● అండదండగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి... | - | Sakshi
Sakshi News home page

● అండదండగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి...

Dec 31 2025 7:19 AM | Updated on Dec 31 2025 7:19 AM

● అండ

● అండదండగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి...

● అండదండగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి...

కొత్తగా కుర్చీ ఎక్కిన వారిలో...

సాక్షి ప్రతినిధి, కడప: ప్రజా ప్రతినిధిగా సక్రమంగా సేవ చేయాల్సింది పోయి.. అధికారంలో ఉండగానే అక్రమంగా నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే తాపత్రయమే కూటమి నేతల్లో కనిపించింది. ఈ ఏడాదిలో జరిగిన పరిస్థితులు చూస్తే ఇదే స్పష్టమవుతుంది. అక్రమార్జనే ధ్యేయంగా ఈ ఏడాదిలో కూటమి నేతలు విచ్చలవిడిగా చెలరేగిపోయారు.

● కమలాపురం నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్‌ దోపిడీ యథేచ్ఛగా సాగింది. అధికారులు ఏడాది పొడవునా అటువైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేదు. బి.కోడూరు మండలం పాయలకుంట్ల పంచాయతీ పరిధిలోని వేమకుంట రెవెన్యూ పొలంలో సర్వే నెంబరు 18లో 16.75 ఎకరాల ప్రభుత్వ భూమిపై టీడీపీ నేత కన్ను పడింది. కోట్లాది రూపాయాలు విలువైన భూమి కంచె వేశారు. మైదుకూరు మండలం నంద్యాలంపేటలో సర్వేనంబర్‌ 859లో 16 ఎకరాలు, సర్వేనంబర్‌ 840లో 70 ఎకరాలు ప్రభుత్వ భూమికి కంచె వెలిసింది. తిప్పిరెడ్డిపల్లె గోడేరు చెరువులో 50ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి.

● టిఫెన్‌ బరైటీస్‌కు చెందిన కోట్ల విలువైన బరైటీస్‌ రాత్రికి రాత్రి లూటీ అయ్యింది.

సిమెంటు పరిశ్రమకు ముప్పు తిప్పలు...

యర్రగుంట్ల సమీపంలో ఉన్న అల్ట్రాటెక్‌ సిమెంటు పరిశ్రమకు కూటమి నేతలు ముప్పు తిప్పలు పెట్టారు. ముడి ఖనిజం సరఫరా చేసే ట్రాన్సుపోర్టర్లును కట్టడి చేశారు. 40 ఏళ్లు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు సదరు వాహనాలను సీజ్‌ చేశారు. ఈ ప్రభావం పారిశ్రామికవేత్తలపై పడింది.

టీడీపీ కార్యాలయానికి ఆర్‌అండ్‌బీ స్థలం

కడప నగరం అక్కాయపల్లె పార్కు సమీపంలో నేషనల్‌ హైవే ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌ ఆఫీసు వెనుక వైపు న్యాక్‌ కార్యాలయానికి చెందిన 2 ఎకరాలు భూమి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కట్టబెట్టారు. ఎకరం రూ.40 కోట్లు విలువైన ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం 99 ఏళ్లకు లీజుకు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

కాశినాయన జ్యోతి క్షేత్రంపై వివక్షత

జ్యోతి క్షేత్రంలో టీడీపీ పొలిటికల్‌ డ్రామా నడిపింది. కొన్ని దశాబ్ధాలుగా ఈక్షేత్రం అటవీ ప్రాంతంలోనే ఉంది. అక్కడి నుంచి అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి కాలిబాట ఉంది. ఇన్నాళ్లుగా అటవీ ప్రాంతంలో ఉన్న ఈ క్షేత్రంపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది. ప్రధాన దేవాలయం, కాశినాయన సమాధి మినహా అన్నింటినీ కూల్చివేయగా.. నిరశనలు మిన్నంటడంతో వెనక్కి తగ్గింది.

టీడీపీ నుంచి నిష్క్రమించిన

సుగవాసి బాలసుబ్రమణ్యం

తెలుగుదేశం పార్టీ బలిజ సామాజిక వర్గ నేతలను యూజ్‌ అండ్‌ త్రో పాలసీ పెట్టుకోవడంతో రాజంపేట టీడీపీ అభ్యర్థి బాలసుబ్రమణ్యం టీడీపీ నుంచి నిష్క్రమించారు. 40 ఏళ్ల పార్టీ అనుబంధాన్ని తెంచుకున్నారు. ఆపై వైఎస్సార్‌సీపీలో చేరారు.

ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌,

వేల్పుల రాములపై హత్యాయత్నం

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌, వేముల మండల నాయకుడు వేల్పుల రామలింగారెడ్డిలపై టీడీపీ మూకలు నల్లగొండువారిపల్లెలో హత్యాయత్నం చేశా రు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా పచ్చ నేతలు వీరంగం సృష్టించారు.

పోలీసులకు మాయనిమచ్చ...

పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలను జిల్లా పోలీసు యంత్రాంగం సక్రమంగా నిర్వహించకపోవడం చరిత్రలో మాయనిమచ్చగా నిలవనుంది.

కుర్చీ కోసం ఎమ్మెల్యే చిందులు!

79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి అధికారులపై చిందులేశారు. ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే అయినప్పటికీ తనకు వేదికపై కుర్చీ వేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం అప్పట్లో హాట్‌టాపికై ంది. ఈ ఘటనతో ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

జెడ్పీ చైర్మెన్‌గా

ముత్యాల రామగోవిందురెడ్డి

జిల్లా జెడ్పీ చైర్మన్‌ పీఠాన్ని వైఎస్సార్‌ సీపీ నిలబెట్టుకుంది. బ్రహ్మంగారిమఠం జెడ్పీటీసీ సభ్యులు ముత్యాల రామగోవిందరెడ్డి జెడ్పీ చైర్మెన్‌గా ఎన్నికయ్యారు.

మేయర్‌గా పాకా సురేష్‌...

కడప మేయర్‌ సురేష్‌బాబుపై కడప ఎమ్మె ల్యే మాధవీరెడ్డి కుట్ర రాజకీయాలు చేశారు. కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న వర్థిని కనస్ట్రక్షన్స్‌ సంస్థ రూ.36 లక్షలు కాంట్రాక్టు పనులు చేశారని బూచిగా చూపెట్టి అనర్హత వేటు వేశారు. మేయర్‌కు సమానంగా స్టేజ్‌పైన కుర్చీ వేయలేదనే కోపంతో కుట్రపన్నా రు. తిరిగి ఆస్థానాన్ని వైఎస్సార్‌సీపీయే దక్కించుకుంది. మేయర్‌ స్థానం వైఎస్సార్‌ సీపీదే. కాకపోతే కొత్తమద్ది సురేష్‌బాబు స్థానంలో పాకా సురేష్‌ కొలువుదీరారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఈశ్వరయ్య...

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (సీపీఐ) రాష్ట్ర కార్యదర్శిగా జిల్లాకు చెందిన గుజ్జల ఈశ్వరయ్య ఎన్నికయ్యారు. కమ్యూనిస్టు యోధులు ఎద్దుల ఈశ్వరరెడ్డి, నర్రెడ్డి శివరామిరెడ్డి (ఎన్‌ఎస్‌), జె వెంకట్రామిరెడ్డి (జెవి) ప్రాతినిథ్యం వహించిన జిల్లా నుంచి రాష్ట్ర కార్యదర్శిగా ఎంపిక కావడంపై రాజకీయ పార్టీలకతీతంగా హర్షం వెలిబుచ్చారు.

ప్రకృతి సంపద దోపిడీలో‘పచ్చ’నేతల పోటీ

సీఎం చంద్రబాబు జిల్లాలో పర్యటించినా ఫలితం సున్నా!

ఎమ్మెల్యే సుధాకర్‌యాదవ్‌కు సైబర్‌ నేరగాళ్లు బురిడీ

అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నప్పటికీ ప్రజాపక్షమే తమ ఎజెండా అంటూ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధి చూపించారు. పెనుగాలుల కారణంగా నష్టపోయిన అరటి రైతులకు హెక్టారుకు రూ.20వేలు చొప్పున రూ.14కోట్లు సొంత నిధులు రైతులకు అందజేశారు. ధరలు లేక నీరసించిపోయిన ఉద్యాన రైతుల కష్టాలపై ప్రభుత్వ వైఖరి ఎండగట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ జయంతి, వర్థంతి కార్యక్రమాల్లోనూ, క్రిస్‌మస్‌ వేడుకలల్లో పాల్గొన్నారు. జిల్లా పర్యటనకొచ్చిన ప్రతి సందర్భంలోనూ ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది.

● అండదండగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి... 1
1/3

● అండదండగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి...

● అండదండగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి... 2
2/3

● అండదండగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి...

● అండదండగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి... 3
3/3

● అండదండగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement