Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తాకు నివేదిక సమర్పిస్తున్న సిట్‌ చీఫ్‌ వినీత్‌ బ్రిజ్‌ లాల్‌. చిత్రంలో ఎస్పీ రమాదేవి
బదిలీలతో బరితెగింపు

సాక్షి, అమరావతి: ఎన్నికల వేళ పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో విధ్వంస కాండను అరికట్టడం, అనంతరం కేసుల దర్యాప్తులో పోలీసు అధికారులు విఫలమయ్యారని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) నిర్ధారించింది. నిందితులపై కీలక సెక్షన్ల కింద కేసులు నమోదు చేయకపోవడాన్ని ప్రస్తావించింది. మూడు జిల్లాల్లో హింసాత్మక సంఘటనలపై విచారించిన సిట్‌ బృందం ఇన్‌చార్జ్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ ప్రాథమిక నివేదికను సోమవారం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ హరీశ్‌­కుమార్‌ గుప్తాకు అందచేశారు. రెండు రోజుల పాటు విస్తృతంగా విచారణ నిర్వహించిన సిట్‌ అధి­కా­రుల బృందం పోలీసుల వైఫల్యాలపై నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. పూర్తి నివేదిక అందించేందుకు మరికొంత సమయం పడుతుందని పేర్కొంది. బదిలీ చేసిన జిల్లాల్లోనే హింసపోలింగ్‌కు ముందు చంద్రబాబు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నికల కమిషన్‌ (ఈసీ)పై ఒత్తిడి తెచ్చి పల్నాడు నుంచి అనంతపురం వరకు ఏకంగా 39 మంది పోలీసు అధికారులను బదిలీ చేయించిన విషయం తెలిసిందే. వారి స్థానాల్లో పురందేశ్వరి సమర్పించిన జాబితాలోని అధికారులనే ఈసీ నియమించడం గమనార్హం. ఈ క్రమంలో పోలింగ్‌ రోజు మే 13న, అనంతరం టీడీపీ గూండాలు యథేచ్చగా విధ్వంసానికి పాల్పడ్డారు. ఈసీ నియమించిన పోలీసు అధికారులు శాంతి భద్రతల పరిరక్షణలో దారుణంగా విఫలమయ్యారు. అనంతరం కేసుల నమోదు, దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించారు.అదనపు సెక్షన్లు చేర్చండి..విధ్వంస కాండపై పోలీసుల దర్యాప్తు తూతూ మంత్రంగా ఉందని సిట్‌ స్పష్టం చేసింది. నిందితులను పట్టుకునేందుకు అదనపు బృందాలను ఏర్పాటు చేయడంతోపాటు అదనంగా మరికొన్ని సెక్షన్లు జోడించాలని సూచించింది. అందుకోసం న్యాయస్థానాల్లో మెమో దాఖలు చేయాలని పేర్కొంది. నిందితులను త్వరగా అరెస్టు చేయడంతోపాటు ముందస్తు తేదీతో చార్జ్‌షీట్లను దాఖలు చేయాలని పేర్కొంది. పోలింగ్‌ సందర్భంగా దాడుల కేసుల దర్యాప్తును తాము పర్యవేక్షిస్తామని సిట్‌ స్పష్టం చేసింది.నాలుగు బృందాలు..పోలింగ్‌ సందర్భంగా హింసాత్మక సంఘటనలపై సిట్‌ విస్తృతంగా దర్యాప్తు చేసింది. వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో ఏర్పాటైన సిట్‌ నాలుగు బృందాలుగా ఏర్పడి శని, ఆదివారాల్లో విచారణ నిర్వహించింది. పల్నాడు జిల్లాలో రెండు బృందాలు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఒక్కో బృందం పర్యటించి హింసాత్మక సంఘటనలు జరిగిన ప్రదేశాలను పరిశీలించాయి. బాధితులతో మాట్లాడి వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించాయి. పోలీసు అధికారులను విచారించడంతోపాటు మొత్తం పరిస్థితిని సమీక్షించాయి.కుమ్మక్కుతో విధ్వంసకాండకాల్‌ డేటా విశ్లేషించి కఠిన చర్యలు తీసుకోవాలిసిట్‌ను కోరిన వైఎస్సార్‌సీపీ నేతలుకొందరు పోలీసు అధికారులు టీడీపీతో కుమ్మక్కై విధ్వంస కాండకు కొమ్ము కాశారని వైఎస్సార్‌సీపీ పేర్కొంది. పోలింగ్‌ రోజు, అనంతరం టీడీపీ రౌడీమూకల విధ్వంసకాండపై పారదర్శకంగా విచారణ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేసింది. దాడులు జరిగిన ప్రాంతాల్లో ఎస్సైలు, సీఐల కాల్‌ డేటా సేకరించి విచారణ నిర్వహించాలని కోరింది. ఈ కేసులపై విచారణ నిర్వహిస్తున్న సిట్‌ ఇన్‌చార్జ్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ను మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ ప్రతినిధి బృందం సోమవారం కలిసింది. టీడీపీ నేతలు, ఆ పార్టీ గూండాలు పక్కా పన్నాగంతో ఎలా దాడులకు పాల్పడ్డారో వివరిస్తూ ఆధారాలను అందచేసింది. మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్‌తోపాటు వైఎసార్‌సీపీ నేతలు పేర్ని నాని, రావెల కిషోర్‌ బాబు, మల్లాది విష్ణు, కైలే అనిల్‌కుమార్, లేళ్ల అప్పిరెడ్డి, మనోహర్‌ రెడ్డి తదితరులు ఈ బృందంలో ఉన్నారు. అనంతరం డీజీపీ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు.బదిలీలు చిన్న విషయం కాదు: అంబటి రాంబాబు, జలవనరుల శాఖ మంత్రిచంద్రబాబు, పురందేశ్వరి ఈసీపై ఒత్తిడి తెచ్చి ఎన్నికల ముందు పోలీసు అధికారులను మార్చి అల్లరి మూకలను దాడులకు పురిగొల్పారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న పోలీసు అధికారులను బదిలీ చేయించడంతో టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. అధికారులను బదిలీ చేసిన ప్రాంతాల్లోనే దాడులు, విధ్వంసం చోటుచేసుకున్నాయి. అప్పటికప్పుడు ఐపీఎస్‌ అధికారులను మార్చడం చిన్న విషయం కాదు. టీడీపీ పన్నాగంలో పోలీసు అధికారులు పావులుగా మారడం దురదృష్టకరం.అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై పోలీసులు దాడి చేసి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. చాలా గ్రామాల్లో ఇప్పటికీ పరిస్థితులు కుదుట పడలేదు. మా పార్టీ నేతలపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసులు పెట్టడం లేదు. టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడమే తడవు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు.ప్రజాబలంతో ఎదుర్కొలేక గూండాగిరి: మంత్రి జోగి రమేష్‌ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ చంద్రబాబు కుట్రలకు బరి తెగించారు. ప్రజల మద్దతులేని టీడీపీ కూటమి ఎన్నికలను ఎదుర్కోలేక దౌర్జన్యాలకు తెర తీసింది. అరాచకాలు, దౌర్జన్యాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. టీడీపీ నిర్వాకంతో ఈ ఎన్నికలు రాష్ట్ర చరిత్రలో ఒక మచ్చగా మిగిలిపోయాయి.హక్కులు కాలరాశారు: రావెల కిషోర్‌ బాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఓటింగ్‌లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు టీడీపీ విధ్వంసకాండకు పాల్పడింది. వారిని గ్రామాల నుంచి తరిమేశారు. అంబేడ్కర్‌ అందించిన రాజ్యాంగ హక్కులను కాలరాసిన టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలి. 33 కేసులు.. 1,370 మంది నిందితులుపల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పోలింగ్‌ సందర్భంగా దాడులు, దౌర్జన్యకాండపై ఇప్పటివరకు 33 కేసులు నమోదు చేశారు. పల్నాడు జిల్లాలో 22,అనంతపురం జిల్లాలో 7, తిరుపతి జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి. మొత్తం 1,370 మందిని నిందితులుగా పేర్కొనగా ఇప్పటివరకు 124 మందిని అరెస్ట్‌ చేశారు. మరో 94 మందికి సెక్షన్‌ 41 ఏ కింద నోటీసులు జారీ చేశారు.

కేబినెట్‌ నిర్ణయాలను మీడియాకు వెల్లడిస్తున్న మంత్రి పొంగులేటి.  చిత్రంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
జూన్‌ 2న సోనియాతో సభ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఏర్పాటై పదేళ్లు పూర్తవుతుండటం, రాష్ట్రంలో తొలిసారిగా కాంగ్రెస్‌ ప్రభు­త్వం కొలువుదీరిన నేపథ్యంలో.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. జూన్‌ 2న భారీ బహిరంగ సభ నిర్వహించి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాందీతోపాటు తెలంగాణ ఉద్య­మంలో పాలుపంచుకున్న పెద్దలందరినీ పిలిచి సన్మానం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుమ­తి కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయనుంది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన తీర్మానాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌­ను కూడా ఆ సభకు పిలుస్తామని.. ఈ విషయంలో భేషజా­లు లేవని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. ‘బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గత ఏడాదే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించిందని, ఇప్పుడు మళ్లీ నిర్వహిస్తారా?’ అని మీడియా ప్రశ్నించగా.. ‘‘తెలంగాణ వచ్చి 10 ఏళ్లు అయింది అప్పుడా? ఇప్పుడు అవుతోందా అన్న విషయం అందరికీ తెలుసు..’’ అని మంత్రి పొంగులేటి బదులిచ్చారు. తడిసిన ధాన్యమంతా కొనుగోలు.. ఇటీవలి అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని పూర్తి­స్థా­యిలో మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయా­లని మంత్రివర్గం నిర్ణయించిందని మంత్రి పొంగులేటి చెప్పారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, మద్దతు ధరకు ఒక్క రూపాయి తగ్గించకుండా తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. విపక్షాల మాయమాటలను నమ్మవద్దని పేర్కొన్నారు. యాసంగిలో పండించిన 36లక్షల టన్నుల ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖ సేకరించిందని.. దేశంలో, రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా రైతులకు 3 రోజుల్లోపే చెల్లింపులు చేసిందని చెప్పారు. కాగా.. ఒక్క గింజ తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేశామని, ఎక్కడైనా తరుగు తీస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. వర్షాలతో దెబ్బతిన్న పంటల వివరాలను వ్యవసాయ శాఖ సమరి్పంచిందని.. బాధిత రైతులకు పరిహారం చెల్లించాలని నిర్ణయించామని వివరించారు. రైతు భరోసా పథకం ఎప్పుడు ప్రారంభిస్తారని మీడియా ప్రశ్నించగా.. విధివిధానాలను తయారు చేయాల్సి ఉందని చెప్పారు. ఆధునిక పాఠశాలలుగా తీర్చిదిద్దుతాం.. జూన్‌ 12 నుంచి బడులు పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో.. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ చేపట్టాలని కేబినెట్‌ నిర్ణయించినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. కమిటీల ఆధ్వర్యంలో నెల రోజుల్లోగా వాటిని ఆధునిక పాఠశాలలుగా తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకోసం రూ.600 కోట్లను కేటాయించామని.. అడ్వాన్స్‌గా రూ.120 కోట్లను విడుదల చేశామని తెలిపారు. అమ్మ ఆదర్శ కమిటీల్లో ప్రధానోపాధ్యాయులు, స్వశక్తి సంఘాల మహిళలు ఉంటారన్నారు. ఈ అంశంపై మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. మూసివేసిన పాఠశాలలు తెరుస్తాం హేతుబదీ్ధకరణ పేరుతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మూసివేసిన 5,600 ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి.. విద్యార్థులు వచ్చేవాటిని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్టు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. పాఠశాల, సాంకేతిక, ఉన్నత విద్యతోపాటు ఉపాధి కలి్పంచే నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేయాలని.. మంచి మార్పు చూపించాలని కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించామన్నారు. నాణ్యమైన విద్యతోపాటు మౌలిక సదుపాయాలు, బోధన, బోధనేతర అంశాలపై దృష్టి పెడతామని చెప్పారు. మరుగుదొడ్లు, పెయింటింగ్, ఇతర అన్ని హంగులతో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతామన్నారు. విద్యార్థులకు యూనిఫారాలను కుట్టే బాధ్యతను మహిళా సంఘాలకు ఇచ్చామని.. ప్రతి విద్యార్థికి రెండు జతలు సరఫరా చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని కమిటీ ఫీజుల నియంత్రణ అంశాన్ని పరిశీలిస్తుందని పొంగులేటి తెలిపారు. టెస్టుల తర్వాతే బ్యారేజీలకు మరమ్మతులు కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల విషయంలో నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) నిపుణుల కమిటీ మూడు కీలక సిఫార్సులు చేసిందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు తెలిపారు. ‘‘బ్యారేజీల గేట్లన్నీ ఎత్తి ఉంచాలని నిపుణుల కమిటీ చెప్పింది. డబ్బులు ఖర్చు చేసి మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేసినా అది ఉంటుందో లేదో నమ్మకం ఇవ్వలేమని పేర్కొంది. బ్యారేజీలకు జియోఫిజికల్, జియోటెక్నికల్‌ పరీక్షలు నిర్వహించాలని సిఫారసు చేసింది. బ్యారేజీలకు పరీక్షలు పూర్తయ్యే వరకు తదుపరిగా ఏ రకమైన పనుల చేపట్టవద్దని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. మూడు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పరీక్షలు నిర్వహించాలని.. ప్రతి బ్యారేజీకి రెండు సంస్థలతో పరీక్షలు నిర్వహించి, రెండింటి అభిప్రాయాల ఆధారంగా మరమ్మతులు చేయాలని నిర్ణయించాం..’’ అని వెల్లడించారు. ఈ పరీక్షలు త్వరగా నిర్వహించేలా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఎన్డీఎస్‌ఏతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. బ్యారేజీల్లో రాళ్ల కట్టతో పంపింగ్‌కు ప్రయతి్నస్తాం.. కాళేశ్వరం బ్యారేజీల పరిధిలో తక్కువ ఖర్చుతో రాళ్ల కట్టను నిర్మించి.. నీళ్లను పంపింగ్‌ చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించిందని మంత్రి పొంగులేటి చెప్పారు. ప్రాజెక్టుపై గత ప్రభుత్వం చేసిన ఖర్చు వృథా కాకుండా.. నిపుణుల సూచనలతో తాత్కాలిక ఏర్పాట్లు చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. గత ప్రభుత్వ తప్పును సాకుగా చూపి రైతులను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం తమకు లేదన్నారు. ధర్నాల పేరుతో డ్రామాలు.. ధాన్యం కొనుగోళ్ల పరిశీలన కోసం కలెక్టర్లను క్షేత్రస్థాయికి వెళ్లాలని ఆదేశించినట్టు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ధర్నాల పేరుతో డ్రామాలు చేశారని, వారు రైతులకు ఏం చేశారో అందరికీ తెలుసని బీఆర్‌ఎస్‌ నేతలపై మండిపడ్డారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేయబోతున్నామని చెప్పారు. సన్న ధాన్యం పండిస్తే రూ.500 బోనస్‌ వచ్చే వానాకాలంలో సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆ సన్నవడ్ల రకాలను వ్యవసాయ శాఖ ప్రకటించనుంది. బడుల్లో మధ్యాహ్న భోజనానికి, హాస్టళ్లకు విద్యార్ధి, రెండు రూపాయలకే కిలో బియ్యం వంటి పథకాలకు ఏటా 36 లక్షల టన్నుల బియ్యం అవసరం కాగా.. వాటన్నింటికీ సన్న బియ్యం ఇస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చామని మంత్రి పొంగులేటి చెప్పారు. బయటి రాష్ట్రాల నుంచి సన్నబియ్యం కొనుగోలు చేయవద్దని నిర్ణయం తీసుకున్నామని, అందుకే రాష్ట్రంలో సన్నబియ్యం పండించిన రైతులకు బోనస్‌ చెల్లిస్తామని వివరించారు. విత్తనాలు, ఎరువులు, ఇతర అవసరాలకు ఇబ్బంది రావద్దని.. నకిలీ విత్తనాల తయారీదారులు, విక్రయదారులు, నకిలీ రశీదులు జారీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారని చెప్పారు. రైతులు లూజు విత్తనాలు కొనవద్దని, కంపెనీల వద్దే కొనాలని, సాగు ముగిసేవరకు రసీదులు దాచిపెట్టుకోవాలని సూచించారు.

