సీడీపీవోకు ఏసీడీపీవోగా బదిలీ | - | Sakshi
Sakshi News home page

సీడీపీవోకు ఏసీడీపీవోగా బదిలీ

Dec 21 2025 6:58 AM | Updated on Dec 21 2025 6:58 AM

సీడీప

సీడీపీవోకు ఏసీడీపీవోగా బదిలీ

స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్రలో మంత్రి ఎదుట అపరిష్కృత సమస్య

ఆకస్మిక బదిలీపై అనుమానాలు

విజయనగరం ఫోర్ట్‌: విజయనగరం అర్బన్‌ సీడీపీవో జి.ప్రసన్న కు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏసీడీపీవోగా డిప్యూటేషన్‌పై బదిలీ అయింది. ఈ మేరకు రాష్ట్ర సీ్త్ర, శిశు సంక్షేమ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అర్బన్‌ ప్రాజెక్టులో ఏసీడీపీవోకు ఇన్‌చార్జ్‌ సీడీపీవోగా బాధ్యతలు అప్పగించారు. అయితే సీడీపీవోల బదిలీ పక్రియ కొన్ని నెలలు క్రితమే ముగిసింది. ఎటువంటి బదిలీలు లేని సమయంలో సీడీపీవోను అది కూడా ఏసీడీపీవోగా డిప్యూటేషన్‌పై బదిలీ చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సీనియర్‌ సీడీపీవో, ఇన్‌చార్జ్‌ పీడీగా కూడా పని చేసిన ఆమెను ఏసీడీపీవోగా బదిలీ చేయడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. గత కొంత కాలంగా ఐసీడీఎస్‌లో అంతర్గత విబేధాలు తలెత్తినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌(పి.డి)కి సీడీపీవోకు మధ్య అంతర్గత విబేధాలు నడుస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ తరుణంలో సీడీపీవో బదిలీ జరగడం సర్వత్రా చర్చినీయాంశమైంది. ఇదే విషయాన్ని ఐసీడీఎస్‌ పి.డి విమలారాణి వద్ద సాక్షి ప్రస్తావించగా అల్లూరి సీతారామరాజు జిల్లాకు అడ్మినిస్ట్రేటివ్‌ గ్రౌండ్స్‌లో డిప్యూటేషన్‌పై ఏసీడీపీవోగా ప్రసన్నను బదిలీ చేశారని తెలిపారు.

ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ

శ్రీకాకుళం రూరల్‌: హెచ్‌పీసీఎల్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌, బొల్లినేని మెడిస్కిల్‌ సంయుక్తంగా బ్యుటీషియన్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, జనరల్‌ డ్యూటీ అసిస్టెంట్‌ (నర్సింగ్‌), ప్రొడక్షన్‌ మిషన్‌ ఆపరేటివ్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు బొల్లినేని మెడిస్కిల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ నాగేశ్వరరావు శనివారం తెలిపారు. విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్‌ మేడపై ఉన్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రంలో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఇంటర్‌, డిగ్రీ, డిప్లమో, ఐటీఐ, పదో తరగతి పూర్తి చేసిన 18 నుంచి 28 ఏళ్ల వారు అర్హులని తెలిపారు. శిక్షణలో ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తామన్నారు. పూర్తి వివరాలకు 7680945357, 7995013422 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

విజయనగరం అర్బన్‌: పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు కొన్నేళ్లుగా పరిష్కారం కాని అపరిశుధ్య సమస్య ఎదురయింది. ఐటీఐలోని తరగతుల నిర్వాహణ భవనానికి ఆనుకొని ఉన్న గిరిజన సంక్షేమ వసతిగృహం నుంచి మరుగుదొడ్ల మురుగునీరు రావడాన్ని మంత్రి కొండపల్లికి అక్కడి ఐటీఐ విద్యార్థులు చెప్పుకున్నారు. కొన్నేళ్లుగా ఈ సమస్య కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి దృష్టిలో ఉంది. మరుగుదొడ్ల మురుగునీటి ప్రవాహం ఐటీఐ ప్రాంగణంలోకి రాకుండా కాలువను నిర్మించుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి శ్రీనివాసరావుకు కొన్ని నెలల క్రితం ఆదేశాలిచ్చానని ఈ సందర్భంగా కలెక్టర్‌ రాంసుందర్‌రెడ్డి అన్నారు. సంబంధిత గిరిజన సంక్షేమ అధికారి పట్టించుకోకపోవడంపై మంత్రి ఎదుటే కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుదొడ్ల ప్రవాహ మరుగునీటి సమస్యను శాఖపరమైన ఉన్నదాధికారులకు తెలియజేసి ప్రత్యామ్నాయ మార్గం పనుల చేపట్టాలని మంత్రి ఆదేశాలిచ్చారు. అనంతరం ఐటీఐ ప్రాంగణంలో మొక్కలు నాటి, పరిసరాలను పరిశభ్రం చేశారు. కార్యక్రమంలో ఐటీఐ ప్రిన్సిపాల్‌ టీవీగిరి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్‌, గిరిజన సంక్షేమాధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి

బలిజిపేట: మండలంలోని బర్లి గ్రామం సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన శశాంక్‌(20) మృతి చెందినట్టు ఎస్‌ఐ సింహాచలం తెలిపారు. వారి వివరాల ప్రకారం బర్లి గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి లారీ, మోటార్‌ సైకిల్‌ ఢీ కొనడంతో ముగ్గురు గాయాలవగా వీరిని బొబ్బిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో శశాంక్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ నుంచి రాజాంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి తిరిగి అక్కడ నుంచి మెరుగైన వైద్య నిమిత్తం శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలిపారు.

సీడీపీవోకు ఏసీడీపీవోగా బదిలీ 1
1/1

సీడీపీవోకు ఏసీడీపీవోగా బదిలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement