జంటనగరాల నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే పలు ప్రత్యేక రైళ్లలో బెర్తులు ఖాళీ ఉన్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్: జంటనగరాల నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే పలు ప్రత్యేక రైళ్లలో బెర్తులు ఖాళీ ఉన్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
- లింగంపల్లి-కాకినాడ (07101) ప్రత్యేక రైల్లో ఈనెల 18న సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీలలో, కాకినాడ-లింగంపల్లి (07102) ప్రత్యేక రైల్లో ఈనెల 8న థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్‌లలో బెర్తులు ఖాళీగా ఉన్నాయి.
- సికింద్రాబాద్-కాకినాడ (07202) స్పెషల్ ట్రైన్లో ఈనెల 11న సెకండ్ ఏసీ, స్లీపర్ క్లాస్‌లలో బెర్తులు ఉన్నాయి.
- సికింద్రాబాద్-గువాహటి (07149) ప్రత్యేక రైల్లో ఈనెల 9న సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్‌లో బెర్తులు ఖాళీగా ఉన్నాయి.
- కాచిగూడ-మంగళూరు (07606) ప్రత్యేక రైల్లో ఈనెల 24న థర్డ్ ఏసీ, స్లీపర్‌క్లాస్‌లలో బెర్తులున్నాయి.
- ఔరంగాబాద్-తిరుపతి (07405) స్పెషల్ ట్రైన్‌లో ఆగస్టు 28, 30 తేదీలలో థర్డ్ ఏసీ, స్లీపర్‌క్లాస్‌లలో, తిరుపతి-ఔరంగాబాద్ (07406) ప్రత్యేక రైలులో ఆగస్టు 24, 31 తేదీలలో థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్‌లలో బెర్తులు ఖాళీగా ఉన్నాయి.