Rasi Phalalu 21-05-2024 Telugu
Rasi Phalalu: ఈ రాశి వారు ఆప్తుల నుండి శుభవార్తలు వింటారు

శ్రీ∙క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి: శు.త్రయోదశి సా.4.43 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: స్వాతి పూర్తి (24 గంటలు), వర్జ్యం: ఉ.11.21 నుండి 1.06 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.03 నుండి 8.51 వరకు, తదుపరి రా.10.51 నుండి 11.39 వరకు, అమృతఘడియలు: రా.9.40 నుండి 11.23 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 5.30, సూర్యాస్తమయం: 6.22. మేషం: ఆర్థికాభివృద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆప్తుల నుండి శుభవార్తలు వింటారు. వాహనసౌఖ్యం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.వృషభం: పలుకుబడి పెరుగుతుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. భూసంబంధ వివాదాలు తీరతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.మిథునం: ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. భూవివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు మధ్యలో ఆపివేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.కర్కాటకం: వ్యవహారాలు నిదానిస్తాయి. శ్రమాధిక్యం. ప్రయాణాలు వాయిదా పడతాయి. సోదరులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.సింహం: నూతన ఉద్యోగాలు లబిస్తాయి. ఇంటాబయటా అనుకూలం. కొత్త కార్యక్రమాలు చేపడతారు. పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.కన్య: కుటుంబంలో ఒత్తిడులు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సామాన్యంగా ఉంటాయి.తుల: పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి పిలుపు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత కలసివస్తాయి.వృశ్చికం: పరిస్థితులు అంతగా కలసిరాదు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.ధనుస్సు: పరిచయాలు పెరుగుతాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. మిత్రుల నుండి ఆహ్వానాలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.మకరం: రుణాలు తీరి ఊరట చెందుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.కుంభం: వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో కలహాలు. ఆకస్మిక ప్రయాణాలు. సన్నిహితుల నుండి ఒత్తిడులు. వ్యాపారాలు కొద్దిగా లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు.మీనం: కుటుంబంలో ఇబ్బందులు. సమస్యలు చికాకు పరుస్తాయి. దూరప్రయాణాలు. పనులు మధ్యలో నిలిపివేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ముందుకు సాగవు.

Chandrababu is going to America for medical tests
ఇట్లు.. ఇటలీకి!

సాక్షి, అమరావతి: అడుగు తీసి అడుగేస్తే మీడియాలో ప్రచారం కోరుకునే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గప్‌చుప్‌గా విదేశాలకు ఉడాయించారు. తన సతీమణి భువనేశ్వరితో కలిసి హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి దుబాయ్‌ వెళ్లిన చంద్ర­బాబు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారనే విషయంపై గోప్యంగా వ్యవహరిస్తున్నారు. వైద్య పరీక్షల కోసం ఆయన అమెరికా వెళ్లినట్లు టీడీపీ తొలుత మీడియాకు లీకులిచ్చింది.అయితే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ ఎన్నారై విభాగం నేత కోమటి జయరాం మాత్రం ఆయన అసలు అమెరికా రాలేదని ప్రకటించడం గమనార్హం. విదేశాల నుంచి అక్రమ నిధులను భారత్‌లోని షెల్‌ కంపెనీలకు మళ్లించిన చరిత్ర ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నారు? ఏం చేస్తున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా విదేశీ పర్యటన వెనుక లోగుట్టు ఏమిటన్నది సస్పెన్స్‌గా మారింది. అయితే తాజా విశ్వసనీయ సమాచారం ప్రకారం చంద్రబాబు ఇటలీలో ల్యాండ్‌ అయినట్లు తెలుస్తోంది.పోలింగ్‌ తర్వాత సైలెంట్‌చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితం అంతా మీడియా ప్రచారంతోనే ముడిపడి ఉందన్నది బహిరంగ రహస్యమే. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆయన మీడియా ద్వారా విపరీతమైన ప్రచారాన్ని కోరుకుంటారు. మూడు ప్రెస్‌మీట్లు, ఆరు మీడియా లీకులుగా ఆయన రాజకీయం కొనసాగింది. వారానికి కనీసం రెండు సార్లు మీడియా సమావేశాలు నిర్వహిస్తుంటారు. అలాంటిది ఈ నెల 13న పోలింగ్‌ ముగిసిన తర్వా­త చంద్రబాబు ఒక్కసారిగా సైలెంట్‌ అయిపోయారు. కనీసం ప్రెస్‌మీట్‌ పెట్టలేదు. పార్టీ నేతలతో సమావేశం నిర్వహించలేదు. తన శైలికి భిన్నంగా ఒక్కసారిగా మౌనముద్ర దాల్చారు.మరోవైపు లోకేశ్‌కు మాట కూడా పెగల్లేదు. చంద్రబాబు కంటే ముందే ఆయన గప్‌చుప్‌గా విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. ఇక పవన్‌ కళ్యాణ్‌ ఎక్కడున్నారో జనసేన వర్గాలే చెప్పలేకపోతున్నాయి. రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అలికిడే లేదు. పోలింగ్‌ ముగిసిన తర్వాత కూటమి నోట మాటే రావడం లేదు. పోలింగ్‌ సరళి తమకు వ్యతిరేకంగా ఉందని చంద్రబాబు కచ్చితమైన అంచనాకు రావడంతో ఒక్కసారిగా మౌనం దాల్చినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిశ్శబ్దంగా విదేశాలకు వెళ్లడం గమనార్హం. ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అడ్డుకోవడంతో..చంద్రబాబు శనివారం అర్థరాత్రి శంషాబాద్‌ విమా­¯­é­శ్రయం నుంచి దుబాయ్‌ వెళ్లారు. ఆయన విదేశీ పర్యటనలపై అధికారికంగా వెల్లడించే టీడీపీ ఈసారి అందుకు భిన్నంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద ఇమ్మి­గ్రే­షన్‌ అధికారులు చంద్రబాబును కాసేపు అడ్డుకో­వడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కింది. టీడీపీ హయాంలో చోటు చేసుకున్న కుంభకోణాల కేసులకు సంబంధించి చంద్రబాబుపై సీఐడీ గతంతో లుక్‌ అవుట్‌ నోటీసు జారీ చేసింది. సీఐడీ ముందస్తు అనుమతి లేకుండా ఆయన దేశం విడిచి వెళ్లకూడదని స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో చంద్రబాబును విమానాశ్రయంలో అడ్డుకున్న ఇమ్మిగ్రే­షన్‌ అధికారులు సీఐడీని సంప్రదించారు. సీఐడీ ఆయనపై నాలుగు కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేసింది. సీఐడీకి సమాచారం ఇవ్వకుండా దేశం విడిచి వెళ్లకూడదని ఆయనకు తాజాగా నోటీసులు జారీ చేయనుంది. ఇదే విషయాన్ని సీఐడీ శంషాబాద్‌ ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు తెలియచేసింది. దీంతో చంద్రబాబు విదేశీ పర్యటనపై అప్పటి­కప్పుడు సమాచారం ఇచ్చిన­ట్లుగా భావించిన ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఆయన్ను వెళ్లనిచ్చారు. సాధారణంగా దుబాయ్‌ చేరుకుని అక్కడి నుంచి మరో విమానంలో అమెరికా లేదా ఐరోపా దేశాలకు వెళుతుంటారు. చంద్రబాబు మాత్రం దుబాయ్‌ నుంచి ఎక్కడికి వెళ్లారో వెల్లడించలేదు. తన పర్యటనను అంత గోప్యంగా ఎందుకు ఉంచారన్నది సందేహాస్పదంగా మారింది.స్కిల్‌ స్కామ్‌లోనూ దుబాయ్‌ బంధంచంద్రబాబు రహస్య పర్యటన నేపథ్యంలో గతంలో షెల్‌ కంపెనీల ద్వారా అక్రమ నిధుల మళ్లింపు వ్యవహారం తెరపైకి వచ్చింది. టీడీపీ హయాంలో యథేచ్ఛగా పాల్పడిన కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన నిధులను ఆయన అక్రమంగా విదేశాలకు తరలించి అక్కడి నుంచి భారత్‌లోని షెల్‌ కంపెనీలకు మళ్లించినట్లు సీఐడీ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. చంద్రబాబు 52 రోజులు రిమాండ్‌ ఖైదీగా రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో ఉన్న స్కిల్‌ స్కామ్‌లో కూడా నిధులను అక్రమంగా దుబాయ్‌కు చేర్చారు.ఆ కుంభకోణంలో పాత్రధారులైన ఆయన మాజీ పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్‌ పార్థసాని, కిలారి రాజేశ్‌ దుబాయ్‌ నుంచే అక్రమ నిధులను సింగపూర్‌ మీదుగా హైదరాబాద్‌లోని షెల్‌ కంపెనీకి తరలించారు. అనంతరం ఆ నిధులు చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. అంటే ఆయన ఆర్థిక కుంభకోణాల్లో దుబాయ్‌ కీలక కేంద్రంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.ఇటలీలో ప్రత్యక్షం..!గుట్టుగా విదేశాలకు వెళ్లిన చంద్రబాబు ఇటలీ చేరుకున్నట్లు సమాచారం. దుబాయ్‌ నుంచి చంద్రబాబు దంపతులు ఇటలీ వెళ్లినట్లు ఇమ్మిగ్రేషన్‌ వర్గాలు అనధికారికంగా వెల్లడించాయి. లోకేశ్‌ దంపతులు కూడా అక్కడికే వెళ్లినట్లు భావిస్తున్నారు. గతంలో చంద్రబాబు కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు వెళ్లినప్పుడు అధికారికంగా వెల్లడించారు. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా గోప్యత పాటించడం గమనార్హం. ఇటలీతోపాటు మరికొన్ని చిన్న చిన్న దేశాలకు వారు వెళ్లే అవకాశం ఉంది. అక్కడ నుంచి సింగపూర్‌కు నిధులు మళ్లించి అనంతరం భారత్‌లోని షెల్‌ కంపెనీలకు చేరవేసే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. చంద్ర­బాబు విదేశీ పర్యటనను పూర్తిగా గోప్యంగా ఉంచడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.

