ఏఐ ల్యాబ్‌తో గొప్ప లక్ష్యం
ఎంతో గొప్ప లక్ష్యంతో 2024 మార్చి2న గత ప్రభుత్వం ఏఐ ల్యాబ్‌ను చీపురుపల్లి బాలుర ఉన్నతపాఠశాలలో ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఇదొక వరం. ల్యాబ్ ఏర్పాటైనప్పటి నుంచి దాదాపు 50 ప్రాజెక్టులు వరకు విద్యార్థులు తయారుచేశారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆర్టిఫీషియల్ ఇంప్లాక్ట్ ఫెస్టివల్‌లో తమ పాఠశాల విద్యార్థులు చేసిన ప్రాజెక్టులను కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ కార్యదర్శి ఎస్.కృష్ణన్, ఇంటెల్ సంస్థ అంతర్జాతీయ వ్యవరాల ప్రతినిధి సారా కెంప్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులు సాంకేతిక రంగంలో ఎదిగేందుకు ఇదొక గొప్ప అరుదైన అవకాశం. పాఠశాల హెచ్‌ఎం ఉమామహేశ్వరి ప్రోత్సాహంతో విద్యార్థులకు ఏఐ పాఠాలు బోధిస్తున్నాం. – ఏవీఆర్‌డి.ప్రసాద్,
ఏఐ ల్యాబ్ ఫెసిలిటేటర్, చీపురుపల్లి


