● చదువుకు అండ
నా పేరు వరిరెడ్డి పూజ. కొమరాడ మండలంలోని మాదలింగి గ్రామం. నిరుపేద కుటుంబం. నాకు తమ్ముడు రాంమకుమార్, చెల్లి శ్రీజ ఉన్నారు. మా చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు. అమ్మ దమయంతికి వచ్చిన టైలరింగ్ వృత్తితో మా జీవనం సాగేది. ఉన్నత చదువులు చదివించాలని అమ్మ కలలు కనేది. ఊర్లో ఉన్న పాఠశాల వరకు మాత్రమే చదివించగల ఆర్ధిక స్థోమత మాత్రమే ఉండేది. ఫీజురీయింబర్స్ ఆర్థిక సాయంతో పిల్లలను చదివించవచ్చని అమ్మ తెలుసుకొని నన్ను ఇంజిరింగ్ విద్యకు ప్రోత్సహించింది. దీనివల్లే నేను ఇంజినీరింగ్ ఈసీఈ కోర్సు పూర్తిచేసి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్‌వేర్ సంస్థలో ఇంజినీరింగ్ వృత్తిలో స్థిరపడ్డాను. తమ్ముడు ఐటీఐ పూర్తిచేసి ఉద్యోగం తెచ్చుకున్నాడు. చెల్లి కూడా అమ్మఒడి సాయంతో చదువుకుంది. ఫీజురీయింబర్స్‌మెంట్‌తో గత ప్రభుత్వం సాయం చేయకపోతే చదువు పాఠశాల విద్యతోనే నిలిచిపోయేది.