Lok Sabha Election 2024: PM Narendra Modi confident of BJP big win in South
Lok Sabha Election 2024: దక్షిణాన కాషాయ జెండా

భువనేశ్వర్‌: దక్షిణ భారతదేశంలో ఈసారి కూడా బీజేపీయే అత్యధిక లోక్‌సభ స్థానాలు గెలుచుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వెలిబుచ్చారు. దేశమంతటా ఎన్డీఏకు స్థానాలు పెరుగుతాయని, ముఖ్యంగా దక్షిణ, తూర్పు భారతదేశంలో బీజేపీ బలం మరింతగా పెరగనుందని జోస్యం చెప్పారు. ‘‘దళిత, ఓబీసీ, గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు అత్యధిక సంఖ్యలో ఉన్న పార్టీ బీజేపీయే. కానీ ‘బీజేపీ పట్టణ పార్టీ, కేవలం ఉత్తరాది పార్టీ, బ్రాహ్మణ–బనియా పార్టీ’ అంటూ దుష్ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. దక్షిణాదిన మాకు బలం లేదన్నది కూడా విపక్షాలు వ్యాప్తి చేసిన అలాంటి అపోహే. దేశాన్ని సర్వనాశనం చేసేందుకు ఇలాంటి అపోహలను ప్రచారంలో పెట్టాయి. కానీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏం జరిగింది? దక్షిణ భారతంలో బీజేపీయే అతి పెద్ద పారీ్టగా అవతరించింది. అప్పటితో పోలిస్తే అక్కడి ప్రజల మనసును మరింతగా గెలుచుకున్నాం. ఆ లెక్కన దక్షిణాదిన ఈసారి మరిన్ని ఎక్కువ స్థానాలు గెలుస్తున్నాం. మా భాగస్వాములనూ కలుపుకుంటే అక్కడ ఎన్డీఏ స్థానాల సంఖ్య భారీగా పెరగనుంది’’ అన్నారు. ఆదివారం పీటీఐ ఇంటర్వ్యూలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. దక్షిణాదిన 131 లోక్‌సభ స్థానాల్లో 2019లో బీజేపీకి 29 సీట్లు రావడం తెలిసిందే. తూర్పు భారతదేశంలో దశాబ్దాల అభివృద్ధి లేమిని పక్కా ప్రణాళికతో పదేళ్లలో తుడిచిపెట్టామని మోదీ అన్నారు. ‘‘మొత్తం తూర్పు భారతాన్నీ సాధికారపరిచాం. ఫలితంగా ‘రెడ్‌ కారిడార్‌’గా పిలిచే ఆ ప్రాంతం ‘కాషాయ కారిడార్‌’గా మారిపోయిందని ఈ ఎన్నికల ఫలితాలు రుజువు చేయనున్నాయి. పలు తూర్పు రాష్ట్రాల్లో కాంగ్రెస్, దాని సారథ్యంలోని ఇండియా కూటమి ఖాతా కూడా తెరవలేవు’’ అని జోస్యం చెప్పారు. దాంతో భువనేశ్వర్, కోల్‌కతాతో పాటు ఢిల్లీలోనూ కొన్ని పారీ్టలకు ఇప్పట్నుంచే కంటిపై కునుకు కరువైందని బిజూ జనతాదళ్, తృణమూల్, కాంగ్రెస్‌లను ఉద్దేశించి ఆయన ఎద్దేవా చేశారు. ‘‘ప్రజల ఆశీస్సులతో మేమీసారి రికార్డు స్థాయి విజయం సాధించబోతున్నాం. జూన్‌ 4న వెల్లడయ్యే ఫలితాల్లో ఎన్డీఏ కూటమి 400 పై చిలుకు స్థానాలు సాధించడం ఖాయం (4 జూన్, 400 పార్‌)’’ అని చెప్పారు. ‘‘ఉనికిపరంగానే గాక భావజాలపరంగా కూడా బీజేపీ మాత్రమే దేశంలో సిసలైన జాతీయ పార్టీ. ఎందుకంటే దేశమే ముందన్నది మా మూల సిద్ధాంతం’’ అని స్పష్టం చేశారు. ఇంటర్వ్యూలో మోదీ వెల్లడించిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... కాంగ్రెస్‌కు లారీల్లో నల్లధనం! ‘అదానీ–అంబానీ’ అవినీతి అంటూ ఆ ఇద్దరు పారిశ్రామికవేత్తలను కొన్నేళ్లుగా నిత్యం విమర్శిస్తూ వచి్చన రాహుల్‌ బాబా ఎన్నికలు మొదలవగానే ప్లేటు ఫిరాయించారు. ఆయన ప్రచారంలో ఎక్కడా వారి ప్రస్తావనే లేదు! హఠాత్తుగా ఎందుకీ మార్పు? ఎందుకంటే అంబానీ, అదానీలతో లోపాయకారీ లింకులున్నది కాంగ్రెస్‌ పారీ్టకే. తమకు లారీల నిండా డబ్బులు పంపితే వారికి వ్యతిరేకంగా మాట్లాడబోమన్న కాంగ్రెస్‌ అగ్ర నేత అ«దీర్‌ రంజన్‌ చౌధరి వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. అదానీ, అంబానీలతో కాంగ్రెస్‌కు డీల్‌ కుదరడం, రాహుల్‌ తమను విమర్శించకుండా ఉండేందుకు వారిద్దరూ లారీల నిండా నల్లధనం పంపడం నిజమో కాదో చెప్పాలి! ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలపై కాంగ్రెస్‌ నేతల ఆరోపణలూ పస లేనివే. అవి రెండూ స్వతంత్రంగా పని చేసే సంస్థలని స్వయానా అ«దీర్‌ చేసిన తాజా ప్రకటనే అందుకు నిదర్శనం. ‘ప్రత్యేక పౌరుల’ హోదాకు ఒప్పుకోను మైనారిటీ సంతుïÙ్టకరణ కోసం కాంగ్రెస్, విపక్షాలు చేస్తున్న ఓటుబ్యాంకు రాజకీయాలనే నా ఎన్నికల ప్రసంగాల్లో బయట పెడుతున్నాను. అంతే తప్ప మైనారిటీలకు వ్యతిరేకంగా నేనెప్పుడూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బీజేపీ కూడా వారికెప్పుడూ వ్యతిరేకం కాదు. కాకపోతే ‘ప్రత్యేక పౌరుల’ హోదాను ఎప్పటికీ అంగీకరించబోను. ఎందుకంటే ప్రజలందరూ సమానమే. కేవలం ఎన్నికల రాజకీయాల కోసం రాజ్యాంగంలో పేర్కొన్న లౌకిక స్ఫూర్తికి నిత్యం గండి కొట్టే పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెసే. రిజర్వేషన్లకు మతం ప్రాతిపదిక కారాదని అంబేడ్కర్, నెహ్రూతో సహా రాజ్యాంగ నిర్మాతలంతా తీసుకున్న నిర్ణయానికి తూట్లు పొడుస్తోంది. కాంగ్రెస్‌ మేనిఫెస్టో నిండా ముస్లిం లీగ్‌ ఛాయలే! చివరికి టెండర్ల కేటాయింపు వంటివాటిలో కూడా మైనారిటీలకు రిజర్వేషన్లిస్తామని అందులో హామీలు గుప్పించారు. కేంద్రంలో అధికారంలో ఉండగా పాకిస్తాన్‌తో సమర్థంగా వ్యవహరించకుండా జాతి ప్రయోజనాలనే పణంగా పెట్టిన చరిత్ర కాంగ్రెస్‌ది. రాహుల్‌ వ్యాఖ్యలను పాక్‌ నేతలు ప్రశంసిస్తున్న పరిస్థితి! మన వీర సైనికులను పొట్టన పెట్టుకున్నది పాక్‌ ఉగ్రవాదులు కాదని కాంగ్రెస్‌ నేతలంటున్నారు. పాక్‌ వద్ద అణుబాంబులున్నాయి గనుక ఆ దేశాన్ని గౌరవించాలని చెబుతున్నారు. సర్జికల్‌ దాడులకు రుజువులేవని ప్రశ్నిస్తున్నారు. వీటన్నింటినీ ప్రజలకు వివరించడం, కాంగ్రెస్‌ కుట్రలను బయట పెట్టడం నా బాధ్యత. కాంగ్రెస్‌ది సంతుïÙ్టకరణ బాట. నాది అందరినీ సంతృప్తిపరిచే అభివృద్ధి బాట. ఈ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం తగ్గడానికి కాంగ్రెస్, ఇండియా కూటమి పారీ్టల పేలవ ప్రచారం కూడా ఓ కారణం. వాటికి సొంత కార్యకర్తలు కూడా ఓటేయడం లేదు. ఇదంతా బీజేపీకే లాభం చేకూరుస్తుంది. బీజేడీ పుట్టి మునుగుతోంది ఒడిశా ప్రజలు మార్పు కావాలని నిర్ణయించుకున్నారు. నవీన్‌ పటా్నయక్‌ ప్రభుత్వంపై వారిలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. అధికార బిజూ జనతాదళ్‌ మనుగడ ఇక కష్టమే. ఒడిశాలో బీజేపీ ఐదేళ్లుగా తీవ్రంగా కష్టపడి నంబర్‌ టూ నుంచి నంబర్‌వన్‌ స్థానానికి చేరింది. యూసీసీ హామీ నెరవేరుస్తాం ఉమ్మడి పౌర స్మృతి, ‘ఒక దేశం, ఒకే ఎన్నిక’ బీజేపీ మేనిఫెస్టో హామీలు. వాటిని నెరవేర్చి తీరతాం. జమ్మూ కశీ్మర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తాం. మళ్లీ అధికారంలోకి రాగానే ముందుగా మేమేం చేయాలో సూచించాల్సిందిగా దేశ యువతనే అడగదలచుకున్నా. అందుకోసం ‘తొలి 100 రోజుల కార్యాచరణ’ను 125 రోజులకు పొడిగించాను. మాకు 400 సీట్లొస్తే రాజ్యాంగాన్ని మారుస్తామన్న విపక్షాల విమర్శలు నిరాధారం. నేను స్వీయ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నానని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ నా శ్రేయస్సు కూడా రాజ్యాంగ శ్రేయస్సులోనే ఇమిడి ఉంది. ఈ రోజు ఈ స్థానంలో ఉన్నానంటే రాజ్యాంగం వల్లే. నేను స్ఫూర్తి, శక్తి పొందేదే రాజ్యాంగం నుంచి!బ్రాండ్‌ మోదీ!నేను కార్యసాధకున్ని. ‘బ్రాండ్‌ మోదీ’ అన్నది రెండు దశాబ్దాల పై చిలుకు ప్రజా జీవితంలో వారి నుంచి సంపాదించుకున్న విశ్వాస ఫలితం. అంతే తప్ప దానికోసం నేను ఏ ప్రయత్నమూ చేయలేదు. నేనూ మనిíÙనే. తప్పిదాలు చేసుండొచ్చు. కానీ తప్పుడు ఉద్దేశాలు మాత్రం నాకెప్పుడూ ఉండవు. మండెటెండల్లో కూడా నా సభలకు ప్రజలు పోటెత్తుతున్నారు. వారి కళ్లలో నాపై కనిపించే తిరుగులేని విశ్వాసమే నాకు శక్తినిచ్చి నడిపిస్తోంది. 13 ఏళ్లు సీఎంగా, పదేళ్లు ప్రధానిగా చేసిన వ్యక్తి మాతృమూర్తి తన చివరి రోజుల్ని ప్రభుత్వాసుపత్రిలో గడిపిందంటే, అలాంటి దేశానికి మరే ఇతర బ్రాండూ అవసరం లేదని నా అభిప్రాయం. అతడు భిన్నమైన వ్యక్తి అని ఆ దేశం ఏనాడో అర్థం చేసుకుంది’’.రూ.250 కోట్ల అవినీతి కంటే 250 జతల బట్టలు మేలే! తాను అత్యంత ఖరీదైన దుస్తులు ధరిస్తానంటూ రాహుల్‌ తదితరులు చేసే ఆరోపణలపై మోదీ ఆసక్తికరంగా స్పందించారు. ‘‘నా రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న అతి పెద్ద ఆరోపణ దుస్తుల గురించే! నాకు 250 జతల బట్టలున్నాయని గతంలో గుజరాత్‌ మాజీ సీఎం అమర్‌సింగ్‌ చౌదరి ఆరోపణలు చేశారు. అప్పుడు నేను సీఎంగా ఉన్నా. అదే రోజు ఓ సభలో పాల్గొన్నా. ‘రూ.250 కోట్లు దోచుకున్న సీఎం కావాలా, లేక 250 జతల బట్టలున్న ముఖ్యమంత్రా?’ అని వేదిక నుంచి ప్రజలనడిగా. 250 జతల బట్టలున్నా పర్లేదు గానీ అవినీతిపరుడు వద్దని వారంతా ముక్త కంఠంతో చెప్పారు. దాంతో విపక్షాలు ఇంకెప్పుడూ నాపై అవినీతి ఆరోపణలకు ధైర్యం చేయలేదు’’ అన్నారు. నిజానికి తనకెప్పుడూ అన్ని జతల బట్టల్లేవంటూ ముక్తాయించారు.

WHO says Brain stroke issue with Bad Habbits
చెడు అలవాట్లతో 'మెదడుకు చేటు'..

సాక్షి, అమరావతి: ఆధునిక జీవనశైలి, దురలవాట్ల కారణంగా మెదడు సంబంధిత జబ్బుల బారినపడుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు పైబడిన వారిలో వయోభారం, బీపీ, షుగర్‌ నియంత్రణలో లేకపోవడం తదితర కారణాలతో బ్రెయిన్‌ స్ట్రోక్‌ వస్తుండేది. అయితే, ప్రస్తుతం నమోదవుతున్న బ్రెయిన్‌ స్ట్రోక్‌ కేసుల్లో 25–30 శాతం కేసుల్లో బాధితుల వయస్సు 20–45 ఏళ్ల లోపే ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. ఢిల్లీ ఎయిమ్స్‌ న్యూరాలజీ విభాగం వెల్లడించిన ఒక నివేదిక ప్రకారం ఏడాది కాలంలో 300 మంది స్ట్రోక్‌తో అడ్మిట్‌ కాగా.. 25 శాతం మంది 21–45 ఏళ్ల వయస్సు వారేనని తేలింది. అలాగే, ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటిమంది ఈ స్ట్రోక్‌ బారినపడుతుండగా, వీరిలో సగం మంది మృత్యువాత పడుతున్నారు. మిగిలిన వారు శాశ్వత వికలాంగులుగా మిగిలిపోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఇటీవల వెల్లడించింది. దురలవాట్లతో చేటు..ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లు మెదడుకు చేటుచేస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ అలవాట్లను మానుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నప్పటికీ కొందరిలో మాత్రం మార్పు రావడంలేదు. బ్రిటీష్‌ మెడికల్‌ జర్నల్‌ 2021లో వెల్లడించిన ఒక అధ్యయనం ప్రకారం.. ధూమపానం, మద్యపానం అలవాట్లున్న వ్యక్తులు బ్రెయిన్‌ స్ట్రోక్‌ బారినపడటానికి 80 శాతం ఎక్కువ అవకాశాలున్నాయి. గుండె జబ్బులకు దారితీసే ప్రధాన కారకాల్లో ధూమపానం ఒకటి. గుండెపోటు కేసుల్లో 25 శాతం వరకూ ఇదే ప్రధాన కారణంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే, పొగాకులోని నికోటిన్, విషతుల్యాలు రక్తనాళాల లోపలి పొరను దెబ్బతీస్తాయి. దీంతో రక్తనాళ గోడల్లో కొలెస్ట్రాల్‌ పేరుకుపోయి పూడిక ఏర్పడుతుంది. పూడిక చిట్లిపోతే హఠాత్తుగా రక్తం గడ్డకట్టి నాళం పూర్తిగా మూసుకుపోవచ్చు. ఇది గుండెపోటుకు దారితీస్తుంది. అదే విధంగా మెదడు రక్తనాళాల్లో పూడికలతో స్ట్రోక్‌ సంభవిస్తుంది. ఏటా కేసుల పెరుగుదల..బ్రెయిన్‌ స్ట్రోక్, ఇతర న్యూరో సంబంధిత కేసులు ఏటా పెరుగుతున్నాయి. ఇందుకు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం కింద అందించిన చికిత్సలే నిదర్శనంగా ఉంటున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద న్యూరో, న్యూరో సర్జరీ విభాగాల్లో చికిత్స పొందిన రోగుల సంఖ్య గడిచిన ఐదేళ్లలో ఏటా వృద్ధి చెందుతూ వచ్చింది. 2019–20లో 26,023 మంది చికిత్స పొందారు. 2022–23 నాటికి ఈ సంఖ్య దాదాపు రెట్టింపు అయింది. ఆ ఏడాది 40 వేల మందికి ప్రభుత్వం ఉచితంగా చికిత్సలు అందించింది. ఇక 2023–24లోను చికిత్స పొందిన వారి సంఖ్య 40 వేలు దాటింది. యువతలో బ్రెయిన్‌ స్ట్రోక్‌కు కారణాలు..⇒ బీపీ, షుగర్‌ నియంత్రణలో లేకపోవడం.. ఊబకాయం ఉండటం. ప్రస్తుతం రాష్ట్రంలో 30 ఏళ్లు పైబడిన వారిలో 25 శాతం మంది బీపీ, షుగర్‌తో బాధపడుతున్నారు.⇒ కొందరిలో బీపీ, షుగర్‌ సమస్యలు ఉన్నప్పటికీ సంబంధిత లక్షణాలు లేకపోవడంతో బయటకు తెలీడంలేదు. కానీ లోలోపల జరగాల్సిన నష్టం జరుగుతోంది.⇒ మహిళలు నెలసరిని వాయిదా వేయడం, అధిక రక్తస్రావాన్ని నియంత్రించుకోవడం కోసం వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోకుండా మందులు వాడటం..⇒ ఊబకాయం కూడా బ్రెయిన్‌ స్ట్రోక్‌కు దారి తీస్తోంది. ⇒ శారీరక శ్రమ లేకపోవడం.తీసుకోవాల్సిన జాగ్రత్తలు..⇒ రోజుకు 45 నిమిషాలు నడవాలి, ఇతర వ్యాయామాలు చేయాలి.⇒ ఆహారంలో 25 శాతం పండ్లు, 30 శాతం కూరగాయలు, 25 శాతం పిండి పదార్థాలు, 20 శాతం ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలి. జంక్‌ ఫుడ్‌ను పూర్తిగా నియంత్రించాలి.⇒ శరీర బరువును నియంత్రించుకోవాలి. బీపీ, షుగర్‌ వంటి సమస్యలు ఉంటే తరుచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.⇒ తీవ్ర ఒత్తిడికి లోనవ్వకుండా ఉండాలి. ఆరు గంటలు నిద్రపోవాలి.జీవనశైలి మార్పుపై దృష్టిపెట్టాలి..గతంలో ఎన్నడూ లేనట్లుగా ఈ మధ్య కాలంలో యంగ్‌ ఏజ్‌ స్ట్రోక్‌ కేసులు ఎక్కువగా చూస్తున్నాం. సాధారణంగా 55 ఏళ్లు పైబడిన వారిలోనే స్ట్రోక్‌ ఎక్కువగా వస్తుంది. అయితే, ప్రస్తుతం అందుకు భిన్నంగా కేసులు వస్తున్నాయి. 25 ఏళ్లు, అంతకంటే చిన్న వయస్సు వాళ్లు బ్రెయిన్‌ స్ట్రోక్‌ బారినపడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఆధునిక జీవనశైలి. యువతలో కొందరు ధూమపానం, మద్యపానం వంటి దురలవాట్లకు అలవాటుపడుతున్నారు. ఇది కొందరిలో వ్యసనంగా మారుతోంది. ఇలాంటి వారిలో ఐదేళ్ల అనంతరం స్ట్రోక్‌ రావడానికి అవకాశముంది. ఈ క్రమంలో ప్రజలు జీవనశైలి మార్పు చేసుకోవడంతో పాటు బీపీ, షుగర్, ఊబకాయం నియంత్రించుకోవడంపై దృష్టిపెట్టాలి. మరోవైపు.. స్ట్రోక్‌ బాధితులను గోల్డెన్‌ హవర్‌లో ఆస్పత్రికి తీసుకొస్తే ప్రాణాపాయం నుంచి రక్షించడానికి ఆస్కారం ఉంటుంది. – డాక్టర్‌ ఎన్‌. వెంకటసుందరాచారి, న్యూరాలజిస్ట్, మచిలీపట్నం వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌

Israel-Hamas war: ICC prosecutor seeks arrest of Israeli, Hamas leaders
Israel-Hamas war: నెతన్యాహు, హమాస్‌ నాయకుల అరెస్టుకు ఆదేశాలు కోరతా

జెరూసలెం: అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు నుంచి ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు, హమాస్‌ అగ్రనేతలపై అరెస్టు వారెంట్లు కోరనున్నట్లు చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ కరీం ఖాన్‌ సోమవారం వెల్లడించారు. గాజా, ఇజ్రాయెల్‌లో యుద్ధ నేరాలు, మానవాళిపై అకృత్యాలకు గాను నెతన్యాహు, ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి యోవ్‌ గాలంట్, హమాస్‌ నేతలు యోహియా సిన్వర్, మహ్మద్‌ దీఫ్, ఇస్మాయిల్‌ హనియేహ్‌లు బాధ్యులని ఆయన అన్నారు. ముగ్గురు జడ్జిల ప్యానెల్‌ అరెస్టు వారెంట్లు, కేసు కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనుంది. సాధారణంగా ఇలాంటి వాటిల్లో నిర్ణయానికి జడ్జిలు రెండు నెలల సమయం తీసుకుంటారు. వారెంట్లు జారీ అయినా నెతన్యాహు, గాలంట్‌లకు వచ్చే ఇబ్బందేమీ లేదు. కానీ నెతన్యాహు, గాలంట్‌లు విదేశీ పర్యటనలకు వెళ్లడం కష్టమవుతుంది. వారెంట్లు కోరడాన్ని యూదు వ్యతిరేక చర్యగా నెతన్యాహు అభివర్ణించారు.

IPL 2024: Top-heavy Kolkata Knight Riders and Sunrisers Hyderabad collide for a place in the final
IPL 2024: ఫైనల్‌ వేటలో ఎవరిదో జోరు!

అహ్మదాబాద్‌: గత రెండు నెలలుగా పది జట్ల పోరు ‘ప్లే ఆఫ్స్‌’ లక్ష్యంగా సాగింది. మెరుపులు, ధనాధన్‌ ధమాకాలతో ఐపీఎల్‌ 17వ సీజన్‌ మరింత మజాను పంచింది. ఇప్పుడు నాలుగు జట్ల సమరం ఫైనల్‌ దిశగా జరగనుంది. ముందుగా మంగళవారం జరిగే తొలి క్వాలిఫయర్‌లో జోరు మీదున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌... రెండుసార్లు (2012, 2014) చాంపియన్‌ అయిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌)తో తలపడనుంది. 2016లో ఐపీఎల్‌ ట్రోఫీ సాధించిన సన్‌రైజర్స్‌ ప్రస్తుత సీజన్‌లో భీకరమైన ఫామ్‌ దృష్ట్యా టైటిల్‌ వేటలో ముందంజ వేయాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు కోల్‌కతా తక్కువేం కాదు... తగ్గేలా లేనేలేదు! ఈ సీజన్‌లో కేవలం 3 మ్యాచ్‌లే ఓడిన నైట్‌రైడర్స్‌ ఎవరికి సాధ్యం కానీ 9 విజయాల్ని సాధించి పాయింట్ల పట్టికలో ‘టాప్‌’లో నిలిచింది. అటు బౌలింగ్, బ్యాటింగ్‌లో సమతూకంగా ఉన్న కేకేఆర్‌ రెండో క్వాలిఫయర్‌దాకా చాన్స్‌ తీసుకోకుండా ఫైనల్‌ బెర్త్‌ సాధించాలని ఆశిస్తోంది. సన్‌ తుఫాన్‌కు ఎదురేది? సన్‌రైజర్స్‌ కొట్టిన కొట్టుడు... దంచిన దంచుడు... 200 పైచిలుకు లక్ష్యమైనా మాకేంటని ఛేదించిన వైనం చూస్తే హైదరాబాద్‌కు ఎదురు నిలవడం ఏ జట్టుకైనా కష్టమే! దంచేసే ఓపెనర్‌ హెడ్‌ డకౌటైన గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 215 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే ఛేదించి టాప్‌–2లోకి దూసుకొచ్చింది. అభిషేక్‌ శర్మ, ఆంధ్రప్రదేశ్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి, క్లాసెన్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు పదేపదే చుక్కలు చూపిస్తున్నారు. ఈ జట్టు బలం బ్యాటింగే! అయితే నిలకడ లేని బౌలింగ్‌తోనే అసలు సమస్యంతా! బౌలర్ల వైఫల్యం వల్లే 277/3, 287/3, 266/7 లాంటి రికార్డు స్కోర్లు నమోదు చేసినా భారీ తేడాతో ఏ మ్యాచ్‌ కూడా గెలవలేకపోయింది. కెపె్టన్‌ కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్‌ సహా బౌలర్లంతా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తేనే సన్‌రైజర్స్‌కు విజయం సులువవుతుంది. ఫైట్‌ రైడర్స్‌ ఫిల్‌ సాల్ట్‌–సునీల్‌ నరైన్‌ ఓపెనింగ్‌ జోడీ మెరుపులతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కాస్తా ఫైట్‌రైడర్స్‌గా మారింది. కీలకమైన మ్యాచ్‌లో సాల్ట్‌ (స్వదేశానికి తిరుగుముఖం) లేకపోయినప్పటికీ బ్యాటింగ్‌ బలం ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే వెంకటేశ్‌ అయ్యర్, కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్, నితీశ్‌ రాణా, రసెల్, రింకూ సింగ్, రమణ్‌దీప్‌ ఇలా ఎనిమిదో వరుస వరకు తిరుగులేని బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న జట్టు కోల్‌కతా. ప్రత్యేకించి రసెల్, రింకూ, రమణ్‌దీప్‌లైతే స్పెషలిస్టు హిట్టర్లు. టాప్‌–3 విఫలమైన ప్రతీసారీ జట్టును నడిపించారు. బౌలింగ్‌లో అనుభవజు్ఞడైన స్టార్క్, నరైన్, రసెల్‌లతో పాటు హర్షిత్‌ రాణా, వరుణ్‌ చక్రవర్తిలు నైట్‌రైడర్స్‌ విజయాల్లో భాగమవుతున్నారు. ఇక నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌ ఆడి పది రోజులవుతోంది. ఈ నెల 11న ముంబై ఇండియన్స్‌పై మొదట 157/7 స్కోరే చేసినా... ప్రత్యరి్థని 139/8కు కట్టడి చేసి 18 పరుగులతో గెలిచింది. తర్వాత గుజరాత్, రాజస్తాన్‌లతో జరగాల్సిన రెండు మ్యాచ్‌లు వర్షంతో రద్దయ్యాయి. దీంతో ఆటగాళ్లంతా ‘మ్యాచ్‌ ఆకలి’ మీదున్నారు. తప్పకుండా ఇరుజట్ల మధ్య హోరాహోరీ సమరం గ్యారంటీ! జట్లు (అంచనా) హైదరాబాద్‌: కమిన్స్‌ (కెప్టెన్‌), హెడ్, అభిõÙక్‌ శర్మ, రాహుల్‌ త్రిపాఠి, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, క్లాసెన్, షహబాజ్, సమద్, సన్వీర్, భువనేశ్వర్, విజయకాంత్, నటరాజన్‌. కోల్‌కతా: శ్రేయస్‌ అయ్యర్‌ (కెపె్టన్‌), నరైన్, గుర్బాజ్, వెంకటేశ్, నితీశ్‌ రాణా, రింకూ సింగ్, రసెల్, రమణ్‌దీప్, స్టార్క్, హర్షిత్‌ రాణా, వరుణ్, అనుకుల్‌/వైభవ్‌. పిచ్, వాతావరణం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఆరు మ్యాచ్‌ల్ని పరిశీలిస్తే... పిచ్‌ బౌలర్లకు, బ్యాటర్లకు సమాన అవకాశాలు కల్పించింది. మూడు మ్యాచ్‌ల్లో 200 పైచిలుకు స్కోర్లు నమోదయ్యాయి. తక్కువ స్కోర్ల మ్యాచ్‌ (గుజరాత్‌ 89 ఆలౌట్‌; ఢిల్లీ 92/4) కూడా ఇక్కడే నమోదైంది. మ్యాచ్‌కు వర్ష సూచన లేదు.26: ఐపీఎల్‌లో ఇప్పటి వరకు సన్‌రైజర్స్, నైట్‌రైడర్స్‌ జట్లు ముఖాముఖిగా 26 సార్లు తలపడ్డాయి. 17 మ్యాచ్‌ల్లో నైట్‌రైడర్స్‌... 9 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌ గెలుపొందాయి. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు ఒకసారి పోటీపడగా నైట్‌రైడర్స్‌ నాలుగు పరుగుల తేడాతో నెగ్గింది. నైట్‌రైడర్స్‌పై సన్‌రైజర్స్‌ అత్యధిక స్కోరు 228, అత్యల్ప స్కోరు 116 కాగా... సన్‌రైజర్స్‌పై నైట్‌రైడర్స్‌ అత్యధిక స్కోరు 208, అత్యల్ప స్కోరు 101.

