ధారగంగమ్మ నిజరూప దర్శనం | Sakshi
Sakshi News home page

ధారగంగమ్మ నిజరూప దర్శనం

Published Mon, May 27 2024 4:25 PM

ధారగం

శృంగవరపుకోట:

ట్టణ ప్రజల ఆరాధ్యదైవం, గ్రామదేవత ధారగంగమ్మ అమ్మవారి నిజరూప దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. ఆదివారం తెల్లవారుజామునుంచి అమ్మవారి ఉత్సవ మూర్తికి ఆలయ అర్చకులు అగ్నిహోత్రం రాజగోపాలచార్యులు, గార్లపాటి మూర్తి మంత్రోచ్చారణతో ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి మహిళలు జలాభిషేకం చేశారు. అమ్మవారి అనువంశిక పూజారి మోపాడ గౌరినాయుడు దంపతులు, పుణ్యగిరి దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్‌ పొలమరశెట్టి రామకృష్ణ, ఎస్‌.కోట ఉపసర్పంచ్‌ మోపాడ కుమార్‌, ఉత్సవ కమిటీసభ్యులు రామోదర కృష్ణంనాయుడు, డబ్ల్యూఎన్‌శర్మ, వి.స్వామినాయుడు, వి.రాజు, మోపాడ మధు, డైరెక్టర్లు ఈశ్వర్రావు, జి. శ్రీను, వార్డుసభ్యుడు మజ్జి శేఖర్‌ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తుల కు శ్రీనివాస పోటో స్టూడియో యాజమాన్యం మజ్జిగ పంపిణీ చేసింది.

నేడు అమ్మవారి తొలేళ్ల ఉత్సవం

పట్టణంలో సోమవారం అమ్మవారి తొలేళ్ల ఉత్సవం నిర్వహించనున్నారు. అనువంశిక పూజారి గౌరునా యుడు ఇంటినుంచి చుక్కవీధిలో ఉన్న బి.గంగ య్య ఇంటివద్దకు చేను కుండలో వరి విత్తనాలు పట్టుకుని ఊరేగింపుగా వెళ్లి గాంధీబొమ్మ జంక్షన్‌ పాండవుల చావిడి వద్ద ఈ విత్తనాలు పోస్తారు. పూర్వీకుల సంప్రదాయంగా వస్తున్న ఈ విత్తనాల ను ఖరీఫ్‌ చల్లే విత్తనాల్లో కలిపి నారుమడిలో చల్లుతారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా సీఐ ఎం.మురళీరావు, ఎస్సై సీహెచ్‌ గంగరాజుల నేతృత్వంలో 200 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

అనుపోత్సవం రేపు

గ్రామదేవత ధారగంగమ్మ అమ్మవారి పండగ అనుపోత్సవం మంగళవారం నిర్వహిస్తారు. అమ్మవారి కి ముందుగా అనువంశిక పూజరి మోపాడ గౌరి ఇంటి నుంచి గొల్లవీధిలో గల ధారగంగమ్మ అమ్మవారి గద్దె గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నా రు. పద్మశాలి వంశీకులు అమ్మవారి భారీ ప్రభను ప్రదర్శిస్తారు. ఈ పండుగకు సుమారు లక్షమంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకునే అవకాశముందని స్థానికులు చెబుతున్నారు.

పోటెత్తిన భక్తజనం అమ్మవారికి వేలాది బిందెలతో జలాభిషేకం

నేడు తొలేళ్ల ఉత్సవంఅనుపోత్సవం రేపు

ధారగంగమ్మ నిజరూప దర్శనం
1/1

ధారగంగమ్మ నిజరూప దర్శనం

Advertisement
 
Advertisement
 
Advertisement