పోలీస్ కార్యాలయ ఏఓ గుండెపోటుతో మృతి
కడప అర్బన్ : జిల్లా పోలీస్ కార్యాలయ ఎ.ఓ. కె.వి.రమణ(56) సోమవారం తెల్లవారుఝామున గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించినట్లు ప్రకటించారు. కె.వి. రమణకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆయన భౌతిక కాయాన్ని జిల్లా పోలీస్ కార్యాలయానికి తరలించారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్‌తో పాటు పలువురు పోలీస్ అధికారులు, డీపీఓ సిబ్బంది కె.వి. రమణ భౌతిక కాయంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎ.ఆర్. అదనపు ఎస్పీ బి.రమణయ్య, కడప డీఎస్పీ ఎ.వెంకటేశ్వర్లు, వన్ టౌన్ సి.ఐ. చిన్నపెద్దయ్య, ఆర్.ఐలు శివరాముడు, సోమశేఖర్ నాయక్, డి.పి.ఓ సూపరింటెండెంట్‌లు శ్రీనివాస నాయక్, సురేష్, జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్, డి.పి.ఓ. సిబ్బంది పాల్గొన్నారు.