Indian pharma firms supplied 47percent of all generic prescriptions in US in 2022
యూఎస్‌ జెనరిక్స్‌ మార్కెట్లో భారత్‌ హవా

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: జెనరిక్‌ ఔషధ రంగంలో భారత కంపెనీల హవా కొనసాగుతోంది. 2022లో వైద్యుల సిఫార్సు మేరకు యూఎస్‌లో రోగులు వినియోగించిన మొత్తం జెనరిక్స్‌లో 47 శాతం భారతీయ కంపెనీలు సరఫరా చేశాయి. ఔషధాల పరిమాణం పరంగా భారత్‌ తొలి స్థానంలో నిలిచింది. ఇక్వియా నేషనల్‌ ప్రి్రస్కిప్షన్‌ ఆడిట్‌ ప్రకారం.. అందుబాటు ధరలో జెనరిక్‌ మందుల సరఫరాలో భారతీయ కంపెనీలు తమ సత్తా చాటుతున్నాయి. ప్రభుత్వ బీమా కార్యక్రమాలు, ప్రైవేట్‌ బీమా కంపెనీలు ఔషధాల కోసం చెల్లించిన మొత్తంలో.. భారతీయ ఫార్మా కంపెనీలు అందించిన మందులు సగానికంటే అధికంగా ఉండడం గమనార్హం. యూఎస్‌ సంస్థలు 30 శాతం వాటాతో రెండవ స్థానం సంపాదించాయి. మధ్యప్రాచ్య దేశాలు 11 శాతం, యూరప్‌ 5, కెనడా 3, చైనా 2, ఇతర దేశాల కంపెనీలు 2 శాతం జెనరిక్స్‌ సరఫరా చేశాయి. 50 శాతంపైగా మన కంపెనీలవే.. చికిత్సల పరంగా చూస్తే మానసిక రుగ్మతలకు వినియోగించిన మందుల్లో భారతీయ కంపెనీలు సరఫరా చేసినవి ఏకంగా 62 శాతం ఉన్నాయి. హైపర్‌టెన్షన్‌ 60 శాతం, లిపిడ్‌ రెగ్యులేటర్స్‌ 58, యాంటీ అల్సర్స్‌ 56, నరాల సంబంధ చికిత్సలకు 55 శాతం మందులు భారత్‌ నుంచి సరఫరా అయినవే కావడం విశేషం. మధుమేహ సంబంధ ఔషధాల్లో భారత్‌ వాటా 21 శాతంగా ఉంది. ఇక బయోసిమిలర్స్‌ సరఫరాలో మూడవ స్థానంలో ఉన్న భారత సంస్థల వాటా ప్రస్తుతం 15 శాతంగా ఉంది. యూఎస్‌ 56 శాతం, కొరియా 18, యూరప్‌ 11 శాతం బయోసిమిలర్స్‌ సరఫరా చేశాయి. మరో 1.3 ట్రిలియన్‌ డాలర్లు..భారతీయ కంపెనీలు సరఫరా చేసిన జెనరిక్‌ మందుల కారణంగా 2022లో యూఎస్‌ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ 219 బిలియన్‌ డాలర్ల మేర పొదుపు చేయగలిగింది. 2013 నుంచి 2022 మధ్య మొత్తం 1.3 ట్రిలియన్‌ డాలర్లు ఆదా అయ్యాయని ఇక్వియా నేషనల్‌ ప్రి్రస్కిప్షన్‌ ఆడిట్‌ నివేదిక పేర్కొంది. భారతీయ కంపెనీల నుండి వచ్చే జెనరిక్‌ ఔషధాలతో వచ్చే ఐదేళ్లలో అదనంగా 1.3 ట్రిలియన్‌ డాలర్ల పొదుపు అవుతుందని అంచనా. భారత్‌–యూఎస్‌ మధ్య బలమైన ఫార్మా వాణిజ్య భాగస్వామ్యం కోసం రెండు దేశాలు ఔషధ ముడిపదార్థాలకై విదేశీ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఔషధ స్థితిస్థాపకతను సాధించాలని ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ అలయన్స్‌ (ఐపీఏ) ఇటీవల కోరింది. ఔషధాల రంగంలో ఇరు దేశాలు కలిసి వచ్చి అగ్రిగేటర్‌గా మారాలి అని ఐపీఏ అభిప్రాయపడింది. 70 శాతం యాక్టివ్‌ ఫార్మా ఇంగ్రీడియెంట్స్‌ చైనా నుంచి భారత్‌కు దిగుమతి అవుతున్నాయి.

New Title For Ranbir Kapoor And Sai Pallavi Ramayan Film
గాడ్‌ పవర్‌?

‘రామాయణ్‌’ టైటిల్‌ ‘గాడ్‌ పవర్‌’గా మారిందా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. రణ్‌బీర్‌ కపూర్, సాయి పల్లవి రాముడు, సీత పాత్రల్లో నితీష్‌ తివారీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి ఇప్పటివరకూ యూనిట్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రామాయణం ఆధారంగా ‘రామాయణ్‌’ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారని వార్తలు వచ్చాయి.అలాగే సీతారాముల గెటప్స్‌లో సాయి పల్లవి, రణ్‌బీర్‌ కపూర్‌ ఉన్న ఫొటోలు లీక్‌ అయి, వైరల్‌గా మారాయి. ముంబైలో చడీ చప్పుడూ లేకుండా కొన్ని రోజుల క్రితం ఈ చిత్రం షూటింగ్‌ ఆరంభించారు. ఆ లొకేషన్లోని రణ్‌బీర్, సాయి పల్లవి ఫొటోలే బయటికొచ్చాయి. కాగా.. ఈ చిత్రానికి ‘రామాయణ్‌’ టైటిల్‌కి బదులు ‘గాడ్‌ పవర్‌’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేయాలని యూనిట్‌ అనుకుంటోందనే వార్త ప్రచారంలో ఉంది.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement