● ఆదుకున్న కుటీర పరిశ్రమ
నా పేరు చప్ప మౌనిక. వంగర మండలంలోని కొప్పర గ్రామం. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. భర్త శ్రీనివాసరావు ఎమ్మెస్సీ బీఈడీ పూర్తి చేసినా ఉద్యోగం రాలేదు. ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాం. గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ ఆసరా, సీ్త్రనిధి, జగనన్నతోడు వంటి పథకాలతో రూ.2లక్షల సాయం అందింది. వీటితో పిడికర్రలు (మాప్ స్టిక్స్), కొండచీపుర్లు తయారీ యూనిట్‌ను ఇంటివద్ద ప్రారంభించాను. ఇప్పుడు నెలకు రూ.15వేలు సంపాదిస్తున్నాను. సాయం అందేలా చేసిన జగనన్న మేలు మరచిపోలేనిది.
● ఆదుకున్నారు
నా పేరు బోదంకి సంతోష్‌కుమార్. మా నాన్న పేరు కృష్ణ. అమ్మ పేరు కనకం. మాది విజయనగరం మండలం రాకోడు గ్రామం. మూడేళ్ల కిందట బీపీ ఎక్కువై పడిపోవడంతో మెదడులోని రక్తనాళాలు చిట్లిపోయాయి. రూ.3 లక్షలు అప్పుచేసి ఆపరేషన్ చేయించారు. విషయం తెలుసుకున్న అప్పటి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేయించారు. రూ. 2.20 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు కావడంతో అప్పుతీర్చగలిగాం. ఆయన మేలు మరచిపోలేం. ఆయనకు ముందుస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు.
● ఆదుకున్న కుటీర పరిశ్రమ


