అనంత్‌-రాధిక ప్రీవెడ్డింగ్‌ ప్లాన్‌.. ఈసారి ఏకంగా సముద్రంలో సెలబ్రేషన్స్‌! | Sakshi
Sakshi News home page

అనంత్‌-రాధిక ప్రీవెడ్డింగ్‌ ప్లాన్‌.. ఈసారి ఏకంగా సముద్రంలో సెలబ్రేషన్స్‌!

Published Mon, May 27 2024 2:49 PM

Anant Ambani-Radhika Merchant's Pre-Wedding Cruise Party Invite LEAKED

ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ జూలై 12న రాధికా మర్చంట్‌ను పెళ్లి చేసుకోనున్నారు. ఇప్పటికే ఓ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ పూర్తి చేసుకున్న ఈ జంట.. మరో ప్రీ వెడ్డింగ్ కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. ఇది మే 29న ప్రారంభమై జూన్ 1న ముగియనుంది.

మొదటి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జామ్‌నగర్‌లో జరిగాయి. రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు క్రూయిజ్ షిప్‌లో జరగనున్నాయి. ఈ వేడుకకు అలియా భట్, రణబీర్ కపూర్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, అయాన్ ముఖర్జీ మొదలైన బాలీవుడ్ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు హాజరుకానున్నారు. ఈ వేడుకలకు సెలబ్రెటీలు ఇప్పటికే ముంబై నుంచి బయలుదేరారు.

మే 29న ప్రారంభమై జూన్ 1న ముగియనున్న ఈ వేడుకలు ఎలా సాగనున్నాయి, డ్రెస్ ఎలా ఉంటుందనే వివరాలతో పాటు సెకండ్ ప్రీ వెడ్డింగ్ ఇన్విటేషన్ షెడ్యూల్ కూడా లీక్ అయ్యింది. ఈ ప్రయాణం ఇటలీ నుంచి దక్షిణ ఫ్రాన్స్‌కు సుమారు 4,380 కిలోమీటర్లు సాగుతుందని సమాచారం. ఈ వేడుకలకు దాదాపు 800 మంది అతిథులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

మే 29, బుధవారం: వెల్‌కమ్‌ లంచ్‌తో వేడుక ప్రారంభం కానుంది. డ్రెస్ కోడ్ క్లాసిక్ క్రూయిజ్. ఆ తరువాత 'స్టార్రీ నైట్' థీమ్ ఈవెంట్ జరుగుతుంది. దీనికి డ్రెస్ కోడ్ వెస్ట్రన్ ఫార్మల్స్.

మే 30, గురువారం: అతిథులందరూ రోమ్‌లో దిగుతారు. అప్పుడు టూరిస్ట్ చిక్ డ్రెస్ ధరించాల్సి ఉంటుంది. సాయంత్రం 'టోగా పార్టీ'తో రెండో రోజు ముగుస్తుంది.

మే 31, శుక్రవారం: మూడో రోజు థీమ్ 'వీ టర్న్స్ వన్ అండర్ ది సన్', 'లే మాస్క్వెరేడ్' అండ్ 'పార్డన్ మై ఫ్రెంచ్'. ఇది క్రూయిజ్‌లో ఆఫ్టర్‌పార్టీతో ముగుస్తుంది.

జూన్ 1, శనివారం: వేడుక చివరి రోజు థీమ్ 'లా డోల్స్ వీటా'. అతిథులు ఇటాలియన్ సమ్మర్ డ్రెస్ కోడ్‌ను అనుసరించాల్సి ఉంటుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement