ప్రత్యేక పిల్లల్లో.. మానసిక వికాసం | Sakshi
Sakshi News home page

ప్రత్యేక పిల్లల్లో.. మానసిక వికాసం

Published Mon, May 27 2024 4:25 PM

ప్రత్

● భవిత కేంద్రంతో బంగారు భవిష్యత్‌ ● ప్రత్యేక అవసరాల పిల్లలకు ఆటపాటలతో విద్య ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 34 కేంద్రాలు ● తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్న ఉపాధ్యాయులు ● ఇంటింటి ప్రచారంతో సత్ఫలితాలు

రామభద్రపురం:

అందరి పిల్లల్లా మా బిడ్డలు చక్కగా ఎదగాలి. చదువుకోవాలి, ఆడుకోవాలని ఏ తల్లిదండ్రులైనా ఆశపడతారు.అదే మానసిక ఎదుగుదల లేని చిన్నారుల తల్లిదండ్రులైతే తమ బిడ్డల భవిష్యత్‌ కోసం ఆలోచన చేస్తూ వారి ఎదుగుదలపై నిత్యం ఆందో ళన చెందుతూ ఉంటారు. అయితే అలాంటి చిన్నారుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండల కేంద్రంలో భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ భవిత కేంద్రం ద్వారా ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారుల అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆటపాటలతో కూడిన విద్యాబోధన, స్పీచ్‌ థెరపీ, ఫిజియోథెరపీ సేవలందిస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 34 భవిత కేంద్రాల ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో ప్ర త్యేక అవసరాలు కలిగిన చిన్నారులు ఆటపాటలతో కూడిన విద్యతో పాటు ఫిజియోథెరపీ సేవలు పొందుతున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా ప్రత్యేక ఉపాధ్యాయులు, ఐఈఆర్టీలు ఇంటింటికీ వెళ్లి ఇప్పటివరకు చదువుకు దూరంగా ఉన్న వారితో పాటు మధ్యలో చదువు మానేసిన ప్రత్యేక అవసరాల పిల్లల గుర్తింపు సర్వే చేస్తున్నారు. దివ్యాంగ చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. దివ్యాంగ చిన్నారుల చదువుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, భవిత కేంద్రాలలో కల్పిస్తున్న మౌలిక వసతులు, ఆటపాటలతో కూడిన విద్యాబోధన ఉంటుందని వివరిస్తున్నారు. దాంతో పిల్లలను చేర్చడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపుతుండడంతో ఏటా భవిత కేంద్రాల్లో చిన్నారుల చేరికలు పెరుగుతున్నాయి.

భవిత కేంద్రంతో ప్రయోజనాలు

మానసిక వైకల్యం, చెవుడు, మూగ, పోలియో తది తర లోపాలతో జన్మించి భవిత కేంద్రంలో చేరిన పిల్లలకు అర్థమయ్యే రీతిలో ఆట పాటలతో కూడిన విద్యను అందజేసి వారిలో మనోధైర్యాన్ని నింపు తూ భవిష్యత్‌పై ఆశలు నింపుతున్నారు. వినూత్న కార్యక్రమాలతో సాధారణ పిల్లల్లాగానే వారు చదువుకునేలా, ఆడుకునేలా మార్పు తీసుకురాగులుగుతున్నారు. ఇందుకుగాను ప్రతి కేంద్రంలో ఇద్దరు సీఆర్టీలను ప్రభుత్వం నియమించి వారి ద్వారా పాఠశాల సంస్థిత, స్పీచ్‌, విజన్‌ థెరపీ, ఎర్లీ ఇంట ర్వెన్షన్‌ వంటి కార్యక్రమాలతో చిన్నారులకు సేవలందిస్తూ దివ్యాంగుల ఎదుగుదలను మెరుగుపరుస్తున్నారు.

ప్రత్యేక డిజిటల్‌ బోధనకు సిద్ధం

దివ్యాంగ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక డిజిటల్‌ విద్యాబోధన ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.పాఠశాలల్లోని సాధారణ విద్యార్థులతో సమానంగా ప్రత్యేక అవసరాల పిల్ల లను సాంకేతికంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక యాప్‌ లతో కూడిన ట్యాబ్‌లను పంపిణీ చేయనున్నారు. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వాటిని పంపిణీ చేయనున్నట్లు అధికారిక సమాచారం. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు బోధనకు అనువుగా ట్యాబ్‌లో సాఫ్ట్‌వేర్‌ లేకపోవడంతో ఈ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన ప్రభుత్వం వాటి స్థానంలో వినికిడి, దృష్టి లోపం ఉన్న విద్యార్ధులందరికీ ఉపయోగపడేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ పొందుపరిచిన ట్యాబ్‌లను పంపిణీ చేయనుంది.

ప్రత్యేక విద్యను అందిస్తున్నాం

గ్రామాల్లో ప్రత్యేక అవసరా లు కలిగిన చిన్నారులను గుర్తించి వారికి భవిత కేంద్రం ద్వారా ప్రత్యే విద్యను అందిస్తున్నాం.చిన్నారులకు ఆట పాటల ద్వారా విద్య ను అర్థమయ్యే రీతిలో అందిస్తున్నాం. చిన్నారుల్లో రోజురోజుకు పురో గతి ఉండడంతో తల్లిదండ్రులు సంతోషంతో తమ పిల్లలను కేంద్రాల్లో చేర్పిస్తున్నారు. –ఎస్‌.సూర్యారావు,

జిల్లా సహిత విద్య కో ఆర్డినేటర్‌

ఫిజియోథెరపీతో శారీరక సేవలు

ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు పాఠశాల విద్యతో పాటు వారంలో ఒక రోజు వారి శా రీరక అవసరాలను బట్టి ఫిజియోథెరపీ సేవలను అంది స్తున్నారు. దీని ద్వారా దివ్యాంగ పిల్లల్లో శారీరక మార్పు జరిగి సాధారణ పిల్లల్లా తయారవుతున్నా రు. అలాగే అవసరాన్ని బట్టి చెవుడు, మూగ, పోలి యో వంటి ఆయా శారీరక రుగ్మతలకు ప్రత్యేక శస్త్ర చికిత్సలు చేయిస్తున్నారు. దీంతో పాటు దివ్యాంగ పిల్లలను భవిత కేంద్రాలకు తీసుకొచ్చే తల్లిదండ్రులకు ఎస్కార్ట్‌, ట్రాన్స్‌పోర్ట్‌ అలవెన్స్‌లు ఇస్తున్నారు. అలాగే ఆడపిల్లలకు స్టైపెండ్‌ ఇస్తున్నారు. భవిత కేంద్రాలకు రాలేని పిల్లల ఇంటి దగ్గరకు ఐఈఆర్టీలు వెళ్లి వారికి విద్యను అందిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి..

దివ్యాంగ చిన్నారుల భవిష్యత్‌కు చక్కని మార్గం భవిత కేంద్రం. ఇంటింటికీ వెళ్లి దివ్యాంగ చిన్నారులను గుర్తించి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ ఈ కేంద్రాల్లో చేర్పిస్తున్నాం. చిన్నారుల్లో శారీరక ఎదుగుదల మెరుగుపడి వారి పనులు చేసుకోగలిగే స్థాయికి వస్తున్నారు. ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి.

–ఎన్‌ ప్రేమ్‌కుమార్‌, డీఈవో విజయనగరం

ప్రత్యేక పిల్లల్లో.. మానసిక వికాసం
1/4

ప్రత్యేక పిల్లల్లో.. మానసిక వికాసం

ప్రత్యేక పిల్లల్లో.. మానసిక వికాసం
2/4

ప్రత్యేక పిల్లల్లో.. మానసిక వికాసం

ప్రత్యేక పిల్లల్లో.. మానసిక వికాసం
3/4

ప్రత్యేక పిల్లల్లో.. మానసిక వికాసం

ప్రత్యేక పిల్లల్లో.. మానసిక వికాసం
4/4

ప్రత్యేక పిల్లల్లో.. మానసిక వికాసం

Advertisement
 
Advertisement
 
Advertisement