రాయచూరు రూరల్: ఖరీఫ్ సీజన్లో వానలు లేనందున తాగునీటి ఎద్దడి నెలకొనకుండా చూడాలని రాయచూరు గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ అధికారులను ఆదేశించారు. శనివారం రాయచూరు టీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులు విత్తనాలు వేయడం వల్ల పంట నష్టం విషయంలో అధికారులు రైతులకు సహకరించాలన్నారు. భవిష్యత్తులో పశువులకు గ్రాసం కొరత రాకుండా చూడాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లభించే సబ్సిడీ పథకాలను రైతులకు అందే విధంగా చూడాలన్నారు. టీపీ ఈఓ చంద్రశేఖర్ పవార్, డీఎస్పీ శాంతవీర్, ఏసీ హంపణ్ణ, తహసీల్దార్ సురేష్వర్మలున్నారు.


