, మధు, లక్ష్మి, వీరేష్‌, నాగమ్మ, రెడ్డమ్మ, శంకరమ్మలున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement